సాహిత్య సమాలోచన –

– పి. సత్యవతి

తొమ్మిది అధ్యాయాలున్న ”సాహిత్య సమా లోచన” వ్యాససంపుటి, కృష్ణాబాయిగారి ఎని మిది పదుల వయోపరిణతీ, అధ్యయన జ్ఞాన మూ, విరసం వంటి సంస్థకు కార్యదర్శకత్వ దక్షతా కలగలుపుకుని వచ్చిన మేలిమి కదంబం. ముదునూరి భారతిగారి ఆలోచనా ప్రేరకమైన ముందుమాట, వరవరరావుగారి మంచి మాట, కల్యాణరావుగారి సన్నని పలక రింపూ ఈ సంపుటితో మనకు అదనపు బహుమతులు.

”చదువులూ సంధ్యారాగాలూ” అనే స్వీ యానుభవాల మొదటి అధ్యాయం, ఆనాటి (1930-40) గ్రామీణ వాతావరణంలో కమ్యూనిస్టు భావజాల ప్రభావంతో ఆమె పాఠశాల చదువుతో మొదలై గంటి ప్రసాదం గారి అమరత్వం వరకూ సాగిన ఆత్మకథాత్మక చరిత్ర. ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు భావజాల ప్రభావం బలపడుతున్న కాలం కృష్ణాబాయి గారికి ఇష్టాలూ అభిరుచులూ ఏర్పడుతున్న కాలం ఒకటే కావడం యాదృచ్ఛికమే అయినా అది ఆమె ఆలోచనలమీద గొప్ప ముద్ర వేసింది. అప్పట్లో చాలామంది భూస్వామి కుటుంబాల ఆడపిల్లలకు లేని మానసిక శిక్షణ ఆమెకు లభించింది. వేణుగోపాలరావుగారితో ఆమె వివాహం, అద్భుతమైన సాహచర్యం, కుటుంబం స్నేహాలూ, విరసం స్థాపన మొద లైన అనేక సందర్భాలను ఆమె ఈ అధ్యాయం లో సంక్షిప్తీకరించారు. యాభైయవ దశకం నుంచీ ఇప్పటివరకూ జరిగిన అనేక రాజకీయ సామాజికార్థిక సాంస్కృతిక పరిణామాలకు సాక్షి అయిన ఆలోచనాపరురాలైన కృష్ణాబాయి గారి ఆత్మకథ ఈ కాసిని పుటలలో ఒదిగి పోవడం ఆమె ఇంకా వివరణాత్మకమైన విశ్లేషణాత్మకమైన అనుభవ సారాన్ని ఈ తరానికి అందిస్తారని ఆశించిన వారికి కొంత నిరాశ కలిగించింది.

ఇదికాక ఈ సంపుటిలో సాహిత్య వ్యాసంగం, ముందువెనుకలు, లోకసంచారం, చైతన్యరంగాలు, కొన్ని జాబులు, మాన్యులూ మహనీయులూ, సృష్టిలో తీయనిది అనే అధ్యా యాలున్నాయి. సాహిత్య వ్యాసంగంలో ఆమె వ్రాసిన వివిధ పత్రికలలో ప్రచురితమైన సాహి త్య వ్యాసాలూ పుస్తక పరిచయాలూ, సమీక్షలూ దాదాపు నలభై ఎనిమిది వున్నాయి. వీటిలో ”ఓరుగల్లు నుంచీ మూడు పుస్తకాలు” అనే వ్యాసం, ”స్వాతంత్య్రానంతర భారతదేశం స్త్రీల స్థితీ గతీ” ”ఆధునిక తెలుగు సాహిత్యం స్త్రీవాద భూమిక” ”కన్యాశుల్కం సామాజిక సంబంధాలు” అనే మూడు పుస్తకాలను గురిం చిన విపులమైన సమీక్ష. స్త్రీవాద చైతన్య మూలా లు-చలం అనే వ్యాసం, కశ్మీర్‌ కర్ఫ్యూ కాళరా త్రి వ్యాసాలు తప్పకుండా చదవవలసినవి.

ముందు వెనుకలులో ఆమె చలసాని ప్రసా ద్‌ గారితో కలసి సంపాదకత్వం వహించిన కొడవంటి కుటుంబరావు సాహిత్య సంపుటు లు కొన్నింటి ముందుమాటలున్నాయి. లోక సంచారంలో వున్న మూడు యాత్రానుభవా ల్లోనూ గాయపడిన సౌందర్యం కశ్మీర్‌ మంచి వ్యాసం. ”మహిళాలోకం” స్త్రీలు శీర్షికలో ”విముక్తి ఉద్యమాలు- స్త్రీలు ”విప్లవ సాహిత్యం – స్త్రీల కృషి” సమగ్రమైన సమీక్షా వ్యాసాలు. ముఖ్యంగా విప్లవసాహిత్యం స్త్రీల కృషి తప్పక చదవవలసిన వ్యాసం. చైతన్య తరంగాలు అన్న అధ్యాయం సమకాలీన సామాజిక సమస్యలపై ఆమె అప్పుడప్పుడూ వ్రాసిన వ్యాసాలను చేర్చారు. ఇందులో శరీర దానం గురించి ముదునూరి భారతి తన ముందుమాటలో విస్తృతంగా చర్చించారు. అవికాక చిత్రరచన ఉత్తరాల ఆల్బం అనే వ్యాసాలు వరవరరావుగారు చెప్పినట్లు అభిరుచి రచనలు, ఫోటో ఆల్బమ్‌ వలె ఉత్తరాల ఆల్బం ఒక అద్భుతమైన జ్ఞాపకాల ఖజానా. ఒక్కొక్క ఉత్తరమూ ఒక స్మృతి కిరణం. తాను కొందరికి వ్రాసిన జాబులు కూడా చేర్చారు. ఇంక మాన్యులూ మహనీయు లు శీర్షికలో వ్రాసిన వ్యాసాలన్నిటిలోనూ ”మెల్లీ షోలింగర్‌” గురించి ఇంత విపులమైన వ్యాసం మనకి తటస్థపడదు. చివరగా వ్యాసకర్త తన స్నేహాల గురించి వ్రాసిన సృష్టిలో తీయనిది శీర్షిక. ఇందలి వ్యక్తులంతా కూడా చిరస్మరణీయులే.

‘| జిళిళిది శినీలి జిలిరీరీ శిజీబిఖీలిజిజిలిఖి లీగి, ఊనీబిశి ళీబిఖిలి బిజిజి శినీలి ఖిరితీతీలిజీలిదీబీలి’ అనే రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ కవితా పంక్తులతో ప్రారంభించి వఉరితీలి రిరీ దీళిశినీరిదీవీ లీతిశి నీతిళీబిదీ బిరీరీళిబీరిబిశిరిళిదీవ అనే రావిశాస్త్రి మాటలతో ముగిసిన ఈ నాలుగు వందల యాభైపేజీల పుస్తకం, రచయిత్రీ, స్నేహశీలీ, విరసం వంటి ప్రత్యేకత కల్గిన సంస్థలో క్రియాశీల కార్యకర్తా అయిన కృష్ణాబాయి గారి యాభై సంవత్సరాల సాహిత్య ప్రయా ణం. ఈ పుస్తకంలో ఆమె తన బాల్యాన్ని గురించి కొంత విపులంగానే వ్రాసారు గనుక అది కలుపుకుంటూనే ఈ యాభై సంవత్సరాల జీవన యానాన్ని, మరొక సంపూర్ణమైన ఆత్మకథగా వ్రాయాల్సిన అవసరం వుంది. అప్పటి ఆశయాలు వాటికోసం పోరాటాలు, జీవనశైలీ ఇప్పటి యువతులకు తెలియవలసిన అవసరం వుంది. వినిమయ సంస్కృతి జీవిత విలువలని మింగేస్తున్న ఈ తరుణంలో అప్పటి కమ్యూనిస్టు కుటుంబాలు సమాజానికి చేసిన సేవ గురించి తెలియాలంటే ఆ కుటుంబాల నుంచి వచ్చిన స్త్రీల ఆత్మకథలు రావాలి… సాహిత్యాన్ని గురించి… సమాజాన్ని గురించి సమకాలీన సమస్యలను గురించి కృష్ణాబాయి గారి దృక్పథానికి అద్దంపట్టే ఈ పుస్తకం తప్పకుండా చదవవలసిన వాటిలో ఒకటి అని నిస్సంశయంగా చెప్పవచ్చు.

సాహిత్య సమాలోచన

రచన : కృష్ణాబాయి

వెల : రూ.300/-

సోల్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ : నవోదయ బుక్‌ హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌.

 

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో