మేం తప్పు చేశాం

– కారుసాల వెంకటేశ్‌

మేం తప్పు చేశాం. మా కూతురి జీవితాన్ని మేమే చేతులారా కాజేశాం. ఒక్కగానొక్క కూతురు. ఈ ఊళ్లో ఏ ఆడపిల్ల పెళ్ళవుతున్నా, పండగనాడు కొత్త బట్టలు కట్టుకొని ఏ అమ్మాయి కనపడినా నా కూతురే గుర్తొస్తుంది. అంటూ కన్నీరు పెట్టుకుంది చంద్రమ్మ.

అస్మిత రీసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ మీడియా ప్రాజెక్ట్‌లో భాగంగా కర్నూలు జిల్లాలో అప్పరి మండలం ఒక గ్రామానికి వెళ్ళాను. అక్కడ పరిస్థితులు, వాతావరణం చూస్తే ఆ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందనిపించింది. ఆ గ్రామం మొత్తం మీద పట్టుమని 10 మరుగుదొడ్లు కూడా లేవని చెప్పారు స్థానికులు. ఇక పిల్లల చదువు గురించి ఆరాతీస్తే. ఈ మధ్య ఎక్కువ మందే పిల్లల్ని బడికి పంపిస్తు న్నారు. కానీ ఇంకా బడి బయట పిల్లల సంఖ్య ఎక్కువగానే ఉందన్ని తెలిసింది. అంగన్‌వాడి కార్యకర్తను కలిశాను. ఈ గ్రామంలో ఆడపిల్లలను చదివిస్తున్నారా. ఎన్నో ఏట పెళ్ళి చేస్తారు. వంటి ప్రశ్నలు సంధిస్తే. ఆమె సమాధానం ఏమి చెప్పాలో తెలియని సంగ్దిద్ధంతో కొంత మంది చదివిస్తున్నారు. మరికొంత మంది చదివించటంలేదు అన్నారు. అంతలో చంద్రమ్మ వచ్చింది. చంద్రమ్మ అంగన్‌వాడి సెంటర్‌లో ఆయా.

ఏముంది సారూ! ఈడ పిల్లల్ని చదివించాలి, వాళ్ళు ఉద్యోగం చేసి బాగుండాలని ఎవరూ అనుకోరు. బడికి పంపుతారు. తర్వాత ఇల్లు గడవటం లేదని పనికి పంపుతారు. ఆడపిల్ల ఐతే నీపెళ్ళికి నీవే సంపాదించుకో కూలిపోయి అని అంటారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆవేదనలో బాధ, ఆవేశం, అన్ని కలిసి కడుపుకోత కన్నీటి రూపంలో బయటకు వచ్చింది. నాకప్పుడు తెలిసింది ఆమె రాల్చిన కన్నీటి బొట్టులో తల్లడిల్లిపోతున్న అమ్మ హృదయంలో జీవితకాలపు శోకాన్ని మిగిల్చిన గతం ఉందని. పెదవి విప్పింది చంద్రమ్మ.

మాకు ఒక్కగానొక్క కూతురు. పేరు రాజేశ్వరి (పేరు మార్చాను) మా ఆయన వీరన్న, మేమిద్దరం పొలం కూలి పనులకు వెళతాం. మాకు భూమి లేదు. వచ్చిన నాలుగు రూపాయలు మా ఆయన తాగుడుకు పోసేవాడు. ఇద్దరం కష్టపడతాం. కానీ రూపాయి వెనకేసుకోలేదు. నేనెప్పడూ మనకు ఆడపిల్ల ఉంది. ఒకయ్య చేతిలో పెట్టాలి అంటూ ఉండేదాన్ని. మా చెల్లి కొడుకుండాడు. వాడికిచ్చి చేస్తా. అంటుండేవాడు. పాపం మా రాజేశ్వరి మేం చెప్పిన మాట వినేది. బడికి పోయి వచ్చినా పనులకుపోయి వచ్చే సరికి అన్నం ఉడకేసేది. పిల్లని చదివిద్దాం అంటుండేదాన్ని. మా ఆయన మాత్రం పిల్లని చదివిస్తే అంత చదువుకున్న వాడ్ని తేవాలి. అంత కట్నం ఇచ్చి తేగలమా! చదువు లేదు, ఏమి లేదు అంటుండేవాడు. ఆయన మాట నిజమే అన్నట్టు నాకు పిల్లకి పెళ్ళి చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలను కొనే దాన్ని.

ఐదో తరగతి దాకా చదివిచ్చాం. తర్వాత సీడుపత్తి సీజన్‌లో మంచి కూలి ఇస్తున్నారంటే మా రాజేశ్వరిని చదువుమాన్పించి పనికి పంపించాం. మా ఊరు, మా పక్క ఊరులో సీజన్‌లో ఆడపిల్లలు, మగపిల్లలు చాలా మంది సీడు పత్తి పనికి వెళతారు. ఆ పనిని పిల్లలే చేయాలి. లేకపోతే అది పండదు అనే నమ్మకం. ఆ సీజన్‌ మూడు నెలలూ పోతే ముప్పైవేలు దాకా కూలి వచ్చేది. ఇప్పుడు ఇంకా పెరిగింది. ఎలాగో పిల్లకు పెళ్ళిచేద్దాం అనుకుంటున్నాంగా ఇక చదివించడం ఎందుకని చదువు మాన్పించి సీడుపత్తి సీజన్‌లో ఆపనికి పంపించాం. మిగతా రోజుల్లో మిరపకాయలు తెంపటానికి పంపించేవాళ్ళం. ఆ పిల్ల కూలి తెస్తున్న దగ్గర్నుంచి మా ఆయన కూలి డబ్బులు ఇంటికి ఇవ్వడం మానేసి పూర్తిగా తాగుడుకు పోసేవాడు. ఒక్కొక్కరోజు పనికి పోవటం కూడా మానేశేవాడు. ఆట్లా రెండేళ్ళు గడిచింది. రాజేశ్వరికి 16 ఏట మేనత్త కొడుకుతో పెళ్ళి కుదిరింది. అబ్బాయి హైదరాబాద్‌లో భవన నిర్మాణ రంగంలో రోజూవారి కూలి. అయిన సంబంధం అయినా కట్నకానుకుల విషయంలో కనికరించలేదు. అప్పటి వరకు రెక్కల కష్టంమీద సంపాదించింది, దానికి తోడు కొంత అప్పుచేసి పెళ్ళి చేశాం. హైదరాబాద్‌లో రాజేశ్వరి కాపురం బాగానే ఉంది. అత్త, భర్త రాజేశ్వరి కలిసి ఉండేవారు. అత్త అపార్ట్‌మెంట్‌లో ఇంటి పనికి వెళ్ళేది. సంతోషంగా రోజులు గడుస్తున్నాయి.

అత్త, భర్త ఇద్దరూ పనులకు వెళ్ళినా, రాజేశ్వరిని పనికి పంపించేవారు కాదు. కంటికి రెప్పలా చూసుకునేవారు. పెళ్ళయి ఎడాది పూర్తయింది. ఇంకా పిల్లలు పుట్టలేదని అనుకుంటుండేవారు. డాక్టరుకు చూపించారు. నెలసరులు సరిగ్గా రావనే విషయం అప్పుడు తెలిసింది. ఆ సంగతి మేమూ పట్టించుకునేవారం కాదు. అమ్మాయికీ అవగాహన లేదు. డాక్టరు ఇచ్చిన మందులు వాడుతోంది. మూడు నెలల తర్వాత రుతుస్రావం ఎక్కువయింది. పిల్ల చాలా తగ్గిపోయింది. మళ్ళీ డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళాము. ఇచ్చిన మందులు ఇక వాడద్దు. అమ్మాయి చాలా బలహీనంగా ఉంది అన్నారు. పరీక్షలు చేశారు. పిల్లలు పుట్టే అవకాశం తక్కువ అన్నారు. వైద్య భాషలో చెప్పాలంటే ”అండాలు రిలీజ్‌” కావటం లేదు. కొంతకాలం వేరే మందులు ఇస్తాను వాడండి. కానీ చెప్పలేం అన్నారు డాక్టరమ్మ. అప్పటివరకు చెట్లు, పుట్టలు మొక్కిన అత్తా, పిల్లలు పుట్టే అవకాశం తక్కువ అనేసరికి బాగా చూసుకునే అత్త కోడల పట్ల ప్రేమకు బదులు సాధించడం మొదలు పెట్టింది.

నాకు ఒక్కగానొక్కడు నేను ఎవరి దగ్గర ముచ్చట చూడాలి. ఇక నీ కూతురికి పిల్లలు పుట్టరు. నా కొడుక్కి వేరే పెళ్ళి చేస్తానంది. దానికి కొడుకు ఏం మాట్లాడలేదు. నీ కూతుర్ని మీ ఇంటికాడే పెట్టుకోండి అని పంపించారు. పెద్ద మనుషుల దగ్గరకు వెళ్ళాము. వాళ్ళు ఇరవైవేలు అమ్మాయికిచ్చి మీ కొడుక్కి ఇంకో పెళ్ళి చేసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఇరవై వేలు ఇచ్చారు. కానీ తిరిగి మా పిల్లని కూడా ఇచ్చారు. నేను, మా ఆయన వాల్లని బతిమాలాం ఒప్పుకోలేదు. ఇంకో పెళ్ళి చేశారు. మా రాజేశ్వరికే ఎందుకు ఈ ఖర్మ అని ఏడ్చేవాళ్లం. మాకు అప్పుడు తెలిసింది. మా రాజేశ్వరి లాగే ఇంకా మా ఊళ్లో చుట్టు ప్రక్కల ఊళ్లో చాలామంది ఉన్నారని, కారణం అది తలరాతో, ఖర్మోకాదు. సీడు పత్తి పొలాల్లో పనిచేయడం వల్ల ఆడపిల్లలకి గర్భం రాదని, గర్భసంచి వ్యాధులు వస్తాయని అక్కడ ఎక్కువ పురుగు మందులు వాడతారు కాబట్టి ఆ తీవ్రతతో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసింది. తెలుసుకునే నాటికి నా కూతురు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. కంటికి రెప్పలా చూసుకునే అత్త, భర్త దూరం నెట్టేశారు. ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఈ బాధంతా కూడగట్టుకొని కుమిలిపోయేది. ఆమె బాధకు మేము బాధపడటం తప్ప ధైర్యం ఎవరూ, ఎప్పుడూ చెప్పులేదు. మాకు భారం కాకుడదనుకోంది. పురుగు మందు తాగి నాకు మా ముసలాయనికు చేసిన తప్పుకు నా శిక్ష వేసింది.

ముందు వెనకా ఎవరూలేరు. కూలిపనికీ వెళ్ళలేము. ఇదిగో ఇక్కడ వంట చేస్తే వచ్చే డబ్బులతో మా కడుపు నిండుతుంది. అదే నా కూతురిని ఆ పనికి పంపించకుండా ఉండుంటే ఆ రోజు బతికుండెది కనీసం చదివిచ్చుంటే ఏదో ధైర్యంతో తన బతుకు, తాను బతికేది. అందుకే మా కనిపిస్తోంది. మా కూతురు జీవితం మేమే నాశనం చేశామని చంద్రమ్మ లా కడుపుకోతకు గురైనవారు, రాజేశ్వరి లా ఇరవై ఎళ్ళకే జీవితం ముగించిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు, ఉంటారు దీనికి కారణం సమాజంలో వివక్షత అసమానతలు సామాజిక, ఆర్ధిక వెనకబాటుతనం, ఇవన్నీ రూపుమాపనంత వరకూ రాజేశ్వరిలాంటి వారు బలవుతూనే ఉంటారు. అది ఏ రూపంలోనైనా కావచ్చు బలవుతూనే ఉంటారు. బలవుతూనే ఉంటారు… బలవుతూనే ఉంటారు.

ముగింపు ఎక్కడ

(అస్మిత రీసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ మీడియా ప్రాజెక్ట్‌లో భాగంగా నేను కర్నూలు జిల్లాలో పరిశోధన చేశాను.)

అంశం: బాల్య వివాహాలు, ఆడపిల్లల స్థితి గతులు

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.