హమారీ జిందగీ… హమారే హత్‌ మే లేలేంగే…

భూమిక సంపాదకీయం రాయడం అంటే మెదడును తొలుస్తున్న, గుండెను పిండుతన్న ఏదో ఒక అంశాన్ని తీసుకుని ఒక్కోసారి కళ్ళల్లో నీళ్ళధార కట్టినపుడు కూడా రాసేది. కళ్ళు తెరుచుకుని ఉన్నంత సేపు అక్షరాలలో కానీ, దృశ్యంలో కానీ, చర్చల్లోకానీ, సమావేశాల్లో కానీ వొలికే దుఃఖాన్ని వొడిసి పట్టుకుని, గుండెల్లో ఇంకించుకుని ఇంక ఆగలేక రాసేదే ఈ సంపాదకీయం. మొన్నటికి మొన్న ”బేటీ జిందాబాద్‌” అంటూ ఏక్షన్‌ఎయిడ్‌ నిర్వహించిన మీటింగ్‌లో దృశ్యం వెంట దృశ్యంగా వస్తున్న ఫీమేల్‌ ఫీటీసైడ్‌ దృశ్యాలు. ”మాకు బతికే హక్కులేదా” అంటూ ప్రశ్నిస్తున్న పసిమొగ్గలు పుట్టకుండానే చిదిమేయబడుతున్న లక్షలాది ఆడపిండాల మృత్యుఘోష ఎవరి చెవిన పడాలో వాళ్ళెవరూ ఆ సమావేశంలో వుండరు. ఆ సమావేశం జరుగుతున్న సమయంలోనే దేశంలో ఎంతో మంది ఆడ పిండాల హత్యలు జరిగి వుంటాయి. పుణ్యభూమి, వేద భూమి,… ఈ భూమి మీదే కోట్లాది పసిగుడ్లు ప్రతి రోజు చిదిమేయబడుతున్నాయి.

నేను, రూపవాణి కూర్చుని లాడ్లి మీడియా అవార్డుల కోసమొచ్చిన ఎలక్ట్రానిక్‌ ఎంట్రీలను చూస్తూ గంటల తరబడి అనుభవించిన మానసిక క్షోభను ఏ అక్షరాలల్లోకి అనువదించగలను? ఒకదాని తర్వాత వొకటిగా మా కళ్ళ మీద దాడి చేసి, మనసును ఛిద్రం చేసిన ఆ దృశ్యాల గురించి ఏం రాయను? తల్లి కడుపులో మొదలయ్యే హింస గురించి రాయనా? ఆడపిండాలను నిర్దాక్షిణ్యంగా నలిపేసి, కాసుల్ని పోగేసుకుంటున్న అమానుష డాక్టర్ల గురించి రాయనా? పసివాళ్ల మెళ్ళో ఉరితాళ్ళేసి దాన్ని పెళ్ళంటున్న మూర్ఖత్వం గురించి రాయనా? ఇళ్ళల్లో వుండే నానా రకాల బంధువర్గం అదను దొరికితే ఆడపిల్లల్ని కాటేసే ఆటవిక సంస్కృతి గురించి రాయనా? మొగుడి రూపంలో వున్న మగాడు కుటుంబంలో సృష్టించే కల్లోలాన్ని, అహరహం హం ఆరళ్ళతో కుటుంబహింసనెదుర్కోలేక తనను తాను అంతం చేసుకునే స్త్రీల గురించి రాయనా? అడుగు బయటపెడితే అడుగడుగునా ఎదురౌతున్న గండాల గురించి రాయనా? ఇంట, బయట, రోడ్డుమీద, పనిచేసే చోట, నడిచే చోట, ప్రయాణం చేసే చోట…. ఏ చోటూ సురక్షితంగా లేని ఈ ప్రపంచంలో, స్త్రీల మడమతిప్పని పోరాటాల గురించి రాయనా? ఎన్నింటి గురించి రాయను?

సంపాదకీయం రాసేటపుడు నా మనసు పచ్చిపుండులా సలుపుతుంటుంది. స్త్రీల పరంగా సమాజపు పోకడల గురించి, ఈ భయానక, బీభత్స వాతావరణం గురించి రాస్తున్నపుడల్లా గుండె వొణుకుతున్నట్లుగా వుంటుంది. తట్టుకోవడం చాలా కష్టంగా వుంటుంది. ఎడారిలో వొంటరిగా వున్నట్టుగా వుంటుంది.

అయినా సరే… నేను నిరాశావాదిని కాదు. సమస్యలకి భయపడి పారిపోయేదాన్ని అస్సలు కాదు. ఎంత చీకటి కమ్ముకున్నా… ఏదో వో మూలనుంచి వెలుతురు కిరణం వస్తుందని నమ్మేదాన్ని. ఏటి కెదురీదే స్త్రీలందరికి ప్రతినిధిని నేను. ఎన్ని హింసల్ని ఎదుర్కొన్నా, ఎన్ని వ్యతిరేక పరిస్థితులున్నా ఫీనిక్ష్‌ పక్షిలా పడిలేచే స్త్రీల సమూహానికి చెందిన దాన్ని, కళ్ళ ముందు కనబడే బీభత్సం, విధ్వంశం కొంతసేపే నన్ను నిలవరించ గలుగుతుంది. ఒళ్ళు విదిలించి ఎగిరి దూకే శివంగిలా నేను ముందుకే దూకుతాను. ఆగిపోవడం నా నైజంలోనే లేదు.

చివరగా వొక్కమాట చెప్పాలనివుంది. ఈ రోజు ఎవరిని ఎవరూ ఉద్ధరించే పరిస్థితి లేదు. చట్టాలు… కోటానుకోట్లు వచ్చినా పరిస్థితి మారేట్టులేదు. మనల్ని మనమే ఉద్దరించుకోవాలి. మన కళ్ళని మనమే ఎరుపెక్కించుకొని… మన మీదికి వచ్చే మదమెక్కిన మగాళ్ళని మొదలంటూ కూల్చిపారేయాలి. అది ఇంట్లో కానీ, బయట కానీ… ఎన్నాళ్ళు కారుద్దాం కన్నీళ్ళు… మనం కార్చిన కన్నీళ్ళు ఈ దేశంలో సముద్రాలవుతాయేమో కానీ… కన్నీళ్ళ వల్ల మన కష్టాలు తీరవు.

ఛలో! హమ్‌ ఆగే జాయేంగే! హమారీ జిందగీ హమారే హాత్‌ మే లేలేంగే!

జీవితం మనది… దీన్ని ప్రేమించుకోవాల్సింది,

రక్షించుకోవాల్సిందీ… ముమ్మాటికీ మనమే…. మనమే!!!

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో