నెల్లుట్ల రమాదేవి సాహిత్యం

– డా|| వేలూరి శ్రీదేవి

వరంగల్‌లో విరబూస్తునన సాహితీ కుసుమం నెల్లుట్ల రమాదేవి. వృత్తి ఆంధ్రా బ్యాంక్‌, హన్మకొండ నక్కలగుట్ట బ్రాంచ్‌లో జోనల్‌ ఆఫీసర్‌. ప్రవృత్తి కవయిత్రి, రచయిత్రి, కార్టునిస్ట్‌, పుట్టింది వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో, స్థిరపడింది అక్కడే. ఆర్థిక శాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఈమె దృష్టి సాహిత్యంవైపు మళ్ళింది.

రమాదేవి సాహితీ వ్యాసంగం బహు ముఖాలుగా సాగుతున్నది. కథలు, కవితలు, వ్యాసాలు రాయడంతో పాటు కార్టున్లు గీయడం ఈమెకు అభిమాన విషయం.

మనసు మనసుకూ మధ్య – కథాసంపుటి

మనసు భాష – కవితా సంపుటి

రమణీయం – కార్టూన్ల సంపుటి.

ఈ మూడు సంపుటాలు డిసెంబర్‌ 2011న ఒకే వేదిక మీద అవిష్కరించబ్డాయి.

మనసు మనసుకూ మధ్య శీర్షికతో ఈమె మొదటి కథా సంకలనం వెలువడింది. ఇందులో మొత్తం 26 కథలున్నాయి. ఈ కథలన్నీ కూడా ఏదో ఒక పత్రికలో అచ్చుకాబడినవే. విభిన్న అంశాల నేపథ్యంతో రాయబడ్డ కథలివి. ఈ కథా సంపుటికి తన అభిప్రాయాన్ని రాస్తూ ఆంపశయ్య నవీన్‌ ”ఉబుసుపోకకో, కాలక్షేపం కోసమో రాసినట్లుగా రాసిన కథ ఒక్కటి కూడా కన్పించలేదు” అన్న మాటలు అక్షరసత్యాలు.

నెల్లుట్ల రమాదేవి కథల్లో చాలా వాటిల్లో స్త్రీయే కేంద్ర బిందువు. ఆమె చుట్టూనే కథ సాగుతుంది. ఇందులో పెళ్ళికాని అమ్మాయి నుండి జీవిత చరమాంకంలో ఉన్న స్త్రీ వరకు అన్ని దశల స్త్రీలు ఉంటారు. సమాజం వల్ల మలచబడ్డ స్త్రీలు కొందరు, సమాజాన్ని తమకనుగుణంగా మలుచుకున్న స్త్రీలు మరికొందరు కనబడుతారు. ఈమె కథల్లోని పాత్రలు మానవత్వం, మృదుత్వం కలిపి ఉంటాయి. అంతకఠినంగా ఉండవు. అక్కడక్కడా కొన్ని పాత్రలున్నా అవి అధికారాన్ని బట్టో, ఆ పరిస్థితిని బట్టో అలా తప్పనివి మాత్రమే.

ఈమె కథలన్నీ మధ్య తరగతి కుటుంబ జీవనాన్ని, వారి అంతర్మధనాన్ని ప్రస్పుట పరుస్తాయి. అయితే రచయిత్రికి దిగువమధ్య తరగతి వారిపై కొంత సానుభూతి, ఆదరణ ఉన్నట్లు ఈమె కథలు చెపుతున్నాయి. కుటుంబ విలువలు, ప్రేమాప్యాయతలు గుమ్మరించినట్లుంటాయి ఈమె కథలు. ఈ సంపుటిలోని కొన్ని కథలు ఉత్తమ పురుషలో సాగుతాయి. అవి సంస్కారం, సొంత లాభం కొంతమానుకో, ఇందుమంతి, ఐ మిస్‌యూ సోమచ్‌, ఓ నీతి కథ. కొన్ని కథల్లో రచయిత్రి ప్రారంభం నుండే కనిపిస్తుంది. మరికొన్ని కథల్లో మధ్యలో కన్పించి కథను తానే పాఠకులకు చెప్తుంది.

నెల్లుట్ల రమాదేవి కథలను వస్తుపరంగా చూస్తే-పెళ్ళి విషయంలో అమ్మాయిలు తీసుకునే స్వతంత్ర నిర్ణయాలు అగ్గిపువ్వు, ఈతరం అమ్మాయి, ఇందుమతి, నీతాళికో నమస్కారం, మనసు మనసుకూ మధ్య, ఓ నీతి కథలు ఒక వర్గీకరణ గాను, మాతీవ్యం కోసం పరితపించే స్త్రీలు స్తన్యం, పాలు, నాకీబిడ్డవద్దు కథలు ఒక రకంగాను, కూతుర్ల, కొడుకుల ఔన్నత్యాన్ని గూర్చి చెప్పేవి ”సొంతలాభం కొంతమానుకో”, ”జీవన సంధ్యలో”. ”కొడుకంటే”, ”లిటిల్‌స్టార్‌” కథలు ఒక వర్గీకరణగాను, మగవాళ్ల పట్ల చెడు అభిప్రాయం ఏర్పరుచుకున్న స్త్రీల గురించి ”సంస్కారం”, ”అంతర్యం”, ”ఐమిస్‌ యూ సోమచ్‌” కథలు ఒకరకంగాను, పట్నం వాళ్ళు పల్లెటూరి వాళ్ళను అసహ్యించుకునే తీరు, చులకన చేసే వైనం ”ప్రయాణం”, ”పాలు” కథల్లోను, ఆదర్శాలు చెప్పేందుకే కాని ఆచరించేందుకు కాదని చెప్పే ఒక అమ్మాయికథ ”ఆదర్శం”లో నమ్మిన ఆదర్శం కోసం నిలబడ్డ ఓ కుటుంబం కథ ”ఓ నీతికథ”లో, అటు కోడలుగాను, ఇటు అత్తగాను సుఖపడని సంధియుగంలో నలిగిపోఇన ఒక అత్తగారి కథ ”తరాల అంతరాలలో”, బాగా డబ్బుండి ఒంటరితనాన్ని అనుభవిస్తూ, భర్త ప్రేమకు దూరమైన ఓ భార్యకథ ”ఐ మిస్‌యూ సోమచ్‌”లోను, ఉన్నంతగా బ్రతికేవారెవరూ అంతే ఉన్నంతలో తృప్తిపడేవారని చెప్పే కథ ”వెహికిల్‌” కథలో, కొడుకును బాగా చదివించడం కోసం ఓ తల్లిదండ్రి పడ్తున్న కష్టాలు చూడలేక, చదువుకు తగ్గ ఉద్యోగం రాక ఆ సర్టిఫికేట్లు బ్యాంకులో పెట్టి లోను తీసుకుని ఆటో కొనుకుని నడుపుతూ ఆ తల్లిదండ్రులను అదుకున్న ఓ చదువుకున్న యువకుడి కథ ”చదువు”లో, బాగా చదువుకుని మంచి మెరిట్‌తో ఇంటర్వ్యూకెళితే వాళ్ళడిగిన తలతిక్క ప్రశ్నలకు తన ఇంటర్వ్యూలోని భావాన్ని పసిగట్టిన ఓ మిషన్‌ వల్ల ఉద్యోగం కోల్పోయిన ఓ నిరుద్యోగి కథ ”ఇంటర్వ్యూలో ఇన్నర్‌వ్యూ”, తెలంగాణ పోరాటంలో ప్రాణాలు విడిచిన ఓ అమరవీరుడి కుటుంబానికి యం.ఎల్‌.ఏ. చెల్లని చెక్కు ఇచ్చిన తీరు ”చెల్లని చెక్కు” కథలో కనిపిస్తాయి.

ఈ కాలం నాటి అమ్మాయిలు జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో స్వతంత్రంగా ఆలోచిస్తున్నారని, ఆ విషయాన్ని ధైర్యంగా బయట పెడుతున్నారని రచయిత్రి ఈ సంపుటిలో కొన్ని కథల్లో చూపించారు.

”అగ్గిపువ్వు” కథలో ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా వచ్చిన ప్రవీణ్‌కు రంగయ్య ఇంటిపనిలో చేదోడు వాదోడుగా ఉంటాడు. రంగయ్య ఆరోగ్యం బాగా లేకపోవడంవల్ల అతని కూతురు నీల ఉదయం కాఫీ అందించడం నుండి రాత్రి భోజనం తయారు చేయడం వరకు ప్రవీణ్‌కు అన్ని పనులు చేసిపెడు తుంది. నాలుగురోజులుగా నీలను దగ్గర నుండి గమనిస్తున్న ప్రవీణ్‌కు దుర్బుద్ధి కలిగి ఆమెతో వెకిలివేషాలు వేస్తాడు. ఏదో పల్లెటూరి పిల్ల ముందు కాస్త బెట్టుచేసినా తర్వాత సహకరిస్తుందనుకుంటాడు. ప్రవీణ్‌. కాని అందుకు భిన్నంగా ప్రవీణ్‌ చెంప పగులగొట్టి ”టాంగా తోలే మా నాగులు మామ నీకంటే ఎంతోనయం. పరాయి ఆడ మనిషిని కన్నెత్త కూడా సూడడు మా నాగులు మావ! మా ఇద్దరికి లగ్గం కుదిరినా ఇంతవరకు నన్నేనాడు ముట్టుకోలేదని చెపితే నీలాంటి యెదవకేమర్థం అయితది? అడి కాలిగ్గోటిక్కూడ సరిపోవు నువ్వు” అంటుంది.

ఒక వ్యక్తిని ఇష్టపడడానికి లేదా తిరస్కరించడానికి అధికారం, అందం, హోదా, డబ్బు ప్రామాణికాలు కావని, అతని యొక్క నైతిక స్థాయి, స్త్రీపట్ల అతడు వ్యక్తపరిచే ప్రవర్తనే మూలమని, అన్నింటికంటే మించి సంస్కారం లేని మనిషికి సమాజంలో స్థానంలేదని అగ్గిపువ్వు కథలో నీల ద్వారా చెప్పారు రచయిత్రి.

ఈతరం అమ్మాయి కథలో హైమ, సుజాత ప్రాణ స్నేహితులు. ఇద్దరూ సరదాగా సినిమా చూద్దామని వెళితే హౌజ్‌పుల్‌ బోర్డ్‌ కనిపిస్తుంది. నిరాశతో వెనుదిరగబోతూంటే తన దగ్గర టికెట్లున్నాయని ఒక యువకుడు ఇస్తాడు. సినిమా హోలులోపలి కెళ్ళాక ముగ్గురివి పక్కపక్కసీట్లు కావడంతో హైమ కొంత ఇబ్బంది పడ్తుంద.ఇ సినిమా మధ్యలో ఆ యువకుడు హైమతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. రెండు, మూడుసార్లు చెప్పినా అతడు మారకపోవడంతో సహించలేని హైమ అతన్ని చెంపమీద కొట్టి సుజాతను తీసుకుని ఇంటికెళ్తుంది.

తనను చూసుకోవడానికి పెళ్లివారొస్తు న్నారని తెలుసుకున్న హైమ ఆశ్చర్యాన్ని, అసహ్యాన్ని ప్రకటిస్తుంది. కారణం తనను పెళ్ళిచూపులలో చూడ్డానికి వచ్చేది ఆ రోజు సినిమా హాల్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ యువకుడే కాబట్టి. ఈ విషయమంతా ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పి తన తండ్రితో ఆ యువకుడి తండ్రికి ఉత్తరం రాయిస్తుంది. ఇంకా తను కూడా అతడికి ఒక ఉత్తరం రాస్తుంది. ”మిమ్మల్ని గారు అని సంభోదించడం ఆ పిలుపును అగౌరవపరచ డమే అవుతుంది. కాని నాలోని సంస్కారం నాచేత ఆపని చేయిస్తోంది. బహుశ నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోనని తిరస్కరించడం మీకు ఆశ్చర్యంగా, అవమానంగా కూడా ఉండొచ్చు.” అంటూ ఒక సుదీర్ఘ ఉత్తరం రాసి చివర్లో ”మీకు భార్య కాబోయే ఉపద్రవం నుండి తప్పించుకున్న హైమ”. అని రాసి తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ప్రకటిస్తుంది.

స్వతంత్ర భావాలుగల స్త్రీ తన భర్తను ఎన్నుకునే సందర్భంలో ఆస్తులు, అంతస్తులకు ప్రాధాన్యత నివ్వకపోవడం, అతని వ్యక్తిగత ప్రకవర్తన, సమాజంలో అతడు స్త్రీల పట్ల ప్రదర్శించే వైఖరికి ప్రాధాన్యతనిస్తూ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది.

మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఒక మనిషి ప్రవర్తనా సమూహమే అతని జీవితాన్ని నిర్ణయిస్తుంది. అలాంటి ప్రవర్తన నైతికస్థాయిని కించపర్చే విధంగా ఉంటే సమాజంలో మరో వర్గాన్ని ఆటవస్తువుగా, భోగ వస్తువుగా భావిస్తే ఎలాంటి ఫలితాలుంటాయో ఈ కథ చెపుతుంది.

”జీవితం ఒక సవాల్‌. దాన్ని సాధించి గెలిచెయ్‌” అన్న సూక్తికి అక్షర రూపమే ఇందుమతి కథ. ఒక మనిషి ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు అతడి జీవితాన్ని గమనిస్తే ఒళ్ళంతా ఉలిదెబ్బలు తిన్న రాయేమొ అందరూ మొక్కే దేవుడైంది. ఏ మాత్రం దెబ్బలు తినని రాయేమో ఇంటి ముందు వాకిలి బండైంది. అలాగే జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సమర్థతతో ఎదుర్కొని తనకనుగుణంగా మల్చుకుంటే తాను తనకుటుంబం, కుటుంబంతో సంబంధమున్న సమాజం సుభిక్షంగా ఉంటాయని తెలుస్తుంది.

ఈ కథా సంపుటిలోని పెద్ద కథలకోవలో ఇందుమతి కథ ఒకటి. ఇందులో బాగా డబ్బున్నవాడు, ఆ కాలేజీ స్టూడెంట్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ సురేశ్‌. అహంకారం, ధనగర్వం, నిర్లక్ష్యంతో పాటు ఎప్పుడూ పదిమందికి తక్కువ కాకుండా అతని వెంటే ఉంటారు. అదే కాలేజీలో చదువుతున్న ఇందుమతి అతని ఆగడాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ అతన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరిమధ్య వైరం కొనసాగుతుంది. సురేష్‌ చేసిన ప్రతి అల్లరిపనిని, చిలిపి పనిని తెలివితో, సమయస్ఫూర్తితో తిప్పికొట్టి విద్యార్థుల, ఉపాధ్యాయుల మన్నననలు పొందుతుంది. ఈ క్రమంలోనే ఇందుమతి పక్కింట్లో ఉండే శ్రీధర్‌తో పరిచయం ఏర్పడుతుంద.ఇ భార్య చనిపోయి ఒక బిడ్డతో ఉన్న శ్రీధర్‌ వ్యక్తిత్వం, మంచితనం ఇందును ఆకర్షిస్తుంది. తనను, తన ఆలోచనలను, ఆశయాలను గౌరవించేవాడు, ఉన్నత సంస్కారవంతుడు అయిన శ్రీధర్‌ను ఇందుమతి పెళ్ళి చేసుకుంటుంది. కాని కొన్ని రోజులకే ఆక్సిడెంట్‌లో రెండు కాళ్ళుపోయి చక్రాలబండికే పరిమితమ వుతాడు. అయినా ఇందుమతి అధైర్యపడక బ్యాంక్‌ పరీక్షలు రాసి ఉద్యోగం సంపాది స్తుంది. భర్తకు కాలక్షేపంకోసం ఒక పుస్తకాల దుకాణం పెట్టిస్తుంది. ఇద్దరు పిల్లలతో జీవితాన్ని సాఫీగా సాగిస్తుంది. ఇందుమతి లాంటి వాళ్ళకు జీవితం ఒక సవాలు. అందులని కష్టాలను వాళ్ళు చిరునవ్వుతో ఎదుర్కొని సుఖాలకి బాటలు వేసుకుంటారు.

”మనసు మనసూకూ మధ్య” ఒక మధ్య తరగతి అమ్మాయి కథ. పెళ్ళి చూపుల్లో చూసిన సంధ్యను మోహన్‌ ఇష్టపడతాడు. పెళ్ళి చూపుల్లోనే ప్రశ్నిస్తుంది సంధ్య మోహన్‌కి తనలో ఏం చూసి ఇష్టం కలిగిందని. సరైన సమాధానం లేదు మోహన్‌ దగ్గర. ఉభయ ఉభయ కుటుంబీ కులు పెళ్ళి నిశ్చయం చేసుకుంటారు. పెళ్ళికి మూఢం అడ్డు రావడంతో కొన్ని రోజులు పెళ్ళి వాయిదా వేసుకుంటారు.

ఒక రోజు మోహన్‌కి సంధ్య నుండి ఉత్తరం వస్తుంది. వెంటనే రెక్కలు కట్టుకుని వాలుతాడు మోహన్‌ సంధ్య దగ్గరికి. ఉత్తరం రాసి మరీ రమ్మని ఎందుకు పిలిచిందో సంధ్య అర్ధం కాదు మోహన్‌కి. సంధ్య మాటలు విన్న మోహన్‌కి షాక్‌ తగిలినట్లవుతుంది. ”మీరు నాలో ఏం చూసారో కాని నన్ను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అలాంటి మీరు నాపై నిఘా ఉంచి మీ తరపున ఒక సీక్రేట్‌ ఏజంటు ను ఎందుకు ఉంచారు? నా గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నన్నడిగితే నేనే చెప్పేదాన్ని కదా! దీనికంత డ్రామా ఎందుకు? భార్యను తోటి మనిషిలా, వ్యక్తిత్వం ఉన్న స్త్రీలా చూడలేని మీకు, మీ సంస్కారానికి ఓ నమస్కారం. ఇప్పుడే ఇలా ఉన్న మీరు పెళ్లయ్యాక మీ అనుమానంతో మీ భార్యను ఎంతగా వేధిస్తారో ఊహించుకోగలను. మీలాంటి అనుమానపు మొగుడితో నా జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధంగాలేను. మొగుడే ధైవం అనుకుని పూజించే పతివ్రతా శిరోమణి ఎవరైనా దొరికితే పెళ్ళి చేసుకుని తరించండి. దయచేసి వెళ్ళిపోండి.” ని ఆవేశంతో ఊగిపోతున్న ఒక ఆడపిల్ల తనను ఇతంలా కడిగేస్తుందని, తన అంతరంగాన్ని తన ముందే ఓ పుస్తకంలా విప్పి చదువుతుందనీ అతడేమాత్రం ఊహించలేదు. ఆమె అభిప్రాయాల ముందు, ఆమె వ్యక్తిత్వం ముందు తానెంతో కుచించుకుపోయినట్లుగా అనిపించింది మోహన్‌కి. ”అయామ్‌ సారీ సంధ్యా” అంటూ బయటకు వెళతాడు మోహన్‌ ఆమెమీద ఆశచంపుకుని.

ఇదే క్రమంలో మరోకథ ”నీతాళికో నమస్కారం’. పందిట్లో బాజాభజంత్రీల మధ్య జరుగుతున్న పెళ్ళి హఠాత్తుగా ఆగిపోయింది. పెళ్ళికి ముందే కట్నం డబ్బులు ఇస్తానని పెళ్ళి ముహూర్తం టైముకు కూడా ఇవ్వకపోవడంతో పెళ్ళికొడుకు, తల్లి, తండ్రి వెళ్ళిపోబోతారు. అక్కడున్న బంధువులంతా నచ్చజెప్పి నెల రోజుల్లోగా కట్నం డబ్బులు మొత్తం ఇస్తారని నచ్చచెప్పడంతో పెళ్ళికొడుకు మంటపంలోకి రాబోతాడు. ఊహించని రీతిలో పెళ్ళికూతురు పెళ్ళి పీటలపై నుంచి లేచి ”జీవితాంతం నాతోకల్సి బ్రతకాల్సిన నీకు కనీసం ఈ పెల్ళి చూడ్డానికొచ్చిన వాళ్ళకున్నంతైనా సానుభూతి, దయలేదు. మానవత్వం, సంస్కారం ఏ మాత్రం లేని నీలాంటి వాళ్ల ఇంట్లోకి అడుగుపెట్టడానికి నాకే సిగ్గుగా ఉంది. సంతలో పశువులా అమ్ముడుపోతూ, ఓ వ్యక్తిత్వం అంటూ లేని నీకు భార్యగా రావడానికి నేను సిద్ధంగాలేను” అంటూ మంగళసూత్రాన్ని పురోహితుడి చేతుల్లోంచి తీసుకుని పెళ్ళికొడుకు వైపు విసిరేసి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటుంది.

మాతృత్వం ఒక మధురానుభూతి. అది స్త్రీకి మాత్రమే చెందే ఒక అపురూప వరం. దీన్ని నేపధ్యంగా తీసుకుని నెల్లుట్ల రమాదేవి పాలు, స్తన్యం, నాకీబిడ్డవద్దు కథలు రాసినట్టు తెలుస్తుంది.

స్తన్యం కథలో మల్లి ప్రసవించి నెలరోజులు కూడా కాలేదు. మగబిడ్డను ఇంట్లోవదలి చేను కోయడానికి కూలీకి పోతుంది. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు వారివి. తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లెకు చంటోన్ని అప్పజప్పి మల్లి తల్లి లచ్చిమితో కూలికి పోతుంది. చంటిపిల్లాడు పాలుతాగే టైమైందని ఒకసారి ఇంటికిపోయి కడుపునిండ పాలుఇచ్చి వస్తుందని మల్లి తరపున లచ్చిమి బ్రతిమిలాడినా రాఘవరెడ్డి దొర ఒప్పుకోలేదు.

ప్రసవానికి తల్లిగారింటికి వచ్చిన ఆడపిల్లలు నెల బాలింతలయినా కూలీకిపోయి సంపాదించందే ఇల్లు గడవదని తెల్సు రాఘవరెడ్డికి. ఎంత బ్రతిమిలాడినా ”ఇంటికి పంపుడన్న ముచ్చటేలేదు. ఒక్కళ్ళు పోతే అందరూ ఏదో వంకపెట్టుకుని పోతమంటరు. మీకు కూలిచ్చేది ఇంటికి పొయ్యెతందుకు కాదు”. అని పరుషంగా మాట్లాడుతాడు. ఒక్కసారి పోనీలే అంటే అదే అలవాటు అయితది అనుకునానడు. అంతలోన కాస్త ఆలోచనల్లో పడ్తాడు. తల్లి వెనక నిలబడ్డ మల్లి రాఘవరెడ్డి దొరకేసి దీనంగా చూడ్డం అతన్ని కొంచెం కదిలించింది. ఒక్కసారి తన కూతురు అనురాధ మనసులో మెదిలింది. ఇదే వయస్సులో అనురాధ తన వీపుమీద పడి ఊగుతూ ఎంతో గారాబం చేసేది. ఆ ఆలోచనతో రాఘవరెడ్డి మనసు కాస్త కరిగింద.ఇ కాని అంతలోనే అతని డబ్బు, స్థాయి, దర్పం దాన్ని కప్పేస్తాయి. ”సరే ఇంటికి వద్దుగాని, నీచిన్నబిడ్డనుతోలి, ఆ పిల్లగాన్ని ఎత్తుకరమ్మను. ఇక్కడే పాల్చి చెట్టు నీడకు పండ బెట్టుకోవచ్చు” అంటూ దయదలుస్తాడు.

ఇంత ఎండలో చంటిగుడ్డును తీసుకు రావడం మంచిదికాదని, చేసేదేమి లేక చేనుకొయ్యడంలో నిమగ్నమవుతాడు మల్లి, తల్లి లచ్చిమి. ఒక అరంగలో లచ్చిమి చిన్నకూతురు (మల్లిచెల్లి) చంటి పిల్లాడిని ఎత్తుకుని పొలంవైపుకు పరుగెత్తిరావడం, మల్లి ఎదురెళ్ళి వాడిని తీసుకుని మామిడి చెట్టు నీడలోకి వెళ్ళడం చూస్తున్న అక్కడి ఆడకూలీలను ”సాయంత్రం వరకు చేనుకొయ్యడం పూర్తయిపోవాలి” అంటూ కసిరాడు రాఘవరెడ్డి. అతని ఆజ్ఞ ప్రకారమే సాయంత్రం వరకు చేనుకొయ్యడం గూడపెట్టి ముద్ర వెయ్యడం అయిపోతుంది.

పొలం నుండి ఇంటికి చేరుకున్న రాఘవరెడ్డికి తమ కూతురు అనురాధకు పాలుపడటం లేదని, పుట్టివారం రోజులైనా కాని చంటిపిల్లవాడు గుక్కపెట్టి ఏడుస్తు న్నాడని, బిడ్డ పట్నం పోతానంటుందని చెపుతున్న భార్యను చూసి నిరుత్తరుడవుతాడు. తన మనవడికి ఘనంగా బారసాల చెయ్యాలని, బాలింతను 3 నెలలు తనింట్లో ఉంచుకోవాలని అనుకున్న రాఘవరెడ్డికి ఆందోళన మొదలవుతుంది. దవాఖాన్ల ఉన్నప్పుడు డాక్టరమ్మ ఇచ్చిన మందులవల్ల పాలు బాగానే పడ్డాయని, ఆమె తీసుకెళ్లమంటేనే తన బిడ్డను, మనవణ్ణి కారులో తనంటికి క్షేమంగా తీసుకొచ్చామని భార్యతో గతాన్ని గుర్తుచేసుకుంటూ కంగారు పడతాడు. రెండు, మూడు నెలల వరకు ఎవరైనా బాలింతపాలు ఇస్తే ఆ తర్వాత డబ్బపాలుగాని, ఇతరత్రా ఏ పాలైనా వాడొచ్చు అని భార్య చెప్పడంతో ఆలోచనల్లో పడతాడు రాఘవరెడ్డి. పాలు అందక తన మనవడికేమన్నా అయితే అన్న ఊహే అతనికి భయంకరంగా తోచింది. బాలింత లెవరున్నారని ఆలోచిస్తున్న రాఘవరెడ్డికి మల్లి గుర్తొస్తుంది. వెంటనే ఆమెను పిలిపించి తన మనవడికి పాలు ఇప్పించి ప్రాణం కాపాడ ుకుంటాడు. మనసులో ఎలాంటి భావం లేకుండా తన కొడుక్కు పాలిచ్చినట్లుగానే దొర మనవడికి కూడా పాలిచ్చి పొలం పనికివచ్చి, చెట్టునీడలో పడుకున్న తన కొడుకుపై ఎండపడటం చూసి సవరించబోయిన మల్లికి చంటోడికి ఎండపడ కుండా గొడుగుపడుతున్న దొర కన్పించేసరికి ఒక పేలవమైన నవ్వు మల్లి ముఖంలో మెరుస్తుంది. కాని ఆ నవ్వుకు అర్థం మాత్రం రాఘవరెడ్డికి అర్థంకాలేదు.

ఇదే కోవలో మరో కథ ”పాలు” కనబడుతుంది. సుప్రియ ప్రసవించే 3 నెలలు కావస్తుంది. ఇన్ని రోజులు తల్లిగారింట్లో ఉండి భర్త రమ్మని

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో