తెలుగు సాహిత్యంలో ముగ్గురు ప్రముఖ మహిళల్ని వరించిన అవార్డులు

Katyani Vidmaheకాత్యాయని విద్మహే కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. ప్రసిద్ధ విమర్శకురాలు. నిరంతర శ్రామికురాలు. సాహిత్య వ్యవసాయమే ఆమె నిత్యవృత్తి. విద్యార్ధులతో విభిన్నాంశాలపై పరిశోధన చేయించడం ఆమెకిష్టమైన పని. విస్తృతమైన ఆమె రచనలు సాహిత్యలోకానికి సుపరిచితమే. స్త్రీల సాహిత్యాన్ని వెలికి తీయడంలోనూ, స్త్రీవాద దృక్పథంతో విశ్లేషణ చేయడంలోనూ ఆమె దిట్ట.

అటువంటి అద్వితీయ ప్రతిభ కలిగిన ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ లభించడం హర్షించదగిన విషయం. స్త్రీలందరి తరపున ఆమెకు భుమిక అభినందనలు.

ఓల్గా

Volga 3

1973లోనీ ‘పంచాది నిర్మల వారసురాల్ని’ అంటూ కవిత్వమై పలికిన ఓల్గా, 80ల తర్వాత ‘స్వేచ్ఛ’వంటి అద్భుతమైన రచనలు చేసి, తెలుగునాట ఫెమినిస్ట్‌ రచయిత్రిగా నిలవడం మనందరికి పరిచితమైన విషయం. ఫెమినిజం అవగాహన కల్పించడం కోసం, అనేక రచనలు చేయడం, ఉపన్యాసాలు, సెమినార్లు, కథలు, కవితలు, నవలలు ఇలా బహురూపాలతో బహుముఖీన కృషి చేశారు. ‘లోకనాయక్‌’ అవార్డు వచ్చినందుకుగాను ఓల్గాకు అభినందనలు.

కె. వరలక్ష్మి

K Varalaskhmiఅద్భుతమైన తన రచనాశైలితో ఆకట్టుకుంటారు కె. వరలక్ష్మిగారు. కథలు, నవలలు, వ్యాసాలు, కవితలు అనేకం రాశారు. ఫెమినిస్ట్‌ రచనలతో పాటు విప్లవస్ఫూర్తి గల రచనలు చేశారు. ‘సుశీలా నారాయణ రెడ్డి’ – అవార్డును అందుకున్నందుకుగాను అందరి తరపున అభినందనలు తెలుపుతున్నాం.

కవి సంగమం

‘సల్మా’ ప్రసిద్ధ తమిళ కవయిత్రి. అంతర్జాతీయ కీర్తిని ఆర్జించుకున్న కవయిత్రి. బాల్యం నుంచి ఎదుర్కొన్న అనేక కష్టాల నుంచి, తనే కాకుండా తనచుట్టూ వారి కోసం పోరాడిన ధీర. ‘కవి సంగమం’ కార్యక్రమంలో 25.1.14న ఆమె పాల్గొన్నారు. ఆమెపై తీసిన డాక్యుమెంటరీ ప్రదర్శించబడింది. కవితా పఠనం చేశారు.

మమతాసాగర్‌ కన్నడ కవయిత్రి ప్రముఖమైన ఆమె రచన హైడ్‌ & సిక్‌ ఆవిష్కరింపబడింది. ప్రత్యేకమైన తరహాలో సాగిన కవిత్వ పఠనం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా పిల్లల గురించి, తల్లి గురించిన కవితలు ఆలోచింప జేశాయి.

రతీసక్సేనా ప్రముఖ హిందీ కవయిత్రి. ‘కృత్య’ వ్యవస్థాప కురాలు. ఆమె కవితా పఠనం చేశారు. నల్ల చీమలు, కవిత వినూత్న ధోరణిలో వుంది.

విమల ప్రముఖ తెలుగు కవయిత్రి సభను నిర్వహించారు. కవియాకూబ్‌ ప్రారంభ వాక్యాలతో ఈ సభ ఆరంభమైంది. నాలుగు భాషల్లో ప్రఖ్యాతులైన వారితో ఈ సభ సాహిత్యా భిమానులకు స్ఫూర్తినిచ్చింది. ఇంకా ఈ సభలో తమిళ నవలా రచయిత్రి రేవతి, ప్రసిద్ధ సినిమా క్రిటిక్‌ భావనాసోమయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో