”గ్రేవ్‌ ఆఫ్‌ ది పైర్‌ ప్లైస్‌”

– సామాన్య

ఈ కాలమ్‌ కోసమని ”గ్రేవ్‌ ఆఫ్‌ ది ఫైర్‌ ప్లైస్‌” రాయాలనే ఆలోచన నా తలలోకి వచ్చిందో లేదో నా మనసు ఆ ఆలోచనని తీవ్రంగా ఖండించి వేసింది. తెలిసి తెలిసీ ఆ సినిమా మళ్ళీ చూసి దుఃఖాన్ని పునరావృతం చేసుకుంటావా అని నాకో ప్రశ్న కూడా వేసింది. నిజానికి ఆ సినిమాలో దాగున్న దుఃఖాన్ని తలచుకుని నాకూ మనసు మాట వినాలనే అనిపించింది. అయినా ఈ సినిమా పదిమందికి చూపాల్సిన సినిమా అని గట్టిగా అనిపించడం చేత నన్ను నేను దుఃఖపరచుకోవడానికి సిద్దపడ్డాను. అంతటి దుఃఖం వుందీ సినిమాలో.

”గ్రేవ్‌ ఆఫ్‌ ది ఫైర్‌ ప్లైస్‌” కూడా ”స్టూడియో ఘిబ్లి” వారి యానిమేషన్‌ సినిమానే. దర్శకుడు ఇసావో తకహాట. ఈ సినిమాకి మూలం అకియుకి నోసాక సెమి ఆటో బయోగ్రఫిక్‌ నవల ”గ్రేవ్‌ ఆఫ్‌ ది ఫైర్‌ ప్లైస్‌”. ఈ సినిమా దర్శకుడు, నవలా రచయిత ఇద్దరూ యుద్ధ బాధితులే. మీరు ఊహిస్తున్నది నిజమే ఈ సినిమా యుద్ధం గురించె. రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంలో శత్రు సేనలు లక్ష్యంగా పెట్టుకున్న జపాన్‌ ముఖ్య నగరాలు టోక్యో, నగోయా, ఒసాకా, కోబ్‌లలో పోర్ట్‌ సిటీ కోచ్‌ ఈ సినిమాకి నేపధ్యం.

”సెప్టెంబర్‌ 21, 1945 దట్‌ వాస్‌ ది నైట్‌ ఐ డైడ్‌” అంటూ ఒక పద్నాలుగేళ్ళ అబ్బాయి చెప్పే డైలాగుతో ఈ సినిమా మొదలవుతుంది. నావికా దళంలో పనిచేసే నాన్న, మామూలు గృహిణి అయిన అమ్మ, వాళ్ళకి ఇద్దరు పిల్లలు పద్నాలుగు, పదిహేనేళ్ళ అబ్బాయి సీట, ఐదేళ్ళ పాప సెత్సుకో, గొప్ప కష్టాలేమి లేని మధ్య తరగతి కుటుంబం. ఇంతలో యుద్ధం వచ్చి పడుతుంది. నాన్న సైన్యం లోనే ఉంటాడు. జబ్బుగా వున్న అమ్మ, ఇల్లు చక్క బెట్టుకుని తన వెనుకే వచ్చేయమని సీటాకి చెప్పి బాంబ్‌ షెల్టర్‌కి వెళ్లిపోతుంది. సీట అన్నీ చక్క పెట్టుకుని చెల్లిని తీసుకుని అమ్మ దగ్గరకు బయల్దేరుతాడు అంతలో సైరన్‌ మ్రోగుతుంది, దాని వెనుకే ఆకాశం యుద్ధ విమానాలు మాయమై అగ్ని వర్షాన్ని కురిపించడం మొదలు పెడుతుంది. కాగితంలోనూ, చెక్క తోనూ కట్టబడి వుండే జపాన్‌ వారి ఇళ్ళు ఆ మంటల్లో నిలువునా దగ్ధమైపోగా, ఆ పాశవిక దాడి అనేకులని మృతులుగా, గాయాలతో జీవన్మ్రుతుగా, ఇల్లు పొల్లులేని దిఃఖంలేని వారిగా మార్చి వేస్తుంది. ఆ దాడి నుండి సీట చెల్లితో సహా క్షేమంగా తప్పించుకుంటాడు కానీ తల్లిని పోగొట్టుకుంటాడు. తనని చుట్టుముట్టిన దుఃఖం తన చిన్నారి చెల్లిని తాకకూడదనుకుంటాడు సీట, తల్లి మరణాన్ని చెల్లికి తెలీకుండా దాచిపెడతాడు.

మాతృహీనులుగా మారినా అన్నా చెల్లెళ్లిద్దరూ, తాము దాచుకున్న ఆహార పదార్ధాలతో తెలిసిన ఆంటీ వాళ్ళింటికి చేరుతారు. మొదట బాగానే చూసినా తరువాతి కాలంలో అన్నా చెల్లెల్లిద్దరికి తానే తిండి పెట్టాల్సిన పరిస్థితులు వచ్చేసరికి ఆ ”అంటీ” వాళ్ళిద్దరినీ సూటి పోటి మాటలతో హింసించి ఇల్లు వదిలిపోయోలా చేస్తుంది. ఇద్దరూ పాడుపడిన ఒక బాంబ్‌ షెల్టర్‌లో తలదాచుకుంటారు. అప్పటి నుండీ వాళ్ళని మరింత కష్టాలు చుట్టు ముడతాయి. సీట చిన్ని చిన్ని దొంగతనాలు చేయడం మొదలు పెడతాడు. చెల్లి కోసం ఆలుగడ్డలు దొంగలించబోయి దెబ్బలు తిన్న వైనం పోలీసుల హృదయాలను కూడా కదిలిస్తుంది.

ఇంతలో పాపకి డయేరియా వస్తుంది. డాక్టర్‌కి చూపించి మందులడుగుతాడు సీట. డాక్టర్‌ నిర్లిప్తంగా ‘ఐ సజస్ట్‌ దట్‌ షి గెట్‌ సమ్‌ నరిష్మెంట్‌, దట్స్‌ ఆల్‌ దట్‌ కేన్‌ బి డన్‌’ అంటాడు. అది వినగానే సీటకి మనసులో నుండి క్రోధం పెల్లుబుకుతుంది. ”వేర్‌ కేన్‌ యు ఫైండ్‌ నరిష్మెంట్‌” అని డాక్టర్‌ని ప్రశ్నిస్తాడు. ఆ చిన్ని పిల్లాడు నరిష్మేంట్‌ని ఎక్కడ నుండి తేగలడు? ఇంతలో యుద్ధం ముగుసిందని, జపాన్‌ లొంగిపోయిందనీ, నాన్న కూడా మరణించాడని తెలుస్తుంది. వాడు ఆ దుఃఖాన్ని లక్ష్య పెట్టేలోపే వాడి చిన్నారి చెల్లి సినిమా అంత తన బుజ్జి ముఖంతో మనల్ని అలరించిన చిన్ని అమ్మాయి సేత్సుకో నిస్సహాయంగా కడుపు ఎండిపోయి చచ్చిపోతుంది. ఆ దృశ్యం మనని కాల్చి కంటికి కడవెడు కన్నీరు పెట్టిస్తుంది. ఈ దృశ్యానికి సీట మరణం ఎంతో దూరంలో వుండదు చెల్లి వెనుకే వాడూ స్మశానానికి పయనం కడతాడు. వాడు చెల్లికి మాట కూడా ఇస్తాడు కదా, నిన్నెప్పుడూ విడిచి పెట్టను అని, ఆ మాట అలా నిలబెట్టుకుంటాడు.

వాడి మరణంతో మొదలువుతుంది సినిమా ”సెప్టెంబర్‌ 21, 1945 దట్‌ వాస్‌ ది నైట్‌ ఐ డైడ్‌” అని చెప్తూ, ఆ చిన్ని కుర్రాడి ఆత్మ, తన చిన్ని చెల్లి ఆత్మ తో కలిసి యుద్ధంలో చిద్రమైన వాడి బ్రతుకు చిత్రంలోని ఒక్కో సన్నివేసం లోకి మనని తీసుకెళుతుంది. నిజానికి ఈ సినిమాలో చెప్పడానికి ఇదీ కథ అంటూ ఏమీ వుండదు. యుద్ధం కేంద్రంగా అల్లిన కొన్ని నిస్సహాయ, కరుణాభరిత సన్నివేశాల సమాహారం ఈ చిత్రం.

మీరూ, నేను ప్రత్యక్షంగా యుద్ధ బాధితులం కాకపోవచ్చు. మన జీవితాలలో ఉత్పాతాలు ఎప్పుడూ సంభవించి ఉండకపోవచ్చు. అయినా సరే ఈ సినిమా చూస్తే కొన్ని ప్రశ్నలు మనవి ఒకచోట కాలు ఆననీయక కలవర పెడతాయి. వాటిలో మొదటిది – అసలు యుద్ధాలేందుకు చేసుకుంటాం అని? రెండో ప్రపంచ యుద్ధమైనా, రాష్ట్ర విభజన పొరాటమైనా, కుల తగాదాలైన, మత మారణహోమాలైనా, స్త్రీ పురుష బేద భావాలైనా, యుద్ధాలు – బహుశా ఒక అధికుడు, ఒక బలహీనుడ్ని అణిచి కాలరాయాలనుకునే అనాగరికతకు చిహ్నాలు. మనుషులం ఇలా మతమనీ, ప్రాంతమనీ ఒకరి ఆకాంక్షలు మరోకరం గౌరవించుకోకుండా సంస్కారహీనంగా ఇంకెన్నాళ్ళూ ఇలా మారణహోమాలు సృష్టించుకుంటామో కదా అని దిగులేసిపోతుంది ఈ సినిమా చూస్తుంటే.

దాంతోపాటూ మరో ప్రశ్న-యుద్ధాలు అన్నీ తెలిసిన పెద్దవాళ్ళ మధ్య కదా, మరి పిల్లలేం నేరం చేసారని మనం వాళ్ళని మన కక్షకార్పణ్యాలకి బలి పెడుతున్నాం అనిపిస్తుంది. ఈ నవలాకారుడు ”నోసాక” యుద్ధ సమయంలో ”ముందు తన ఆకలి సంగతి చూసుకుని, తన కడుపు నిండాకే తన చెల్లికి పెట్టె వాడినని ఆ కారణం చేతే తన చెల్లి ఆహార లేమితో చచ్చిపోయిందని” ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన నిష్టుర సత్యాన్ని చదివితే ఎలా స్పందించాలో అర్థం కాక హృదయం నిస్సహాయంగా మారి మూగపోతుంది.

Share
This entry was posted in సినిమా లోకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో