హృదయాంజలి –

 వి.ప్రతిమ

దేశభక్తి అంటే కార్గిల్‌కి పోయి యుద్ధం చేయడం మాత్రమే కాదు.. తన ధర్మాన్ని, తన బాధ్యతను, తన కర్తవ్యాన్నీ నిర్వర్తించడం.

పుష్పాంజలి తీవ్రమైన అనారోగ్యంలో వుండి కూడ బుచ్చిబాబు మొత్తం కథలు చదివి లోతయిన విమర్శ రాసింది. మంచం చుట్టూ పుస్తకాలు పేర్చుకుని వాటిలోని జ్ఞానాన్ని తన లోలోపలికి నింపుకోవడానికి ప్రయత్నించేది… కొద్దిసేపట్లో ఉరికొయ్యకు వేళ్ళాడబోతూ కూడ తాను చదువుతుండిన పుస్తకాన్ని పూర్తి చేయాలని ఆదుర్దా పడిన భగత్‌సింగ్‌ గుర్తొస్తాడు పుష్పాంజలి తపన చూస్తే.

మరణమాసన్నమవుతున్నదని ముందే తెలిసిన జ్ఞానిలా చెయ్యాల్సిన పనులన్నింటినీ (సాహితీపరంగా) చక్కగా నిర్వర్తించుకుంటూ వచ్చింది… చివరిక్షణం దాకా ఎత్తిన కలం దించకుండా రచనా వ్యాసంగాన్ని కొనసాగించడంకంటే రచయిత చేసే సమాజసేవ మరేముంటుంది?

చేప తాను నీళ్ళల్లో బతుకుతూ ఆ నీటిని శుద్ధిచేస్తుంది. అలా పుష్పాంజలి తన చుట్టూవున్న కలుషిత వాతావరణాన్ని హాస్యపు జల్లులు విసిరి, సాహితీ వెలుగులు నింపి పరిశుభ్రం చేయడానికి ప్రయత్నించేది…

సోక్రటీస్‌ ఒక మాటంటాడు ‘పిల్లలకి మీ హృదయాలను అతికించండి’ అని… ఒక బోధకురాలిగా పుష్పాంజలి పాఠ్యాంశాలనే కాకుండా విద్యార్థులకి జీవితపు విలువలను కూడ తెలియచెప్పేది… అంతేకాకుండా పాఠశాలలకు వెళ్ళి సాహిత్యాన్ని పరిచయం చేసి పిల్లలకి అనేక పుస్తకాలందించి ప్రోత్సహించేది… చివరిలో తాను విద్యాలయాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడ విద్యార్థులలో మాట్లాడమని తన సహ రచయితలను అర్థించేది… అలా పుష్పాంజలి ఎప్పుడూ తన హృదయాన్ని పిల్లలకు అతికించుకుని వుండేది…

స్త్రీవాద రచయితగా పుష్పాంజలికి సాహిత్యంలో ఒక ప్రత్యేకస్థానముంది… స్త్రీవాదులు అస్థిత్వ చైతన్యం, గృహహింస, ఇంటిచాకిరి దోపిడి, స్వేచ్ఛా సమానత్వాలు, శరీర ధర్మాలు ఇలా అనేక సూక్ష్మాంశాలను చర్చకు పెట్టారు… అయితే లైంగిక సంబంధాలమీద, లైంగిక అసంతృప్తుల గురించి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు విరివిగా రాయలేదు అని చాలాకాలంగా ఒక ఆలోచన… ఆ అసంతృప్తిని బద్దలు కొడుతూ పుష్పాంజలి ”అమ్యూజింగ్స్‌” కథాసంపుటి తూటాలా దూసుకొచ్చింది తెలుగు సాహిత్యంలోకి…. అయితే దానిమీద జరగవలసినంత చర్చ జరగలేదు. రావల్సినంత పేరు ఆమెకి రాలేదేమొ అన్పిస్తుంది… కథ, కవిత, నవల, వ్యాసం నాటకం అన్ని ప్రక్రియల్లోనూ ఆమె కలం పరవళ్ళు తొక్కడం విశేషం… పుష్పాంజలి సాహితీ ప్రక్రియల గురించి లోతుగా, సవివరంగా మాట్లాడుకోవడానికి మరొక సందర్భాన్ని వెదుకుదాం….

”బ్రతుకు అంటే ప్రతిరోజూ పరుగులెత్తు సంఘర్షణ, బ్రతుకు అంటే ప్రతినిముషం ప్రగతి కొరకు అన్వేషణ, బ్రతుకు అంటే ప్రతినిత్యం పరుల కొరకు పాటుపడడం, బ్రతుకు అంటే ప్రతిక్షణం అనుభవించు ఆత్మతృప్తి”

పుష్పాంజలిని చూస్తోంటే ఎక్కడో చదివిన వాక్యాలు పదే పదే కళ్ళముందు కదిలేవి… అంత సమన్వయంగా జీవించేది ఆమె.

‘భూమిక’ కథల పోటీల్లో రెండుసార్లు ఆమె కథలు బహుమతులు గెల్చుకున్నాయి.. రెండుసార్లూ కూడా ప్రైజ్‌మనీనీ అదేవేదిక మీద భూమికకి అందివ్వడం ఆమె ఉదారతకీ వ్యక్తిత్వానికీ, భూమికపట్ల ఆమెకున్న ప్రేమకీ నిదర్శనం.

మరణానంతర జీవితాన్ని సొంతం చేసుకున్న పుష్పాంజలి రచనలు కొరవడడం స్త్రీవాద సాహిత్యానికి తీరని లోటు… ఆమెకి భూమిక స్త్రీ రచయితలందరి తరపునా ప్రగాఢ హృదయాంజలి ఘటిస్తూ.

 

 

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో