జాగలేదు – టైము లేదు

కొత్త సంవత్సరమొచ్చిందంటె తెలంగాణ ఉద్యోగ, కార్మిక టీచర్స్‌, లాయర్స్‌ యింకా సబ్బండ సంగాలు డైరీ ఆవిష్కరణ సభలు జాతర జరిగినట్లే జరుగుతుంటయి. తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు కూడా ఉద్యమంగా నడిచినయి. తెలంగాణ ప్రకటన తర్వాత డైరీ సభలు జోరుగ సాగినయి.

యీ కొత్త సం|| సందర్భంగా ఏదో తెలువని నంబర్‌ నుంచొచ్చింది ఒక ఫోను.

హలో ఎవరు?

నా పేరు సమ్‌ రెడ్డి నేను తెలంగాణ గ్రూప్‌ వన్‌ ఎంప్లాయీస్‌ ప్రసిడెంటును నువ్వు గూడ గ్రూప్‌ వన్‌ ఎంప్లాయి గదా! మెసేజ్‌ పెట్టిన చూసినవామ్మ.

ఆ…. చూసిన అన్నాను ముక్తసరిగ.

సరె! మంచిదమ్మా నువ్వు మీ మహిళా కొలీగ్స్‌ను తీసుకొని రావాలె అమ్మా డైరీ ఆవిష్కరించేదానికి! మన తెలంగాణ లీడర్లంతొస్తున్నరు. ఫలాన రావులు, రెడ్లు, గౌడులు మాట్లాడ్తరని మెసేజ్‌ల బెట్టిన గదమ్మ!

నువ్వు బెట్టిన మెసేజ్‌ల ఒక్క మహిళ గూడ లేదు. మెసేజ్‌ల అందరి పేర్లు బెట్టనీకి జాగుండాలె గద! జాగలేక పెట్టలే…

నేననుకున్న ఓ.. కొత్త సంవత్సరంలో మహిళలను గూడ సభలకు ఆహ్వానిస్తున్నరు ఫరవాలేదు. మహిళా ఉద్యోగులకు యిది మంచి పరిణామమే. ఫోనులో (ఎస్‌ఎంఎస్‌) లో పేర్లు పెట్టలేక పోయిండ్రు. కాని స్టేజి మీద భాగస్వామ్యముంటది గదా! అని అనుకున్న.

మహిళా ఆఫీసర్లు ఎవరొస్తున్నారనీ ఎవర్ని మాట్లాడిస్తున్నారని అడిగిన కుతూహలంగ.

ఆ ….. ఎక్కడమ్మా మన పెద్ద పెద్ద లీడర్లకే స్టేజి సరిపోదు యిగ మహిళల కేడ! స్టేజిమీద జాగుంటె ఒకరిద్దర్ని ఎన్కనన్నా కూసోబెడ్తము మీరైతే రాండ్రి ‘మహిళలతో మాట్లాడిస్తమంటే, స్టేజి మీదికి పిలిచి ఎన్క కూసో బెట్టము’ అంటే ‘వస్తాను’ అన్నాను.

గియన్నెందుకమ్మ మీరు మీ కొలీగ్స్‌ అంత కలిసి రాండ్రి. అయినా గా కుర్సీల్లేని స్టేజి మీదికి ఎందుకమ్మ! స్టేజికింద బొచ్చెడు కుర్సీలుంటయి ఆరామ్‌గ కూసోని సౌలతుగ మీటింగయేనేతానికి రాండ్రమ్మ తప్పకుంట రావాలె.

మహిళలనేటాలకు ఫోను మెసేజ్‌ల జాగుండది, స్టేజిమీద జాగుండది, ఒక వేళ వున్నా మైకిచ్చే టైముండది. జాగ ఫోనుల్లో స్టేజి మీద కాదు వీల్లబుర్రల్లోనే లేదు.

తెలంగాణ ఉద్యమం మహిళలకు ప్రాతినిథ్యం యిచ్చే విషయాన్ని పట్టించుకోలే. అదొక సీరియస్‌ అంశంగా గుర్తించలేదు, అందుకే తెలంగాణ నాయకులకు మహిళల పట్ల యిట్లాంటి అప్రస్తుత పరిస్థితి వుంది. యిది సమాజంలో ఏ శక్తులకు పట్టక పోవడం మహిళా సమాజానికి ప్రమాదకరం.

తెలంగాణ ప్రకటనొచ్చింతర్వాత చాలా ప్రజా సంగాలతో జోరుగ రౌండ్‌ టేబుల్లు జరుగుతున్నయి. రేపటి తెలంగాణలో సామాజిక న్యాయాలు- మహిళా సాధికారతలు- పునర్నిర్మాణాల మీద జరుగుతున్నయి రౌండ్‌ టేబుల్‌ సభలు.

ఒక బహుజన సంగం నాయకుడు ‘తెలంగాణ పునర్నిర్మాణములో-మహిళా సాధికారత మీద రౌండ్‌ టేబుల్‌ సభకు పిలిచిండు. ఆడవాల్లను పక్కకు బెట్టి సభలు జేస్తున్న విధానాల మీద అసంతృప్తిగా వున్న నాకు ‘బహుజన కులాల మహిళా గుంపును కండ్ల చూద్దామనీ, మాట్లాడ్దామని పోయిన. రౌండ్‌ టేబుల్లో ప్రధాన టేబుల్‌గా మగ నాయకులున్నారు. సభ బెట్టిన నాయకుడు అధ్యక్షత వహిస్తుండు. అటువైపు, యిటువైపు టేబుల్స్‌ దిక్కు బహుజన కులాల మహిళలు కూర్చుండ్రు.

మహిళా సాధికారత పేరు బెట్టి మగవాల్లు సాధికారత చేయడమేంది? చాలా కోపమొచ్చింది. మగ సాధికారతలో మీటింగు నడుస్తుంటది. ఆ మీటింగులో మగవాల్లకే ప్రాధాన్యత వాల్లు మాట్లాడగా టైము వుంటె వచ్చిన మహిళలు మాట్లాడాలి. ఆ వచ్చిన వాల్లలో అగ్రకుల మహిళలకు మొదటి ప్రాధాన్యత. తర్వాతనే యితర అణగారిన కులాల మహిళలకు అవకాశం.

ఈ మహిళా సాధికారత మీటింగు కొచ్చిన నాయకులు మహిళల గురించి మహిళా అభివృద్ధి-సాధికారత మీద ఒక్క ముక్క మాట్లాడరు. అది తప్ప అన్ని విషయాల మీద మాట్లాడ్తుంటరు. ఒకతను సాయుధ పోరాటం చేయాలంటడు యింకో కాయన ప్రాణ త్యాగాలు చేయాలంటడు. ఎవరు చేయాలె? మాట్లాడే వాల్లు ఎలాంటి త్యాగాలు చెయ్యరు. వాల్ల పిల్లలు సీమాంధ్రలో కాకుంటే యితర రాష్ట్రాల్లో చదువుకోవాలె అట్నించటే విదేశాలకు బోవాలె. కాని ఉద్యమాల్లో త్యాగాలు జేసేది అణగారిన విద్యార్ధులు, విద్యార్ధినిలు.

అట్లా వూక దంపుడుతో టైమంత తింటరు. మాట్లాడిన వెంటనే వెళ్లిపోతరు. అగమేగాల మీదొచ్చి వెళ్తరు. మహిళా సాధికారత పట్ల బాధ్యత వుండదు, మహిళలు ఏమ్మాట్లాడ్తుండ్రు అనే విషయం పట్టదు. నిర్వాహకులు కూడా నిజాయితీగా యింకో సగం ప్రపంచంపట్ల బాధ్యతగా, ప్రజాస్వామి కంగా వ్యవహరించాలి. తెలంగాణ ఉద్యమంలోనైనా తెలంగాణ కోసం పోరాడిన మహిళా చరిత్రల్ని నిర్మించలేక పోయింది. గోల్కొండ ముట్టడి జరిగినప్పుడు యాదవ రాణి యుద్ధంజేసిందట. చెన్నారెడ్డి ఉద్యమాన్ని వదిలి పక్కకు పోతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది సదాలక్ష్మి ఈశ్వరిబాయి, జీనత్‌ సాజిదాలు- తెలంగాణ పునర్నిర్మాణంకాదు నవనిర్మాణం జరగాలి. ఆ నవనిర్మాణంలో కులజెండర్‌ వివక్షలు పోవాలి.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో