” ”

టి.శ్రీవల్లీ రాధిక గారి ”తక్కువేమి మనకూ” – డాక్టర్‌ మైథిలి అబ్బరాజు

శ్రీవల్లీ రాధిక గారి కథలు చదువుతూ వుంటే పొగడపూలూ తులసీదళాలూ స్పురించటం యాధృచ్చికం కాదు, రచయిత్రి భావప్రపంచపు పరిమళం అదే. గడిచిన పదిహేను పదహారేళ్లుగా తను చేస్తూ వున్న సాహిత్య ప్రయాణాన్ని గమనించటం మంచి అనుభవం.

కథని ఇంత సరళంగా నిర్మించటం సులభంగా సిద్ధించేది ఎంతమాత్రమూ కాదు. రచయిత్రి దాన్ని అప్రయత్నంగా సాధించి వుంటారనీ అనుకోలేము. కానీ ఈ అలవోకతనం ముచ్చటగా వుంది. తను ఏం చెప్పదలచుకున్నారో ఎంత బాగా తెలుసో ఎలా చెప్పాలో కూడా అంత రూఢిగానూ ‘తెలిసి’ రాసిన కథలివి. ఈ కాంతి కేవలం అన్నమయకోశంలో అందేది కాదు.

రచయిత్రి అన్ని సార్లూ బీరుపోకుండా పాఠకుల లీలిశిశిలిజీ రీలిజితీ ని గురి చూస్తారు. ఈ కథానాయకులూ నాయికలూ అందరా నివారుగా అనుకోవటం ఎవరిని వారు తగ్గించుకోవటమే. అన్ని విధాలయిన బలహీనతలనీ సహించి సమర్థించడం వర్తమాన సాహిత్యంలో వున్నా ఇప్పుడు రాధికగారి మాటలు ఔషధప్రాయంగా వినిపిస్తున్నాయి. ఈవిడ ఆశించే ఆరోగ్యంలో కూడా ఏ వెలితీ లేదు. అది చాలా వరకు పరిశుభ్రత మీద ఆధారపడినది! వైద్య శాస్త్రంలో రీళిబీరిబిజి బిదీఖి చీజీలిఖీలిదీశిరిఖీలి ళీలిఖిరిబీరిదీలి కీలకమయిన అంశం. ఈ కథలు అలాంటివి. తక్కువేమీ మనకూ ఈమె ప్రచురించిన నాలుగవ కథా సంపుటి. ఇందులో పన్నెండు కథలున్నాయి.

సనాతన ధర్మాన్ని అనుసరించే నిర్మలమయిన జీవన విధానాన్ని చిత్రిస్తాయి దాదాపు అన్ని కథలూ. చిక్కుముడులు విప్పటమే కాదు, అసలు చిక్కులే రాకుండా ఎలా జీవించవచ్చునో హితవు చెప్తాయి.

మొదటి కథ గురుత్వం ఇహమూ, పరమూ పరస్పరం విరుద్దాలు కావనీ, ఆముష్మికం కోసం నేర్చే చదువు ఐహికానికి కూడా వర్తింపచేసే సులువు వుంటే చాలుననీ చెప్తారు రచయిత్రి. సహధర్మచారిణీ కథలో ఒక ఇల్లాలి అభద్రతకి కారణం ఆమెకి ‘స్వేచ్ఛ’ ఇచ్చి సహకారం కోరకపోవటం అని ఆమె భర్తతోపాటు మనమూ తెలుసుకుని విస్తుపోతాము…. ‘ఇంతలో వుందా’ అని.

శ్రద్ధ అనే కథ చాలా ధైర్యంగా రాసినది.సంప్రదాయాలకీ విశ్వాసాలకీ కేవలం వర్తమానానికి వర్తించే నిర్వచనాలు ఇవ్వటం తెలివి తక్కువతనమనీ వాటి పరిధిని తెలుసుకోలేకపోతే ఆచరణ ఒక్కటే చాలుననీ చెప్పటానాకి చాలా ధైర్యమే కావాలి. ఏ విధమయిన అస్పష్టతా లేని నిబ్బరం రాధిక సాధించారు కనుకే ఆ ధైర్యం. నియమాలూ, నిబద్ధతలూ జీవితాన్ని సుగమం చేసి సృజనకీ తోడ్పడతాయని మనమంతా మరిచిపోయి చాలా కాలమే అయింది కనుక ఇప్పుడు కొత్తగా తిరిగి తెలుసుకోవచ్చు!

‘సత్యం’ కథలో సత్యాన్ని దర్శించటం, ఆచరించటం మధ్య వున్న అంతరాన్ని చాలా చాలా సరళంగా మనం ఊహించని పాత్ర నోట వింటాము. తలఒగ్గుతాము. ఈ విషయమే మరింత బలంగా ‘ఎంపిక’ కథ చెప్తుంది. మనం చేసే పోరాటాలు మన మీదికే తిరిగితే పట్టుకోవాలా వాటిని విడిచి పెట్టాలా? ఆ పాత్రతో పాటు మనమూ బెంబేలు పడిపోతాము. రచయిత్రి అలా మనల్ని వదిలివేయరు, దారి చూపిస్తారు.

సంపుటిలో చాలా ముఖ్యమయిన కథ ‘లోభం’. అస్తమానమూ గడియారం చూసుకుంటూ దాచుకున్న సమయాన్ని ‘ఏమి చేసుకోవాలో తెలిసే వివేకం లేకపోతే ఎలా వుంటుందో సుతిమెత్తగా చెప్తారు. ఆ వెంపర్లాట లేనివాళ్లకి ఎంత హాయిగా వుంటుందో కూడా. నియమాలే లేని జీవనశైలీ కాదు అది. నియమాలని పాటిస్తూనే అనుకోని విషయాలకి కూడా అవసరమయితే చోటు ఇ్వగలగటం.

‘తక్కువేమి మనకూ’ కథలోని నిత్యలాంటి కూతురో కోడలో ఒక దివ్యా శీర్వచనం వల్ల కానీ లభించరనిపిస్తుంది. బ్రతికేందుకు ధనం కావాలి. అది సరిపడినంత చాలు… ఎక్కువ సంపాదించేందుకు ఏ విలువలూ వదులుకోనక్కర్లేదు. చదువుతూ వున్న మనకి కూడా ‘ఆహా’ అనిపిస్తుంది. ‘ఎల్లల నడుమ’ కథ ఒక అన్వేషణ. ఒక ప్రయత్నం. యాంత్రిక జీవితంలోనే కాదు. గతంలోకి ప్రయాణించటంలోనూ శాంతి వుండదేమో అనిపించటం ఎందుకు? ఈ ప్రశ్న ఎవరికి వారు వేసుకుని జవాబు కోసం వెతకాలి. ఇంత చక్కటి పాఠాలు కదా తల్లులు పిల్లలకి నేర్పవలసింది! అంతకు ముందు ఆ తల్లులకీ తెలియాలి ఆ సంగతులు!

‘విముక్తి’ కథ గొప్పది. మనసుకి నచ్చినవి చేస్తూ పోతే అలా ఎన్నాళ్లు? తెచ్చుకోవలసినది నిగ్రహం కాని కొత్త ఆరాటాలు కానేకాదు. ఇద్దరు విరుద్దులయిన సహోద్యోగుల మద్యన జయంతి ముందు ఎవరివైపు మొగ్గుతుందో అక్కడ వ్యతిరేక పరిస్థితులు ఎదురయినప్పుడు ఎలా నీరసపడిపోతుందో ఆసక్తికరంగా చెప్పుకొస్తారు రచయిత్రి. విదేశయానం… ఉద్యోగంలో ఉన్నతి… ఇవి పుట్టబోయే పాప కన్న ఎక్కువనుకునే తనకి తల్లి అమాయకంగా చెప్పే మాటల వెనుక ఎంత సంప్రదాయ స్థైర్యం వుందో కాస్త ఆలోచిస్తేగాని అర్థమవదు. జయంతికి నచ్చటం మొదలుపెట్టిన మరొక సహోద్యోగిని ప్రియ నిజంగా బంగారుతల్లి. ఆమెలో నూతనమనిపించే దృక్పథానికి, అది ఇచ్చే ప్రశాంతతకీ లోబడి పోతాము జయంతితో పాటు మనమూ.

‘సత్యానికి చేరువగా’ రచయిత్రి ఎక్కిన శిఖరాలను చూపిస్తుంది. ఆధ్యాత్మికత ఇచ్చిన కరావలంబనతో సత్యం సాధించిన నిశ్చలత అంత ఎత్తయినది. ఆత్మీయులని కోల్పోవటం ఎన్ని దశలుగా ఒకరి మీద ప్రభావం చూపుతుందో ఆ దశలన్నిటినీ ఒక అంగలో అతను దాటటం ఆమె రాసిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. అది ఎంతమాత్రమూ అసాధ్యం కాదని తెలుసుకోవటం చక్కగా కళ్లు తెరిపిస్తుంది. అసాధారణమయిన మామయ్య, భర్త దాటిపోయిన తర్వాత కొత్త జీవితం ప్రారంభించిన అత్తగారు, తన అపరాధ భావనలని తమ్ముడి మీద నిరసనగా ప్రదర్శించే అన్న, సాక్షీభూతు రాలయిన అక్క, చివరికి సరయిన నిర్ణయం తీసుకున్న తల్లి… అందరూ ఎదటే తిరుగుతూ కనిపిస్తారు. ‘సౌందర్యం’ చివరి కథ. ఆశా నిరాశా లేని దృఢత్వం ఒకరిది. ఆశ నిరాశల మధ్య తూగిపోయే మనసు మరొకరిది. ఏమీ ఎదురుచూడని వారికి ఎదురయిన ప్రశంసలోని సౌందర్యం విస్మయపరుస్తుంది.

చదవటం మొదలు పెట్టిన పాఠకులూ అన్నీ చదవటం ముగించిన పాఠకులూ ఒకరు అపరు. ఈ కథల సారం వారిని వదిలిపోదు. కలిసి నడిచే, దారి చూపి తోడు రాధిక సాహిత్యం.

– పుస్తకం .నెట్‌ సౌజన్యంతో

 

 

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో