కుప్పం కస్తూరి ఓ పరిమళభరిత పని పాఠం

వారణాసి చరిత్ర మొత్తం వైధవ్యం పాలైన మహిళల చరిత్రేనని వాటర్‌ సినిమా విషయమై తలెత్తిన వివాదాల సందర్భంగా దీపామెహతా అన్నట్లు గుర్తు.

ఆ పట్టణమే విధవలైన స్త్రీల శ్రమశక్తిమీద నిర్మితమైందని మెహతా అభిప్రాయపడింది. ఆ మాటల వెనక ఉన్న విస్తృతార్థం తరచి ఆలోచించే కొద్దీ పొరలు పొరలుగా తెలుస్తూ ఉంటుంది.

కుప్పంలో కస్తూరిని చూసేంతదాకా వైధవ్యం పొందిన స్త్రీల శ్రమఫలం గురించి అంతగా అర్థం కాలేదు. కొన్నిసార్లు మనకు సన్నిహితంగా, అనుభవంలోన ఉన్న విషయలు కూడా చాలా ఆలస్యంగా అర్థమవుతుంటాయి.
కుప్పం కస్తూరికి అరవైఐదు ఏళ్లు. మనిషి చాలా సన్నం. కదలికల్లో చురుకు ఎక్కువ. చకచకా పనిచేస్తుంది. పని మాత్రమే చేస్తుంది. తక్కువ మాట్లాడుతుంది. ఎప్పుడు చూసినా నోట్లో ఆకూ వక్క ఉంటాయి. టీ.వి. సీరియల్స్‌ను నొసలు చిట్లించి ఈసడిస్తుంది. రెండుమూడు ఇళ్ళల్లో పనిచేస్తుంటుంది. ప్రతిఇంటినుంచి రెండుమూడొందల రూపాయలు వస్తాయి. అంతకుమించి వేరే ఆదాయమే లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల్లాగా కస్తూరికి ఎవర కరువుభత్యం పెంచరు. భర్త చనిపోయి పాతికేళ్లు దాటింది. వైధవ్యానికి కూడా సిల్వర్‌జూబ్లీ జరుపుకునేంతదాకా రాగలిగిన సంస్కృతికి కస్తూరి చాలాదూరంలో ఉంది. గత పాతికేళ్లుగా తన కుటుంబాన్ని పొడవాటి రెక్కలతో పోషించుకుంట వస్తోంది. ప్రస్తుతం తనని తాను పోషించుకునేందుకు పనిచేసుకుంటుంది.
ఈ మధ్య దీపావళికి చీర కొనుక్కునేందుకు డబ్బులడిగి చీర అయితే చిరిగిపోతుందని ముక్కుపుడక చేయించు కుంది. ఆ ముక్కుపుడక కస్తరి ముఖానికి ఎంత అందాన్నిచ్చిందంటే – చందమామ నువ్వుగింజంతై ముక్కున వాలినట్లు, చిన్న వెన్నెల బిందువు మెత్తగా నవ్వినట్లనిపించింది. ముడతలు పడ్డ ముఖాంలోన లోతయిన సౌందర్యం ఉంది. ఆ సౌందర్యం ఫెయిర్‌ & లవ్లీలకు దొరకదు. ఫేస్‌ప్యాక్‌లకు అందదు. పనిచేయల్సిన నేను నిద్ర ఎక్కువ పోతున్నానని నాకో మందలింపుతో కూడిన హెచ్చరిక చేసింది. ”ఏమి అట్లా నిద్ర పోతా ఉండావు. నీకేమీ తెల్సనే లేదు” అంది. నాకేమి తెల్సలేదో నాకన్నా కస్తూరికి బాగా తెలిసింది.
కస్తూరి మందలింపులో ఒక వేదన ఉంది. ఉత్పాదక సామర్ధ్యం గల వయస్సులో ఉన్నవాళ్లు అట్లా నిద్రపోతే ఎట్లా అనే వేదన అది.
కస్తూరి ఆ మాటన్నాక కుప్పం ఆర్థికచరిత్ర మీదకు నా దృష్టి మళ్లింది. కస్తూరిలాంటి వయసు పైబడ్డవాళ్ళే ఇక్కడ నిర్విరామంగా పనిచేస్తుంటారు. మిగతావాళ్లు పనిచేయరని కాదు. వాళ్ల వయసుకి, సామర్ధ్యానికి తగ్గట్లుగా పనిచేయకపోవటమే కుప్పం వెనకబాటుతనానికి కారణం అవుతున్నదేమో! కుప్పం అభివృద్ధిలో వెనకబడటానికి భౌగోళిక, వాతావరణ ప్రతికూలతలు ఎంత కారణమో, పనిచేయగల సామర్ధ్యం ఉన్నవాళ్లు పనిచేయకపోవడం కూడా అంతే కారణం. ఈ నిర్విరామ శ్రమజీవులు అంతా ఎటువంటి వ్యాయవలు అవసరం లేకుండా సన్నబడ్డారు. ఆకులు అమ్ముత, పూలు వెస్త, కూరగాయలు అమ్ముత, పొలాల్లో పనిచేస్త, ఇళ్లల్లో పనులు చేస్త ఎవరినుంచి ఏమీ ఆశించకుండా బ్రతుకుతున్నారు. ఏ ప్రాంతంలో ఉత్పాదక శ్రమలో యువకులు భాగంగా వరరో ఆ ప్రాంతం, ఆ సమా జం, ఆయ కుటుంబాలు వెనకబడే ఉంటాయి అనడానికి కుప్పమే నిదర్శనం కానక్కర్లేదు.
నా నిద్రపట్ల కటువైన అసహనం చూపిన కస్తూరమ్మను నేను గౌరవిస్తున్నాను. ”లే! నిద్రలే!! పాటుపడు. కష్టపడు. పనిచెయ్‌. ఫలితం పొందు. నువ్వు బాగుపడి ఇతరుల్ని బాగుపరుచు” అని సందేశమిస్తున్న కస్తూరికి జీవితంపట్ల అసంతృప్తిలేదు. పాతికేళ్ల క్రిందటే భర్తను పోగొట్టుకున్న నిరాశా లేదు. నిస్సత్తువ లేదు. ఒక గొప్ప తేజస్సు ఆమెలో ఉంది. ఓ వెలుతురుంది. వీటన్నిటికీమించి ఆ వయసులో ఆరోగ్యంగా కూడా ఉంది. మనాది లేదు. దిగులు లేదు. నత్తిట లేదు. డిప్రెషన్‌ లేదు. ద్వంద్వప్రవృత్తి లేదు. నాకిది లేదే అనే బెంగ లేదు. ఇవన్నీ లేకపోవడానికి కారణం కస్తూరిలో పనిచేసే తత్త్వం ఉండటం. చేస్తున్న పనిని ఆనందించడం ఉంది. ఇతరుల శ్రమ మీద తాను సుఖపడాలన్న ఆకాంక్ష లేదు. పనిని ప్రేమించే మనుషులతో ఉన్నప్పుడు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. పని తప్ప మరొకటేదీ మనిషికి అంత తృప్తినీ, ఆరో గ్యాన్నీ ఇవ్వలేవని అర్థమౌతుంది. పని మను షుల పరీమళం వల్ల సమస్త రుగ్మతల, సకల జాడ్యాల మాయమవుతాయి.
కస్తూరి సీనియర్‌ సిటిజన్‌. ప్రభుత్వాలు ప్రకటించే ఏ రాయితీల జాబితాల్లో లేదు. ప్రభుత్వాలు ఇచ్చే వృద్ధాప్య పింఛన్లు పొందడం లేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్లాగా పెన్షన్‌ తీసుకోవడం లేదు. రైల్వే స్టేషన్లలో సీనియర్‌ సిటిజన్‌ అని క్లెయిమ్‌ చేసి రైళ్లలో తక్కువ ఛార్జీలతో ప్రయణించడం లేదు. స్వాతంత్య్ర సమరయెధులమని ఉచితపాస్‌లు పొంది వ్యాపారం చేయడంలేదు. అరవైఏళ్ల పైబడ్డ కస్తూరి శ్రమిస్తోంది. ఆత్మగౌరవంతో తన తిండిగింజలు తాను సంపాదించు కొంటోంది. ఇట్లాంటి వారి శ్రమవల్లనే ఈ దేశం సుభిక్షంగా ఉంటోంది.
పదకొండవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను ఆమాదించడానికి జరిగిన సమావేశం ఎదుట ఇట్లాంటి కస్తూరిలను కోట్లాదిగా నిలబెట్టి అడగాలి ‘పనికి రాయితీ పథకం ఏదైనా ఉందా’ అని. రానున్న కాలంలో ఆహార భద్రతపై ఒత్తిడి పడుతుందని హెచ్చరిస్తున్న వారిని కూడా మా కుప్పం కస్తూరి హెచ్చరిక చేయగలదు. దేశానికి పనిచెయ్యమని చెప్పగలదు. పనికిమాలిన పనులెందుకు చేస్తారయ్య అనీ అనగలదు. పనికొచ్చే పనులే చేయండనీ అనగలదు. ఎటు తిరిగీ వినే ధైర్యమే కావాలి ఎవరికైనా.
ముఖ్యంగా నీకైనా, నాకైనా, దేశ ప్రధానికైనా…

Share
This entry was posted in న్యూనుడి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో