నూరుశాతం విజయాల్లో నూటొక్క సందేహాలు

సెక్స్ వర్కర్ అనగానే మనకు స్త్రీలే గుర్తొస్తారు. కాబట్టి నీతులు, జాగ్రత్తలు, బాధ్యతలు, మందులు, ఆకస్మిక మరణాలు అన్నీ త్రేతాయుగం నాటి దృక్పధంతోనే నడుస్తాయి.

సెక్స్ అంటే కనీసం ఇద్దరు ఇంకా ఎక్కువమంది పురుషులు భాగస్వాములుగా వుంటారని, రాకెట్ ఆధిపత్యం మొత్తం మెజారిటీ పురుషుల చేతిలోనే వుందని అలవాటుగా మర్చిపోతాం. కాబట్టి రబ్బరు తొడుగులతో సమస్య తీరడం లేదు.

నూరుశాతం విజయాలు సాధించినదని చెప్పబడుతున్న కండోమ్ పాలసీ గురించి నూట ఒకటి సందేహాన్ని ఇవాళ సెక్సువర్కర్స్ అడుగుతున్నారు. వాటిలో కొన్నిటినైనా మనం మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవాల్సి వుంది.

నూరుశాతం కండోమ్ పాలసీ కస్టమర్స్ సంఖ్యని తగ్గించలేదు. సురక్షితంకాని పద్ధతుల్ని పట్టించుకోవడం లేదు. కండోమ్ లేకుండా రిస్క్ కు సిద్ధపడ్డ స్త్రీలకు ఎక్కువ సంపాదన వుంటోంది.

సెక్స్ వర్కర్ బైటికి వెళ్ళి కస్టమర్స్ ని వెతుక్కుంటున్నప్పుడు కనీసం 5 నుంచి 6 కండోమ్‌లు వరకు జాకెట్టులోనో పరికిణిలోనో దాచుకుని బయల్దేరుతుంది. కానీ పోలీసుల నిఘాలో దొరికినప్పుడు వాళ్ళు అవన్నీ లాక్కుంటారు. దానివల్ల సెక్స్ వర్క్ ఆగిపోదు. కండోమ్ లేకుండానే సెక్స్ జరుగుతుంది. తొడిగించడం అనే సామాజిక బాధ్యతను శిక్షణగా తీసుకున్న ఆమె నిస్సహాయురాలవుతుంది.

– పోలీసుల భయంతో సెక్స్ వర్కర్స్ కార్నర్ షాప్స్ వాళ్ళను బ్రతిమలాడో, కమీషన్ యిచ్చో కండోమ్‌లు దాచుకుంటారు. కస్టమర్ దొరికేలోపు షాపు మూసేసినట్టయితే ఇక కండోమ్ వాడకం సాధ్యపడదు.
– బ్రోతల్‌హౌస్ నిర్వహణే ఒక అనైతిక, చట్టవిరుద్ధ కార్యక్రమం కాబట్టి ఆస్పత్రిలో వున్న వారి మానవహక్కులు చర్చించబడవు. ఒక స్త్రీ హెచ్.ఐ.వి పాజిటివ్ అని తెలియగానే బ్రోతల్ హౌస్‌లో వసతి కోల్పోతుంది. వారి బ్రతుకు రోడ్డున పడుతుంది.
– సెక్సువర్కర్స్ లో ఎక్కువశాతం స్థానికేతరులు అవడం వల్ల భాషా సమస్య తీవ్రంగా వుండి ఆ ప్రాంతంలో జరుగు తున్న నిరోధక చర్యలు అర్థం చేసుకునే స్థాయిలో వుండరు.
– ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు యిస్తున్న వైద్య, సమాచార సదుపాయం చేరాల్సి నంతగా చేరడం లేదు.
– ఎయిడ్స్ బారిన పడకుండా వుండడానికి సెక్స్ కి బదులు ఓరల్ సెక్స్ అంటూ కొన్ని పద్ధతుల్ని సెక్స్ వర్కర్స్ కి శిక్షణ యిస్తున్నారు. దీనివల్ల గర్భధారణ, వ్యాధి రాకపోవచ్చు. కాని తీవ్రమైన అసౌకర్యం, చెప్పుకోలేని హింస వుంటున్నాయి. ఈ జాడ్యానికి పిల్లలు ఎక్కువమంది బలవుతున్నారు.
– సెక్స్ వర్క్ లోకి దిగిన స్త్రీలు దొరికిపోతున్నట్టుగా ఏజెంట్లూ, నిర్వాహకులూ, ఇతర పెద్దలూ దొరకడం లేదు.
– తరలించడం, నమ్మకద్రోహం, అమ్మడం, కొనడం, బంధించడం, లాంటి అనేక చర్యలు చేస్తున్నవాళ్ళందరినీ సెక్స్ వర్కర్స్ అనాలి కానీ ఆ పేరుని బాధిత స్త్రీలకు మాత్రమే ఉద్ధేశిస్తున్నారు.
– ఈ సెక్స్ వర్క్ ని నిరోధించడం అంటే ప్రత్యామ్నాయ ఆదాయమార్గం అందించడం అనే దిశగా ఆలోచించాలి.
– ఒక యువతి తనంతట తాను అదే వృత్తిలో కొనసాగుతున్నదంటే గౌరవంగా బతికే అవకాశం ఈ సమాజం ఇవ్వలేదనే అర్థం.
– మెహందీ స్త్రీల మానవ హక్కుల్ని గురించి మాట్లాడ్డమంటే ఆ వృత్తిని ప్రోత్సాహించటం కాదు. జైళ్ళలో నేరస్థుడు నేరం చేశాడనే కారణంగా కొట్టడం, తిండిలేకుండా మాడ్చడం, కోర్టుకు హాజరు పరచకపోవడం, ఎలాంటి నేరాల్లో సెక్స్ వర్కర్స్ బ్రోతల్ హౌస్‌లోనూ, కస్టమర్స్ చేతుల్లోనూ ఎదుర్కొంటున్న హింసా అదే నేరం కింద పరిగణించాలి.

సెక్స్ వర్కర్‌ను అరెస్టు చేసే చట్టం పేరు ‘సీత’. మహా పతివ్రత పేరు అవడం వల్ల అది ‘పీత’గా మార్చబడింది. ఈ మార్పు యాదృచ్ఛికంగానే జరిగినా అది కరుడుగట్టిన పురుషస్వామ్యాన్ని సూచిస్తోంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో