కవితలు

వంటింటి ఆర్టిస్టు
రోష్నీ
ఏమే! కాసిని మంచినీళ్లు
వీధిలోంచి భర్త (గెస్ట్‌) కేక
చల్లటి మంచినీళ్ల గాస్లందించాను

అమ్మా!ఆకలి చంపేస్తోంది
పిల్ల(గెస్ట్‌)ల అల్లరి
అందరికీ వేడి వేడిగా వడ్డించి
కొసరి కొసరి తినిపించి
మిగిలిందేదో నేన తిన్నాను

అరె! గెస్ట్‌లంతా కలిసి ఏదో చర్చించుకుంటున్నారు
వెళ్ళాను విందామని
”నీకెందుకిదంతా, పోయి టీ చేయరాద…”
కసిరారు.
అంతవరకూ హోస్టుగా ఉన్న నేను
ఒక్కసారిగా వేస్టు(ఆర్టిస్టు)గా మారిపోయనెందుకో…!

2)దొంగకు .. చీకటి గవాయి
కొలిపాక శోభారాణి
అప్పటిదాక పచ్చపచ్చగా ఉన్న ప్రకృతి ఒడి
పక్షులు చేస్తున్న సంగీత కచ్చేరి
వెండితీగల్లా ఆకాశానికి – భూమికి వారధికట్టే
తుల్లింతల జలపాతాలు
ఎటుచూసినా నువిందె
ఇవ్వన్నీ మాయమయ్యే రోజొచ్చింది
ప్రపంచీకరణ పుణ్యమా అని
బాక్సైట్‌, గ్రానైట్‌ల తవ్వకాలంట
రక…రకాల కంపెనీల గుత్తాధిపత్యపు జులుం
చెట్టు పుట్టలు చెక్కెసే కంట్రాక్టర్ల కనికట్టు
కనీసావసరాలైన తిండి, బట్ట నీడ కాసింత అక్షర జ్ఞానం
గిన్ని జెండా పండుగలు జరుపుకున్నా ఇన్ని చబ్బీస్‌ జనవరిలు జరిగినా
ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందని
వాపోత… అయ్య న్యాయం చెయ్యండి
మీకు జేయమైతది.. కాళ్ళు గడ్డాలు.. పట్టుకు బతిమాలితె
అన్నా! మీరింత తెలివికచ్చిండ్రట… రాజ్యం కన్నెర్ర
జాగుసేత్తె కల్సెటట్టు లేదని.. ఎక్కడిదక్కడ్నే చల్లార్పాల్నని
నూకలపరంల.. ఉశికెను గాలించినట్టు….. గాలింపు
పాణాల్ని…. వనాల్ని కొల్లుగొట్టుడు… షుర!
కరకు బట్లు … చప్పుళ్లకు కొండా.. కోనా.. చెట్ట… చేెవ
గజ… గజ… మంటుంది.
గ్రద్ద కోడి పిల్లను తన్నుకు పోయిన తరీక
గంపకింది కోడిపిల్లల మీద తోడేళ్ళమంద దాడిచేసినట్టు
ఆడది కన్పిచ్చుడు పాపమైంది
మానవ మృగాల కాళ్లకింద నలిగిన బతుకులు
ఏందని అడిగితె గాల్లో కలిసె ప్రాణాలగోడు
మాకు అన్యాయం జరిగింది
న్యాయం చెయ్యిండ్రి….
దర్నాలు, రాస్తారొకోలు, బంద్‌లు, బైఠాయింపులు
నిరసనలు..
కులం వెలితో అటు ఇంటికి కాక ఇటు పంటకు కాక
గిర్క సందెనబడ్డ శాంతాడోలె… పాలకేడ్చే పిల్లల.. గోస
పిల్లలకు.. తల్లులను
మొగునికి.. పెండ్లాన్ని ఎడబాపిండ్రు
వయసుకచ్చిన పిల్లలు .. అన్నీ పోగొట్టుకొన్న తల్లులైండ్రు
గుర్రు పెడుతున్న ఏలికలు
నాలిక్కర్చుకున్న సర్కారు
కులాచారం పేరిట – చెయ్యి విదిలించి తిరిగి నిద్రలోకి జారుకుంది.
నామ్‌కే వాస్తే నివేదికలు, ఎంక్వైరీలు బుట్ట దాఖలు
దొంగకు చీకటి గవాయి
అక్కడేం జరిగిన దాఖలాల్లేవు
గాజుముక్కలు ఉద్దేశ పూర్వకంగా సృష్టించారు
అక్కడి మహిళల ప్రవర్తన అసహజంగా ఉంది
అస్సలేం జరగనే లేదు…. తేల్చిచెప్పటం
ఓ ఆడది నాకు అత్యాచారం జరిగిందని చెప్పటం
ఇక్కడ అసాధారణంగా అన్పిస్తుంది.
నమ్మి నానబోస్తే… పుచ్చి… పుర్రలైనట్టుంది.
న్యాయనికి కండ్లే కాక చెవులు, మానవత్వం కూడ లేదని
మరో మారు రుజువైంది.
పంచ పాండవులు
మంచం కోళ్ళోలె
ముగ్గురే…
(విశాఖ జిల్లా వాకపల్లి గిరిజన మహిళల
అత్యాచారంపై కోర్టు తీర్పు విని)

3)పరీక్ష
ఉద్దంటి రామమోహనరావు

మొగ్గలోనే త్రుంచడానికి
లింగనిర్ధారణ పరీక్ష.
పరీక్షిత్తులా గండం గడిచి
భూమ్మీద పడితే
అడుగడుగునా వివక్ష.
ఎదిగినకొద్దీ ఎదురవుతాయి
కఠోర ప్రేమ కఠారులు.
వెడెస్టీ గదుల నిండా
మగమృగాలుమిసిన
మదపరాగు మరకలు.
మౌనంగా సాగితే వస్తుంది
పెళ్ళిచూపుల రేవు.
ఆదాయ పరీక్ష
అణకువ పరీక్ష
వరకట్న సమీక్ష
నెగ్గితే…పెళ్ళి
ఇహ అదొక టెన్‌-ఎ-వన్‌
అప్పాయింట్‌మెంట్‌.
సీమంతంతో
ప్రొబేషన్‌ కమెన్స్‌మెంట్‌.
అబ్బాయిపుడితే
డిక్లరేషన్‌.
అమ్మాయి పుడితే
ఎక్స్‌’టెన్షన్‌’.

4)పాట నిరంతరమై
స్వాతి శ్రీపాద
యౌవనం తొలివాకిట
నునుసిగ్గుల పాలపుంతన
సుషుప్తి అసర్యంపశ్యలుగా
పదిలంగా ఎదలోలోపలి అంతఃపురంలో
కలల ఊయల్నగే సౌకువర్యపు బాలల్ను
నిలువెల్లా తడిమితడిమి
రాతిమౌనాన్ని ద్రవించి ద్రవించి
పులకింతల పున్నాగల్ను – జల్లులు జల్లులుగా రాల్చి
ఆలాపనల ప్రవాహాల్ను అధిరోహించి
వలపు
నాగులా ముంచెత్తే పాట…
బుడిబుడి అడుగుల్తో తొలి ప్రవేశానంతరం

గురుగుడు చెట్టులా పెరిగిపెరిగి
జీవితాన్నాక్రమించి
యౌవనరాగరంజిత మౌక్తికాల్ను
దోసిళ్ళతో దోచుకున్నా – తనివితీరనితనం
కనురెప్పపాటులో యుగాలు క్షణాలుగా
క్షణాలు యుగాలుగా
రెండ ఒకటై
లాస్య తరంగాల్న – జోత్స్నా వల్లికలన
ఒకటిగా మాలలల్లి
మనసుగదిలో
పరిమళాలు ప్రభవించి ప్రభవించి
హఠాత్తుగా
పాట మూగవోయిన క్షణం
బిత్తరపోయిన జీవితం
ఓ గాజుకన్నులా
ఖాళీగా మారిన అమృతభాండంలా
కన్నీటివాగై – వరదై
గడ్డిపరకై – దిశారహితంగా పల్టీలు కొట్టి
అప్పుడదిగో
కనిపించకుండా ఓదార్చే ఓ కమ్మని స్పర్శ
ఎక్కడవున్నా పక్కనే పలకరించే నీ శ్వాస
నిశ్శబ్దంగా మనసును శృతిచేసే నీ పాట
నా ఊపిరిగా మారి….
నిర్విరామమై – నిరంతరమై
పాట కొనసాగుతుంది – నీ శ్వాసలాగే
నీ వెచ్చని జ్ఞాపకాలతో.

5)వినోదం
జి. విజయలక్ష్మి
సంతర్‌ సబ్బో
సన్‌రైజ్‌ కాఫీనో
సేఫ్టీ సెక్యూర్‌ నాప్‌కిన్నో
షవర్‌ టు షవర్‌ పౌడరో
ఏదో ఒకటి బాగులో వేసుకొని
ప్రతివీధీ తిరుగుతాను
ఎండకి సొమ్మసిల్లి నాలిక పిడచకట్టి
నిస్పృహే మిగులుతుంది
కొనకపోతే సరే, కొరుకుతినేలా చూస్తారు
కళ్ళతోటే ఛీ కొడతారు
అవమానాల్ని అనుమానాల్ని భుజాన మూటగట్టుకొని
ఉసరంట ఇంటిగుమ్మంలో అడుగుపెడతా
అందర తినగా మిగిలింది నాకోసం ఎదురుచస్తుంది
నన్ను చూసి వరండాలో కుక్క గుర్రుమంటుంది
దాని వాటా దక్కనందుకు
కొందరికి నేను కాలక్షేపం
మరికొందరికి వినోదం
ఇంకొందరికి వింతచోద్యం
ఎందుకీ బ్రతుకుని నన్ను నేను తిట్టుకోను
ఆడదానిగా పుట్టినందుకు జన్మహక్కని ఓదార్చుకుంటాను
రంగురంగుల తెరపై నా నెలసరిబట్ట ప్రకటనల్ని
గుడ్లప్పగించి చూసేవాళ్ళకి నన్ను చూస్తే అసహ్యం
నేను డస్ట్‌బిన్‌లో వేసిన గుడ్డముక్కతో
డాలర్ల గుడ్లు పెట్టించుకునేవాళ్ళకి నేనంటే చులకన
వీళ్ళని చూసి సిగ్గుపడాలో
నన్ను చూసుకొని గర్వపడాలో.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.