– షేఖ్‌ . మహబూబ్‌ బాషా, లక్నో.

‘…. నేనెంతటిపనినైనను, సులభముగా జేయగలను. భర్త ప్రీతిచేతనే గదా, ద్రౌపతి ఎన్నో కష్టములకోర్చినది. మనమిరువరము పరస్పరానురాగము గలిగి, తగినట్టు సంసారము నడుపుకొనిన మనలనీ దరిద్రదేవత ఏమి చేయును?’ ఈ సమాధానంతో ‘మిగుల సంతోష’ పడ్డ భర్త ‘ఓ సుందరీ! నేను నిన్నెంత కొనియా డుదును?’ అని ప్రేమపూరిత ప్రశంస కురిపిస్తే భార్య ‘(అధిక సంతోషము తో) ఇట్టి నిర్మలప్రేమ దృఢముగానున్న నింతకంటె నూరురెట్లధిక దారిద్య్రము వచ్చినను, దానిని సరకుగొందునా’ అని నల్లమల కొండంత ఆత్మస్థైర్యంతో పలుకుతుంది.వలసాంధ్రలో మహిళోద్యమాన్ని నిర్మించిన క్రియాశీలక మహిళామేధావుల్లో ఒకరైన భండారు అచ్చమాంబ (1874-1905) తెలుగు కథాసాహిత్యానికి ఆద్యురాలుగా గుర్తింపూ, ఖ్యాతీసంపాదిం చుకుంది. తెలిసినంతవరకూ అచ్చమాంబ రాసిన 12 కథల్లో 10 కథలు సంగిశెట్టి శ్రీనివాస్‌ కృషి కారణంగా మనకు లభ్యమవుతున్నాయి. ఇంతదాకా అలభ్యంగా వుండిన ‘ప్రేమా పరీక్షణము’, ‘ఎఱువుల సొమ్ము బఱువుల చేటు’ అనే రెండు కథలు ఈ వ్యాసకర్తకు లభించాయి. ఈ రెండు కథలను పరిచయం చెయ్యడం, అచ్చమాంబ కథావస్తువులో (మిగిలిన కథల్లో కొన్నింటిని కూడా కలుపుకొని) అలా ఎందుకుండి నాయో చారిత్రక దృష్టికోణంతో మాత్రమే కాకుండా చారిత్ర ‘పద్ధతి’తో కూడా స్థూలం గా విశ్లేషించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

అచ్చమాంబ రచించిన ‘తొలి’ తెలుగు కథ ‘ప్రేమా పరీక్షణము’ (‘ప్రేమ పరీక్షణము’ కాదు) వలసాంధ్ర మహిళోద్యమ నిర్మాణంలో గణనీయమైన పాత్ర పోషించిన రాయసం వేంకట శివుడి తెలుగు జనానా పత్రికలో 1898 జులై సంచికలో ప్రచురితమైంది. (సంపుటము 6, సంచిక 1, పు. 193-198). తెలుగు శీర్షికపైన ‘ఊనీలి ఊలిరీశి ళితీ ఉళిఖీలి.(ఔగి బి కరిదీఖితి ఉబిఖిగి)’ అని ఆంగ్ల శీర్షికనిచ్చారు. కథ చివర్న అచ్చమాంబ పూర్తిపేరూ ‘బాలాఘాట్‌’ (ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉంది) నుండి రాసినట్లూ యిచ్చారు. అచ్చమాంబ రాసిన మిగతా కొన్ని కథల్లాగానే ఈ కథ కూడా భార్యభర్తల మధ్య సంభాషణ రూపంలో ఉంది. (ఈ ప్రక్రియా విశేషం అచ్చమాంబకే పరిమితం కాదు. బెంగాళీ, హిందీ, ఉర్దూ, మరాఠీల్లో రచనలు చేసిన తొలితరం స్త్రీలూ, పలుమంది పురుషులూ ‘సంవాద’ రూపంలోనే రచనలు సాగించేవారు.)

కథ టూకీగా: మాణిక్యాంబ, రామారావులు భార్యాభర్తలు. ఒకరోజు సాయంత్రం ‘భిన్నవదనుడై’ యింటికొచ్చి మౌనంగా ‘కుర్చీమీద’ కూర్చుంటారు రామారావు. భర్త అలా ఎందుకున్నాడో అర్థంకాక ఆందోళన చెందిన మాణిక్యాంబ ఎందుకు విచారంగా కన్పిస్తున్నారని అడిగితే తలనొప్పంటాడు. కానీ దీంతో సమాధాన పడని భార్య వేరే ఏదో కారణముండి వుంటుంది, మన బంధువర్గమంతా క్షేమంగా ఉన్నారా అని ఆతురతతో అడుగుతుంది (ఎవరైనా చనిపోయారేమోనని భయ పడ్తుంది). ‘ఇంకనైన నిజమయిన కారణము చెప్పెదరా?’ అని అడిగిన భార్యతో ‘ఆ దుర్వార్త నీ చెవిని వేయుటకు నా మనసొప్పదు…’ అంటాడు భర్త. కడచిన సంవత్సరం దీపావళి పండుగ ఎంత ఘనంగా జరుపుకున్నారో ఆమెకు గుర్తుచేసి ఈ సారి అలా చేయలేమనిచెబుతూ ‘రేపటి నుండియు నేనింటనే గుర్చుండవలసి యుండును’ అంటాడు. విషయం గ్రహించిన భార్య ‘మీ యుద్యోగము పోయినదా యేమి?’ అని ప్రశ్నిస్తుంది. ఔనన్న భర్తతో ఎక్కువ దిగులు పడొద్దని సాంత్త్వన పరుస్తంది. తాము డబ్బు దాచుకున్న బ్యాంకు కూడా మునిగిపోయిందన్న భర్తతో ‘ఇది యొక గొప్ప విచారకరమగు సంగతియే గాని’ ఎక్కువ చింతించి ఆరోగ్యం చెడగొట్టుకోవద్దని అనునయిస్తుంది. గడచిన దీపావళి ధూం ధాంగా చేశాము, ‘నీవు కోరిన బనారసు చీరగొని పెట్టితిని’, యిప్పుడవన్నీ జరగక పోగా ‘మన భోజనమెట్లా గడచునాయని’ అత్యంత విచారంగా ఉందన్న భర్తతో మళ్లీ ఉద్యోగందొరికి కొంత డబ్బు పోగయ్యేదాకా ‘నాకున్న రెండు నగలనమ్మి పరమేశ్వరుడు మంచి దినములగు పరుచు వరకు గడపుకొందము’ అని ధైర్యాన్నిస్తుంది. చెప్పడం సులభమే, చెయ్యడం కష్టం: ఇంట్లో పనిమనుషుల్ని తీసేసి ఆ పనులన్నీ నువ్వే చెయ్యాల్సి వచ్చినప్పుడు ‘నీకీ దారిద్య్ర దుఃఖము తెలియును. అయ్యో! పాపము నిన్ను జూచిన, నాకు మిగుల జాలిగానున్నది – నేనేమి చేయుదు?’ అని వాపోయిన భర్తతో మిక్కిలి ఆత్మ విశ్వాసంతో గభీరంగా యిలా చెబుతుందా భార్య: ‘…. నేనెంతటిపనినైనను, సులభముగా జేయుగలను. భర్త ప్రీతిచేతనే గదా, ద్రౌపతి ఎన్నో కష్టములకోర్చినది. మనమిరువరము పరస్పరానురాగము గలిగి, తగినట్టు సంసారము నడుపుకొనిన మనలనీ దరిద్రదేవత ఏమి చేయును?’ ఈ సమాధానంతో ‘మిగుల సంతోష’ పడ్డ భర్త ‘ఓ సుందరీ! నేను నిన్నెంత కొనియా డుదును?’ అని ప్రేమపూరిత ప్రశంస కురిపిస్తే భార్య ‘(అధిక సంతోషము తో) ఇట్టి నిర్మలప్రేమ దృఢముగానున్న నింతకంటె నూరురెట్లధిక దారిద్య్రము వచ్చినను, దానిని సరకుగొందునా’ అని నల్లమల కొండంత ఆత్మస్థైర్యంతో పలుకుతుంది. తమకు దారిద్య్రాన్ని దేవుడెందుకిచ్చాడో అని భర్త మథన పడుతుంటే ‘కలిమిలేములు కావటికుండలు. నేడిట్లు మీ యుద్యోగమాకస్మికముగా బోవునని యెన్నడైనా కలగంటిమా?’ అని ధైర్యపరుస్తున్న భార్యతో ‘ఓ సుందరి ఉద్యోగ మెపుడుపోయెను?’ అని అంతదాక నాటకమాడుతున్న భర్త అంటాడు. మరి యింతదాకా మీరు పెట్టిన ఈ నసంతా ఏమిటని ప్రశ్నించిన భార్యతో ‘ఇదియంత యు వినోదము’ అనీ ‘నీ మనసు పరీక్షింపఁగోరి’ అబద్ధం చెప్పాననీ, ఆమె వాస్తవంగా యిలాంటి ఉత్తమ గుణాలు కలదని తనకు ముందుగానే తెలిసినప్పటికీ ఒకసారి ‘పరీక్షింపనెంచి’ నాననీ ‘నాకిట్టి గృహిణి దొరికినందు కానందము పట్టజాలకున్నాను. లోకములో నందరికినిట్టి సద్గుణవతులు భార్యలు(గా) దొరికిన స్వర్గమిక్కడనే యుందుననుట యతిశ యోక్తిగాదు’ అనీ అంటారు.

ఎట్టి క్లిష్టపరిస్థితులెదురైనప్పటికీ భార్యలు తాము నీరుగారిపోకుండడమే కాకుండా భర్తలకు కొండంత అండగా నిలవాలనీ, ఆత్మ స్థైర్యంతో మెలగాలనీ, భార్యభర్తలు పరస్పరానురాగంతో ఉంటే కల్లోల పరిస్థితుల్లో కూడా సంసారసాగరాన్ని సునాయాసంగా ఈదగలరనీ చెప్పడంతో పాటుగా యింటి పనులు గృహిణి స్వయం గానే చేసుకోవాలనీ, ‘తగినటుల’ – అంటే భేషజాల కెళ్ళకుండా – ఉన్నంతలోనే – జీవితాన్ని గడుపుకోవాలనీ బోధిస్తుందీ కథ. స్త్రీలు భర్తల్ని నగలకోసం సతాయిం చడం కాకుండా నగలనమ్మైనా భర్తల్ని కష్టాల గుంతల్లోంచి బయటికి పడెయ్యాలని పరోక్షంగా భార్యలకు హితవుంది. అయినప్పటికీ అచ్చమాంబ తన వ్యక్తిత్వానికి తగ్గట్టుగా కథ చివర్లో, మెల్లిగానే అయినా, ఒక ఝట్కా కూడా యిచ్చింది. ‘స్త్రీలు కపటముగలవారని కొందరు చెపుదురుగాని పురుషు లెట్టి కపటిలో ఇప్పుడు వెల్లడియ యెనాను. అట్లు మోనపుచ్చుటనే సేవకు రాలేమి యపరాధము చేసెను. ఆ సమయ మున మీ ముఖమును (ఉద్యోగం పోయిందని నాటకమాడి) జూడనాకత్యంత దుఃఖము గలిగెను. కానీ, మీకు ధైర్యము చెప్పుటకే నా దుఃఖమును పైకి జూపినదాననుగాను. ఇట్లు (స్త్రీలమైన) మేమొకయించుక చేసినను, మీరేమందురో తెలియదు’ అని బుల్లి చురక పెట్టింది.

ఇక రెండో కథ ‘ఎఱువుల సొమ్ము బఱవుల చేటు’ (‘ఎరువు సొమ్ము పరువు చేటు’ కాదు). ఇది కూడా తెలుగు జనానా పత్రికలో 1898 సెప్టెంబరు సంచికలో ప్రచురితమైంది. (సంపుటము 6, సంచిక 3, పు. 89-96). తెలుగు శీర్షికపైన ‘ఐశిళిజీగి ళితీ బి స్త్రళిజిఖిలిదీ శ్రీళిరీలి జీరిదీవ్ష్మీ ఔగి బి కరిదీఖితి ఉబిఖిగి’ అని క్యాపిటల్‌ లెటర్స్‌లో యిచ్చారు. ‘బాలఘాట్‌’ నుండి పంపబడ్డ ఈ కథ కూడా భార్యా భర్తల సంభాషణ రూపంలోనే ఉంది. జానకమ్మ రామమూర్తిలు యిందులో భార్యాభర్తలు. ప్రకరణాల్లో విడగొట్టబడ్డ ఈ కథ విశేషమేమంటే ‘ఒక కథ’ అని శీర్షికలోనే యివ్వడం (‘ఎఱువు సొమ్ము బఱువుల చేటు: ఒక కథ’) (అచ్చమాంబని ‘తొలి’ కథా రచయితగా ఒప్పుకోని వాళ్ళు దీన్ని గమనించగలరు) ‘కఱువు కాలమునందు (1896 ప్రాంతంలో మధ్య పరగణాల్లో దుర్భర క్షామం తాండవించింది) నెలకు ముప్పది రూపాయల జీతముతో, భార్యభర్త లిద్దరికి భుక్తికిఁబోగా, నేమిమిగులును?’ అంటూ మొదలౌతుందీ కథ. గొఱ్ఱెతోక జీతం యిద్దరికే చాలని పరిస్థితుందే ఒళ్ళు వంచి పనిచేసే తత్త్వంలేని పరమసోమరి అయిన జానకమ్మ పనికత్తను కూడా నియమించు కుంటుంది. డబ్బు విలువ తెలియక ‘దుబారా ఖర్చులు’ చేసే ఆమె వంటపని కూడా విసుక్కుంటూ చేస్తుంది. ‘భార్య యిట్టి స్వభావముగలదైనను రామమూర్తిగారికామె యెడఁగల ప్రేమ యింతింతని చెప్పను విగాదు. తన చేతనైనతంత వరకును, భార్యనోటి నుండి వచ్చిన వాక్యమతి సంతోషముతో నెరవేర్చుచుండును’. ఇంత మంచి భర్త దొరికినా సంతోషంలేని జానకమ్మ ‘తనకు విలువగల వస్త్ర భాషణములు లేవని యెప్పుడును తనయసంతృప్తినే గనపఱచుచుండును’.

ఒకరోజు సాయంత్రం ‘అత్యంతా నందంతో’ యింటికొచ్చిన భర్త ఆయన అధికారి కుమారుడి ఉపనయనోత్సవానికి ఊళ్ళో వాళ్ళని పిలవడానికి ఆయన భార్యతో కలిసి వెళ్ళమని తన భార్యతో అంటే ‘ఈ మాసిన గుడ్డలు గట్టుకొని’ పేరంటానికి పిలవడానికెళా వెళ్ళాలని ప్రశ్నిస్తుంది. ‘నేను కొనిన మధుర చీర’ కట్టుకొని పొమ్మన్న భర్తతో ‘ఆహాహా చీరకును సిగ్గులేదు? నాకును సిగ్గులేదు’. ఎప్పుడో ఐదేళ్ళ క్రితం కొన్న పాతచీరే మళ్ళీ మళ్ళీ కట్టుకొని ఎట్లాపోవాలని ప్రశ్నిస్తుంది. ఆ చీర పదహైదు రూపాయలకు కొన్నదని గుర్తుచేసిన భర్తతో ‘మఱింత కోపము’ వచ్చిన జానకమ్మ ‘పదునైదు రూపాయిలని పాటఁబాడుటయేగాని, అదికొనియెంతకాలమైనదో మీరు విచారించుట లేదు. అది మాత్రము మీ మనసుతోఁగొన్నారా? ఎన్నో నెలలు వెంటఁబడి కొనుడని మొఱబెట్టినఁగాని, యాకొంచెము భాగ్యపు చీరయునుగొనలేదు’ అని రేపా అధికారి భార్య వచ్చేటప్పటికి యింట్లో వుండకుండా ఎక్కడికైనా పోతానని ఖరాఖండీగా చెప్పేస్తుంది. దీంతో ‘ధనములేక భార్యను సంతోష’ పెట్టలేకుండా ఉన్నానే అని ముందే కుమిలిపోతున్న రామమూర్తి ‘మఱింత చింతాగ్రస్తుడయ్యెను’.

అధికారి తన జీతం పెంచాడని భర్త ‘సంతోషవార్త’ చెప్పిన వెంటనే ‘ఇంక ముందొక బ్రాహ్మణక్కను వంటకుఁబెట్టెదరా?’ అని ఆత్రంగా అడుగుతుంది భార్య. పెరిగిన జీతం ఐదు రూపాయలే అని తెలుసుకొని ఓస్‌ ‘ఇంతేనా’ అని భర్త సంతోషంపై నీళ్ళు చల్లుతుంది. సరే, నీకెలాంటి చీరకావాలో చెప్పు, తెస్తాను అన్న భర్తతో ‘కొంటిరా, మంచి బనారసు చీర కావలెను… ఎంతైనను సరే… ఋణమైనను చింతలేదు’ అని గడుసుగా అడుగుతుంది. దాంతో గత్యంతరం లేక 20 రూపాయలు అప్పుతెచ్చి చీర కొంటాడు రామమూర్తి. భేషజాలకెళ్లే జానకమ్మ అంతటితో సంతోషించక ‘యింకా 50-60 రూపాయ లొక్కసారిగా నప్పుదెచ్చి, ముక్కుపోగు (నత్తు) చేయించియుండినెంత బాగుండును!’ అంటు ంది. ఇప్పుడుకాదు, యింకోసారి అంటాడు భర్త. దీంతో జానకమ్మ ఎఱువడగడానికి పొరుగునున్న తహసీల్దారు భార్య దగ్గరికి పోతుంది: ఆమె మొహమాటం కొద్దీ పరోక్షంగా వీలుగాదంటున్నా ‘బలవంత’ పరిచి ముక్కు పోగుతోపాటు కాళ్ళకున్న తోడాలను (గొలుసులు) కూడా తెచ్చుకొని పేరంటానికెళ్తుంది. సహజంగానే అందగత్తె అయిన జానకమ్మ ముక్కుపోగు కారణంగా మరింత అందంగా కన్పించి పలువురి దృష్టి నాకర్షిస్తుంది; వాళ్ళు పొగడగా ఉబ్బితబ్బిబ్బౌతుంది.

ముక్కుపోగు పెట్టుకున్న ఒక ధనికురాలి పక్కన భోజనానిక్కూర్చుటుంది జానకమ్మ. ఆమె భోజనం చేసేటప్పుడు పోగుతీసి భోజనమయ్యాకన మళ్లీ పెట్టుకుంటుంది. అలవాటు లేకపోవడంతో జానకమ్మ తీసిన పోగును మళ్లీ పెట్టుకోలేకపోతుంది. పట్టపగ్గాల్లేని ఆనందంతో యింటికొచ్చిన జానకమ్మతో ముక్కుపోగెక్కడని అడుగుతాడు భర్త. మెడలో తను వేలాడేసుకొన్న చోట పోగులేకపోవడంతో గాభరాపడి తన యిళ్ళూ, విందుకై వెళ్ళిన వారి యిళ్ళు, మధ్య దారిలో… అంతా వెదుకుతారు భార్య భర్తలిద్దరూ. కానీ ప్రయోజనం శూన్యం. పైపెచ్చు జానకమ్మ అజాగ్రత్తని విమర్శిస్తారు వీధిలోని అమ్మలక్కలు…

ఇంతలో ఒకామె పోయిన పోగు ఈమెదికాదు, తహసిల్దారు భార్యది, అందుకే ఈమె మరిచిపోయిందని వెటకారంగా పలికి జానకమ్మ పరువుని బజారున పెడ్తుంది. చోద్యం చూసే అమ్మలక్కల రకరకాల మాట లు జానకమ్మకు ‘దుస్సహమయ్యెను’. తన పోగు పోగొట్టిందని తెలుసుకొని ఆనరాని మాటలంటుంది తహసీల్దారు భార్య; పోగు ఖరీదు 300 కట్టమంటుంది. ‘తానుజేసిన దుబారా ఖర్ఛులు మొదలయినవనేకములు నాటి రాత్రి యామెకు తలఁపునకు వచ్చి, నేను సంసారము చక్కగా ఁ జేసికొను చుండినయెడల, నాకును నా భర్తకును నిట్టి కష్టములు వచ్చియుండవుగదా; నేను సోమరిని గాకున్న మా యిల్లెంత బాగుం డును? నేను లేనిపోని మనసులుపడి, భర్త బోధనలు వినక, ఎఱువు నగలు తెచ్చినందు నగదా, నేటి దుఃఖము ప్రాప్తమై నది’ అనుకుంటూ బాధపడుతుండగా ‘భర్తయామె నెంతో రడించెను’. పోగు ఖరీదు చెల్లించడానికై నూటికి రూపాయి చొప్పున వడ్డీకి అప్పు తెచ్చి తీరుస్తాడు భర్త. బుద్దివచ్చిన జానకమ్మ ‘పరిచారికను దీసివేసి, తానే పనులన్నియు జేయుచు, చేతనైనంత వ్యయము తగ్గించి, వర్తింప సాగెను’. అప్పు తీర్చే నిమిత్తమై ఒక పదిరూపాయల ఆదాయమొచ్చే యింకో ఉద్యోగం కూడా రాత్రిపూట చేయడం మొదలుపెడతాడు రామమూర్తి. దీంతో ‘తన మూర్ఖతవలననే భర్తకింత కష్టముగలిగెనని జానకమ్మ – విచారపడుచుండెను.’ ముందు ముప్ఫై రూపాయలను మంచినీళ్ళ ప్రాయంగా దుబారా ఖర్చు పెట్టిన ఆమె పదునైదు రూపాయల్లోనే సంసారాన్ని ఒద్దికగా నిర్వహించుకోవడం ప్రారంభి స్తుంది. ఇప్పుడామె బనారసు చీరపేరుగానీ, నగల ఊసుగానీ ఎత్తనే ఎత్తదు – భర్త పెట్టుకోమన్నా అప్పుతీరిన తర్వాతే అంటుంది. ఇలా చిన్న చిన్నగా అప్పులు తీరుస్తూ హాయిగా వున్న సందర్భంలో అదృష్టవశాత్తూ ఒకరోజు యింట్లో ఒకమూల కన్నంలో పడివుండిన ముక్కుపోగు దొరుకుతుంది. పరమానంద భరితు లౌతారు భార్యాభర్తలు. ‘అప్పటి నుండి జానకమ్మ, వెనుకటి దుర్గుణములన్నిటిని వదలి, భర్తకు అనుకూలముగా నడుచుకొనుచుండెను. రామమూర్తిగారు కష్టపడి తెచ్చిన నెల జీతమును వ్యర్థపు కర్చులకు వ్యయపరచక పొంకముగా సంసారము చేయుచు ప్రతి సంక్రాంతి పండుగునకును అధనము మూడువందల రూపాయల వరయినను మిగుల్చును… జానకమ్మగారి సొంపయిన గృహనిర్వాహ కత్వము వలనను, వారు కొద్ది కాలములోనే, పుత్రులను పుత్రికలను గలిగి మహాధనికు లయిరి… కాని జానకమ్మ గారెన్నడు, ఎఱువు ముక్కుపోగు మాట మాత్ర ము మఱచినదికాదు!’ అని ముగుస్తుంది కథ.

అచ్చమాంబ మిగిలిన కథలను కూడా విశ్లేషనార్థం తీసుకుంటే ‘గృహ సంస్కరణ’ ప్రధాన విషయవస్తువుగా ముందుకొస్తుంది. అందులో భార్యాభర్తల మధ్య అనురాగ పూరితంగా ఉండాల్సిన స్నేహితుల్లాంటి సంబంధాలు, పిల్లలకుసరైన రీతిలో తర్ఫీదునివ్వడం, ఆర్ధిక విషయాల్లో స్త్రీలకుండాల్సిన జాగ్రత్తలూ, సంసారాన్ని పొందికగా నడుపుకుంటూ భేషజాలను దూరంపెట్టి భర్తల్ని కష్టాల పరంపరకు గురిచేయకుండా మెలకువగా వ్యవహరిం చడం, అన్ని విషయాల్లోనూ ముఖ్యంగా కష్ట సమయాల్లో – భర్తకు చేదోడు వాదోడుగా వుండడం, యిలా ఉన్నత విలువలు పెంపొందించుకోవడానికీ, భర్త అడుగు జాడల్లో నడుచుకోడానికి స్త్రీలు విద్య నేర్చుకోవాల్సిన ఆవశ్యకత మొదలైన విషయాల చుట్టే తిరుగుతాయీ కథలు. ఆమె ఉపన్యాసాలూ, వ్యాసాల్లో కూడా ప్రధాన విషయం యిదే.

అచ్చమాంబ కథా వస్తువులు యిలాగే ఎందుకుండినాయన్న విషయం దగ్గరికొద్దాం. ఆమె కథల్లో ‘జటిలమైన సమస్యలు’ లేవని మనకివాళ అన్పించొచ్చుగానీ పందొమ్మిదో శతాబ్దంలోనూ, 20వ శతాబ్ది ప్రథమార్థం లోనూ జీవించిన వారికి భార్యాభర్తల సంబంధం, గృహనిర్వాహకత్వం జటిల సమస్యలుగా ఉండినాయని చెప్పడాకి కోకొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. ఆనారోగ్యకరమూ, అనాసక్తిదాయకముగా ఉన్న కౌటుంబికత్వ సమస్య (శినీలి చీజీళిలీజిలిళీ ళితీ ఖిరిరీశితిజీలీలిఖి ఖిళిళీలిరీశిరిబీరిశిగి) అంత జటిలంగానూ, భయభ్రాంతంగానూ ఉండేది కాబట్టే ఈ విషయంగూర్చి పురుష సంస్కర్తలూ స్త్రీ సంస్కర్తలూ విస్తృతంగా రాశారు. వివిధ భారతీయ భాషల్లో సమకాలీన పత్రికలు – ముఖ్యంగా స్త్రీల పత్రికలు, అందునా పురుషుల సంపాద కత్వంలో వెలువడినవి – గృహ నిర్వాహకత్వ విషయాన్ని గూర్చి విస్తారంగా చర్చించేవి. మంచి ఇల్లాలు, మానినీ శతకము, స్త్రీ నీతి దీపిక, స్త్రీ నీతి రత్నావళి మొదలైన పుస్తకాలు వెలువడ్డాయి. అప్పట్లో గృహనిర్వహణ విషయం ఎంత ప్రముఖమైన దండే రాయసం వేంకటశివుడి గృహనిర్వాహ కత్వము అనే పుస్తకం మొదటి ముద్రణ 300 కాపీలు త్వరత్వరగా అమ్ముడైపోగా ఆయన రెండోముద్రణకు (మార్పులు చేర్పులతో) సంసిద్ధమయ్యార మహాదానంద పడుతూ. బెంగాళీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, హిందీ, తమిళం మొదలైన భాషలన్నింటి లోనూ ఈ విషయానికి సంబంధించి బోలెడు పుస్తకాలు ప్రచురితమయ్యాయి. మొత్తానికి ‘కౌటుంబిక జీవనసంస్కరణ’ అనేది నాడు ముఖ్యంగా వలసవాద సంస్కృతిచే ప్రభావితులైన మధ్య, ఉన్నత మధ్య తరగతుల వారికి ఊపిరి సలపన్విని సమస్యగా ఉండింది.

బ్రిటీష్‌ వలస సామ్రాజ్యవాదులు భారతీయులపై చేసిన సాంస్కృతిక దాడిలో ‘దిగచారిపోయివున్న భారతదేశ స్త్రీల స్థితి’ని బాగా ఉపయోగించుకున్నారు. సరియైన ఖీలిదీశిరిజిబిశిరిళిదీ లేకుండా ఎలుకల కన్నాల్లా అన్పించిన యిక్కడి యిళ్లూ, అందులో నివసించే భార్యాభర్తల మధ్య ఉన్న యజ మానీ బానిస సంబంధాలూ, బాల్యవివాహా లూ, విధవా వివాహనిషేదాలూ, స్త్రీలకు విద్యనివ్వకపోవడాలూ – మొదలైనవన్నీ భారతీయులను ”పరమ మూర్ఖులూ”, ”అనాగరికులూ” అని చిత్రీకరించి తమ అధికారం పదిలపరచుకోవడానికి బాగా ఉపయోగించుకున్నారు వలసవాదులు. ఒక ఉదాహరణ తీసుకుంటే – ప్రయోజనవాద సామ్రాజ్యవాద చరిత్రకారుడైన జేమ్స్‌మిల్‌ తన కరిరీశిళిజీగి ళితీ ఔజీరిశిరిరీనీ |దీఖిరిబి (1818) లో ‘ఊనీలి బీళిదీఖిరిశిరిళిదీ ళితీ శినీలి గీళిళీలిదీ రిరీ ళిదీలి ళితీ శినీలి ళీళిరీశి జీలిళీబిజీదిబిలీజిలి బీరిజీబీతిళీరీశిబిదీబీలిరీ రిదీ శినీలి ళీబిదీదీలిజీరీ ళితీ దీబిశిరిళిదీరీ. జుళీళిదీవీ జీతిఖిలి చీలిళిచీజిలి, శినీలి గీళిళీలిదీ బిజీలి వీలిదీలిజీబిజిజిగి ఖిలివీజీబిఖిలిఖి …. శ్రీళిశినీరిదీవీ బీబిదీ లినిబీలిలిఖి శినీలి నీబిలీరిశితిబిజి బీళిదీశిలిళీచీశి గీనీరిబీనీ శినీలి కరిదీఖితిరీ లిదీశిలిజీశిబిరిదీ తీళిజీ శినీలిరిజీ గీళిళీలిదీ…. ఊనీలిగి బిజీలి, లీగి రీగిరీశిలిళీ, ఖిలిచీజీరిఖీలిఖి ళితీ లిఖితిబీబిశిరిళిదీ. ఊనీబిశి జీలిళీబిజీదిబిలీజిలి – చీజీళిళితీ ళితీ లీబిజీలీబిజీరిశిగి, శినీలి గీరితీలి నీలిజిఖి తిదీగీళిజీశినీగి శిళి లిబిశి గీరిశినీ నీలిజీ నీతిరీలీబిదీఖి, రిరీ చీజీలిఖీబిజిలిదీశి రిదీ కరిదీఖితిరీశిబిదీవ అని ‘హిందూ కౌటుంబిక జీవన సంస్కృతిని తూట్లుపొడిచాడు (ఔళిళిది ||, ్పునీబిచీశిలిజీ.7, చీచీ.445-452)

వలసవాదుల సాంస్కృతిక దాడి తమలో కలుగజేసిన ఆత్మన్యూనత నుండి బయటపడి భారతజాతీయ అస్మితను నిరూపించడానికి ”మా తాతలు నేతులు తాగారంటూ బయల్దేరి సంఘ సంస్కరనోధ్యమాన్ని ప్రారంభించారు పురుష సంస్కర్తలు. వాళ్ళ అడుగుజాడల్లో నడిచారు పలుమంది మహిళా మేధావులూ సంస్కర్తలూ. ఈ కారణంతో పాటు వలసపా లన – ముఖ్యంగా విద్య, సంస్కృతి – కారణంగా తమ జీవితాల్లో త్వరత్వరగా చోటుచేసుకొన్న మార్పులకనుగుణంగా తమ గృహాల్లో కూడా మార్పులు ప్రవేశపెట్టాల్సిన అవసరం కలిగింది. ఒక దశలో సంఘ సంస్కరణ ఆంటే గృహ సంస్కరణే అన్పిం చేంత ఎక్కువగా ఇంటి సంస్కృతి పునర్మిర్మా ణోద్యమం ముందుకొచ్చింది. ఇంగ్లీషు స్కూల్లో, కాలేజీల్లో ఆంగ్ల సాహిత్యాన్ని – ముఖ్యంగా ఉరిశిలిజీబిశితిజీలి ని చదివిన పురుషు లు తమ వాస్తవ జీవితాల్లో ‘మూర్ఖులూ’, ‘అనాగరికులూ’, ‘ఆ విద్యావంతులూ’ అయిన బాలభార్యల కారణంగా తాము తహతహలాడుతున్న రోమాన్స్‌ లోపించడ ంతో లబలబలాడారు. వలస సంస్కృతి ప్రభావ కారణంగా – ముఖ్యంగా ఆంగ్ల స్త్రీ-పురుష సంబంధాలు – పురుషులకు కొన్ని ఆకాంక్షలూ, ఆదర్శాలూ యేర్పడ్డాయి. భార్య భర్తల సంబంధాలు యజమానీ బానిసల్లా కాకుండా స్నేహితుల్లాగా ఉండాలనీ, భార్య సహాయకు రాలుగానూ, సహచరిగానూ (నీలిజిచీళీబిశిలి బిదీఖి బీళిళీచీబిదీరిళిదీ) ఉండాలనీ, భార్యాభర్తలు పరస్పరం పేర్లతో సంబోధించుకోవాలనీ, ఆంగ్ల దొరలూ దొరసానుల్లాగా సాయంత్రా లు అలా ప్రక్కప్రక్కన నడుచుకుంటూ షికార్లకూ, మీటింగులకూ, నాటకాలు చూడ్డానికీ వెళ్ళాలని ఉబలాటపడేవారు. ఈ నూతన సంస్కారాన్ని సాధించాలంటే అంటే తమ ఆకాంక్షకనుగుణంగా ”మూర్ఖశిఖా మణు”లైన భార్యల్ని మలచాలంటే వాళ్ళకు విద్యనందించి, తమకవసరమైన విషయాల్ని వాళ్ళ బుఱ్ఱల్లోకి తోసి వాళ్ళ ద్వారానే సంస్కారాన్ని సాధించాలి. మూర్ఖులైన భార్యల తో సంసారం ఎంత ఘోరంగా ఉండిందో, వారికారణంగా నూతన సంస్కారవాదులైన పురుషుల ఆదరాలకు ఎలా చిల్లులు పడేవో తన భార్య రత్నమ్మతో తన తొలినాటి సంసార జీవితం ఎంత దుర్భరంగా సాగిందో రాయసం వేంకట శిశుడు విపులంగా వివరించాడు. ‘అజ్ఞానియై యటవీ – మృగమువలె’ పెరగడం కారణంగా ‘యాతని సందేశముల చొప్పున నడువనొల్లని యొక యంగన కాంతకు గట్టఁబడుట యెంతటి కాలవైపరీత్యము!’ అనీ ‘ ఒడ్డు పొడుగులందు హనుమంతునికిని వాలఖిల్యులకును గల భేదము ‘ఈ సంస్కర్త”కును అతని సతీమణికిని గలదు. గృహజీవితమును గురించి యున్నతాశయములను, భార్య విద్యాభ్యున్నతి విషయమై యుత్కుృష్ట భావములను గల యీ ‘సంస్కర్త’, జీవితము న పరాజయమందెనే!…’ అంటూ గుండెలు బాదుకున్నాడు. ఇరుగుపొరుగు ముసలమ్మల మాటలు విని, భర్తల నూతన సంస్కార భావాల్ని ‘వైపరీత్యములు’గా భావించి ”గృహకల్లోలా”నికి కారణమై ”సంసార సాగరం దుఃఖం” అని తలపింపజేసేవారట అవిద్యావంతులూ, అ సంస్కారవంతులూ అయిన భార్యలు.

అరకొర ‘జీతాల’తో బతుకులు వెళ్లదీస్తున్న పురుషులు తమ భార్యలు గృహకృత్య నిర్వహణలో ఆంతేరి ఉండాలనీ, దుబారా ఖర్చులు చేయకుండా, చీరలూ నగలకై తమని సాధించకుండా, యింట్లో శుచీశుభ్రతా పాటిస్తూ, ఖాళీ సమయాన్ని అమ్మలక్కల ఉబుసుపోక కబుర్లతో గడపకుండా సద్వినియోగం చేసుకోవాలనీ – ఇలా సంసారాన్ని సంస్కారయుతంగా, గుంభనంగా నడుపుకొని తమకెలాంటి కష్టం వాటిల్లకుండా చూసుకోవాలని కోరుకు న్నారు. భర్తల ఆకాంక్షలకనుగుణంగా ప్రవర్తిస్తూ కుటుంబాన్ని నడపాలనీ, బయట ‘కష్టపడి’ యింటికొచ్చిన భర్తకు చికాకుపరిచే మాటలు మాట్లాడకుండా, వీలైతే ”ఒక చక్కని పాటపాడి” సేదదీరేందుకు తోడ్పడాలనీ భావించేవారు. గృహకృత్య నిర్వహణలో – ముఖ్యంగా ఆర్ధిక విషయాల్లో – భార్య ఆరితేరిలేకపోతే, దుబారా ఖర్చులు చేసి డబ్బు ఆదా చేయకపోతే భర్తకుకలిగే కష్టాలన్ని గృహలక్ష్మి పత్రిక వ్యవస్థాపకుడూ, సంపాదకుడూ అయిన డాక్టర్‌ కె.యన్‌. కేసరి తన మొదటి భార్య కనకమ్మతో తన సంసార యాత్ర సాగిన విధానం ప్రస్తావించిన సందర్భంలో వివరించారు. తనకూ, తన పక్కింటి అయ్యరుకూ నెలజీతం ఇరభై రూపాయలే అయినా అయ్యరు భార్య పొదుపరీ, గృహకార్య నిర్వహణలో నేర్పరీ కావడంతో వాళ్ళు కొంత డబ్బు ఆదా చేసుకొనే వారనీ, తమ ఇల్లు గుల్ల అయ్యేదనీ వాపోయారు. అయ్యరు తన భార్యతో కలిసి సాయంత్రాలలా షికారు వెళ్తాడనీ, తనకా భాగ్యం లేదనీ, అయ్యరు సతి లాగా తన భార్యకు సంగీత జ్ఞానం లేదనీ వాపోతారు. చివరకు ‘కనకమ్మా’ అని పేరుతో సంభోధిస్తే అలా పిలవవద్దు అని నివారించిన భార్యతో తనెలా గడిపిందీ, తన రెండో భార్యతో తన ఆశయాలెలా సాకారం చెందిందీ వివరిం చారు తన స్వీయ చరిత్ర నా చిన్న నాటి ముచ్చట్లు లో.

వేంకట శివుడూ, డాక్టర్‌ కె.యన్‌.కేసరిల్లా (తొలినాల్లలో) ”దురదృష్టవంతులు” కాకుండా అదృష్టపవంతులుగా తేల్తారు కందుకూరి వీరేశలింగం, దర్శి చెంచయ్యలు. తన ఆకాంక్షలూ ఆదర్శాల కనుగుణంగా తనను తాను మలచుకొని తన ”ఛాయ” లాగా ప్రవర్తించిన కందుకూరి రాజ్య లక్ష్మమ్మను బహువిధాలా ప్రశంసించారు ‘వీర సంస్కర్త’ అయిన వేరేశలింగం. అనుకూలవతి అయిన భార్య దొరికినందుకు (దర్శి అన్నపూర్ణాదేవి) ఎంతో మంది దర్శి చెంచయ్య మీద ప్రశంసల జల్లులు కురిపించారు.

పైన మనం వివరించుకుంటూ వచ్చిన విషయాలు అచ్చమాంబ కథా వస్తువులు అలాగే ఎందుకుండినాయో కొంతవరకు స్పష్టపరుస్తాయి. తమ అవసరాలూ ఆకాంక్షలకనుగుణంగా స్త్రీలను మలచడం – అంటే ఆంగ్ల విద్యావంతులూ లేదా ఆంగ్ల సంస్కృతీ ప్రభావితులూ అయిన పురుష సంస్కర్తల దృష్టికోణ చట్రంలో స్త్రీలను పోతపోయడం – పురుష సంస్కర్తల లక్ష్యం. ఉదారవాద పితృస్వాములైన సంస్కర్తల చట్రంలో తమని తాము అందంగా యిమిడ్చికొన్న తొలితరం ఆంధ్రస్త్రీల / భారతస్త్రీల సాంసారిక, సాంఘిక చరిత్రకు అద్దం పడ్తాయి అచ్చమాంబ కథలు. ఆధునిక భారత మహిళోద్యమ చరిత్రను రాసిన స్త్రజూష్ట్రజుఉఈ|శ్రీజూ ఓంష్ట్రఔజూఐ సూత్రీకరణ అయిన ఐం్పు|జుఉ ఓజూఖ|శ్రీ|ఐఖ (సోషలిస్టు ఫెమినిజం కాదు) కు ఉదాహరణగా తీసుకోవచ్చు అచ్చమాంబ కథల్ని. సోషల్‌ ఫెమినిజం అంటే స్త్రీలు తాము కోరుతున్న హక్కులు సాంప్రదా యంగా తమకు విధించబడిన విధులను నిర్వర్తించడానికేనని వ్యూహాత్మకంగా వాదించిన విధానం.

మొత్తానికి లభ్యమైన ఈ రెండు కథలు తెలుగు కథారంభకాలాన్ని ఇరవైయ్యవ శతాబ్ది తొలిదశకం నుండి తొలగించి పందొమ్మిదో శతాబ్ది చివరి దశకంలోకి తీసుకెళ్తాయి. తెలుగు సాహిత్యానికి ఈ గౌరవం సంపాదించి పెట్టిన భండారు అచ్చమాంబ బహుదా ప్రశంసనీయం.

– షేఖ్‌ . మహబూబ్‌ బాషా

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో