సవాల్‌

– సి.హెచ్‌.మధు

”అవును నేను చంపేసాను”

”నేనే చంపేసాను”

”నాకు న్యాయవాది అవసరంలేదు”

”నాది తప్పు కాదు” 

”నేను తప్పును – ఇది తప్పుగా అంగీకరించను.

”నేనే వాదించుకుంటాను.

”సాక్ష్యాలతో అవసరం లేదు నేను చంపానని అంగీకరిస్తున్నానుగా”

”ఆత్మ రక్షనార్థం నేనే చంపాను”

”నన్ను రేప్‌ చేయపోతే నా కొంగుతో గొంతు పిసికి చంపేసాను”

అది జిల్లా కోర్టు హాల్‌ నిండా జనమున్నారు. మొత్తం న్యాయవాదులు అక్కడే వున్నారు. కొందరు కూర్చునివున్నారు. కొందరు నిల్చొనివున్నారు. హాల్‌ కిక్కిరిసి నట్టుగా వుంది. పైన పంకాలు తిరుగుతు న్నాయి. ఓ ప్రక్క ఎసి యంత్రముంది. జడ్జి గారు తన కుర్చీలో నిదానంలో కూర్చు న్నారు. ఆయన ముఖంలో గంభీరత వుంది. నలుపది దాటని వయసు నల్లగా వుంటాడు. నల్లముఖం మీద తెల్ల కళ్ళద్ధాలు మెరుస్తు న్నాయి. మధ్యాహ్నం రెండు దాటింది. లంచ్‌ అయిపోయింది.

ఉదయం నుండి ఇదే కేసు నడుస్తూ వుంది. ఓ పక్క కుర్చీలో డియస్‌పి వున్నారు. ఆయన ప్రక్కన యస్‌ఐ వున్నారు. బోనులో ముద్దాయి నిటారుగా నిల్చోని వుంది. చింపిరి జుట్టు, మాసిపోయిన బట్టలు వయస్సు ముప్పదిదాటదు. ఒక నెల రోజులుగా జైలులో వుండటం. అంతకు ముందు ఓ వారం రోజులు పోలీసు కస్టడీలో వుండటం వలన కొంత చిక్కిపోయినట్టు అనిపించినా ముఖంలో ‘కళ’ ఏమాత్రం తగ్గలేదు. ఆమె సహజంగానే సౌందర్యంగా వుంటుంది. ఎర్రగా వుంటుంది. ముఖం గుండ్రగా వుంటుంది. ఆమె పెద్దగా చదువుకున్నామె కాదు. ఆమె చదువు నాలుగవ తరగతి దాట లేదు. ఆమె పట్నం మహిళగాదు. ఓ పల్లెటూరులో జీవిస్తున్న మహిళ. ఆమెకు భర్తవున్నాడు. కానీ దుబాయ్‌లో వుంటున్నాడు. పొట్ట కూటి కొరకు దుబాయ్‌ వెళ్తాడు ఆమెకు అత్తామామ వున్నారు. కోర్టుకు వచ్చారు. ఓ ప్రక్క కూర్చున్నారు. ఆమెకు తల్లి దండ్రులున్నారు. వారి ప్రక్కనే కూర్చున్నారు. వారి మధ్య పదకొండు సంవత్సరాల అబ్బాయి వున్నాడు. ఏడవ తరగతి చదువుతున్న అబ్బాయి పేరు మనోజ్‌. మనోజ్‌ బోనులో ఉన్న మహిళ కొడుకు. అమె పేరు ఝాన్సీ!

ఝాన్సీ మళ్లీ అంది. అవును నేను సునీల్‌ రెడ్డిని చంపేసాను. నా కొంగుతో గొంతు పిసికి చంపేసాను వాడు రేప్‌ చేయబోతుంటే చంపేసాను. నా మానాన్ని రక్షించుకోవ టానికి చంపేసాను. అఘాయిత్వం చేసాక నా ప్రాణాన్ని తీయడనే నమ్మకం లేదు అందుకే చంపేసాను. గొంతు విప్పి బిగ్గరగానే అంది ఝాన్సీ. అరిచినట్టుగా మాట్లాడుతూ వుంది. ఆమె మాటకు కోర్టు నిశ్శబ్ధమ యినది. ఎవరి నోట మాట రావటంలేదు. డియస్‌పి యస్‌ఐ కూడా ఆమెవంక, ఆమె ధైర్యంవంక చిర్నవుతోనే చూస్తున్నారు. వారి మనసులలో కోపం లేదు. పోలీసు న్యాయ వాదికి ఏం మాట్లాడాలో తోయటంలేదు. ఏం మాట్లాడాలో ఆయనకు అర్థం కావటంలేదు. న్యాయమూర్తి మనసు ఆమె వంక కృతజ్ఞతతో తలవంచింది. అదీ ఎవరికి కనిపించని మనసు, న్యాయ మూర్తులకు కూడా మనస్సు వుంటుంది. కానీ దానిని దాచుకుంటారు.

నిశ్శబ్ధంగా వున్న కోర్టును చూచి, ఏమి మాట్లాడాలో తెలియకుండా వున్న పోలీసును న్యాయవాదిని చూచి – నింపాదిగా ఝాన్సీనే చూస్తున్న న్యాయమూర్తిని చూచి మళ్ళీ ఝాన్సీయే అంది. ”నేను చంపేసానని ఒప్పుకుంటున్నానుగా తప్పా చెప్పండి”.

అసలేం జరిగింది? ఝాన్సీ ఎందుకు బోనులో నిల్చుంది? సునీల్‌ రెడ్డిని తానే చంపానని ఎందుకంటుంది? నేపద్యంలోకి వెలుదాం!

ఝాన్సీ, వూరు కొత్తగూడెం దగ్గర చిన్న పల్లె. పేరు గొల్లపల్లి. గొల్లపల్లి పెద్ద ఊరు కాదు చిన్న పల్లె వంద ఇళ్ళు కంటే ఎక్కువ వుండవు. జాతీయ రహదారికి (15) మైళ్లు లోపు వుంటుంది. వంద కుటుంబాలు కూడా వ్యవసాయంపై ఆధారపడి వుంటాయి.

ఝాన్సీకి పదిహేనో ఏటనే పెళ్ళి జరిగింది. ఆమె పుట్టిన వూరు గొల్లపల్లికి పదికిలోమీటర్ల దూరంలో వుండే రామన్న పేట. వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయ కుటుంబంలోకి వెల్లింది. ఝాన్సీ భర్త పేరు రామకృష్ణ. తల్లితండ్రులకు ఒక్కడే కొడుకు ఐదు ఎకరాల పొలముంది. ఒక్కడే కొడుకని ఐదు ఎకరాల పొలముందని ఝాన్సీ నిచ్చారు. రామకృష్ణ కుటుంబానికి ఐదు ఎకరాల పొలం మూడు తరాల నుండి వుంది. ఐదు ఎకరాల పొలంతో మూడు తరాలు అప్పు లేకుండా బ్రతికింది. రామకృష్ణ తండ్రి తరం వచ్చే వరకు అప్పులు మొదలయ్యాయి. మూడు తరాలు అదే పొలంతో అప్పులేకుండా ఎలా పెరిగారో తానెందుకు అప్పుల పాలయ్యానో – రామకృష్ణ తండ్రికి అర్థం కాలేదు. కరువు లేదు కాటకం లేదు. పంట దిగుబడి పెరిగిందే తప్ప తగ్గలేదు. రామకృష్ణకు కూడా వ్యవసాయమే ఆధారం. బి.ఏ వరకు చదివాడు కానీ – ఉద్యోగం దొరుకలేదు. పొలం వుండగా ఉద్యోగమెందుకని అనుకున్నాడు. రామకృష్ణకు ఝాన్సీకి పెళ్లి అయ్యింది. ఒక కొడుకు పుట్టాడు నిద్ర పట్టని అప్పులు కనిపిస్తున్నాయి. ఈ అప్పులు తీరాలంటే ఏదో ఒకటి చేయాలి. రామకృష్ణ చాలా రోజులు ఆలోచించాడు అప్పటి కొడుకు వయస్సు ఎనిమిటి సంవత్సరాలు ప్రతి సంవత్సరం అప్పు పెరుగుతూ వుంది. ఉపాధి లేక అప్పుల పాలయి వ్యవసాయం గిట్టు బాటుకాక అప్పటికే వూరిలోని యువకులు సగం మంది పెళ్లాం బిడ్డలను విడిచి ముసలి తల్లిదండ్రులను గాలికొదిలి మస్కట్‌ దుబాయ్‌ వెళ్ళిపోయారు. భార్యను విడిచి – ఆమె ప్రేమను విడిచి – ముద్దులు కురిపించే కొడుకును విడిచి – ప్రాణం కంటే ఎక్కువ చూచుకునే తల్లి తండ్రులను విడిచి, చల్లటి పల్లెను పిల్లగాలను పచ్చటి పొలాలను విడిచి దుబాయ్‌ వెళ్లిపోయాడు. … అప్పటికే ఝాన్సీ వయస్సు ఇరువది ఐదు బాధగానే అంగీకరిం చింది? – ఏం చేయగలదు? – ఇలా వేలాది మహిళలు భర్తను విడిచి – దేశంకాని దేశం దుబాయ్‌ మస్కట్‌లో మన్ను మోసి బ్రతుకుతుండగా – తప్పదంటూ ఒంటరిగా బ్రతుకుతున్న వారున్నారు. భారతదేశంలో పొలాలున్నా ఉపాధి లేదు. భారత దేశంలో వనరు లెన్ని వున్నా బ్రతుకుదెరువు లేదు. భారతదేశం నిండుగ పంటలు పండినా కడుపు నిండింది లేదు. భారతదేశంలో నీళ్లకు కొదువలేదు. సారవంతమైన మట్టికి కొదువలేదు. శ్రమకు కొదువలేదు కానీ బ్రతుకు లేదు. మన శ్రమను ఇంకోదేశాలు వాడుకుంటున్నాయి – ఈ క్రమంలో ఝాన్సీ నాలుగు సంవత్సరా లుగా అత్తామామల నీడలో ఒంటరిగానే వుంది.

ఒంటరిగా వున్న ఝాన్సీపైన సునీల్‌ రెడ్డి కన్ను పడింది. సునీల్‌రెడ్డి గ్రామ సర్పంచు కొడుకు, గొల్లపల్లిలో పంచాయితీ బోర్డు లేదు. ప్రక్కనున్న గ్రామం కేశంపేట పంచాయితీ బోర్డు క్రింద గొల్లపల్లి వుంది. గొల్లపల్లికి కేశుపేట రెండు మైళ్ల దూరంలో వుంటుంది. గొల్లపల్లి కేశుపేట మధ్య ఝాన్సీ మామగారి ఐదు ఎకరాల పోలముంది. కేశుపేట సర్పంచు విష్ణువర్ధన్‌ కొడుకు సునీల్‌ రెడ్డి విష్ణువర్ధన్‌ రెడ్డి పెద్ద ధనవంతుడు. వందలాది ఎకరాల పొలాలున్నవాడు. పైగా సర్పంచు, తండ్రి అధికారం, చదువు సునీల్‌ రెడ్డిని అహంకారిని చేసాయి. తప్పు ఒప్పు నిర్ధారించు కోలేని స్థితిలోకి నెట్టాయి. స్వాతంత్య్రం వచ్చిందని. ప్రజాస్వామ్యమని రంకెలు వేస్తాం కానీ ఇప్పటికీ దొరల రాజ్యమే పాత దొరలే ఇప్పుడు పల్లెలను ఢిల్లీని ఏలుతున్నారు. ఏలడానికి ఒకే ఒక కార్యం తరతరాల దోపిడి సంపాదన వారి చేతుల్లో వుండటమే! వందల వేల ఎకరాల భూమి వారి గుప్పిట్లో వుండటమే విష్ణువర్ధన్‌ రెడ్డి ఆ బాపతే! సునీల్‌ రెడ్డి తండ్రికి తగిన కొడుకే – వాడు ఆ రెండు వూళ్లలో చెయ్యని పాపం లేదు.

ఝాన్సీపై సునీల్‌ రెడ్డి కన్ను పడింది. వారి పొలం రెండు వూళ్ల మధ్యన వుంటుంది. దారి ప్రక్కనే పొలం వుంటుంది. అత్తామామలు వయసు, అరువది దాటిందని ఈ మధ్య ఝాన్సీ వారికి అవసరంగా ఆసరాగా పొలానికి వెలుతుంది. ఎన్నొసార్లు ఒక్కతే వెలుతుంది. గోచిపెట్టుకొని నాటటం కలుపుతీయట అన్నీ ఆమె చేస్తుంది. ఝాన్సీ అందంగా వుంటుంది సునీల్‌ రెడ్డి కంట్లో పడింది. ఎన్నోసార్లు వెంటపడ్డాడు వేధించాడు. ఆశ చూపాడు. బంగారం, పట్టు చీరలు ఎన్నొ ఆశలు చూపాడు. దేనికి ఝాన్సీ లొంగలేదు పైగా తిట్టింది. శాపనార్ధాలు పెట్టింది. బెదిరించింది

నెలా పది రోజుల క్రితం అత్తా మామల కు జ్వరమొచ్చిందని నీళ్ళు పారించటానికి పొలానికి వెళ్ళింది ఝాన్సీ. సాయం కాలం నాలుగు గంటల సమయం లో వెళ్లింది. అప్పడే కరెంట్‌ వస్తుంది. కరెంట్‌ కోత సమయం నాలుగు గంటలకు అయిపో యింది. నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది వరకు నీళ్లు పారించవచ్చు. కరెంట్‌ వుంటుంది. ప్రతి దినం మామయ్య వెలుతాడు. జ్వరంగా వుందని ఝాన్సీ వెళ్ళింది గోచి పెట్టుకుంది. కరెంట్‌ వేసింది. నీళ్లు పారిస్తూ వుంది. ఆరు గంటలవుతుంది. చుట్టు ప్రక్కల ఎవరు లేరు. పొలాలున్నా అందరూ వెళ్లిపోయారు. తాను వెళ్లిపోవా లనుకుంది. చలికాలం చీకటి పడింది. ఆ సమయంలోనే సునీల్‌రెడ్డి హీరో హోండాపై వచ్చాడు. ఝాన్సీని చూచాడు బండి ఆపి ఝాన్సీ దగ్గరకు వచ్చాడు. ‘నిన్ను ప్రేమిస్తున్నాను నీవు కావాలి” పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు. వీడితో మాట్లాడడం ఈ సమయంలో సరియైనది కాదని తప్పించుకోవాలని చూచింది. ”ఎక్కడికి పోతావే ఇన్నాళ్లకు నీవు దొరికావు నిన్ను విడుస్తానా?” అంటూ ప్రక్కనే వున్న గుడిసెలోకి లాక్కెళ్ళారు. బలమైన రెక్కలు వాడివి. మంది కష్టం చేస్తే పెంచిన కండవానిది మాంసం కొవ్వు తిన్న శరీరం వాడిది. తాగున్నాడు. మత్తుమైకం వాడిది గుడిసెలోకి లాక్కెళ్లి మీద పడ్డాడు. ఎంత చెప్పినా వినడు పైగా బెదిరింపు ”మంచిగా వింటావా? లేదా? నీ సుఖం నాకు కావాలి. నీకు డబ్బు యిస్తాను దస్కం యిస్తాను బంగారమిస్తాను లేకపోతే బలవంతంగా అనుభవించి చంపేస్తాను తెలుసా?” బెదిరిస్తున్నాడు. అరిచింది. చుట్టు ప్రక్కల ఎవరూ లేరు. పైన పడ్డాడు ”మగడు దుబాయ్‌ వెళ్ళాడు కదే’ నాల్గు సంవత్సరాల నుండి ఎలా వుంటున్నావు? నా సుఖం భలేగా వుంటుంది ల…” ఏదో అరుస్తున్నాడు. బలంగా పైన పడ్డాడు. ఇక లాభం లేదను కుంది. తన కొంగు తీసి వాడి మెడకు చుట్టూ చుట్టి బలంగా లాగింది. అంతే… వాడి ప్రాణం పోయింది. శవంగా మారిపోయాడు. గుండెలో భయం. చెమటలు పట్టాయి. ఏమి చేయాలో అర్థం కాలేదు. చీకటి ముసురుతుంది. పొలం గట్టుపైన కూర్చుని అరగంట వెక్కి వెక్కి ఏడ్చింది. వాడు చనిపోయినందుకు కాదు వాన్ని చంపినం దుకు కాదు. ఈ పరిస్థితి వచ్చినందుకు.. కనులు తుడ్చుకుంది. ఇంటికి వెళ్లాలా? — వద్దు… ఎలాగూ పోలీసులొస్తారు. అరా తీస్తారు.. అందులో విలువ వుండదు. . సరాసరి పోలీసుస్టేషన్‌ కెళ్లింది యస్‌ఐ వున్నాడు. జరిగిందంతా చెప్పింది. ఝాన్సీని లాకప్‌లో వేసారు.

రాత్రి పదిగంటల వరకు రెండు వూరుల లో తెల్సిపోయింది. ఝాన్సీ అత్తామామలు పాలుపోని స్థితిలో అచేతనంగా కూర్చున్నారు. గొల్లపల్లి అంతా అలాగే వుంది. ఆ రాత్రి ఎవరూ అన్నం తినలేదు. నిద్రపోలేదు. సునీల్‌ రెడ్డిని ఝాన్సీ చంపినందుకు ఎవరికీ బాధలేదు. వాడు దుర్మార్గుడు పోతే పోయాడు. పోయిందే మేలు పాపం ఝాన్సీ… చాలా మంచిది. మందిలో అందర్ని ప్రేమగా చూసేది అక్కా అన్న తాత అంటూ పలకరించేది. అయ్యో పాపం ఎలా అయ్యింది బ్రతుకు . ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు.

జరిగిన కథ అది ఝాన్సీ ఇపుడు కోర్టులో వుంది. నిండు ధైర్యంతో తనను తాను సమర్ధించుకుంటూ వుంది.

నేను చంపేసాను. నన్ను రేప్‌ చేయపోతే నన్ను నేను రక్షించుకోవటానికి చంపేసాను. సునీల్‌రెడ్డిని నేనే చంపేసాను. ఆత్మరక్షణార్థం చంపాను. నా దృష్టిలో నేను చంపటం న్యాయం నేను చంపకపోతే వాడు నన్ను చంపేవాడు. చట్టం ప్రకారం ఏ తీర్పు యిస్తారో యివ్వండి!” సవాల్‌గా అంటున్న ఝాన్సీని చూచి కోర్టు, న్యాయవాదులు, పోలీసులు నిశ్శబ్ధమయ్యారు. న్యాయమూర్తి ఆమెనే చూస్తున్నాడు. ఇంకేముంది కేసులో?! వాదించటానికి ఏమిలేదు. సాక్ష్యాలేమి లేదు. క్రాస్‌ ఎగ్జామ్‌ లేదు. వాయిదాలు లేవు. వాదనలు లేవు.

ఉదయం నుండి ఇదేకేసు… ఇవే మాట లు లంచ్‌టైం అయ్యింది. సాయంకాలం నాలుగు దాటింది. న్యాయమూర్తి పోలీసు వకీలు నడిగారు ”సారేమైనా చెప్ప దల్చుకున్నారా? అడుగదల్చుకొన్నారా?” ”లేదు” అన్నాడు. అడగటానికి ఏమి లేదు అయినా ఝాన్సీని చూస్తే అయనకు భయంగా వుంది. ఏమి ప్రశ్నిస్తే ఏం జవాబు చెపుతుందో!

తీర్పు మరునాటికి వాయదా వేస్తున్నా నన్నాడు.

పోలీసులు ఝాన్సీని తీసుకెలుతున్నారు. ఆమె ఎవరినీ చూడటం లేదు. వూరు జనాన్ని కన్న కొడుకును అత్తను మామను ఎవరినీ చూడటం లేదు. ద్వేషం కాదు. తనమీద మమకారం ఎవరికీ పెరుగకూడదు. శిక్ష విధించవచ్చు. జీవితాంతం జైలులో వుంచవచ్చు. ఇంకా ఎందుకీ మమకారాలు అనుకుంది.

కోర్టు ద్వారం వరకు వెళ్లిన ఝాన్సీ వెనుకకు తిరిగి న్యాయమూర్తి ముఖంలోకి చూస్తూ.

”వాడు నన్నే కాదు ఈ రెండు వూళ్లలో చాలా మందిని వేధించాడు. అడవాళ్ల నెందరినో బాధించాడు చెప్పుకోలేరు కానీ ఎందరో స్త్రీలు వాని దుర్మార్గానికి చీకట్లో ఏడ్చారు” అంది.

న్యాయమూర్తి నిశ్శబ్ధంగా విన్నాడు.

రెండు అడుగులు ముందుకేసిన ఝాన్సీ మళ్లీ వెనక్కు తిరిగి న్యాయమూర్తి కనులలోకి చూస్తూ ”సునీల్‌రెడ్డికి సమాజం వేయాల్సిన శిక్ష నేను వేసాను” అంది.

కోర్టులోని వారి ముఖాలు నల్లబడ్డాయి. న్యాయమూర్తి పెదవులపై కనిపంచని చిర్నవ్వు మెరిసింది.

మర్నాడు కోర్టు

సునీల్‌రెడ్డి హత్యపై తీర్పు ప్రకటిస్తానని న్యాయమూర్తి చెప్పారు.

పోలీసులు ఝాన్సీని తీసుకొచ్చారు. బోనులో నిల్చుంది. కోర్టుహాల్‌ న్యాయవాదుల తో, జర్నలిస్టులతో పోలీసు ఆఫీసర్లతో కిక్కిరిసివుంది.

కోర్టు బయట వందలాది జనం. పురు షులు మహిళలు పిల్లలు పెద్దలు. అందరి మనసులలో తీర్పు ఎలా వుంటుందోననే ఉత్కంఠ అందరి మనసులలో ఝాన్సీపై గౌరవం, అందరి మనసులలో ఝాన్సీ తప్పు చేయలేదనే భావన అందరి మనసులలో ఝాన్సీకి శిక్ష పడకూడదని భాగవంతునిపై ప్రార్థన

ఝాన్సీ బోనులో నిటారుగా నిల్చుంది. ఆమె ముఖంలో ఏ భావన లేదు. ఆమె మనసులో తప్పు చేసానని అనుకోవటంలేదు

సరిగ్గా 11-30కు

న్యాయమూర్తి తీర్పు చదివాడు. చట్టాలు అంకెలు ఎన్నొ చెప్పి ”ఝాన్సీ ఆత్మరక్షణార్థం సునీల్‌ను చంపింది. ఆ పరిస్థితులలో ఆమె సునీల్‌ను చంపకపోతే మానభంగానికి గురి అయ్యేది. హత్యకు గురి అయ్యేది. హత్యకు గురికాకున్నా మానభంగం మూలంగా ఆమె ఆత్మహత్య చేసుకునేది. మానభంగానికి గురి అయిన స్త్రీ ఈ సమాజంలో బ్రతకటం కష్టం… అని కొద్ది నిమిషాలు అగి

ఝాన్సీ సునీల్‌రెడ్డిని తన కొంగుతో గొంతు పిసికి చంపటం. ఆత్మరక్షణ భాగంలో తప్పనిసరిగా భావించి ఆమెను నిర్ధోషిగా విడుదల చేస్తున్నాను” అన్నాడు.

కోర్టులో చప్పట్లు విచిత్రమేమిటంటే కోర్టులో వున్న వారంతా పోలీసు ఆఫీసర్లతో సహా లేచి నిల్చున్నారు.

”నా తీర్పులో లోపాలున్నాయని భావిస్తే పై కోర్టుకు వెళ్లే హక్కు పోలీసులకుంది”

ఈ మాట న్యాయమూర్తి అనగానే పోలీసు న్యాయవాది వెంటనే అన్నారు ”మాకా ఆలోచనలేదు”

పోలీసులు ఝాన్సీని విడిచిపెట్టారు.

వెళ్ళుతున్న ఝాన్సీ వెనక్కు మరిలి

”న్యాయమూర్తిగారూ! మరోసారి ఇలా జరిగితే వారిని చంపనని నేను ఏ హామీ యివ్వటం లేదు”

అప్పటి దాకా కూర్చున్న న్యాయమూర్తి లేచి నిల్చున్నాడు.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.