కవన భూమిక

నేను వెతుకుతున్నాను

– జడపల్లె మాధవాస్సుధ

నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను

చదువుకున్న వ్యక్తులకోసం కాదు…

ఎదుగుదలకు ఆధారం ”సంస్కారం” మనుషుల్లో మచ్చుకైనా కన్పిస్తుందేమోనని.

నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను

అందమైన అమ్మాయికోసం కాదు…

ఆడ కూతుళ్ళను గౌరవించే ”నీతిమంతులు” ఎక్కడైనా ఉంటారేమోనని.

నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను

డబ్బులొచ్చే దారులకోసం కాదు…

సమాజానికి చీడ ”అవినీతి” లేనిచోటు ఉంటుందేమోనని.

నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను

ఏ గ్రేడు సాధించే విశ్వవిద్యాలయాలకోసం కాదు…

”నైతిక విలువలు” బోధించే కళాశాలలు ఎక్కడైనా ఉన్నాయేమోనని.

నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను

సత్మల పరిమళాల్నిపంచే మనుషులకోసం కాదు…

”కుట్రలు కుతంత్రాలు” లేని వ్యక్తులు తటస్థపడతారేమోనని.

నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను

ఆడది అర్థరాత్రి తిరుగుతుందేమో… నిజమైన స్వాతంత్య్రంకోసం కాదు…

నిర్భయ, అభయ” వంటి నిర్భాగ్యులు లేని సమాజం ఎక్కడైనా కన్పిస్తుందేమోనని.

నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను

స్త్రీ దేవత… ని పూజించే మగాళ్ళకోసం కాదు…

మగువ మర్యాద కాపాడే మగాళ్ళ ముసుగులో ఉన్న ”మృగాళ్ళు” లేని చోటు ఎక్కడైనా ఉందేమోనని.

నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను

కాలుష్య రహిత సమాజం కోసం కాదు…

పర్యావరణ సృహతో ”పచ్చని మొక్కలను” పెంచే ప్రకృతి ప్రేమికుడు ఎక్కడోచోట ఉండకపోతాడాని.

నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను

మదర్‌ థెరిస్సా మహోన్నత మానవత్వమున్న వ్యక్తిత్వం కోసం కాదు…

జన్మనిచ్చిన అమ్మ నాన్నకు ”పిడికెడు మెతుకులు” పెట్టే బిడ్డలు ఎక్కడైనా ఉంటారేమోనని.

 

గాయాలనది – ఉదయమిత్ర

సునీతా!

నువ్వు నాలుగున్నర అడుగులే ఉండొచ్చు…

కానీ… నువ్వొక హిమాలయ శిఖరానివి…

నీది బాల్యంలేని బాల్యమే గావొచ్చు…

కానీ… నువ్వెందరికో బాల్యాన్నిచ్చి

భయంకర నిర్లక్ష్యపు బావుల్నుండి చేదుకున్నావు

నీ జీవితమొక గాయాలనదే గావొచ్చు…

కానీ… ఎన్ని ప్రాణదీపాలకో

గాయాల చేతులడ్డం పెట్టి

ఆత్మ విశ్వాసాల్ని ”ప్రజ్వల”న జేశావు

 

నీవు పుట్టుకతోనే

వికలాంగురాలినన్నావు…

కానీ… ఈ సమాజమేమో

నువ్వు పుట్టకముందే వికలాంగురాలు…

కాళ్లకింద నేల కరిగిపోతూ ఉన్నా

నీవు రేపటి కలలు గంటూ ఉంటే భద్రతా జీవితాల మీద

అభద్రతా దుప్పట్లు గప్పుకొని

వీళ్లు నిత్యమూ పీడకలలు గంటూ ఉంటారు…

నీ ప్రపంచమే వేరయిపోయిందన్నావు…

మంచిదే అయ్యింది…

అది… మూసానగర్‌ మురికివాడలకు దారి దీసింది

మెహబూబ్‌కా మెహందీకి రక్షణ నిచ్చింది

వేశ్యవాటికల

దుర్భర చీకటి చరిత్రల్ని

లోకాలకు తట్టి లేపింది

పెట్టుబడికి అమ్ముడుపోయిన రాజ్యానికి

పిల్లల్ని అమ్మడం నేరంగాలేదు గాని…

నువ్వు అత్యాచారాల్ని బలంగా మల్చుకొని

దాడుల్ని అవార్డులుగ స్వీకరించడం

నేరమయ ప్రపంచానికొక నేరమయింది

ఏటికెదురీదిన నీవైనం

వర్తమానం మీద దివిటీ అయింది

 

నువ్వు పడి లేచిన కెరటానివి

నువ్వు ఎద మీటిన అగ్నివీణవు

నువ్వొక ప్రశ్నవు, నిష్ఠురానివి

నువ్వొక పాఠానివి, చరిత్రవి

నువ్వొక యుద్ధానివి, పరిష్కారానివి

చావు సైతం వెంటాడుతున్నా

దాని ముఖం మీదే నవ్వే ధీశాలివి

బతుకులో పిరికి పడ్డప్పుడల్లా

తప్పక స్మరించదగిన గొప్ప జ్ఞాపకానివి

నువ్వు నడిచినంత మేరా

ఒక దీపాల జాతర

సునీతా! సాహసీ!

సహస్రబాహువుల నవకాళీ!

జైల్లో ”ములాఖత్‌” సమయాల్లో

ఒక్కరైనా పిలుస్తారేమోనని ఆశపడ్డావు గదూ…

చెవులు రిక్కించుకొని

గాల్లో మాటకోసం ఊపిరి బిగబట్టావు గదూ…

ఇప్పుడు చూడు…

ప్రపంచమంతా… చేతులు చాచి… నీ ముందు…

(వ్యభిచార వ్యవస్థమీద యుద్ధం ప్రకటించిన సునీతా కృష్ణన్‌కు)

 

అవును ఈ బాధ్యత మనదే

– రేణుక అయోల

ఆకలి వేళ్ళు పాతుకున్నచోట

మొలకలెత్తే మొక్కలమీద రంగులపూలు

కాగితం వాసనతో రెపరెపలాడుతాయి

గాథ చెప్పదు ఎప్పుడు చెదరని రంగు ఆకర్షిస్తుంది

అక్కడే ఆకలి వేటకొడవలితో మొక్కలమీద

పూల వాకిళ్ళకోసం యుద్ధాలు చేస్తాయి

ప్రేమఅద్దాలు అమ్ముడవుతాయి

మోసాల జాతరలు అంగళ్ళు వేసుకుంటాయి

దేహాలమీద రంగుల హోలి

తడిసిన దేహం నలిగిన హృదయం

కటిక చీకటిలా పడివున్న రాత్రిలో కరిగిపోతుంది

ఓ చిన్న కీటకం శరీరాన్ని తొలుచుకుంటూ విశ్రాంతి పొందుతుంది

ఎందరో ఆకలికి తట్టుకోలేక పూలమీద చేతులుంచి

నిర్దయగా పూలబుట్టలో పూలని పెకిలించి

నెత్తురు ముద్దలని చేసి అమ్మేస్తున్న ప్రతీసారి

కీటకం నవ్వుకుంటుంది

అమ్మ గర్భంలో కీటకం

చిన్నారి గుండెలో కీటకం

ప్రపంచంలో కీటకం

సిగ్గుపడేలా దొంగలా

కీటకం దొలిచేసిన పూలు

ద్రోహులుగా ఇనుప పంజరంలో ఖైదీలు

ఎందుకిలా

తప్పు ఆకలిదా?

ఆకలి చెట్టుని అల్లుకున్న పూలతీగలదా?

ప్రశ్నలు కూడా రహస్యంగానే తిరుగుతున్నాయి

పోరాటం అంతం కావాలి

కీటకం మీద యుద్ధం మొదలైంది

జయించలేని ఆకలి అన్నంలో

పురుగులు లేకుండా చూడాలి

పంజరంలో మగ్గుతున్న వేలకళ్ళ తడిని

తుడిచే ఆయుధం వుంది

అందించే బాధ్యత మనదే

అవును ఈ బాధ్యత మనదే….

(ఎయిడ్స్‌ వ్యాధితో, సమాజంతో, నిత్యం పోరాటం చేస్తున్న మహిళలకోసం ఓ చిన్న అక్షరమాల)

 

 

నో ఛేంజ్‌ – సిహెచ్‌. మధు

ఇలా జరుగుతూనే వుంటుంది

ఏ కన్నీళ్లు – ఏ దారుణాన్ని ఆపుతాయి

ఏ చట్టాలు – లైంగిక దాడులను నిలుపుతాయి

ఏ శిక్షలు – రేప్‌లు మానభంగాలు మహిళల హత్యలకు

చరమగీతం పాడుతాయి

అంతా వట్టిదే!

ఇది పురుషాధిక్య సమాజం

ఇది పురుషాంకార సమాజం

ఇది మగమహారాజుల దౌర్జన్య సమాజం

తరతరాల మగవాడి దౌష్ట్యం

ప్రపంచీకరణ తర్వాత

పట్టపగలు దౌర్జన్యంగా మారింది

అడుగడుగున పురుషాధిక్యత కనిపిస్తున్నపుడు

అహంకారం ఎలా తగ్గుతుంది!

వరకట్నం ఆధిక్యతకు ఓ చిహ్నం

సినిమాలు, టీవీలు, సీరియల్స్‌

సంస్కృతి, సాహిత్యం

అన్నీ మగవాడి ఆధిక్యతను నిలబెడుతున్నపుడు

దౌర్జన్యాలు ఇంతే!

పర్లాంగ్‌కొక వైన్‌ షాప్‌, గల్లీకొక కల్లు అంగడి

త్రాగటం మగవాడి పౌరుషం

చిత్రహింసలు మగవాడి ప్రతాపం

సర్కారు త్రాగిస్తుంది

మగవాడ్ని విశృంఖలంగా మారుస్తుంది

ఎలా మారుతుంది!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో