క్రోమోజోముల్ని కంగాళీ చేసే భావజాలం

మొన్న వెబ్సైటులో ఏవో వ్యాసాలు చూస్తూ పోతున్న నన్ను ఒక యువకుడి వాస్తవ గాధ కట్టి పడేసింది.

ప్రస్తుతం నేను పనిచేస్తున్న థర్డు జండరు ప్రాజెక్టుకి దగ్గరగా వుండటంతో ఆసక్తి కొద్దీ వెంటనే అనువాదం చేసాను. ఆ కధ ఇలా మొదలయింది.

”నన్ను ఎప్పుడ వెంటాడే జోరీగ – మగాడిలావుండు-సతాయించే చమత్కారం-మగాడివా-ఆడంగివా-
ఎప్పుడైనా ఎవరినైనా అడగాలనుకుంటున్న ప్రశ్న-విమెన్‌ స్టడీసు మాత్రమే
ఎందుకున్నాయి? మెన్‌ స్టడీసు ఎందుకు లేవు?
నిజం చెబుతున్నాను. నేను మగాడినే. అయినా ఎందుకో గాని ప్రశాంతత ఇష్టం. మోటు పనులు చెయ్యడం, ఆలోచించడం చాతకాదు. ఆడవాళ్ళని చూడగానే ఏదో ఒకలా స్పందించడం నాకు రాదు. అంత మాత్రాన మగాడిని చూసినా ఏమీ అయి పోను. రోడ్ల మీద తిరగడం కంటే సంగీతం వినడం ఇష్టం. వంట చెయ్యడం ఇష్టం. ఎవరు ఏ కష్టంలో వున్నా కళ్ళమ్మట నీరొ స్తుంది. ఇవన్నీ ఆడలక్షణాలుగా భావించి మగాడిలా నన్ను తయరు చెయ్యడం కోసం ఇంటిల్లిపాదీ తాపత్రయ పడతారు. మిత్రు లయితే పొగ తాగించడం, మందు తాగించ డం చేశారు. వాళ్ళ పోరు పడలేక తాగినా గాని నాకేమీ సంతోషం దొరకలేదు. చుట్టు పక్కల వాళ్ళ ముందు మగాడిలా నిరూపించడం కోసం ఒక అమ్మాయిని తెచ్చి పెళ్ళి చేశారు. ఆమెతో కాపురం గొప్పగా వుందని చెప్పలేను కాని ఫరవాలేదు. ఇద్దరు పిల్లలకు తండ్రి నయ్యను. నా భార్యకు నర్సుగా రాత్రి డ్యూటీలు వుండేవి. కాబట్టి పిల్లల పెంపకం నేనే చూసేవాడిని. నాకున్న ఆడ అభి రుచులు, నా భార్య రాత్రి డ్యూటీలు గురించి జనం రకరకాలుగా మాట్లాడేవారు. తన గురించి నాకు, నా గురించి తనకు అపనమ్మకం నూరి పోసేవారు. నేను పెద్దగా పట్టించుకోలేదు కాని నా భార్యలో చాలా మార్పు వచ్చింది. సహ ఉద్యోగికి దగ్గరయింది. భయంకరమైన ఒంటరి తనం… ఎవరితో చెప్పుకోవాలో తోచక బాధ పడుతున్న నన్ను నా మిత్రులు మెహందీకి తీసుకు వెళ్ళారు. మనసులేని పని అవడం వల్ల నేను అక్కడ విఫలం అయ్యను. కానీ ఒక స్త్రీ నాకు బాగా దగ్గరయింది. తను బలవంతాన ఇందులో దిగినట్టు చెప్పింది. నా పరిస్థితి కూడా అంతేనని చెప్పాను. ఆమెకు అర్థం కాలేదు. ఆమె చేస్తున్న వ్యభిచారం కంటే నేను నిరపించు కోవాల్సిన మగతనం ఏ రకంగా గొప్పదో తెలీదు. నాలాగే ఆలోచించే ఇంకో మిత్రుడు జనం ఆపాదించిన కొజ్జాతనం ముద్రతో ”నిర్మాణం” (అంగవిచ్చేదన) జరిపించుకుని దందాలో వున్నాడు. డాక్టరు రిపోర్టులో నేను హెచ్‌.ఐ.వి. అని తేలింది. నాతో వున్న స్త్రీకీ అదే….”
ఇంతవరకూ చదివాక జండరు శాస్త్రం గురించి నాకు తెలిసిన పరిజ్ఞానం ఏ మాత్రం సరిపోదనిపించి కొన్ని ప్రశ్నలు మీతో పంచుకోవాలనిపించి ఇలా రాస్తున్నాను. ఒక క్రోమోజోము కారణంగా వంట చెయ్యలనిపించడం, ఇంకో క్రోమోజోము కారణంగా సిగరెట్టు తాగాలనిపించడమూ వుంటుందా???
ట్రాన్సుజెండరుకి గురయిన వారిలో దాదాపు అందరు ఇదే వాదిస్తున్నారు. దాన్ని సమర్ధిస్తనే అలంకరణ, వస్త్రధారణ, హావభావాలు తీర్చిదిద్దుకుంటున్నారు. సాటి పురుషులతో లైంగిక జీవితం గడుపుతున్నారు. చివరికి పూర్తిస్థాయి ఆడతనం కోసం ”నిర్మాణు” ఉత్సవం జరుపుకుంటున్నారు. దీనివల్ల సాధారణ ఆరోగ్యం దెబ్బ తింటుందని, శక్తిసామర్ధ్యాలు దెబ్బతింటా యని వైద్యులు ఆందోళన పడు తున్నారు.
చిన్నప్పుడు అబ్బాయిలకు గౌన్లు, అమ్మాయిలకు నిక్కర్లు తొడగడం వల్ల శారీరక లింగం మారిపోదు. దాదాపు తల్లి దండ్రులందర తమ సరదా ఇలా తీర్చు కుంటారు. కాని యుక్తవయసులో అది తీవ్ర విషయంగా భావించడం, అదుపు చెయ్యడం జరుగుతుంది. సహజంగానే ఎక్కడైతే అదుపు వుంటుందో అక్కడ కోరిక మరింత బలంగా తలెత్తుతుంది. అది మానవ బలహీనత. బలం కూడా. శారీరక సెక్సులో ఏదో తేడా వుండటం వల్లనే గౌను మనసయింది అనుకున్న దశలోనే జండరు కౌన్సిలింగు అవసరమవుతుందేమా…
ఓపక్క హార్మోన్లలో అవకతవకల వల్ల నిజంగానే ఇరకాటంలో పడ్డ సెక్సు లక్షణాలకి మంచి వైద్యమే దొరుకుతోంది. పుట్టిన సెక్సుని సరిదిద్దుకునే అవకాశము మరోపక్క కేవలం ఒక భావజాలం శరీరం కత్తిరించుకోవడం దాకా తీసుకెడుతోంది.
ఈ మూసలోంచి మనిషిని నడిపించ డానికి చాలా ప్రయత్నమే జరగాలి. మొదట నేను పరిచయం చేసిన యువకుడు అడిగినట్టు ”విమెన్‌ స్టడీసు మాత్రమే కాదు, మెన్‌ స్టడీసు కూడా రావాలి.”
”ఆడదానిలా ఏడుస్తావేం” అనే ఎగ తాళి మాట ఆడ, మగ – ఇద్దరినీ కించ పరచడానికి పనికొస్తుంది. ఆడదానికి కన్నీరే వుండటం, మగాడికి కన్నీరు కార్చే హక్కు కూడా వుండదనుకోవడం- స్వాభావికంగా రెండ తప్పే. అచ్చుతప్పులు చరిత్రగతిని మార్చుతున్నాయి.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.