భూమిక హెల్ప్‌లైన్‌ రివ్యూ మీటింగ్‌

సౌదామిని

జనవరి 18న భూమిక హెల్ప్‌లైన్‌ రివ్యూ మీటింగ్‌ హిమాయత్‌నగర్‌లోని హోటల్‌ ఉడ్‌ల్యాండ్‌లో జరిగింది. సత్యవతి గారు భూమిక ఆవిర్భావం వెనుక గల ఆంతర్యం మొదలుకొని ఇప్పటి వరకు దాని ప్రస్థానాన్ని దాని వెనుక ఉన్న కృషి తమ అనుభవాలను వివరంగా వివరించారు. చిన్నగా ఒక ఫోన్‌ మొదలై ఒక వ్యవస్థలా తయారయిందని అన్నారు. హెల్ప్‌లైన్‌ ప్రారంభించడా నికి ముందుగానే దానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, సహయ సేవల వివరాలను సేకరించామని తెలిపారు. ప్రారంభించిన తరువాత కూడా సహాయ సేవలకు సంబంధించిన అంశాలపై ఎన్నో అధ్యయనాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. గృహ హింస చట్టంపై అవగాహనను పోలీస్‌ మరియు జూడీషియల్‌ వ్యవస్థలతో మొదలు పెట్టామని అన్నారు. ఎన్నో కళాశాలలో, ఆఫీసుల్లో ఈ అవగాహన కార్యక్రమాలు చేసామని అన్నారు. అదే విధంగా కౌన్సిలింగ్‌ సదుపాయాల్ని బలోపేతం చేయగలిగామని ప్రింట్‌ చేసారని అన్నారు. ప్రస్తుతం హెల్ప్‌లైన్‌ 9వ తరగతి పాఠ్యపుస్తకంలో అన్నారు. పిల్లలకు కూడా హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉందన్నారు. హెల్ప్‌లైన్‌ సక్సెస్‌ వెనుక భూమిక హెల్ప్‌లైన్‌ వాలంటీర్స్‌ భూమిక న్యాయ బృందం కృషి ఎంతో ఉందని అన్నారు. ఇంతకాలం ఆక్స్‌ఫామ్‌ సపోర్ట్‌తో హెల్ప్‌లైన్‌ నడిచిందని, ఈ డిశంబరుతో ఆ ప్రాజెక్ట్‌ అయిపోయిందని, హెల్ప్‌లైన్‌ను కొనసాగించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హెల్ప్‌లైన్‌ వాలంటీర్స్‌ మరియు న్యాయవాద బృందం పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న వారందరూ ముక్త కంఠంతో హెల్ప్‌లైన్‌ ఖచ్చితంగా కొనసాగాలని దానికి తమ సహాయ సహకారాలు ఎప్పటికి ఉంటాయని అన్నారు. హెల్ప్‌లైన్‌లో మహిళలే కాకుండా బాలికలు కూడా భాగస్వామ్యులయ్యారు కాబట్టి ఇది ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చిందని గృహహింసకు సంబంధించిన సహాయ సదుపాయాలు ప్రభుత్వం ఆధీనంలో ఉండడం వల్ల దీన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతో ఉందని అన్నారు. అన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి ప్రభుత్వాన్ని కోరడమే కాకుండా ఒత్తిడి తేవడానికి కూడా ప్రయత్నం చేద్దామని అన్నారు. భూమిక హెల్స్‌లైన్‌లో పనిచేస్తున్న న్యాయవాదులు మరియు వాలంటీర్‌లు తమ తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. హెల్ఫ్‌లైన్‌ కొనసాగడానికి తమ సహకారం ఎప్పటికి ఉంటుందని, అందరిది ఒకే మాటగా చెప్పారు.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో