స్త్రీ సాధికారత, స్త్రీ వివక్ష – ఐక్యరాజ్యసమితి పాత్ర

స్వర్ణలత, రీసెర్చి స్కాలరు

స్త్రీ సాధికారత ఎప్పుడు చర్చనీయంశమే. స్త్రీ వివక్ష ఎప్పుడు అనుభవమే. ఎన్నో చర్చలు, మరెంతో హంగామా. చెప్పింది చాలా. చేసింది తక్కువ.

ఎంత చేసినా జీవితకాలాలు తరుగుతున్నాయే కానీ స్త్రీ సాధికారత దిశగా వేసిన అడుగులు ఇంకా గమ్యం చేరనేలేదు. చట్టసభల్లో రాజ్యాధికారంలో ఉన్నత పదవుల్లో, విధాన నిర్ణయలలో స్త్రీ పాత్రను పరిమితంగానే ఉంచుతోంది సమాజం.

ఈ సమస్య కేవలం ఒక్క మనదేశ మహిళలదే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరిది కూడా.
ఈ సందర్భంగా ప్రపంచ దేశాల మహిళలు ముఖ్యంగా వెనుకబడిన వర్ధమాన దేశాలలోని స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలకు మూలకారణమైన లింగ వివక్షను నిర్మలించి, మహిళా సాధికారత సాధించడానికి తీవ్రకృషి జరుపుతున్న ఐక్యరాజ్యసమితి గురించి ఈ పేపరులో చర్చించడం జరిగింది.
ఐక్యరాజ్యసమితి మిలీనియం డెవలప్‌మెంట్‌ లక్ష్యాలు మరియు కన్వెన్షన్‌ ఆన్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఫామ్స్‌ ఆఫ్‌ డిస్క్రిమినేషన్‌ అగైనస్ట్‌విమెన్‌ వంటి ప్రోగ్రాములలోని ఉన్నత లక్ష్యాలను సాధించటం కోసం ఈ క్రింద పేర్కొనబడిన విభాగాల ద్వారా చెప్పుకోదగ్గ కృషి సలుపుతోంది. అవి :
– UNDP యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌
– UNDAP యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌
– UNIFPM యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఫర్‌ విమెన్‌
– UNIFPM యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ ఎమర్జెన్సీ ఫండ్‌
అంతే కాకుండా 17 యునైటెడ్‌ నేషన్స్‌ ఏజన్సీలన్నీ కలసి యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్‌ ఏజన్సీ వర్కింగు గ్రూపు ఆన్‌ జెండర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అను గ్రూపుగా ఏర్పడినాయి. దీనిలో 24 మంది ఫోకల్‌ సిబ్బందితో ఐదు సబ్‌వర్కింగు గ్రూపులు వున్నాయి. UNIFPM మరియు UNIFPM సంయుక్త ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతోంది. మనదేశంలో ఆ అయిదు వర్కింగు గ్రూపులు ఈ క్రింది విధంగా వున్నాయి.
– సెక్స్‌ డిసెగ్రిగేటడ్‌ డేటా
– వయెలెన్స్‌ ఎగైనస్ట్‌ విమెన్‌ అండ్‌ గర్ల్‌ చిల్డ్రన్‌
– విమెన్స్‌ పార్టిసిపేషన్‌ ఇన్‌ లోకల్‌ గవర్నన్స్‌
– ఎన్‌జెండరింగు ది 10th ఫైవ్‌ ఇయర్‌ ప్లాన్‌
– జెండర్‌ ఆడిటింగు
ఈ సందర్భంగా జెండర్‌ సమానత్వం గురించి ఐక్యరాజ్యసమితి UNDP యొక్క ఉద్దేశ్యం ఈ విధంగా వుంది. ”జెండర్‌ సవనత్వాన్ని సాధించడమే UNDP యొక్క లక్ష్యం. ఎందుకంటే స్త్రీపురుష సమానత్వం అనేది న్యాయబద్ధమైనది, సరియైనది. అది దానంతటికదే చాలా గొప్ప విలువైన లక్ష్యం. సమస్త మానవాభివృద్ధికి, మానవ హక్కుల సాధనకు జెండర్‌ సమానత్వం సాధించటం అనేది అత్యంత ముఖ్యమైన లక్ష్యం.”
UNDP ఈ లక్ష్యసాధనకు రెండు పరస్పర ఆధారిత విధానాల ద్వారా ప్రయత్నం చేస్తోంది. అవి 1) జెండర్‌ మెయిన్‌స్ట్రీమింగు మరియు 2) స్త్రీ సాధికారత.
జెండర్‌ మెయిన్‌ స్ట్రీమింగు : స్త్రీపురుష అసమానతలు తొలగించి ప్రతి ఒక్కరూ అభివృద్ధిని సాధించటంలో సమాన అవకాశాలు కల్గి వుండటంగా చెప్పుకోవచ్చు. స్త్రీపురుష సమానత్వం సిద్ధించాలంటే స్త్రీల పట్ల వివక్షను రూపుమాపి వారి వెనుకబాటుతనాన్ని నిర్మలించి వారిని అన్ని రంగాలలో ప్రోత్సహించటం.
స్త్రీల సాధికారత : ఈ విధానంలో స్త్రీలు తమ కాళ్ల మీద తాము నిలబడటమే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అధికారాన్ని పురుషులతో సమానంగా కల్గివుండటమే కాదు, తమ యొక్క హక్కులను, అధికారాలను పొందగలిగేలా చేయటం.
అయితే ఈ జెండర్‌ మెయిన్‌ స్ట్రీమింగు ఆరు రకాల ప్రాక్టీసు ఏరియల ద్వారా సాధించడానికి UNDP ప్రయత్నం చేస్తున్నది. అవి :
డెమోక్రాటిక్‌ గవర్నెన్స్‌ (ప్రజాస్వామ్యబద్ధపాలన) : పరిపాలనలో ప్రజలందరి భాగస్వామ్యం వుంటేనే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనబడుతుంది. స్త్రీపురుషులు సమానంగా పాలుపంచుకొని ఎవరి హక్కులు, అధికారాలు వారు పొందగల్గుత, సరియైన నేతలను ఎన్నుకొనగల్గుత ప్రభుత్వాన్ని, నాయ కులను ప్రజలకు జవాబుదారులుగా చేయగల్గాలి అంటే, స్త్రీలు కూడా తమ హక్కులను అధికారాలను ఎరిగి ప్రజాస్వామ్యంలో పాలుపంచుకునేలా చేయలి. అట్లా జరగాలీ అంటే స్త్రీ పురుష వివక్ష నశించి తీరాలి. కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ వివక్ష ఇంకా కొనసాగుతనే వున్నది. అయితేకొన్ని ఆశావహ సూచనలు కనబడుతున్నాయి. సెన్సస్‌ 2001 లెక్కల ప్రకారం, ఈ మధ్యకాలంలో స్త్రీలలో రాజకీయజ్ఞానం పెరుగుతున్నట్లు గాన, అన్నిరంగాలలో ముందుకు వచ్చేందుకు చొరవచూపడమే కాకుండా, వివిధ జాతీయ, అంతర్జాతీయ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వీరిని తగువిధంగా ప్రోత్సహిస్తున్నాయి. ఉదాహరణకు స్వయంసహాయక బృందాలు. ఇవి ముఖ్యంగా మైక్రోఫైనాన్స్‌ని ప్రోత్సహించి అట్టడుగు ప్రజలు ముఖ్యంగా పేద మహిళల ఆర్థిక స్థితిగతులను పెంపొందించడానికి ఉద్దేశించిన పథకమే అయినప్పటికీ సాధికారత దిశగా స్వయం సహాయక బృందాలు చాలా ప్రగతిని సాధించాయి. వివిధ స్థానిక సంస్థల ఎన్నికలలో, పోటీ చేసిన మహిళల్లో దాదాపుగా 70% మహిళలు గెలుపొందారు. దీనర్ధం మహిళల్లో తమ పట్ల ఆత్మవిశ్వాసం, ముందుకు పోవాలన్న జిజ్ఞాస, అధికారాన్ని అందిపుచ్చుకోవడంలో చొరవ, వంటివి ప్రస్ఫుటమౌతున్నవి. ఇది ఒక్క రోజులో వచ్చిన మార్పు కాదు. స్త్రీలలో విద్యను ప్రోత్సహించటం, వారికి కావాల్సిన వనరులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి UNDP విశేషంగా కృషి చేస్తోంది.
దారిద్య్ర నిర్మలన: దారిద్య్రము- జెండర్‌ వివక్ష రెండ చాలా దగ్గరి అవినాభావ సంబంధాన్ని కలిగి వున్నాయి. ఎందుకంటే కుటుంబంలోని దారిద్య్రపు తీవ్రప్రభావాన్ని ఎదుర్కొనేది ఎక్కువగా స్త్రీలు, బాలికలు. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో ఒక బిలియను అనగా 10 కోట్ల మంది చదవడం రానివారు ఉంటే వారిలో మూడింట రెండవ వంతుమంది స్త్రీలే. దీనికి కారణం కోసం పెద్దగా అన్వేషించనవసరంలేదు. కుటుంబంలో విద్యపై ఖర్చును తగ్గించాలీ అంటే ఆ కుటుంబంలోని బాలికలు తమ చదువును త్యాగం చేయక తప్పదు. అంతేకాదు కుటుంబ ఆర్థికస్థితికై చేదోడు వాదోడుగా పనులు చేయల్సిందే. తమ్ముడ్ని ఎత్తు కోవటం కోసం, అన్నను బడికి పంపడం కోసం, ఒక అక్క, ఒక చెల్లి తన చదువును త్యాగం చేస్తుంది. కుటుంబంలో తండ్రి, అన్నదమ్ముల, భర్త ఆకలి తీర్చడం కోసం ఒక తల్లి, ఒక అక్క, ఒక చెల్లి, ఒక భార్య తన ఆకలిని చంపుకుంటుంది. ఈ విధంగా సాగిపోయే జీవితాలెన్నో. వివిధ దారిద్య్ర నిర్మలన పథకాల ద్వారా దారిద్య్రాన్ని అధిగమించడానికి కావలసిన సహకారాన్ని, ఆర్థిక సహాయన్ని అందించడానికి ఆయ దేశాలతోను, మరియు స్వచ్ఛంద సంస్థలతోను కలసి పనిచేస్తూ, లింగ వివక్షను అధిగమించడానికి తద్వారా మహిళా సాధికారతను సాధించడానికి యునైటెడ్‌ నేషన్స్‌ ఇతోధికంగా కృషిచేస్తోంది.
క్రైసిస్‌ ప్రివెన్షన్‌ అండ్‌ రికవరి (సంక్షోభ నివారణ/పునరుద్ధరణ యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు వంటి సంక్షోభ సమయల్లో/తరువాత శారీరకంగా, మానసికంగా, సామాజికంగా అష్టకష్టాలు పడేది స్త్రీలే. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో దాదాపుగా 3,50,00,000 (3 కోట్ల 50 లక్షల) మంది కాందిశీకులు వుంటే వారిలో 80% శాతం మంది స్త్రీలు మరియు పిల్లలే. ఆ సమయంలో అనుభవించే వత్తిడితో పాటు, వారు విపత్తునుండి దూరంగా పారిపోతున్నపుడు, కాందిశీక శిబిరాల్లోన అత్యాచారాలకు, హింసకు గురవుతున్నారు. అయితే, చితికిన తమ కుటుంబాలను నిలబెట్టుకోవడంలోన, ఒంటరిగా ఆ కుటుంబాలను సమర్ధ వంతంగా నిర్వహించడంలోన, తద్వారా శాంతిసవజ స్థాపనలోన ఆ స్త్రీలు అద్వితీయ ప్రతిభను కనబరుస్తున్నారు. అంతేకాకుండా సంక్షోభ సమయలలో వేళ్లూనికొనియున్న సంప్రదాయలు, అధికార పగ్గాలు సడలి సమసమాజ స్థాపనకు నూతన వర్గాలు ఏర్పడతాయి. అలాంటి సందర్భంలో కావలసింది దిశానిర్దేశమే. అందుకే అట్లాంటి పరిస్థితుల్లో వున్న స్త్రీలకు, పిల్లలకు సరియైన ఆదరణ, భద్రత, విద్యావికాసాన్ని, ఆర్థిక స్వావ లంబనని కలుగచేయడం ద్వారా జెండర్‌ వివక్షను రూపుమాపి జెండర్‌ మెయిన్‌ స్ట్రీమింగు చేయడం కోసం సువిధ ప్రయత్నాలు చేస్తోంది.
ఇంధనం మరియు పర్యావరణం : పర్యావరణ కాలుష్యం, ఇంధన అభద్రత పేద మహిళలు, పిల్లలపై అధికమైన ప్రభావం చూపుతుందనడంలో అతిశయెక్తి లేదు. పేదరికం వలన ఇంధన భద్రత వుండదు. దానికై వారు ప్రకృతిపై ఆధారపడక తప్పదు. నేటికీ పేదవారి ఇండ్లలో కట్టెలవంట తప్పడం లేదు. నానాటికీ తరిగిపోతున్న వృక్షసంపద పెరుగుతున్న భూ, వాయు, నీటికాలుష్యాలు వంటివాటి వల్ల స్త్రీలు మరియు పిల్లలు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఐక్యరాజ్యసమితి వివిధ కార్యక్రమాల ద్వారా దీనిని అరికట్టేందుకు తగినచర్యలు తీసుకుంటోంది.
ఇన్ఫర్మేషన్‌ మరియు కమ్యూనికేషన్‌ టెక్నాలజీ : ICI ప్రపంచ రూపురేఖలను, స్థితిగతులను మార్చివేసింది. దాంతోపాటే జెండర్‌ సమానత్వాన్ని, స్త్రీ సాధికారతను సాధించడానికి కొత్త అవకాశాలను, ఛాలెంజీలను మన ముందుకు తెచ్చింది. అవకాశాలను అందిపుచ్చుకొని నేడు సమాచార, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ రంగాలలో నేడు స్త్రీలు అన్ని విధాలా ముందంజ వేస్తున్నారు. కానీ ఇది దిగువ మధ్యతరగతి మరియు అట్టడుగు పేద మహిళల దాకా చేరడానికి ఇంకా కొంతకాలం పట్టవచ్చు. అయినప్పటికీ స్త్రీలు సాధించిన ఘనత, దానిని అంగీకరించడానికి సంసిద్ధమవుతున్న సామాజిక పరిస్థితులు స్త్రీ సాధికారత, జెండర్‌ వివక్షా నిర్మలన పట్ల ఆశావహ దృక్పథాన్ని కల్పిస్తున్నాయి. UN ప్రోగ్రా ములు ఈ దిశగా చాలా కృషి చేస్తున్నాయి.
HIV / AIDS : ఇపుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రధాన సమస్యలలో HIV / AIDS సమస్య ఒకటి. పురుషులతో పోల్చినపుడు యువతులతో ముఖ్యంగా టీనేజీ బాలికలలో ఎయిడ్స్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనికి ప్రధాన కారణం అసురక్షితమైన సెక్సు కార్యకలాపాల నుండి తమను తాము రక్షించుకొనలేకపోవడం దీనికి ముఖ్య కారణం – జెండర్‌ వివక్ష. స్త్రీకి ఆ విషయలలో స్వాతంత్య్రం లేకపోవడం. అంతేకాకుండా స్త్రీకి తన సంతానాన్ని పొందే విషయంలో గానీ, గర్భనిరోధక సాధనములు వాడే విషయంలో గానీ ఇప్పటికీ స్వాతంత్య్రం లేదు.
దారుణమైన వాస్తవమేమిటంటే ఒక అంచనాప్రకారం ఐదు సంవత్సరాలలోపు శిశుమరణాల రేటులో స్త్రీ పురుష తేడాలులేవు. అయితే అన్ని విషయలు, పరిస్థితులు సమానంగా వున్నపుడు బాలుర మరణాలు బాలికల కన్నా 50 శాతం ఎక్కువ అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఆశ్చర్యకరంగా, మరంతకంటే దారుణంగా జరిగేది ఏంటంటే పిల్లలు పెరుగుతున్న కొద్దీ స్త్రీశిశు మరణాలరేటు పెరుగుత బాలుర మరణాల రేటు తగ్గుత వస్తోంది. ముఖ్యంగా పేదకుటుంబాలలో ఇది ఎక్కువగా కనబడుతోంది. దీనికి ప్రధానంగా జైవిక కారణాల కన్నా బాహ్యకారణాలే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దీనికి జెండర్‌ వివక్షను తప్ప వేరే వారికి బాధ్యులను చేయలేం.
అయితే అన్ని తాళాలకు ఒకటే చెవి అన్నట్లుగా దారిద్య్ర నిర్మూలనం ప్రధాన ఉద్దేశ్యంగా సమాజంలో పాతుకుపోయిన మూఢాచారాలను రూపుమాపి, మానవ హక్కుల పరిరక్షణ, సుపరిపాలన, సామాజిక సాంస్కృతిక హక్కుల సాధన ద్వారా స్త్రీ సాధికారత, జెండర్‌ వివక్ష నిర్మూలన సాధించడానికి ఐక్యరాజ్యసమితి గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇది ప్రపంచ మహిళలందరికీ ముదావహం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.