న్యాయసంస్కరణ

”తల్లిదండ్రుల, వృద్ధుల పోషణ మరియు సంక్షేమం” చట్టం
కాంతి

ఏ సమాజంలోనైనా తల్లిదండ్రులను, తాతముత్తాతలను – నిరాదరించడం, అగౌరవపరచడం అన్నది చాలా హృదయవిదారకమైన, సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే ప్రక్రియ.

”నిషా తాంబి” అనే ఆమె, నిరాధారులైన వయెవృద్ధులకు పోషణ మరియు ఆశ్రయం లభించే విధంగా ప్రభుత్వం జోక్యం కల్గించుకునే విధంగా, వచ్చిన ఒక సంస్కరణాత్మకమైన కొత్త ‘విల్లు’ గురించి వ్రాసిన వ్యాఖ్యానాలు.
2001లో చేసిన జనాభా లెక్కల ప్రకారం, 60 యేళ్ళు పైబడినవారు 76 మిలియన్ల మంది ఇండియలో వున్నారని, వారి సంఖ్య 2016 నాటికి 112 మిలియన్లకి పెరగవచ్చని భావిస్తున్నారు. దాన్నిబట్టి మొత్తం జనాభాలో ‘వయెవృద్ధుల’ సంఖ్య 10 శాతం కంటే ఎక్కువే అని చెప్పవచ్చును. ఈ దృక్కోణంలో చూస్తే, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ”తల్లిదండ్రుల మరియు వృద్ధుల పోషణ మరియు సంక్షేమం” బిల్లు సరియైన సమయనికి వచ్చినదిగానే భావించాలి. కేంద్రమంత్రివర్గ ఆమోదముద్ర పడిన ఈ బిల్లు 2006 బడ్జెట్‌ సెషన్‌లో ప్రవేశపెట్టే మొదటి జాబితాలో వుంది.
ఈ బిల్లులో వుండే అంశాలు :
1. ఈ బిల్లు, ముఖ్యంగా వయస్సు మళ్ళిన వ్యక్తులపై గల జాతీయవిధానం, 1999 ఆధారంగా రూపొందింది, వయె వృద్ధులు (60 యేళ్ళు పైబడినవారు అని నిర్వచనం యివ్వబడింది కాని అనాథ వితంతువుల విషయంలో వయస్సు యింకా తక్కువ చేయబడింది) తమని తాము పోషించుకునే విధంగాను, వారి కనీసావసరాలను అనగా తిండి, బట్ట, గడు సమకూర్చే విధంగాను ఉద్దేశించబడిన అంశాలు కలిగివుంది. అయినా, ఈ బిల్లులోని సెక్షన్లు 4, 10ల్లోని అంశాలమీద, వేటిక్రిందైతే పిల్లలు (ఈ శ్రేణిలో కడుపున కన్న పిల్లలే కాక దత్తు తీసుకున్న పిల్లలు, మనవలు కూడ వున్నారు) ఎవరైతే వయస్సు మీరిన తల్లిదండ్రుల పోషణ వహించడం ఎగ్గొట్టినవారు ఈ చట్టం క్రింద శిక్షార్హులనియు, వారికి 5000 ర||లు జరిమానా లేక 3 నెలల వరకు జైలుశిక్ష, లేక రెండు శిక్షలు కూడ కలిపి విధించే వీలు కల్పించిన అంశాల మీద చాలా చర్చ జరుగుతోంది.
2. ఇంకొక అంశం ఏమిటంటే ఆర్థిక సహాయం అడిగే పెద్దవారికిచ్చే ‘ఆర్థిక సహాయం’ వారి జీవన వ్యయసూచికకు సరిపడేలా చెయ్యలని వుంది. (హిమాచల్‌ ప్రదేశ్‌ చట్టం ప్రకారం వయస్సు మళ్ళిన వృద్ధులకు పోషణ కొరకై యిచ్చు డబ్బు నెలకి 5000 ర||లు వరకు యివ్వాలని వుంది. హిందూ దత్తత మరియు పోషణ చట్టం, 20(1)వ అధికరణం ప్రకారం, ఆధారపడ్డ వారికిచ్చే భత్యం, తల్లిదండ్రులతో సహా, వారి సామాజిక, ఆర్థిక అంతస్తుకు తగ్గట్లు వారు బ్రతికేందుకు అవసరమైనంత యివ్వాలంది. భారతీయ శిక్షాస్మృతిలోని జీవనభత్యానికి సంబంధించిన అంశాలు మరియు హిందూ దత్తత మరియు పోషణ చట్టం 20(1) అధికరణంలో కూడ అనాథల్లా కాకుండా చూడడమేకాని తగిన రీతిలో బ్రతికేలా చెయ్యడం కాదు. కాని ప్రస్తుత బిల్లు ముఖ్యలక్ష్యం మటుకు అది ఒనగడేలా చెయ్యడమే.
3. సెక్షన్‌ 125, భారతీయ శిక్షాస్మృతి క్రింద భరణం నిమిత్తం ఆధారపడ్డ తల్లిదండ్రులు, దరఖాస్తు చేసే పద్ధతి చాల కాలహరణం చేసే పద్ధతి. దీని నివారణకు ప్రస్తుత బిల్లులో పెట్టిన అంశాలు ప్రత్యేక న్యాయస్థానాల (ట్రిబ్యునల్స్‌) ద్వారా, వాటికి ఆధిపత్యం వహించే ‘సబ్‌-డివిజనల్‌ మేజిస్ట్రేట్‌’, ఎవరికైతే శీఘ్రగతిని పనిచేసే కోర్టులలా పనిచేయించి, సంక్షిప్త ఆదేశాలనిచ్చే అధికారం కలిగివుండి, త్వరగా భరణం అందేలా మరియు నేరం చేసిన వారికి శిక్షపడేలా చేసే అధికారం యిచ్చింది. ఇంకా హిమాచల్‌ప్రదేశ్‌లో వ్యాజ్యాలలో చిక్కుకున్న పిల్లలు వారి ప్రతివాదం (డిఫెన్సు) కొరకు ‘ట్రిబ్యునల్స్‌’లో న్యాయవాదులను పెట్టుకునే వీలులేదు. ప్రస్తుత బిల్లు ఈ చట్టం నమూనానే తీసుకుంది. ఈ అంశం ఇప్పుడు దేశం మొత్తం మీద అన్వయిస్తుందని మనం భావించవచ్చును.
4. ఈ చట్టంలో న్యాయసహాయం అంశం కూడ పొందుపరచబడింది. దీని ప్రకారం ప్రభుత్వం నియమించిన సంక్షేమ అధికారులు కేసుల కోసం వాదించడం మరియు వయస్సు మళ్ళిన వ్యక్తుల తరఫున ఫిర్యాదులను నమోదు చెయ్యడం చేస్తారు. అదేగాక కోర్టులు కూడ ”సమోటో” అనగా స్వయంగా పెద్దవారి యెడల జరిగిన నేరాలను గుర్తించేలా అధికారం కలిగి యున్నాయి. ఈ సంక్షేమ అధికారులు కూడ, పెద్దవారిని అమర్యాదగా, అవమానకరంగా చస్తున్నారన్న అనుమానం మీద కూడ, ఆ తప్పు చేసేవారి మీద చర్య తీసుకునే అధికారం వుంది.
5. సామాజిక న్యాయం మరియు సాధికారికత మంత్రిత్వశాఖ, ఈ బిల్లును సామాజిక యంత్రవిద్యలో ఒక విప్లవాత్మకమైన బిల్లుని, ఏదైతే ఒక నైతిక ధర్మపరమైన కర్తవ్యాన్ని ఒక న్యాయపరమైన దానిగా మార్చి, అనాథలుగా మారిన పెద్దవారి (వృద్ధుల) బాధలను తీర్చడంలో కొన్ని రకాలైన పద్ధతులను సూచించిందని అభివర్ణించింది. పోషణ గురించి యిచ్చిన హామీతోబాటు, వయస్సు మీరిన తల్లిదండ్రులు, పెద్దలు తాము వీలునామా ప్రకారం ప్రత్యేకించి తమ ఆస్తిని యిచ్చినవారు తమని అమర్యాదగా, అవమానకరంగా చూసిన యెడల, ఎప్పు డైనా ఆ వీలునామా వెనక్కి తీసుకునే లేక వాపసు తీసుకునే వీలు కూడ ఈ బిల్లు కల్పించింది. ఇంకొక మంచి విషయం ఈ బిల్లులో వున్నదేమిటంటే ఒక వ్యక్తి తన పిల్లలకి ఆస్తి అంతా బదిలీ చేసేశాక, వారు, అతని శారీరక అవసరాలను తీర్చడానికి తిరస్కరించినా, లేక ఎగ్గొట్టినా, ఆ ఆస్తి బదిలీ వెసంతో, బలవంతాన చేయించ బడినట్లుగా భావించబడి, చెల్లదని ప్రకటించ బడాలని నిర్ద్వందంగా స్పష్టీకరించింది.
ఈ సందర్భంలో, ఈ బిల్లులో గల ఒక ”లోటు” గురించి చెప్పాలంటే పెద్దవారై, అనాదరణకు గురైన తల్లిదండ్రులకు యిద్దరు లేక యింకా ఎక్కువమంది పిల్లలు వున్న యెడల ఏం జరుగుతుంది అన్న విషయం వివరణ సరిగ్గా యివ్వలేదు. అటువంటి కేసులలో సాధ్యమైన త్రోవ ఏదంటే ఒకరినుంచి కాని, లేక ఇంకా ఎక్కువమందినుంచికాని ”క్లెయిమ్‌” చేసే హక్కు ఆ తల్లిదండ్రులకే వదిలేయలి. ఈ సందర్భంలో కుమారి వెర్సస్‌ యశోధాదేవ్‌ (1978) 600, అన్న కేసులో కేరళ హైకోర్టు యిచ్చిన తీర్పు ఒక మంచి సూచనగా చెప్పుకోవచ్చును. ఇందులో సింగిల్‌ జడ్జి, తల్లిదండ్రులు తమను తాము పోషించుకోలేని స్థితిలో కుమారులే ఆ బాధ్యత వహించాలని, ఆ కుమారులకు తగిన ఆదాయవనరులున్నచో మరియు ఒకరి కంటే ఎక్కువ కుమారులున్నను, ఆ తల్లిదండ్రులు ఒకరికంటే ఎక్కువమంది నుంచి తమ పోషణ నిమిత్తమై దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పిన ”క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌”పై వేసిన ఉమ్మడి సంఘం చేసిన నివేదికపై ఆధారపడి తీర్పు యిచ్చేరు.
ఇంకా ఆసక్తికరమైన విషయమేమి టంటే సుప్రీంకోర్టు ఈజీ. విజయ మనోహర్‌ ఆర్బాటే వెర్సస్‌ కాశీరామ్‌ రాజారామ్‌ సవాయ్‌ మరియు ఇతరులు, 1987, 1100, కేసులో, సిఆర్‌పిసి లో సెక్షను 125లో యిచ్చిన ఆదేశాన్ని స్థిరపరుస్తూయిచ్చిన తీర్పులో పెళ్ళి అయిన కుమార్తెలకు కూడ తల్లిదండ్రులను పోషించే బాధ్యత వుందని పేర్కొంది. ఇందులో గల తర్కమేమిటంటే ఒక కుమార్తె, పెళ్ళి అయిన తర్వాత కూడ, వారి కూతురు కాకుండా పోదు కాబట్టి ఆమెకు సెక్షన్‌ 125 సిఆర్‌పిసి (1) (డి)లో వున్న బాధ్యత అంతమవదని భావపడింది.
6.ప్రభుత్వంనుంచి ఆర్థికసహాయం: ఈ బిల్లు, హివచల్‌ప్రదేశ్‌ తల్లిదండ్రుల మరియు ఆధారపడిన వారి పోషణ చట్టం, 1996ను నమూనాగా తీసుకుని రూపొందించబడినది. దీని ప్రకారం, నిరుపేదలైన, వయస్సు మళ్ళిన వ్యక్తులు, వారసులులేని, ప్రభుత్వం నడిపించే ‘సీనియర్‌ సిటిజన్స్‌ గృహాల’లో లేక ‘వృద్ధాశ్రమాల’లో నివసించనివారికి, దరఖాస్తు చేసుకుంటే, నెలకి 1000 ర||లు వరకు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందుతుంది.
7.’వృద్ధాశ్రమాలు’ :
ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్రప్రభుత్వాలు మరియు యూనియన్‌ టెరిటరీ ప్రభుత్వాలతో సంప్రదించి దేశంలోని ప్రత్యేకమైన స్థలాలలో అన్ని విధాలైన సౌకర్యాలతో వృద్ధాశ్రమాలను తగినన్ని నిర్మించి, నిర్వహించాలని, ఒక బాధ్యతను ఏర్పాటుచేసింది. ఇంకా ఈ బిల్లు, రాష్ట్రప్రభుత్వాలు తామే స్వయంగా కాని లేక ప్రభుత్వేతర సంస్థలతో కలసి కాని, వృద్ధాశ్రమాల స్థాపన, నిర్వహణ బాధ్యతలు వహించాలని సూచించింది. కాని అటువంటి ఒక ప్రభుత్వేతర సంస్థ ఈ బిల్లును విమర్శిస్తూ, ప్రభుత్వాలు అట్టి వృద్ధుల బాధ్యతను వారి పిల్లల మీదకి లేదా ప్రభుత్వేతర సంస్థలకి నెట్టేసి, ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి చూస్తున్నాయని, అందరి వృద్ధులకు సామాజిక రక్షణ అంశాలను పెంపొందించే బాధ్యత ఎక్కువ ప్రభుత్వానికే ఉండాలని అంది.
8.రక్షకభటులు (పోలీసు) :
ఈ బిల్లు యింకా ప్రస్ఫుటంగా చెప్పినదేమిటంటే, ఏ ఆధారము లేనివారికి ప్రత్యేకంగా, మరియు ఇతర పెద్దవయస్సు వారి ఆస్తిపాస్తులకు, ప్రాణాలకు తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం గురించి పోలీసులకు గ్రహింపు కల్గించాలని అంది. ఈ బిల్లు స్థానిక పోలీసుస్టేషన్‌, తన ‘ఇలాకా’లో నివసిస్తున్న ‘సీనియర్‌ సిటిజన్స్‌’ జాబితాను, వారికి పూర్తి భద్రత కల్పించేందుకు, నిర్వహించడం అన్నది వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా చేసింది. పైగా ఆ పోలీసు స్టేషన్‌ అధికారి అయిన ‘ఇనస్పెక్టరు’ను, ఒంటరిగా వున్న ప్రతీ వయసుడిగిన పెద్దవారికి మరియు ఒంటరి వృద్ధ దంపతులకి (అతని ‘ఇలాకా’లో వున్నవారికి) పూర్తిభద్రత ఏ విధంగా న్యాయశాస్త్రం నిర్దేశించిందో ఆ విధంగా కల్పించాలని ఆదేశించింది.
9.ఎక్కువ సదుపాయల ప్రతిపాదన :
ఈ బిల్లు ప్రకారం, రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వయసుడిగిన పెద్దలకు మంచి వైద్య సంరక్షణ సదుపాయలు కల్పించడం కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి, ఉదాహరణకి వారి కోసం విడిగా ‘ఔట్‌ పేషంటు’ విభాగాలు, యింకా దీర్ఘకాలిక, చివరిదశ మరియు క్షీణింపజేయు వ్యాధుల చికిత్స కొరకై సదుపాయల విస్తరణ చేయడం వంటివి చేయల్సి వుంది. ఇవేగాక ఈ బిల్లులో, వారికి, ఉచిత ప్రయణ సదుపాయలు కల్పించాలని కూడా ఉన్న అంశాల్ని జోడించేరు.
10.విమర్శలు :
ప్రభుత్వ నిర్దేశక సత్రాలలోని, ఆర్టికల్‌ 41ని దేని ప్రకారమైతే ప్రభుత్వం, తన శక్త్యానుసారం వృద్ధాప్యంలో నున్నవారి సంరక్షణకై ప్రభుత్వ సహాయం అన్నది ఒక హక్కులా చెయ్యలనే గాక, వారి జీవనసరళిని ఉన్నతంగా చేయలన్న అనేకాంశాలు చొప్పించబడి వుందో, దానిని నిజం చేసే సాధనంగా ఈ బిల్లును పరిగణిస్తున్నప్పటికి, ఎన్నో యితర విషయలలో అనేక విమర్శలనెదుర్కొంది. తమపై ఆధారపడ్డ తల్లిదండ్రులను, తాతలను, అమ్మమ్మ, నాయనమ్మ, ఇతర బంధువులను ఉపేక్షించే పిల్లలు ఈ బిల్లు ప్రకారం శిక్షార్హులవుతున్నప్పటికి, పెద్దవారైన బంధువులను జాగ్రత్తగా చూసే పిల్లలకు పన్ను మినహాయింపు, యితర ప్రయెజనాలు కల్పించడం లాంటి ప్రోత్సాహకాలు యివ్వడం లేదు. ఈ ప్రభుత్వం వృద్ధుల పట్ల తన బాధ్యతలనుంచి తప్పించుకోజూస్తున్నదన్న భావన కలుగుతోంది.
చట్టంలోని సెక్షను 12 ప్రకారం, కేంద్రప్రభుత్వం తగినన్ని నిధులు రాష్ట్రాలకు ఈ లక్ష్యాల కోసం యివ్వాలని చెప్పినా, రాష్ట్రాల ‘బడ్జెట్‌’ కేటాయింపులలో, వృద్ధుల కోసం వెచ్చించే చెల్లింపుల గురించి ఏ వివరణలు లేవు. ఈ బిల్లు గురించిన అసలైన వాదన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన పిల్లలకు వేసే శిక్షల గురించే జరుగుతోంది. తమని చూడనిదానికి పిల్లలు జైలు పాలవడం ఏ తల్లిదండ్రులు కోరుకోరు. కాబట్టి ఈ విధానము నిరుపయెగమని అంటున్నారు. కాని శిక్ష విధించే అంశం లేకపోతే, ఈ బిల్లులోని అంశాలన్నీ వ్యర్ధమవుతాయని, నిర్లక్ష్యం చేయడాన్ని నిలపడానికి ఇదొక్కటే సరియైన మార్గమని అంటున్నారు చాలామంది.
11.ముగింపు :
ఈ చట్ట ప్రక్రియ వల్ల భారతదేశంలోని పెద్ద వయస్కులు ‘పీడన’ నుంచి మంచి నివారణ వర్గం పొందేరని మనం భావించనక్కరలేదు. ఈ చట్టాన్ని సక్రమంగా అమలుపరచడానికి తగిన విధానాలు పెంపొందించడంతోబాటు, ఫించను సంస్కరణలు రూపొందించి, అమలులో పెట్టడం, సామాజిక రక్షణ ప్రమాణాలు తయరుచేసి, తద్వారా వయసుడిగిన పెద్దలు వాళ్ళ చివరిరోజులు ఆర్థికంగా రక్షణ కల్గి సుఖంగా గడిపేలా చెయ్యవచ్చును. ఈ సంస్కరణలన్నీ కలగలిపి అమలుచేసిననాడే ఈ చట్టం తన లక్ష్యాన్ని అందుకోగల్గుతుంది. ”ప్రేమ, ఆప్యాయతలనేవి చట్టం వల్ల నిర్దేశింపబడలేవు” అని వేరే చెప్పాల్సిన పనిలేదు.

Share
This entry was posted in న్యాయదర్శనం. Bookmark the permalink.

One Response to న్యాయసంస్కరణ

  1. prasuna says:

    అలాగె ఆదవల్లకి వున్న ఆస్థి సంభంధ చత్తలు గురించి అవగాహన కల్పించంది దయచెసి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో