బ్యాక్‌లాష్‌

పి. సత్యవతి

‘సెప్టెంబర్‌ 11” సంఘటన అమెరికన్‌ స్త్రీల జీవితాలపైనా అమెరికన్‌ సంస్కృతిపైనా కలుగజేసిన ప్రభావాన్నీ, దాని పరిణామాన్నీ, అందులో మీడియ పాత్రనీ, ”ట్రెండ్‌ జర్నలిజం” స్వభావాన్నీ వివరిస్తూ బ్యాక్‌లాష్‌కి దారితీస్తున్న విషయన్ని ఉదాహరణలతో బయటపెడుతూ ”టెర్రర్‌ డ్రీం” అనే పుస్తకాన్ని ఇటీవల ప్రచురించిన సూసన్‌ ఫలూడి స్త్రీవాదులకి చిరపరిచితురాలే.

ఆమె 1991లో ప్రచురించిన ”బ్యాక్‌లాష్‌” (అమెరికన్‌ స్త్రీలపై అప్రకటిత యుద్ధం) అప్పట్లో బాగా సంచలనం సృష్టించడమే కాక అది చాలాకాలం బాగా అమ్ముడుపోయి ఆమెకొక మంచి అవార్డును కూడా సంపాదించి పెట్టింది. ఆ పుస్తకం గురించి ఇప్పుడు…………
ఇరవయ్యె శతాబ్దం చివరకొచ్చేసరికి అమెరికన్‌ మహిళలు సాధించనిదంటూ ఏమీలేదనీ, వారికి లభించని హక్కులంటూ ఏమీ లేవనీ ఒక వైపు ప్రసార మాధ్యమాలు హొరుపెడుతుంటే మరొకవైపునించీ అదే వేగంతో దానికి విరుద్ధమైన ప్రచారం ప్రారంభమైంది. ”మహిళలారా మీరెంత స్వేచ్ఛ సాధించినప్పటికీ, ఇప్పుడున్నంత దయనీయమైన పరిస్థితిల్లో మరెప్పుడ లేరు” అంటూ ఈ విరుద్ధ ప్రచారం అన్ని ప్రసారమాధ్యమాల్లో ఇంకాస్త గట్టిగా మొదలైంది. సినిమాల్లో, టెలివిజన్‌ ప్రసారాల్లో, రేడియెలో, వైద్యశాలల్లో, ఎక్కడంటే అక్కడ, కొన్ని మాటలు పదే పదే వినపడడం మొదలైంది. అదేమిటంటే, వృత్తి ఉద్యోగాలలో ఉన్న స్త్రీలు తమ శక్తినంతా కోల్పోయి పిప్పయిపోతున్నారు. అంతేకాదు తమ పునరుత్పత్తి శక్తిని కూడా కోల్పోతున్నారు. ఒంటరి స్త్రీలు పురుషుల కొరత నెదుర్కొంటున్నారు.సంతానంలేని స్త్రీల సంఖ్య నానాటికీ పెరగడంతో పాటు అటువంటి స్త్రీలు వనసిక అశాంతిని అనుభవిస్తున్నారని న్యూయర్క్‌ టైమ్స్‌ పత్రిక రాస్తే, అవివాహిత స్త్రీలు మరింత అయెమయనికి గురవుతున్నారని న్యూస్‌ వీక్‌ పత్రిక ప్రకటించింది. ఇక ఆరోగ్య సలహాలిచ్చే పత్రికలు ఎక్కువ అధికారహోదాలలో పనిచేసే స్త్రీలకు మానసిక వత్తిడివల్ల సంప్రాప్తించే వ్యాధులు ఆకస్మికంగా సోకుతాయనీ, నరాల బలహీనత, మద్యపానానికి అలవాటుపడటం, గుండె జబ్బులాంటివి వస్తాయనీ హెచ్చరికలు మొదలుపెట్టాయి. మానసిక శాస్త్రజ్ఞులు ”స్వతంత్రంగా జీవించే స్త్రీల ఒంటరితనం ఒక పెద్ద ఆరోగ్యసమస్య అవుతుందని” అంటున్నారు.
మరి అన్ని హక్కులు సాధించిన స్త్రీలకు ఒక్కసారిగా ఇన్ని బాధలెలా వచ్చాయి? అంత హోదా సాధించగలిగిన స్త్రీలు మానసికంగా ఎందుకింత దిగజారిపోయరు? తాము కోరుకున్నదంతా పొందిన తరవాత ఇప్పుడిలా ఎందుకైంది? ఈ చిక్కు ప్రశ్నకు ఒకటే సమాధానం చెబుతున్నారు.
వాళ్లు సాధించుకున్న స్వేచ్ఛా సమానత్వాలే వాళ్ల బాధలకి కారణం. వాళ్ల స్వేచ్చే వాళ్ల దుఃఖానికి కారణం. స్వేచ్ఛ అనే బంగారు ఉంగరాన్ని పెట్టుకుని వివాహపుటుంగరాన్ని ఒదులుకున్నారు. తమ పునరుత్పత్తి శక్తి మీద అధికారం సాధించి ఏకంగా దాన్నే పోగొట్టుకున్నారు. వృత్తి వుద్యోగాల కోసం స్త్రీత్వాన్ని వొదులుకున్నారు. స్త్రీ విముక్తి ఉద్యమమే వారి ముఖ్య శత్రువుగా వరింది. స్త్రీవిముక్తి ఉద్యమంతో తాము నష్టపోయమంటూ చాలామంది యువతులు వ్యాసాలు రాయటం మొదలుపెట్టారు. ”స్త్రీవిముక్తి ఉద్యమం ఘోరపరాజయం పొందిన ఒక ప్రయెగం” అని కొందరు వర్ణించారు. 1980లలో న్యూయర్క్‌ టైమ్స్‌ దగ్గరనుంచీ వ్యానిటీ ఫెయిర్‌ దాకా స్త్రీవిముక్తి ఉద్యమాన్ని తూర్పారబట్టాయి. స్త్రీల మేనిఛ్చాయ తగ్గడం దగ్గర్నుంచీ, వారి ఆహారపు అలవాట్లు మారడం, వారిలో మానసిక ఒత్తిడి, బాలికల ఆత్మహత్యలు, పొదుపు చెయ్యలేకపోవడం, ఒకటేమిటి, సకల లోపాలకూ కారణం స్త్రీవిముక్తి ఉద్యమమేనని ప్రసార మాధ్యమాలన్నీ గోలపెట్టాయి. ఇంత హోరుగా జరుగుతున్న ప్రచారం ప్రభావానికి కొందరు స్త్రీవాదులు కూడా తలవొగ్గారు.
అయితే వీళ్ళంతా మాట్లాడే సమానత్వం ఎక్కడ?
నిజంగా అమెరికాలో స్త్రీలు అంత సమానత్వం సాధించి వుంటే వారు దేశంలో వున్న బీదవారి సంఖ్యలో మూడింట రెండు వంతులెందుకుంటారు?
పూర్తి పనిగంటలు పనిచేసే స్త్రీలలో 75 శాతం మంది ఆదాయం సంవత్సరానికి 20 వేల డాలర్లు మించడం లేదెందుకని? వాళ్ళింకా సరయిన గృహసౌకర్యం, ఆరోగ్యబీమా సౌకర్యం లేకుండా ఎందుకున్నారు? సగటు అమెరికన్‌ పురుషుని వేతనంకన్నా సగటు అమెరికన్‌ స్త్రీ వేతనం ఇంకా తక్కువగానే వున్నదెందుకు? అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశంలో ఇంకా వేతనాల విషయంలో జెండర్‌ వివక్ష కొనసాగడం ఏమిటి?
స్త్రీలు నిజంగా అంత అభివృద్ధి సాధించి వుంటే, ఇంకా నటికి 80 శాతం మంది స్త్రీలు సంప్రదాయపరంగా నిర్దేశించిన సెక్రటరీ, సేల్స్‌ గుమాస్తా వంటి ఉద్యోగాలలోనే ఎందుకున్నారు? న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా, కార్పొరేట్‌ మేనేజర్లుగా ఇంత తక్కువమంది ఎందుకున్నారు?
వీరంతా చెబుతున్నట్లు స్త్రీలు సాధించనిదంటూ ఏమీ లేకపోతే అనేక ఇతర పారిశ్రామిక దేశాలలో వలే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో శిశు సంరక్షణ పథకాలు గానీ, కుటుంబం కోసం ప్రత్యేక సెలవులు గానీ లేవెందుకు? అమెరికాలో ప్రయివేట్‌ రంగంలో ఇంకా శిశు సంరక్షణాలయలు లేవు కదా! స్త్రీలు నిజంగా అంత స్వేచ్ఛని అనుభవిస్తుంటే వారి పునరుత్పత్తిపై వారికి గల హక్కు గత దశాబ్దంలోకన్నా ఇప్పుడే ఎక్కువ ప్రమాదంలో పడిందెందుకు? ఇంకా 70 శాతం మంది స్త్రీలు ఇంటిపనంతా భుజాలమీద వెస్తున్నారు.
బయట ఇంతగా ప్రచారం జరుగుతున్నా స్త్రీలు మాత్రం తాము నిజంగా విముక్తి సాధించామనుకోవటంలేదు. ఈ సంగతి స్త్రీల అభిప్రాయ సేకరణ కోసం జరిపిన సర్వే లన్నింటిలోన స్పష్టంగా వెల్లడైంది. 1990ల నాటికి స్త్రీలు తాము సాధించుకున్న సమానత్వం తిరిగి చేజారిపోతోందనుకోసాగారు. దీనికి కారణం 80లలో స్త్రీ ఉద్యమం చాలా వ్యతిరేకతని, విరుద్ధప్రచారాన్నీ ఎదుర్కొని ఉండడం. అదే స్త్రీవిముక్తి ఉద్యమం స్త్రీల శక్తినీ, స్త్రీత్వాన్నీ దెబ్బతీసిందనీ వారి ఆరోగ్యాలకి కూడా వారు కోరే స్వేచ్ఛ మంచిది కాదనీ ప్రచారం జరిగింది.
ఇది ఒక పెద్ద అబద్ధం. చాలా దుర్మార్గమైన అబద్ధం. నిజానికి స్త్రీలను శక్తిహీనులుగా మారుస్తున్నది వారు ఏకొంచమో సాధించిన సమానత కాదు. స్త్రీలు స్వేచ్ఛా సమానత్వాల సాధన కోసం పడే తపననీ, వాటికోసం వారుచేసే ప్రయత్నాలనీ అడ్డుకుని వారిని తిరోగమింప చెయ్యడానికి జరుగుతున్న ప్రయత్నమే స్త్రీలను బలహీనులను చేస్తోంది. స్త్రీలు గర్భధారణశక్తి కోల్పోవడం, వారు సాధించిన స్వేచ్ఛకు చెల్లించిన మూల్యం అంటూ అబద్ధపు ప్రచారం జరుగుతోంది. ఇదంతా కూడా మళ్ళీ వారిని వెనక్కి పంపే క్రమమే. అయితే ఇదంతా ఒక కుట్ర లాగా ఉండదు. వారే కొంచెమో సాధించింది చాలు. ఇంకా వాళ్లని పైకి పోనీకుండా చేయలన్నదే!!
స్త్రీల ఉద్యమ వైఫల్యం అంటూ జరుగుతన్న ప్రచారానికి ప్రసార మాధ్యమాలు కూడా సహకరించాయని సూసన్‌ తన పుస్తకంలో సోదాహరణంగా వివరించింది. అట్లాగే సినిమాలు, ముఖ్యంగా అప్పుడొచ్చిన ”ఫేటల్‌ అట్రాక్షన్‌” అనే సినిమా ఈ బ్యాక్‌లాష్‌కి ఎలా అద్దం పట్టిందో తన వ్యంగ్య హాస్య ధోరణిలో నసాళం అంటేలా చెప్పింది.
అమెరికన్‌ స్త్రీలపై అప్రకటిత యుద్ధం సంగతి అట్లా పెడితే, 1980లలో మన వార్తాపత్రికలన్నీ స్త్రీల పేజీలలో స్త్రీల సమస్యల్ని, స్త్రీవాద దృక్పధంతో వ్రాసిన వ్యాసాలని, కవితల్ని విరివిగా ప్రచురించాయి. అవే పత్రికలిప్పుడు స్త్రీల పేజీల్లో వంటలు, ఫ్యాషన్లు, సౌందర్యపోషణకు తప్ప గంభీర విషయలకు చోటుపెట్టటం లేదు. మన సినివల్లో హీరోల ప్రేమ సంపాదించడానికి హీరోయిన్లు నానాతంటాలు పడుతున్నారు. స్త్రీలకి పెళ్ళి చేసుకుని గుట్టుగా సంసారం చేసుకోడమొక్కటే జీవనగమ్యం. మరి మన మీద హమేషా జరిగే ఈ అప్రకటిత యుద్ధం మాటేమిటి?

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.