స్త్రీ నుండి స్త్రీ దాకా –

డా.టి.(సి) వసంత 

హిందీ మూలం : స్త్రీ సే స్త్రీ తక్‌ : శ్రీ రమేష్‌ దవే

తెలుగు అనువాదం : స్త్రీ నుండి స్త్రీ దాకా :డా.టి.(సి) వసంత. రాబియా ఒక చేతిలో దివిటీ, రెండో చేతిలో నీళ్ళకుండ తీసుకుని పరుగెడుతోంది. అందరు చూస్తున్నారు. రాబియా అతివేగంగా పరుగెడుతోంది. కాళ్ళకి చక్రాలు ఉన్నాయా అని అనిపించక మానదు. వేగంగా అతి వేగంగా పరుగెడుతునే ఉంది. ఇంతలో ఒక ఫకీరు ఆమెను ఆపడానికి మార్గం మధ్యలో నిల్చున్నాడు. పట్కారాను ఊపుతూ అతడు ప్రశ్నిస్తున్నాడు. ‘రాబియా ఏమిటది? ఏం చేయాలనుకుంటున్నావు. ఎటువైపు వెళ్తున్నావు?

రాబియా జవాబిచ్చింది. కనబడటం లేదా? ఒక చేతిలో దివిటీ ఉంది. మరో చేతిలో నీళ్ళు

నిజమే కాని వీటితో ఏం చేయాలనుకుంటున్నావు?

దివిటీతో జన్నత్‌ (స్వర్గం) ని కాల్చేస్తాను

జన్నత్తే ఎందుకు? జహన్నుం నరకం ని కాల్చవా?

జహన్నుమ్‌ని సమూలంగా నాశనం చేస్తాను. సముద్రంలో ముంచి పడేస్తాను

ఎందుకట్లా చేయడం రాబియా!

జన్నత్‌… జహన్నుమ్‌… సవాబ్‌ (పుణ్యం) అజాబ్‌ (పాపం) మనిషి మనిషిని భయపెట్టడానికి ఎన్నెన్ని శబ్దాలు సృష్టించాడు. అసలు ఈజన్నత్‌ జహన్నుమ్‌లు లేకపోతే మనిషికి ఎటువంటి భయం ఉండదు.

నిజానికి ఇది ఒక జానపద కథ కాని స్త్రీలోని ఆక్రోశానికి ప్రతీక ఈ కథ. రాబీయా ఒక స్త్రీ. అందరి స్త్రీలలాగానే ఆమె ఒక స్త్రీ. ఏ సమాజం లో అయితే ఆమె పుట్టిందో, పెరిగిందో ఆ సమాజం ఒక క్రూరమైన సమాజం. స్త్రీ ఈ సమాజంలో ఒక బూతైపోయింది. తిట్లన్ని ఆమెకి ప్రతీకగా మారాయి. కొందరు ఆమెలో దేవతను చూస్తే మరికొందరు నరకం. రాబియాకి ఈ ఆలోచన అంటేనే విపరీతమైన కోపం. స్వర్గం నరకాలని భయపెట్టడానికి నిర్మించి పాలించే వాళ్ళ విరుధంగా కాచిన ఒక విప్లవం రాబియా. రాబియా చౌరాస్తాలో స్త్రీలందరిని దృష్టిలో పెట్టుకుని నిల్చుని ప్రకటన చేసింది. వినండి స్త్రీలారా! వినండి, ఇళ్ళల్లో బందీలై కేవలం మొగవాడికి భోగవస్తువై, ఇళ్ళల్లో జరిగే అత్యాచారాలని భరించి క్షణం క్షణం చస్తూ జీవించే సమయం కాదిది. సోనోగ్రఫీ చేయించు కుని లింగనిర్ధారణ చేయించి ఆడపిల్ల అయితే హత్య చేస్తుంటే చూస్తూ లేక సహిస్తూ ఉండే సమయం కాదిది. లేవండి. మీరందరు మేల్కొండి. మీలో నిద్రాణమై ఉన్న తిరుగుబాటును మేల్కొలపండి. పొయ్యిలోని మంటను హృదయంలో మండించండి”.

రాబియా చేతిలో దివిటిని నీళ్ళకుండను చూసి అందరు భయపడ్డారు. అందరు ఆమెను చుట్టుముట్టారు. తిలకం దిద్దుకున్న పండితుడు అడిగాడు. మీకేం హక్కు ఉందని ఇవన్నీ అడగడానికి, చేయడానికి? ఇటువంటి పనులు చేయడానికి మేము ఉన్నాంగా!

మౌలవీ సాహెబ్‌ కలిగించుకున్నాడు – ‘నీవు ఇప్పుడు చిన్న పిల్లవి కావు. పెద్దదానివి నీ వయస్సును బట్టి నువ్వు బురఖా వేసుకోవాలి. ఇంట్లోనే ఉండి ప్రార్ధనలు చేసుకోవాలి. ప్రార్థనలే జవాబులు చెబుతాయి. స్వర్గనరకాల తీర్పులు కూడా అవే ఇస్తాయి”.

ఇంతలో ఆ గుంపులో నుండి ఒక క్రైస్తవుడు ఇట్లా అన్నాడు. ”మా చర్చి స్త్రీలకు ఇటువంటి పనులు చేయడానికి అనుమతి ఇవ్వదు. మన ధర్మం పట్ల ఇది అపచారం. ధర్మానికి విరుద్ధం మీ పైన ధర్మ విరుద్ధం, బ్లాస్‌ ఫేమీ కేసు పెట్టే అధికారం ఉంది”. తక్కిన పురుషు లందరు తమ తమ ఇష్టానుసారంగా ఆమెకు తెలియ చెప్పడం మొదలు పెట్టారు. ‘స్త్రీ స్త్రీగానే బతకాలి. పురుషులు చేయవల్సిన పనులను వాళ్ళని చేయనీయండి.

కొన్ని మహిళా సంఘాలు వచ్చాయి. కొందరు మేధావులైన స్త్రీలు వచ్చారు. ‘అసలు స్వర్గం – నరకం అంటూ ఈ గోల అనవసరం అసలు స్వర్గంలేదు. నరకం లేదు. పురుషులు సృష్టించిన భయం ఇదంతా.

ఒక మహిళ ఎర్రబల్బు వెలుగుతున్న కారులో నుండి దిగింది. రాబియా దగ్గరికి వెళ్ళింది. ”నిజానికి ఈ స్వర్గ నరకాల సృష్టి గురించి మీ ఆలోచన, మీ రిట్లా చేయడం సబబైనవే. కాని ఈ స్వర్గ-నరకాల ఆధారంగా వీటి మీద స్త్రీని అవమానించడం – బాధ పెట్టడం లాంటి కేసులు పెట్టలేము. ఈ దివిటీ, ఈ నీళ్ళు ఏమీ చేయలేవు. ఏదైనా చేయాలంటే చట్టం చేయాలి అంతే. స్వర్గ నరకాల విషయంలో ఏ చట్టం లేదు. ఏ న్యాయస్థానం లేదు. మనిషిని భయ పెట్టడానికి, మనిషి వీటిని సృష్టించాడు. భావాలను వ్యక్తం చేయడానికి ఇదొక పద్దతి” అని ఆమె అన్నది.

రాబియా అందరి వంక నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూసింది. సమాజంలో పెద్దవాళ్ళు స్త్రీని ఏ విధంగా పరిభాషిస్తారో విన్నది. ఇంతలో కాలేజీలో చదివే ఒక యుతి ఆమె ఎదురుకుండా వచ్చి ఇట్లా అంది – రాబీయా మీరు చెప్పేదంతా నిజమే. మీకు సలహాలు ఇచ్చే వీళ్ళందరే అసలు ఈ స్వర్గ-నరకాల సృష్టికి కారకులు. పురుషుడి దృష్టిలో స్త్రీ అంటే ఒక నరకం. ఆమె పాపాల పుట్ట. నేను మీతో చేయి కలుపుతున్నాను. మీరు చెప్పేదంతా నిజమే.

యువతి మాటలు వినగానే రాబియా అన్నది. ‘నీవు ఒక్కతివే ఎందుకు? ఆడవాళ్ళందరు తమ తమ చేతుల్లో నిప్పును తీసుకోండి.స్వర్గ-నరకాలంటూ మొత్తం ప్రపంచంలో భయాన్ని సృష్టించిన వీటిని, ధర్మం పేరన, మతం పేరన సృష్టింపబడిన జన్నత్‌ జహన్నమ్‌లను కాల్చేసేయండి’.

మౌలనీ సాహెబ్‌ అన్నాడు- ‘ఇది విప్లవంకాదు.. క్రాంతి కాదు. ఉన్మాదం, పిచ్చి. ఇటువంటి పట్టుదల మంచిది కాదు”.

ధర్మ గురువు అతడితో ఏకీభవిస్తూ అన్నాడు – ‘ఇదంతా ధర్మానికి సంబంధించింది. మీరు తప్పుదోవన నడుస్తున్నారు’.

వినగానే రాబియా పెద్దగా అరిచింది – ‘మాలవీ సాహెబ్‌’ ఆడదాని దౌర్జన్యం ఇదేగా అసలు పూర్తిగా పిచ్చిది కాదు కదా! ఏ రోజైతే నాతో పుట్టిన ఈ పట్టుదల అందరి స్త్రీలలోనూ పుడుతుందో అప్పుడే మార్పు వస్తుంది. మీరందరు శారీరక బలంతో పోరాడితే స్త్రీలు ఆత్మబలంతో పోరాడుతారు.”

”కాదు… కాదు… రాబియా! ప్రతీ మతం, ప్రతీ ధర్మం స్త్రీని గౌరవిస్తుంది. మన సంస్కృతే అది. అసలు ఆడదానికి సంబంధించి జన్నత్‌ – జహన్నుమ్‌ల గొడవే లేదు. అసలు మీరు ఇంత అశాంతిగా ఎందుకున్నారో అర్ధం కావడం లేదు”.

”అశాంతి.. ఏ సమాజం అయితే స్త్రీలోంచి శాంతిని లాక్కుంటుందో, జీవితాన్ని దుర్భరం చేస్తుందో, స్త్రీలని పాపాల మూట అని అంటుందో అక్కడ అసలు శాంతి ఎక్కడ ఉంటుంది. అంతా అశాంతే పండిత్‌ జీ!’

ఇంతలో కొందరు యువతులు వచ్చారు. వాళ్ళు అడగడం మొదలు పెట్టారు – ‘మీరు ఈ జన్నత్‌ – జహన్నుమ్‌నే పట్టుకుని కుర్చున్నారు. అసలు ఇవి ఉన్నాయో, లేవో ఎవడికి తెలుసు. స్త్రీకి సంబంధించిన మరెన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆమె అభిమానం, ఆమె పట్ల జరుగుతున్న హింస, విద్యా, బతుకు తెరువుల గురించిన ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు ఉన్నాయి రాబియా! వీటన్నింటికన్నా నీ జన్నత్‌ – జహన్నుమ్‌ల పని ముఖ్యమా!’

‘సరే జన్నత్‌ – జహన్నుమ్‌ల మాట నిజమే కాని అసలు నీకేం కావాలని కోరుకుంటున్నావు?’ మాలవీ అడిగాడు.

రాబియా సమాధానం చెప్పింది – ఇవాళ నేను జన్నత్‌కి మంటపెడతాను. జహన్నుమ్‌ని సముద్రంలో ముంచేస్తాను. నేను పరుగెత్తుతునే ఉంటా. ఆకాశం నుండి జన్నత్‌ కాలిపోయి కింద పడేదాకా! జహన్నుమ్‌ నీళ్ళల్లో మునిగి పోయి మొత్తంగా మాయం కావాలి. అంత దాకా నేను పరుగెడుతూనే ఉంటాను.’

ఇది ఒక కథ. తెలిసిన కథ. చిన్ని కథ. పాప-పుణ్యాల మోసపు కథ. జన్నత్‌ – జహన్నుమ్‌లని కాదనే స్త్రీ కథ. స్త్రీలో నిబిడీకృతమైన స్త్రీ కథ. స్త్రీ ఆక్రోశం వ్యక్తం చేసే కథ. స్త్రీ తిరుగుబాటు కథ. కథ ఇంతే. రాబియా చేతిలోని దివిటీ వలన జన్నత్‌ తగలబడలేదు. జహన్నుమ్‌ మునిగిపోలేదు. రాబియా గుండెల్లోని మంటలలో కాలిపోయింది. అగ్నితో చెలగాటం ఆడేటప్పుడు కాలిపోతూనే ఉంటారు. సరే ఇక ఈ కథ ఇక్కడే ఆపేయండి. ముందుకు పదండి.

ఇంతలో రాబియా పెద్దగా అరిచింది. ఆ అరుపు కేవలం అరుపు కాదు. స్త్రీ చేసిన శంఖవాదం, విప్లవవాదం. తరతరాల బానిసత్వానికి వ్యతిరేకంగా. ఆడదాన్ని కాని, బానిసలను కాని గొలుసులు కట్టేయవు. కట్టేసేది మనిషే. వాడే స్త్రీకి పెద్ద గొలుసు. సరే… ఇక ఇక్కడికి ఈ కథ ఆపేద్దాం. ఆ కూడలి దగ్గర పెద్ద గుంపు చేరింది. రాబియా – రాబియా అని గుంపులోని వాళ్ళు అరుస్తున్నారు.

కాలేజీకి ఎదురుకుండా రోడ్డు, రోడ్డుకి కొంత దూరంలో చౌరస్తా ఉంది. అక్కడ ఝాన్సీరాణి బొమ్మ ఉంది.

రాబియా కథ విన్న ఆడపిల్లలు అడగడం మొదలు పెట్టారు.. ‘నిజానికి రాణీ లక్ష్మీబాయి ఎందుకు పోరాడింది. ప్రాణాలు పోగొట్టుకుంది కాని స్వతంత్రం రాలేదు. ఒక్క లక్ష్మి ఉన్నందు వలన ప్రపంచంలోని ఆడవాళ్ళందరు లక్ష్మీబాయిలు కారుగా. రోషినీని రేషమ్మా అడిగింది.

అసలు నువ్వున్నట్లు ఈ ఉన్మాద సమాజంలో ఇదంతా సంభవమే ! రోషినీ!

ఎందుకు కాదు?

అసలు ఈ ప్రపంచంలో ఎంత మంది స్త్రీలు ఉన్నారు. చర్చలు జరిపించే వారు కాకుండా సాహసం చూపించే వాళ్ళు ఎంత మంది ఉన్నారు? నిజమే కదా రోషినీ!”

”కొంతమంది ఉన్మాదులైన పురుషులు వాళ్ళ పేరునే కాదు స్త్రీల పేరును కూడా పాడుచేస్తారు. తెలిసిందా రేష్మా!”

”రోషినీ! నన్ను అమాయకురాలిగా అనుకోకు. ఈనాటి వరకు ఎక్కడైనా స్త్రీ సేవ ఉందా! సైనికులందరు పురుషులే. ఒకవేళ ఉన్న పిడికెడు మంది ఉండి ఉంటారు. అమరవీరుల లిస్టు స్త్రీలను అమరవీరులు అని ఎవరైనా అంటారా! స్త్రీలు ఇంట్లో కాని, బయటకాని ఎన్నడైనా సరే ఎంత పోరాటం చేసినా, తమనుతాము సమర్పించుకొని ప్రాణాలు పోగొట్టుకున్నా ఎవరూ వాళ్ళని అమరవీరులు అని పిలవరు. అంతో ఇంతో స్త్రీపై జాలి చూపిస్తూ అయ్యో పాపం ప్రాణాలుతీసుకుంది, అనవసరమైన వాటిల్లో చిక్కుకుంది అని మాత్రమే అంటారు. మహా అయితే వార్తా పత్రికలలో ఆమె పేరు పడుతుంది. సాహసం చేసింది అని రాస్తారు. ఒకవేళ అత్యాచారాలకు, అన్యాయాలకు, బలత్కారాలకు విరుద్దంగా పోరాటం జరిపి ప్రాణాలు అర్పిస్తే అంతో – ఇంతో పొగుడుతారు. ఎవరిచ్చారు ఆమెకి అమరవీరుల హోదా! రాజకీయ సన్మానంతో ఎప్పుడైనావాళ్ళకు అంత్యక్రియలు జరిగాయా! చెప్పు రోషినీ చెప్పు.

‘నీవు ఇప్పుడు ఎంతో బాధాభయాలలో ఉన్నావు. అసలు అడదంటేనే బాధా భయాలు’

‘నీవు చాలా ఎకడమిక్‌గా మాట్లాడుతున్నావు. స్త్రీకి కొత్త-కొత్త అర్ధాలు ఇస్తున్నావు. స్త్రీ అంటే అశ్రువులు – భయం – బాధ… అవమానం… అసలు వీటి వలన ఒరిగేది ఏముంది? రోషనీ! బాధ శక్తి రూపం దాలుస్తుంది? అవమానం గౌరవ రూపం దాలుస్తుందా?’

‘నీవు చెప్పేది నిజమే రేషమా! కాని ఏం చేస్తాం చెప్పు అసలు ఆడవాళ్ళదరి మధ్య ఐక్యత అనేది లేదు. ఒక ఇష్యు మీద చదువుకున్న వాళ్ళైనా, ఉద్యోగాలు చేసేవాళ్ళైనా ఆడవాళ్ళు ఒకటిగా కాదు. ఆడదానికి శక్తిరూపం అన్ని అర్ధాన్ని ఇచ్చారు. కాని వ్యర్థం ఆడది భయం అనే కలుగులో గిలగిల కొంటుకుంటున్న ఎలుకలా ఉండి పోయింది.”

స్త్రీలోని స్త్రీని, బొమ్మలోని బొమ్మను ఎవరుచూసారు? ఎట్లా చూసారు. ఎప్పుడు ఎక్కడ చూసారు? స్త్రీలో ఉన్న రాబియాను ఎవరైనా చూసారా?

రోషినీ రేష్మాని అడిగింది – సరే రేష్మా! స్త్రీలో రాబియా ఉండనీ, లక్ష్మి ఉండనీ. ఆమే దేనికి అమితంగా భయపడుతోంది.?

రేష్మా కొంత ఆలోచించింది. లోలోపల కొంత చర్చ జరిపింది. ”అసలు స్త్రీకి భయం తను స్త్రీయే అని.

మరి అయితే పురుషుడికి తను పురుషుడే అన్న భయం ఎందుకు లేదు? నిజానికి స్త్రీకి భయం పురుషుడిని చూసే.

రోషినీ అన్నది – చూడు రేష్మా ! నీవు రాబియా కథ విని కలత చెందావు. నీలో ఉన్న స్త్రీకి తను స్త్రీ అన్న భయం పట్టుకుంది.

‘ఇద్దరు మనుష్యులే రోషినీ! పురుషుడికి తాను పురుషుడుకదా అన్న భయం లేనప్పుడు స్త్రీకి ఎందుకు? పురుషుడంటే స్త్రీకి ఎందుకు భయం? ఈ భయం నుండి మనం బయటపడాలి. స్త్రీ కేవలం చర్చించే బదులు సాహసి అయి ముందడుగు వేయాలి” రేష్మా గంభీరంగా అన్నది.

మెల్లి-మెల్లిగా ఆడపిల్లలందరు తమ తమ అభిప్రాయాలను బయటపెట్టసాగారు. ‘మీరిద్దరు పనికి రాని చర్చలు సాగిస్తున్నారు. మేము రాబియాలు కాని లక్ష్మిలు కాని కాము. అసలు వాళ్ళిద్దరిలా కావడం ఏ మాత్రం మాకు ఇష్టం లేదు. మేం ఆడపిల్లలం స్త్రీలం అని మాకు తెలుసు. ఏం చేయాలో, ఏం చేయకుడదో మాకు బాగా తెలుసు. విద్యా జ్ఞానం కళలుకల ప్రపంచంలో మేం జన్మించాం. మా దృష్టిలో జన్నత్‌ లేదు. జహన్నుమ్‌ లేదు. పాపం లేదు. పుణ్యం లేదు. మేం అంటే మేమే. అంటే సంపూర్ణ స్త్రీ. భావోద్వేగాలతో, శరీరంతో సహా ఆత్మ-ఆలోచనలతో, సంవేదనతో కలబోసిన స్త్రీలం మేము. మా నుండి మా స్త్రీ తత్వాన్ని ఎవరు లాక్కొలేరు. మేము పురుషులనీ అనుకరించం. స్త్రీవాదం అంటూ వాదించం.” జహీదా పెద్దగా అన్నది.

మార్తా తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది – ‘మేం ఎవరితోనూ పోట్లాడం. ఎవరితోనూ కలబడే అవసరం మాకు లేదు. స్త్రీని స్త్రీగా, సంపూర్ణ స్త్రీగా, ఆమె అస్తిత్వంతో బాటు అర్ధం చేసుకోవాలి అంతే”.

శారద తర్కం ఏమటంటే ‘మాకు స్త్రీవాదం ఒద్దు. పురుషవాదం వద్దు. మేం మనుష్యులం. స్త్రీవాదం పేరున సంవేదన, సద్భావం, కరుణలను మేం పోగొట్టుకోం. దేశం అంటే ఐదారు వేల పెద్ద పెద్ద పట్టణాలు,చిన్న – చిన్న నగరాలు కావు. పట్టణంలో బతికే చదువుకున్న స్త్రీ యువతులు కాదు మొత్తం ప్రపంచం 60, 70 శాతం జన సంఖ్య ఊళ్ళల్లో ఉన్నారు. అందులోనూ సగం మంది స్త్రీలు ఉన్నారు. ఊళ్ళల్లో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలు, హింసల గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఏ మహిళా సంఘాలు ఊళ్ళకి వెళ్తున్నాయి. అక్కడ వీటికి విరుద్దంగా పోరాడుతున్న దెవరు? అక్కడికి వెళ్ళి ఈ బాధితులను, అమాయకులను ప్రత్యక్షంగా చూస్తున్నది ఎవరు?

జహిదా అన్నది – ‘ఉపన్యాసాలు ఇచ్చే వేళ కాదు ఇది. అసలు అవతలి వాళ్ళు మనపై కరుణ, జాలి, చూపించాలని ఎందుకను కోవాలి. అసలు భిక్ష ఎందుకు? నేను చదువుకున్న దానిని, మా చుట్టు పక్కల, మా బస్తీలలో జరిగే ఘోరాలన్న నాకు తెలుసు. మేము మౌనంగానే ఉంటాం. అత్యాచారాలను సహిస్తున్న ఆ స్త్రీలు మౌనంగానే ఉంటారు. పురుషుడు నోరు ఎందుకుతెరుస్తాడు? నిజానికి ఆడది కూడా ఆడదాని పట్ల సహృదయత చూపించదు. ఇళ్ళల్లో , ఇళ్ళ బయట,కూలీల ఆఫీసులలో, కంపెనీలలో పనిచేసే ఆడవాళ్ళు, ఆడపోలీసులు కూడా బయట ఎన్నో ఎన్నెన్నో, అన్యాయాలుచేస్తునే ఉంటారు. ఈ పరిస్థితులను ఎట్లా అధికమించాలి? ఏం చేయాలి?

‘జాహీదా! ఇంతగా బాధపడుకు. అందరు స్త్రీలు, అందరు పురుషులు ఇట్లా ఉండరు. సజ్జనులు ఉంటారు. జన్నత్‌ లేదు. సహన్నుమ్‌ లేదు. ఉన్నదంతా భూమియే. మన ఇళ్ళే మన సమాజమే వీటన్నింటిని బాగు చేసుకోవాలి. అప్పుడే ఆడదాని బాధ తెలుసుకో గలుగుతారు’అన్నది మార్తా.

ఇంతలో ఒక గురూజీ ఊడి పడ్డాడు. ‘మన సమాజంలో లింగబేధం ఉంది. సమానత్వం గురించి ఎవరు మాట్లాడుతారు. ఎందుకు మాట్లాడుతారు. ఆసలు సమానత్వం గర్భంలో ఉన్నప్పటి నుండి ఉంటుంది. సమానత్వం అనే మాటను సృస్టిస్తూ చర్చించే కొందరు స్త్రీని కిందిక తోసేసారు. పురుషులు సెమినార్లలో, ట్రైనింగులలో, మీటింగులలో ఉపవ్యాసాలు దంచుతూ, చర్చలు జరుపుతూ స్త్రీని పైకి తేవాలనుకుంటున్నారు. కాని వాళ్ళు పురుషులేగా’.

‘వాహ్‌! మీరు సత్యం చెప్పారు. స్త్రీవాదం గురించి తక్కువ మాటలతో ఎంతో చక్కగా చెప్పార. స్త్రీవాదం అంటే, ఆడంబరంగా లంచ్‌ – డిన్నర్‌తో సెమినార్లు, విదేశీ యాత్రలు వ్యాసాలు రాయడం, పుస్తకాలు ప్రచురించడం, పురస్కారాలు కాదు. వీటిల్లో ఊరు ఎక్కడ ఉంది?ఊళ్ళోని ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నారు. నిజానికి ఇవన్నీ వ్యాపార గర్భంలోంచి పుట్టాయి. వ్యాపారం స్త్రీ రూపాన్నే పూర్తిగా మార్చేసింది. స్త్రీని మనిషిగానూ, ఒకతల్లి, ఒక సోదరి, ఒక కూతురుగా గానూ ఉండనివ్వడం లేదు. ఈ వ్యాపారం ఆమెని బజారులో ఒక అలంకరణ వస్తువుగా మార్చేసింది. సెక్స్‌ – కమోడిటీ అయిపోయింది’. రేష్మా ఆవేశంగా అన్నది.

‘ఇక ఈ చర్చని ఆపు చేయండి. ఇక యాక్షన్‌ ఎట్లా చేయాలో ఆలోచించండి. పెద్ద పెద్ద బంగళాల వైపు చూడండి. చదువుకున్న ఆఫీసర్లు కంపెనీల యజమానులు, కార్పోరేటర్లని, నేతలని, ప్రొఫెసర్లని, మధ్యమ వర్గం వాల్ళని చూడు’ అని రేషమా అన్నది.

జాహిదా ఇళ్ళల్లో పని చేసే పనివాళ్ళతో మాట్లాడింది. వాళ్ళ వ్యధనివిన్నది. ఒక పనామె ఇట్లా అన్నది – ‘నా భర్త సంపాదించేది తక్కువ. తాగేది ఎక్కువ. పడుకునేటప్పుడు అంతో – ఇంతో ప్రేమ చూపిస్తాడు. ఇక తక్కిన సమయం అంతా తిట్లు-తన్నులు. ఇక వినండి ఈ బంగ్లాలలో జరిగే భాగోతాలు అంటూ మరో పని మనిషి చెప్పటం మొదలు పెట్టింది. ‘ మా వాళ్ళల్లో ఇరవై నుండి ఏభై సం||ల దాకా వయస్సున వాళ్ళు ఉన్నారు. అందమైన యువతులు ఉన్నారు. ఈ బంగ్లాళలో నివసించే యజమానులు మా వైపు ఎంత కామంతో చూస్తారంటే బయట గూండాలే నయం వీళ్ళకన్నా.పాపం ఎంతోమంది ఆడవాళ్ళు నిస్సహాయత వలననాలుగు డబ్బులు వస్తాయి అన్న ఆశ వలన లొంగిపోతారు’.

మూడో యువతి అన్నది – ‘సాహెబ్‌, అఫీసర్‌, డాక్టర్‌ మాస్టర్‌ ఎవరైతేం ఏం? ఇంట్లో ఆడవాళ్ళని కొడతారు. తిడతారు. వాళ్ళు ఒకవేళ ఉద్యోగం చేస్తే వాళ్ళ మీద అనుమానం. ఆ అనుమాంతో అవమానాలు చేస్తారు. నానా కష్టాలు పెడతారు. వాళ్ళ దాష్టీకాన్ని అసలెందుకు భరించాలి’.

మరో యువతి అన్నది – పెద్ద ఇంటి ఆడవాళ్ళు కూడా తమ మొగవాళ్ళకి బట్టలు అందిస్తారు. బూట్లు, లేసులు కడతారు. టీ కాని టిఫిన్‌ కాని లేట్‌ అయితే తిట్లు తినాల్సి వస్తుంది. ఒకవేళ ఎదిరిస్తే తన్నులు తినాల్సి వస్తుంది.పెద్ద ఇళ్ళల్లో ఆడవాళ్ళు విడాకులు తీసుకుంటారు. ఉరి పోసుకుని చచ్చిపోతారు. కాల్చుకుంటారు. విషం కూడాతింటారు ఏమాత్రం ఎదురు చెప్పినా మొగవాళ్ళు కాల్చి పడేస్తారు’.

ఇట్లాంటి వన్నీ బీదవాళ్ళకే జరుగుతాయని అంటారు. ఈ ధనవంతులు మా కన్నా హీన దశలో ఉన్నారు. నా మీద ఒక ఆఫీసరు దృష్టి పడ్డది.నన్ను బలవంతం చేసాడు. డబ్బులు పడేసి నోరు మూసుకోమన్నాడు. ఏం చేయను నిస్సహాయస్థితి. సోదరీ నా బతుకిట్లా కాలింది.’ అంటూ ఒక అమ్మాయి ఏడువడం మొదలు పెట్టింది.

ఇటువంటి వ్యథలు – కథలు విన్న రేషమా, రోషనీ, జాహీదా, మార్తా, శారద, ఇంకా కొందరు యాక్టివిస్టులు చెప్పడం మొదలు పెట్టారు. పురుషుల సృష్టి ఆడవాళ్ళ కోసం జహన్నుమ్‌. తమ దాహం తీర్చుకోవడానికి మాత్రం పురుషులకి జన్నత్‌.’

ఇక చుట్టు పట్ల ఇళ్ళకి వెళ్దాం. అక్కడ ఒక రాజకీయ నేత కొడుకు ఊరిలోని చిన్న వయస్సు పిల్లను అపహరించాడు. ఆమెను బలాత్కారం చేసాడు.

ఒక ముసలామె కలిసింది – ‘వాడు కుళ్ళి కుళ్ళి చావాలి. నా కోడలిని ఎత్తుకు వెళ్ళిపోయారు సర్పంచ్‌ మనుషులు. అసలు నా కోడలు ఎక్కడుందో తెలియదు. నేను పిచ్చి దాన్నై పోయాను. వెతికి వెతికి అలసిపోయాను. కొడుకుని సర్పంచ్‌ ఖైదీ చేసాడు. పోలీసులా ! నేతలా! ఆఫీసర్లా? ఊరివాళ్ళు! ఎవరి దగ్గరికి వెళ్ళను. నా చేతిలో కొడవలి ఉంది. సర్పంచ్‌ కనిపిస్తే నరికేస్తాను’.

ఇక పోలాలలో, నిర్జన ప్రదేశాలలో బలాత్కారాల సంగతి చెప్పనే అక్కర లేదు. కోకొల్లలు, ఇళ్ళల్లోంచి ఆడపిల్లలను అపహరించి అమ్మేస్తున్నారు. వేశ్యా వాటికలకు పంపించేస్తున్నారు. ఇదంతా ప్రతీ మొగాడు ఆడది మూగ దానిగా పుట్టాలనే అనుకుంటాడు. లేకపోతే ఆమెను మూగదానిగా, చెవిటిదానిగా చేసేస్తారు. నిజానికి ఎంత క్రూరమైన సమాజం. భయంకరమైనది ఈ సమాజం’. రేషమా కళ్ళల్లో నీళ్ళు నిండాయి.

‘ఒద్దు … ఒద్దు… రేషమా! మనం కూడా ఏడిస్తే పోరాటం చేసేది ఎవరు? కన్నీళ్ళు ఎండిపోయేలా చేయమని కళ్ళకి చెప్పండి. రోషినీ, జాహీరా, శరద్‌, రేష్మా మూర్తా అందరు ఒంటరి వాళ్ళు కాదు. మన ఐదుగురులోనూ ఏభై అరవై కోట్ల ఆడవాళ్ళ గొంతులు ఉన్నాయి. మన బాధలు, కన్నీళ్ళు, మన పట్ల జరుగుతున్న హింసలకి వ్యతిరేకంగా ఎటువంటి ఆయుధాలు లేకుండాకేవలం అహింసతో పోరాటం జరుపుదాం. ‘మనం తల్లులవాడానికి ఒప్పకోం. వివాహాలు చేసుకోం చేసుకున్నా భర్తలు భార్యలుండగానే వేరొకరిని ప్రేమిస్తూ ఎట్లా తిరుగుతారో మనం అట్లాగే చేద్దాం. అప్పుడు ఈ సమాజం మారుతుందా?’ రోషినీ అన్నది.

‘రోషినీ! ఇట్లా అనడం సరియైనది కాదు. ఇది పద్ధతి కాదు. నిజానికి ఇదిపోరాటం కాదు. ప్రతీకారం తీర్చుకోవడం. కాని మనం పురుషుల పట్ల ప్రతీకారం తీర్చుకోకూడదు. వాళ్ళ మనస్సులని మార్చే ప్రయత్నం చేయాలి’ మార్తా అన్నది.

‘మనం ఒక ఉద్యమం చేయాలి. ఉపదేశం బదులు సందేశం ఇవ్వాలి. మనము కేవలం దేహం కాదు. దాసీలం కాదు. మనుష్యులం. ప్రపంచంలో అందరికన్నా మంచి వాళ్లం. అందమైన వాళ్ళం. శక్తిగల వాళ్ళం. కోమలమైన వాళ్ళం’ మళ్ళీ మార్తా అన్నది.

శారద అన్నది – ‘అసలు మన గురించి మనం ఎందుకు ఇంతగా చెప్పుకోవడం మన ఆలోచనల ప్రకారం మన షరతుల ప్రకారమే మనం జీవించాలి’.

‘షరతులతో జీవితం ముడి పెట్టి నంత మాత్రాన అంతా సరిగానే నడుస్తుందా’?

గురూజీ కూడా అక్కడే ఉన్నాడు – ‘మీ మాటల్లో నిజం దాగి ఉంది. సరిగానే చెప్పారు. కాని మనం అన్నింటికన్నా ముందుగా ఆడపిండాలహత్యకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఆడపిల్ల పుట్టగానే ఆ పిల్ల ఆలనా పాలనా మీద, సమాజంలో ఆ పిల్లని చూసే విధానంపైన మన దృష్టిని ఉంచాలి. ఆడపిల్లకి సమానాధి కారం – తినడంల్లో తాగడంలో, ఆటపాటలలో, పెళ్ళి, ఉద్యోగంలో… మొత్తం జీవితంలో ఉండాలి – వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మనం ఉద్యమం చేయాలి.’

‘మీరు చెప్పిందంతా నిజమే గురూజీ! కాని సమాజంలోని ముల్లాలని పండితులని, సామంతుల మనస్తత్వం ఉన్న వారిని ఎట్లా ఎదిరించాలి? మీరు విన్నారుగా పని మనుషుల వ్యథలని’ జాహీదా అన్నది.

ఇదంతా ఒక కథ బదులుగా స్వయంగా ఒకసెమినార్‌ అయిపోయింది. మనం స్త్రీలోని స్త్రీతో మాట్లాడుతున్నాం. స్త్రీ అంటేనే అత్యాచారాలు సహించడం. కాని ఇది పూర్తి సత్యం కాదు. స్త్రీ ఒక తల్లి – ఒక చెల్లెలు, ఒక కూతురు కూడా, కాని ఇది కూడా పూర్తి సత్యం కాదు. ఎందుకంటే ఈ స్త్రీని కూడా వేశ్యగా మారుస్తారు. ఆమెను దాసిగా చేస్తారు.ఆమె అమ్మబడే ఒక వస్తువు. అంగడిలో అమ్మేస్తారు’ అన్నది రేష్మ.

చివరికి శారద ఇట్లా అన్నది- ‘నిజమే… సంపూర్ణ సత్యం ఏది కాదు. కాని స్త్రీ అనేది నిజం. స్త్రీ ఉంటుంది ఇది సత్యం. స్త్రీలేని సమాజం క్రూర జంతువుల సమాజం అవుతుంది కదా?’

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో