పున్నాగపూల తోటల్లో దొంగాటలాడుకొంటుంటే..

– కుప్పిలి పద్మ

ఆశ్వయుజ మాసం మొదలవ్వబోతోన్న సమయంలోనే మా యింటి ముందున్న పున్నాగ పూల చెట్టు విప్పారిన పువ్వులతో సువాసనభరితంగా అభిషేకిస్తుంది భూదేవి ని. అది మొదలు రాసులురాసులుగా పువ్వులే పువ్వులు. చెర్రి బ్లోసమ్‌ సీసన్‌లో అనేక మంది యాత్రికులు ఆ పూల సౌందర్యాన్ని కన్ను లారా చూడాలని జపాన్‌కి వస్తారు. అప్పుడు అక్కడ సంగీత నృత్యోత్సవాలు జరుగుతాయి. అనేకమైన పుడ్‌ కోర్ట్స్‌ సువాసనలని విజిమ్ముతుంటాయి. అక్కడంతా పండగ కోలాహలం వురకలే స్తుంటుంది.పువ్వులు వికసించటాన్ని వొక సుసంబరంగా జరుపుకోవటం వోఁహా… యెంత బాగుంటుంది.

పువ్వులు, పళ్ళు, చేలు, పిల్లలు కళ్ళు తెరిచిన ప్రతిసారి మనం సంబరాలు చేసుకొంటుంటాం. కొత్త సృష్టి మనలని ఆనందభరితులని చేస్తుంది. ప్రతి యేడాది యీ నగరంలో యెక్కడెక్కడ యీ పూలు వికసిస్తాయో అక్కడక్కడికి పున్నాగలని చూడటానికి వెళతాను. నా కళ్లెప్పుడు ఆ పువ్వుల కోసం విప్పారే వుంటాయి. నెక్లెస్‌ రోడ్డులో, జలవిహార్‌ పార్క్‌ టర్నింగ్‌లో వో పెద్ద చెట్టు వుంటుంది. నిండుగా పువ్వులు. సెక్రటేరియట్‌ ముందున్న పైవోవర్‌ మీద నుంచి వెళుతుంటే దాదాపు మన చూపులకి సమాంతరంగా పువ్వులేపువ్వులు. బంజార హిల్స్‌లో చిన్న చిన్న వంపులు తిరిగేదారుల నిండుగా రోడ్డు పక్కలంతా పూలతివాసీలే. అలా యీ నగరమంతా పువ్వులే పువ్వులు. యీ కాలమంతా ఆ పువ్వుల పక్క నుంచే యీ నగరం హడావడిగా సాగిపోతుంటుంది. గాలిలో కలగాపులగంగా కలిసిపోయిన కాలుష్యంలో యీ పూలపరిమళం యెవ్వరి వూపిరికి సుగంధాన్ని అందనివ్వదు.

దైనందిన జీవితంలోని అనవసరపు ఆదుర్ధా మన మనఃశ్శరీరాలని అనేక ఆందోళనలకు లోను చేయటంతో మనలోని సర్వేంద్రియాలు పువ్వులు విచ్చుకొనే సవ్వడికి పూలరంగుల అందాలకి, వాటి సహజమైన పరిమళాలకి మనలోకి యింకించుకోలేనంత దూరంగా దూరదూరంగా జరిగిపోతుంటే మనం మన మనశరరీరాలకి తిరిగి వాటిని ప్రయత్నపూర్వకంగా పరిచయం చేయ్యాల్సి ందే. స్నేహం చిగురింపచేయ్యాల్సిందే.

అందుకే నగరం మరీ పూర్తిగా వూపందు కోని తెల్లార్నె మనం మన యిళ్లల్లోంచి బయటకి వెళితే చల్లని గాలుల్లో సమ్మిళిత మైన సౌరభం మృదువుగా మన వూపిరిని స్పర్శిస్తుంది. రాత్రంతా చల్లదనాన్ని నింపు కొన్న యీ పువ్వులు మన చూపులకాంతిని శాంతిమయం చేస్తాయి.

యొప్పుడు యెంతో జీవంతో తొణికిస లాడే యీ భూమి యెన్నెన్ని తుఫానులని, వరదలని, భూకంపాలని, యుద్ధాలని యిలా నిరంతరం విధ్వంసాన్ని చూస్తునేవుంది. యిప్పటికే జరుపుకొంటున్న యుద్ధాలకి ఆమె మనసెంత దుఃఖపడు తుందో కదా… ఆమె ఆ బాధ నుంచి కోలుకోడానికి నిరంతరం అన్ని రుతువులు ఆమెని తమతమ కాలపు వివిధ వర్ణాలు, విభిన్న పరిమళాలు, భిన్న ఆకృతుల పువ్వులతో అభిషేకిస్తుంటే ఆమె హృదయానికి స్వాంతన దొరుకుతుం దపిస్తోంది.

భూమిని తవ్వుకొంటూ సిమ్మెంట్‌ కట్టడాలతో చుక్క నీరు కూడా యింకడానికి అవకాశం లేకుండా సిమ్మెంట్‌ చప్టాలు కట్టేస్తుంటే మన చుట్టూ పూల మొక్కల సొగసుకే అవకాశం లేకుండా అయిపోతుంటే నిలువెత్తు పున్నాగపూల చెట్లని యెలా పెంచుకొంటాం. మనం వుండటానికి ఓ పొదరిల్లు… నడవటానికి కాస్త పేమెంట్‌ మనం సంతోషాన్ని నింపుకోటానికి కాసింత మట్టి నేలని వుంచుకొంటే మనం కూడా పూల తోటలని పెంచుకోవచ్చు. మనం కూడ పళ్ల తోటలని పెంపొందించుకోవచ్చు.

యెన్ని పూలు విరబూసిన పున్నాగ వసంతపు పువ్వు కాదు. కానీ పున్నాగ కాలంకాని కాలంలో మన హృదయంలో వసంతాన్ని చిలకరిస్తుంది. మనం కూడా పున్నాగతోటల్ని విరివిగా పెంచుకొని పున్నాగలు విరిసేకాలంలోపాటలతో ఆటలతో పున్నాగలపండుగని సంబరంగా జరుపుకొంటే యెంత బాగుంటుంది… మనం దొంగాటలాడుకొంటుంటే యెంత వుత్సాహం. ఆహా… ఆ పరిమళపు తోటల్లో మనమంతా విందు భోజనం చేస్తు శుభాకాంక్షలని చెప్పుకొంటుంటే యీ పుడమి ఎంత ఆనందిస్తుంది.

Share
This entry was posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో