అందరూ స్త్రీలే ఎంపికైన పంచాయితి

గాంధారి మండలం నిజాబాద్‌ జిల్లాలో స్త్రీల అక్షరాస్యత మరియు అభివృద్ధి సూచికలలో వెనకబడి ఉన్న మండలాలలో మొదటిది. గాంధారి మండలంలోని చద్మల్‌ గ్రామపంచాయితీ జిల్లా కేంద్రం నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పంచాయితీ క్రింద చద్మల్‌ గ్రామ చద్మల్‌ తాండ, దుబ్బతాండ, నేషిరాం తాండ పేర్లతో నాలుగు పల్లెలు ఉన్నాయి. చద్మల్‌ పంచాయితీ గిరిజన సంస్కృతీ నేపద్యంతో కూడుకున్నది. పంచాయితీలో మొత్తం 246 కుటుంబాలు 2800 మంది జనాభా ఉన్నారు. గిరిజనులు (లంబాడీ) గిరిజనే తరులు కలిపి ఉండటం చద్మల్‌ పంచాయితీ ప్రత్యేకత చద్మల్‌ గ్రామ పంచాయితీలో కాయిత్‌లంబాడీ అనే గిరిజన తెగవారు ఎక్కువ నివసి స్తున్నారు. పశుసంపద మరియు వ్యవసాయం వీరి జీవనాధారం.

ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమత సొసైటి 1998 సంవత్సరంలో నిజామాబాద్‌ జిల్లాలో అభివృద్ది దిశగా వెనకబడిన మండలాలను ఎంపిక చేసుకుని గాంధారి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలంలో కార్యక్రమాలను ప్రప్రథమంగా మొదలు పెట్టారు. గాంధారి మండలంలో 75 శాతం తాండాలు వున్నాయి. ఈ తాండాలకు వెళ్ళడానికి కనీస రవాణ సౌకర్యం, మౌళిక సదుపాయాలు లేవు. వీటికి తోడు నక్సలిజం తీవ్రంగా ఉండేది. స్త్రీలు గ్రామం దాటి బయటికి రావడం చాలా అరుదు. ఆడపిల్లలు ఎక్కువగా పశువులు పెంపకం చిన్న పిల్లల సంరక్షణ కారణంగా వారిని చదివించే వారు కాదు. అధిక సంతానం, బాల్యవివాహాలు, స్త్రీలకు కనీస సమాచారం లేకపోవడం, గ్రామ పంచాయితీ దృష్టికి కనీసం స్త్రీల సమస్యలను తీసుకెళ్ళాలి అన్న ఆలోచన లేని స్థితి ఉండేది. గుర్తించినటువంటి పేద స్త్రీల అంశాల పైన పని చేయడం ద్వారా స్త్రీల స్థితి, పరిస్థితులలో మార్పు తీసుకురావాలి అనే ఆలోచనతో ఎస్‌.సి., ఎస్‌.టి. మరియు సామాజికంగా వెనకబడిన బి.సి. కులాల స్త్రీలను సంఘటిత పరుస్తూ ప్రతి గ్రామంలో సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది.

సంఘం సమావేశాలలో స్త్రీల స్థితి, పరిస్థితిలపైన లోతైన విశ్లేషణలు చేసినప్పుడు స్త్రీల – ఆరోగ్యం, కుటుంబంలో స్త్రీల పనికి గుర్తింపు, విలువ లేకపోవడం, స్త్రీలపై అధిక పనిభారం, స్త్రీలు లేవనెత్తిన అంశాలు ఈ అంశాలపై మహిళా సమత సమావేశాలు, శిక్షణలు, గ్రామ సభలు, నిర్వహించడం ద్వారా స్త్రీల సమాచార స్థాయి మరియు మొబిలిటి పెరిగింది.

గ్రామ అభివృద్ధిలో స్త్రీల పాత్ర కీలకం అన్న విషయం అర్థం చేయిస్తూ పరిపాలనలోకి స్త్రీల భాగస్వామ్యం పెంపొందించాలన్న ఉద్దేశ్యంతో 2000 సంవత్సరంలో జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున 1200 మంది స్త్రీలతో మేళ్ళా నిర్వహించడం జరిగింది. ఈ మేళ్ళాలో చర్చించిన అంశాలు ఇచ్చిన సమాచారం మేరకు మూడు మండలాలలో నుండి 44 మంది స్త్రీలు పంచాయతీ ఎన్నికల్లో వివిధ హోదాల్లో ఎంపిక అయ్యారు.

ఈ స్ఫూర్తితో 2006 ఎన్నికల్లో 55 మంది సంఘం స్త్రీలు ఎంపిక అయ్యారు ఈ క్రమంలోనే చద్మల్‌ పంచాయితీ పరిధిలోని గ్రామాలు సంఘం స్త్రీలతో ఎన్నికల్లో స్త్రీలు పోటీ చేయడం గురించి చర్చించినప్పుడు గ్రామ అభివృద్ధి అంశాలు ప్రధానంగా స్త్రీల అంశములతో ముడిపడి ఉన్నాయి కావున మొత్తం స్త్రీలతో కూడిన పంచాయితీని ఏర్పాటు చేసుకోవాలి. అన్న ఆలోచన మొదలైంది. ఈ ఆలోచనను తాండా పెద్దలు; పంచాయితీ సభ్యులు యువతతో వేరు వేరుగా మహిళా పంచాయితీ ఏర్పడటం ద్వారా గ్రామం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని అర్ధం చేయించడం జరిగింది. అదేవిధంగా పంచాయితీ పరిధిలోని గ్రామాలలో గ్రామసభలు, సంఘం సమావేశాలు స్టాల్స్‌, కళాజాతాలు మొదలైన కార్యక్రమాలు వరుసగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రభావంతో చద్మల్‌లో మహిళా పంచాయితీ ఏర్పాటుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. అనుకున్న ప్రకారంగా గ్రామపెద్దలు, గ్రామస్థుల సహాకారంతో మహిళా పంచాయితీ ఏర్పడింది.

మహిళా పంచాయితీ ఏర్పడిన అనంతరం పంచాయితీలో అభినందన సభలు ఏర్పాటు చేసి సన్మానించడం జరిగింది. సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అధికారులను ఆహ్వానించి మహిళా పంచాయితీ ఏర్పాటుకు సహకరించినటువంటి గ్రామస్థులందరిని అభినందిస్తూ 5 సంవత్సరాల కాలానికి సంబందించిన గ్రామ అభివృద్ధి ప్రణాళికను తయారు చేసుకున్నారు. పంచాయితీ సభ్యులకు సమాచారం స్థాయిని పెంచడానికి మహిళా సమత ద్వారా సమావేశాలు, శిక్షణలు నిర్వహించడం జరిగింది. వరుసగా ఈ గ్రామం టీం విజిట్‌ చేయడం అవసరమైన సహకారం అందించడం జరిగింది. మహిళా పంచాయితీకి రావలసినటు వంటి నిధులు, అందకపోవడంతో పలు మార్లు జిల్లా పరిషత్‌ కార్యాలయం మరియు కలెక్టర్‌ కార్యాలయంలో ధరఖాస్తు పెట్టారు. అయినప్పటికి నిధులు రాకపోవడంతో అనుకున్న విధంగా పనులు జరగకపోవడంతో వీరిలో నిరాశ నెలకొంది. ఈ సమయంలో పార్టీ పరమైన ఒత్తిడి వల్ల వీరిని ఒక స్థాయిలో మహిళా పంచాయితీన విరమించుకోవాలి అనే ఆలోచనకు దారి తీసాయి. అయినప్పటికి సంఘాలు మరియు మహిళా సమత టీం ఎప్పటికప్పుడు ఇచ్చిన సహకారంతో మహిళా పంచాయితీ ద్వారా ఉన్న బడ్జెట్‌ కేటాయింపులలో ఎక్కువ గ్రామ అభివృద్ధి పనులు చేసుకోగలిగినారు. 2009 సంవత్సరంలో గాంధారి మండలంలో స్వతంత్య్ర ఫెడరేషన్‌ ఏర్పాటు కావడంతో అక్కడ నుండి మహిళా సమత ఆ మండలం నుండి విత్‌డ్రా కావడం జరిగింది.

మహిళ సమత టీం, సంఘాలు ఇచ్చిన స్ఫూర్తితో చద్మల్‌ పంచాయితీ 2011 ఎన్నికల్లో గ్రామస్థులు తీర్మానించుకుని మహిళా పంచాయితీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నారు. మహిళా పంచాయితీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నారు. మహిళా సమత టీంకు ఏకగ్రీవంగా మహిళా పంచాయితీ ఏర్పాటు చేసుకున్న విషయం తెలియచేస్తూ, చద్మల్‌ పంచాయితికి ఆహ్వానించి సన్మానించడం జరిగింది.

మహిళా సమత టీం కూడా పంచాయితీ సభ్యులను అభినందించి మహిళా పంచాయితీ ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నందుకు సంతోషం వ్యక్తపరుస్తూ, ఇదే స్పూర్తితో ముందుకు వెళ్ళాలి అని గ్రామంలో స్త్రీల అవసరాలు మరియు స్త్రీల అభివృద్ధిదిశగా కృషిచేయాలి అని ఇందుకు గాను. మా నుండి (మహిళా సమత సొసైటీ అవసరమైన సహాయ, సహకారాలు ఎప్పటికి ఉంటాయి. అని తెలియచేశారు. ఏకగ్రీవంగా మహిళా పంచాయితీ ఏర్పాటు చేసుకుని విషయాన్ని తెలియచేస్తూ వారి పంచాయితీ ఆహ్వానించి సన్మానించడం జరిగింది. టీం కూడా పంచాయితి సభ్యులను అభినందించి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలన్న సంతోషాన్ని వ్యక్త పరుస్తూ గ్రామంలో స్త్రీల అవసరాలు, స్త్రీల అభివృద్ధి దిశగా కృషి చేయాలని ఇందుకు గాను మా నుండి అవసరమైన సహాయ సహకారాలు ఎప్పటికి ఉంటాయి అని తెలియచేశారు. ఆ స్ఫూర్తితో 2006 ఎన్నికల్లో 55 మంది సంఘం స్త్రీలు ఎంపిక అయ్యారు. ఈ క్రమంలోనే చద్మల్‌ పంచాయితీ పరిధిలోని గ్రామాల సంఘం స్త్రీలతో ఎన్నికల్లో స్త్రీలు పోటీ చేయడం గురించి చర్చించినప్పుడు గ్రామ అభివృద్ధి అంశాలు ప్రధానంగా స్త్రీల అంశాలతో ముడిపడి ఉన్నాయి కావున మొత్తం స్త్రీలతో కూడిన పంచాయితీని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన మొదలైంది. ఈ ఆలోచనను తాండా పెద్దలు, పంచాయితీ సభ్యులు యూత్‌తో వేరు వేరుగా మహిళా పంచాయితీ ఏర్పడటం ద్వారా గ్రామం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని అర్దం చేయించడం జరిగింది. అదే విధంగా పంచాయితి పరిధిలోని ప్రతి గ్రామంలో గ్రామసభలు, యూత్‌ సమావేశాలు, సంఘం సమావేశాలు స్టాల్స్‌, కళాజాతలు మొదలైన కార్యక్రమాలు వరుసగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రభావంతో చద్మల్‌ మహిళా పంచాయితి ఏర్పాటుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. అనుకున్న ప్రకారంగా గ్రామపెద్దలు గ్రామస్థుల సహాకారంతో మహిళా పంచాయితి ఏర్పడింది.

 

Share
This entry was posted in గ్రామీణ మహిళావరణం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.