పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకోవటం నేరం

మన సమాజంలో స్త్రీల పట్ల వివక్షత ఉందనటంలో సందేహం లేదు. ఆడవాళ్ళు చదువకోటానికి లేదు, మంచి ఆహారం పెట్టరు, జబ్బు చేస్తే త్వరగా వైద్యం చేయించరు. ఈ వివక్షత జనాభాలో స్త్రీ, పురుషుల నిష్పత్తిలో స్పష్టంగా కనపడుతుంది. 0-6 సంవత్సరాల వయస్సులో ప్రతి వెయ్యిమంది బాలురుకి 943 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. అలాగే 0-6 వయస్సులో ప్రతి వెయ్యి మందికి 46 శిశు మరణాలు సంభవిస్తుండగా బాలురులో 44 మంది, బాలికలలో 47 మంది చనిపోతున్నారు.

ఆడపిల్లలు పుడితే బాధ పడటం, ఆడపిల్లను కన్నందుకు భార్యను వేధించటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని రాష్ట్రాలలో మాదిరిగా పుట్టిన వెంటనే ఆడపిల్లను చంపటం మన రాష్ట్రంలో అంతగా లేదు. వివక్షత, అశ్రద్ధ, నిర్లక్ష్యం కారణంగా ఆడపిల్లలు చనిపోవటం మన రాష్ట్రంలో ఎక్కువ.

వైద్య ప్రగతి దుర్వినియోగం

వైద్య వ్యవస్థలో రోగనిర్ధారణ, శస్త్ర చికిత్స, మందులలో ఎంతో పురోగమనం సాధించాం. అలవికావనుకున్న ఎన్నో రోగాలను నయం చేసి మనిషి అఆయుర్ధాయాన్ని పెంచుతున్నాం. గర్భంలో ఉన్న పిండం ఆడా, మగా అని తెలుసుకోగలిగిన సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందింది. దీంతో గర్భంలో ఉన్నది. ఆడపిల్ల అని తెలిస్తే కొంతమంది భ్రూణహత్యకు పాల్పడుతున్నారు. దీనిని ఆరికట్టడానికి భారత ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఈ చట్టమే

గర్భధారణకి ముందు, గర్భస్త శిశు లింగ నిర్ధారణ నిషేద చట్టం, 1994

గర్బంలో ఉన్నప్పుడు దిగువ సంబంధిత వ్యాధులను గుర్తించడానికి పరీక్షలు చేయవచ్చు

తి జన్యులోపాలు లేదా జీవక్రియల సంబంధిత వ్యాధులు

తి క్రోమోజోముల వైపరీత్యాలు

తి హిమోగ్లోబిన్‌ సంబంధిత వ్యాధులు

తి పుట్టుకతోనే సంక్రమించే వ్యాధులు

తి పుట్టుకతో వచ్చే లైంగిన వ్యాధులు

తి కేంద్ర పర్యవేక్షక బోర్డు పేర్కొనే ఇతర వైకల్యాలు, వ్యాధులు

అయితే ఈ క్రమంలో గర్బంలో ఉన్నది ఆడా, మగా అని గర్భవతి కానీ ఆమె బంధువులు కానీ అడగకూడదు, ఆ విషయం పరీక్షలు చేపట్టిన వాళ్ళు తెలియచెయ్యకూడదు.

చట్టం పరిధిలోకి వచ్చే కేంద్రాలు

తి జన్యు సలహా కేంద్రం

తి జన్యు క్లినిక్‌

తి జన్యు ప్రయోగశాల (అల్ట్రాసౌండ్‌ యంత్రం, ఇమేజింగ్‌ యంత్రం లేదా స్కానర్‌ లేదా ఇతర పరికరాలు)

తి సంతాన సాఫల్య కేంద్రాలు

ఈ కేంద్రాలు నమోదు అయి ఉండాలి.

ఏ పరిస్థితిలో పరీక్షలు జరపవచ్చు

తి గర్భవతి వయస్సు 35 సంవత్సరాలు దాటినప్పుడు

తి అంతకుముందు 2 లేక అంతకన్నా ఎక్కువసార్లు గర్భస్రావం జరిగినప్పుడు

తి గర్భవతి మహిళ కేన్సర్‌ కారక మందులు, రేడియేషన్‌, వ్యాధి కారక క్రిములు లేక రసాయనిక ప్రభావాలకి లోనైనప్పుడు

తి గర్భవతి లేదా ఆమె భర్త కుటుంబంలో బుద్ధిమాంద్యం, ఎపిలెప్సి, శారీరక వైలక్యం, జన్యుపర వ్యాధుల చరిత్ర ఉన్నప్పుడు

తి కేంద్ర పర్యవేక్షక బోర్డు పేర్కొన్న ఇతర జన్యుపర వ్యాధులు గర్భవతికి ఉన్నప్పుడు

ఏ కారణంగా పరీక్షలు జరుపుతున్నారో వాటిని నిర్వహించే వ్యక్తి రాతపూర్వకంగా రికార్డు చెయ్యాలి.

ఈ పరీక్షలు చేయించుకోడానికి గర్భవతి నుండి ఆమె అర్థం చేసుకోగలిగిన భాషలో రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాలి.

ఈ పరీక్షలు చేసిన వ్యక్తి కానీ, ఇతరులు కానీ గర్భస్థ శిశువు ఆడో, మగో గర్భవతికి కానీ, ఇతరులకు కానీ మాటలతో, సంజ్ఞలతో, ఇతర పద్ధతుల్లో తెలియ చెయ్యకూడదు.

కేంద్ర, రాష్ట్ర పర్యవేక్షక బోర్డుల కర్తవ్యాలు

తి లింగ నిర్ధారణ, ఇతర పరీక్షల దుర్వినియోగంపై ప్రభుత్వానికి సలహాలు

తి చట్టంలోని నియమాలు అమలు తీరుపై పర్యవేక్షణ, నియమాలలో మార్పు అవసరమైతే సిఫారసు

తి లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడపిండాలహత్యలపై ప్రజలలో అవగాహన

తి చట్ట విరుద్దంగా లింగ నిర్ధారణ, ఇతర పరీక్షలు చేపట్టే వారిపై తగిన చర్యలను రాష్ట్ర బోర్డులు తీసుకోవాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి లేదా ఎక్కువ అప్రాప్రియేట్‌ అథారిటీలను నియమించాలి. వీటి కర్తవ్యాలు:

తి జన్యు సలహా కేంద్రం జన్యు ప్రయోగశాల జన్యు క్లినిక్‌ల రిజిస్ట్రేషన్‌ ఆమోదం, నిలిపివేయటం, రద్దు చేయటం.

తి పైన పేర్కొన్న కేంద్రాలు ప్రామాణికాలు పాటించేలా చూడటం.

తి ఈ చట్టానికి సంబంధించిన ఫిర్యాధులు తీసుకుని విచారణ చేసి, చర్యలు తీసుకోవటం.

తి ప్రజలలో చైతన్యం కలిగించటం.

తి చట్ట నియమ నిబంధనలు అమలు అయ్యేలా చూడటం, అవసరమైన మార్పులకు సిఫారసులు చేయటం.

తి సలహా కమిటీని ఏర్పాటు చేసి ఫిర్యాదులపై దాని సిఫారసులను అమలు చేయటం.

చట్టం కింద నేరంగా పరిగణించే చర్యలు, శిక్ష

లింగ నిర్ధారణ, ఎంపికకి సంబంధించి సదుపాయాల గురించి ఏ రూపంలోనైనా వ్యాపార ప్రకటనలు, సమాచారం జారీ చేసినా, ఇటువంటి లింగ నిర్ధారణ, ప్రకటనలు ప్రచురించినా, పంపిణీ చేసినా మూడు సంవత్సరాల వరకు జైలు, పదివేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.

లింగ నిర్ధారణ, ఎంపికకు సహకరించిన, సేవలందించిన (వేతనం మీద, డబ్బు తీసుకుని, డబ్బు తీసుకోకుండా) కేంద్రాల యజమానులు, ఉద్యోగులు (వృత్తి నిపుణులు, డాక్టర్లు) మొదటిసారి నేరానికి 3 నెలల వరకు జైలు, పదివేల రూపాయల వరకు జరిమానా; రెండవసారి నేరానికి 5 ఏళ్ల వరకు జైలు, యాభైవేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.

పై నేరాలకు డాక్టర్ల రిజిస్ట్రేషను రద్దు చెయ్యవచ్చు. కోర్టులో నేరం రుజువైన తరువాత మొదటిసారి నేరానికి 5 సంవత్సరాల పాటు, రెండవసారి నేరానికి శాశ్వతంగా రిజిస్ట్రేషను రద్దు చెయ్యవచ్చు.

చట్టం అనుమతించిన కారణాల కోసం కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేసే వ్యక్తులు, వృత్తి నిపుణులు, వైద్యులకు మొదటిసారి నేరానికి 3 సంవత్సరాల జైలు, యాభై వేల రూపాయల జరిమానా, రెండవ సారి నేరానికి 5 సంవత్సరాలు జైలు, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు.

బలవంతం మీద ఈ పరీక్షలు చేయించుకోవలసిన మహిళను నేరస్తురాలిగా పరిగణించరు.

అందుకు వ్యతిరేకంగా రుజువైతే తప్పించి గర్భిణి స్త్రీ భర్త, అతడి బంధువులు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని బలవంతం చేశారని కోర్టు భావించి, నేరస్తులుగా పరిగణించి శిక్షిస్తుంది. చేయి చేయి కలుపుదాం- ఆడపిల్లలను రక్షిద్దాం పుట్టబోయేది మగపిల్లవాడైనా, ఆడపిల్లైనా ఆహ్వానిద్దాం – చట్ట వ్యతిరేక లింగ నిర్ధారణ పరీక్షలను ఆపేద్దాం

భాగస్వామ్య సంస్థలు: గ్రామ్య, పిలుపు, పీస్‌, గ్రామీణ మహిళా మండలి, తరుణి, పి.ఎస్‌.ఎస్‌,స

ఎస్‌.వి.కె., రెడ్స్‌, డి.డి.యెన్‌.యెన్‌., ఏ.యార్‌.డి., గ్రాస్‌, అంకిత, జాగృతి, ఏ.ఎస్‌.డి.ఎస్‌.,

మహిళా యాక్షన్‌, నిసర్గ, ఎస్‌.సి.ఎ.ఎఫ్‌.ఎన్‌., ఎన్‌సి.ఎ.ఎఫ్‌.ఎన్‌. సి.సి.సి., షహీన్‌

Share
This entry was posted in ప్రకటనలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో