రాయని పుస్తకాలు

నిమాన్‌ శోభన్‌
అనువాదం : ఓల్గా

“పదాలు నా నివాస గృహాలయ్యయి” అని మెక్సికన్‌ కవి ఆక్టేవియ పాజ్‌ ఒకసారి రాశారు. ముప్ఫై సంవత్సరాలకు పైగా నేను నా దేశం కాని దేశంలో బతుకుతున్నాను.

పందొమ్మిదేళ్ళ వయసులో నా యిష్టానికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన వ్యక్తితో నాకు పెళ్ళిచేసి స్వర్గానికి పంపించారు. దానిమీద నేను కంప్లయింట్‌ చెయ్యటానికి కూడా వీలులేదు. కానీ నా దేశం నుంచి, సంస్కృతినుంచి, నాకిష్టమైన సాహిత్య విద్యా విషయల నుంచి దూరంగా జీవిస్తున్నాను. కుటుంబంలో నిర్వహించాల్సిన పాత్రలు, బాధ్యతల కారణంగా నేను నా నిజమైన ఆత్మనుంచి ప్రవాసంలోకి వెళ్ళాను. కాబట్టి చాలా సంవత్సరాలుగా ఆక్టేవియపాజ్‌ వాక్యాలు నావై పోయయి. విదేశీ వాతావరణం లోపల ఒక ఉపసంస్కృతిగా శ్రద్ధతో సృష్టించుకున్న భ్రమాన్విత ప్రదేశంలో భౌతికంగా జీవిస్తున్నాను. మరోవైపు నా సృజనాత్మక హృదయంలో, భావుకతలో, రచనలో యింకొక ఇల్లు ఉంది. అదే నా పదాల నివాస గృహం.
ఐతే ఏ నివాస ప్రదేశానికైనా బయటి ప్రపంచపు డిమాండ్లన, తీర్పులన, సాంఘికంగా, రాజకీయంగా కరెక్ట్‌గా ఉండాలనే క్రూరత్వాన్ని బైట వుంచ గలిగినంత బలమైన తలుపులు ఉండవు.
రచన అనేది బహిరంగపరిచే తత్త్వాన్ని కలిగివున్న చర్య. ప్రచురణ ప్రపంచానికి, ప్రజలను దూరంగా ఒక భద్రమైన వాతావరణంలో పుట్టినప్పటికీ దాని స్వభావం అదే. నాలాగా తమను తాము తెలుసు కోటానికి, తమ గురించి జ్ఞానానికి, ఆత్మ నిర్వచనానికి మాత్రమే రాస్త, ప్రచు రించాలనే ఆలోచన లేని రచయిత్రులు, సాంఘిక, కుటుంబపు అల్లికలో బంధించ బడినవాళ్ళు, వాళ్ళ చుట్ట వాతావరణం ఎంత ఉదారంగా ఉన్నప్పటికి ప్రపంచంలో సరైన పక్షాన ఉండాల్సిందే.
నేను చాలా భాషలు మాట్లాడతాను గానీ నా మాతృభాష కవిత్వం. చాలాకాలం పాటు కాలమ్స్‌, కథానికలు రాస్తున్నదానిగా నా వృత్తిపరమైన భాష వచనం. కావాలంటే పితృభాష అనండి. కానీ కవిత్వం నా హృదయపు షార్ట్‌హాండ్‌. నేను ఎంత వెనక్కి వెళ్ళి చూసుకున్నా నేనెప్పుడ కవితలే రాశాను.
ప్రత్యేకమైన భాషలో ఉంటుందని కాదు నేను కవిత్వాన్ని ప్రేమించేది. కవిత్వానికి విప్పిచపే శక్తి ఎంత వుందో దాచిపెట్టగల శక్తి అంత వుంది. ఆ శక్తి కోసం నేను కవిత్వాన్ని ప్రేమిస్తాను. నేను దాచిపెట్టటం గురించి చాలా తొందరగా నేర్చుకున్నాను. పదమూడేళ్ళ వయసులో అపుడపుడే రాస్తున్న రచయిత్రిగా కనిపించని సెన్సార్‌ వలలను మొదటిసారిగా ఎదుర్కొన్నాను.
నన్ను నేను గుర్తుచేసుకోవాలంటే హృదయం లోలోపల దాగివున్న సాంఘిక తిరుగుబాటుదారుతో ఘర్షణపడుతున్న మంచి కువర్తెను. ఏవో యిపుడు మర్చిపోయను గానీ, కొన్ని విషయల మీద వ అమ్మతో పోట్లాడుత నా ప్రియమైన డైరీలో ”ఓ! ఆమెను నేను ద్వేషిస్తున్నాను” అని రాసుకునేదాన్ని. వ అమ్మ ఆ పేజీని చదివేది. అమ్మదానిని చడటంతో ఆమె విపరీతంగా ఉద్రేకపడటం, ప్రైవేట్‌ పేజీ అనుకున్న పవిత్రమైన చోటులో వెస పోయననే భీతి, ఇది నాకు వటలలోని వ్యక్తీకరణకున్న బలహీనతను గురించి మొదటి పాఠాన్ని చెప్పాయి. రచనలోని పారదర్శక స్వభావం. ఇతరుల పట్ల వుండే సాంఘిక, ఉద్రేకపరమైన బాధ్యత యొక్క భారం. స్వీయ సెన్సార్‌షిప్‌లోని లోపలి చట్టాలతో నేను మొదటిగా అప్పుడే ఎదుర్కొన్నాను.
ఆ సంఘటనతో వచనం మీద నాకు జీవితకాలపు సందేహం యేర్పడింది. వచనం చాలా అందుబాటులో వుంటుందనిపిస్తుంది. అది ప్రపంచంతో కమ్యూనికేషన్‌ పెట్టుకోటానికి మాత్రమే మంచిసాధనం. అది శ్రోతలతో పెద్దగా బిగ్గరగా మాట్లాడటం, కవిత్వం మనకు ఆత్మీయం. మనకోసం రాసుకునేది. అది నిశ్శబ్దాన్ని గురించి, ఆత్మలోపల మనతో మనం చేసుకునే సంభాషణ. ఇది నేను నమ్మను. హృదయం యొక్క సంకేతాల రహస్య భాషగా, కొందరు ప్రత్యేక వ్యక్తులకే ముఖ్యంగా ఆ క్లబ్బులో సభ్యులై పాస్‌వర్డ్‌ తెలిసినవారికే అందుబాటులో ఉండే భాషగా నేను కవిత్వాన్ని ఎంచుకున్నాను.
కొన్ని సంవత్సరాలుగా నేను నా కవిత్వాన్ని నాకు ప్రియమైన డైరీ జర్నల్‌లో రాస్తున్నాను. నా దగ్గర అసంఖ్యాకంగా కవితలున్నాయి. అన్నీ పంజరాల్లో, వాటి రెక్కలన్నీ బంధించబడి ఈ మధ్యకాలంలోనే వాటిని అనంతాకాశంలోకి అనుమతించా లనుకున్నాను.మా అబ్బాయి నా ఎలక్ట్రానిక్‌ ఫైళ్ళన్నీ ఒక క్రమంలో పెట్టి నా కవితలను ప్రచురించటానికి మా వీలుగా ఒక వరుసలో అమరుస్తానన్నాడు. అతను వాస్తవంలో నా కవితలేవీ చదవలేదు గానీ నేను హఠాత్తుగా నా రచనలను అతని కళ్ళనుండి లేదా పరాయివైన యితర కళ్ళనుండీ చూశాను. నా పిట్టలు చూరంగా వెళ్ళాయి. నేను అంత బాగోని స్థితిలో ఆగాను. ఆ ఆగిన స్థితిలో యితరుల గొంతులను ఆశ్చర్యకరమైన భయంతో, అంగీకారం లేకుండా, అపార్థాలతో మొత్తంగా చెప్పాలంటే ఒక వ్యతిరేకతతో ఉన్న గొంతులు విన్నాను. ఈ పుస్తకంలోని కవితలన్నిటికీ కలిపి నేను ”పాటల-మౌనము” అని పేరు పెట్టాలను కోవటం యధృచ్ఛికం కాదు. ‘పాటలు’ అనేదాని కింద విశ్వజనీనమైన, అస్తిత్వ, ఆధ్యాత్మిక విషయలున్నాయి. అవి నా హృదయనికి దగ్గరగా సిద్ధంగా ఉన్నాయి. ఐతే లోపలికీక అన్న విభాగం కింద ఉన్న కవితలు చాలా లోతుగా వ్యక్తిగతమైనవి, ఎవెషన్స్‌కి సంబంధించిన విషయలు. ఎక్కడ నన్ను నేను నగ్నంగా చసుకుంటానో అవి ”మౌనాలు” అన్న విభాగంలో వున్నాయి. ఐతే వీటిని ప్రచురించటానికి కావలసి నంతగా ఈ ప్రపంచాన్ని నమ్ముతానా అన్నది సందేహమే.
మీరు చశారు గదా నేను రాసిన ఒక పుస్తకమే ప్రచురితమైంది. అది నేను రాసిన ‘కాలమ్స్‌’ని సంకలనం చేసిన పుస్తకం. అది పాఠకులు నా రచనలను ఒక సంకలనంగా కావాలని కోరుకోవటం వల్ల వచ్చిన పుస్తకం. పూర్తిగా ప్రైవేట్‌ వ్యక్తిగా నేను, ప్రధానంగా కవితలు రాసుకునే నేను పరిస్థితుల ప్రభావం వల్ల ప్రజలందర చదివే రపంలో ఒక వార్తాపత్రికలో ప్రతివారం ప్రదర్శన యిచ్చినట్టు పర్సనల్‌ కాలం రాయటం కవితాత్మకమైన విడ్డరం కాక మరేమిటి – అది తల్చుకుంటే నవ్వొస్తుంది. నా ప్రపంచం, నా జీవితం, అప్పటి కాలం యివన్నీ బహిరంగమై పోయయంటే దానికి కారణం బంగ్లాదేశ్‌ జాతీయ వార్తాపత్రిక డైలీ స్టార్‌ సంపాదకుడు, నా స్నేహితుడు అయిన మహ్‌ప్సజ్‌ అనామ్‌ నన్నది రాయమని అడగటమే. దాదాపు పది సంవత్సరాల వరకూ రాశాను. ఒక కాలమిస్టుగా నా అనుభవం రచయితగా నా అస్తిత్వానికి విలువ తెచ్చింది. ఈ ప్రపంచం గురించి తెలియజేసి దాన్లో నా వ్యక్తిగతమైన చోటు కోసం అడగటం ఎట్లానో చెప్పింది. అంత కంటే ముఖ్యంగా పరస్పరాధారితమైన పాఠకులు రచయితల సంబంధం గురించే కాక, రచయిత మీద పాఠకుడికున్న అధికారం గురించి నేర్చుకునేలా చేసింది. పాఠకులు ఆశించేవాటికి, ఆవెదించేవాటికీ దరంగా వెళ్ళలేదుగదా అని రచయితలు పడే ఆందోళనను పరిచయం చేసింది. కానీ దీన్నంతటినీ నేనొక సవాలుగానే తీసు కున్నాను. నన్ను నాలోకి, వ్యక్తిగతం లోకి, అదృశ్యంలోకి, పరిచితమైన చిన్న అందమైన ప్రపంచంలోకి, కుటుంబం గురించి శ్రద్ధ్దాస క్తులలోకి నెట్టేసే అణచివేత దృక్పథానికి నన్ను కట్టేసిన తాడుని విప్పుకోవాలనే ప్రయత్నంలో కష్టపడుతున్నాను.
ఒకోసారి రెక్కల చప్పుడు కూడా అశాంతిపరుస్తుంది. కానీ జనావెదం, జనంలో పాప్యులర్‌ అనేవి మత్తెక్కించి మనల్ని అట్లాగే ఉంచేస్తాయి. నేను రాయల్సిన అంశాలను ఎంచుకోవటంలో చాలా శ్రద్ధ తీసుకోవటం ప్రారంభించాను. దానివల్ల ప్రయణం హాయిగా కుదుపులు లేకుండా జరిగిపోతుంది. ఎప్పుడైనా ప్రమాదపు వాసనను పసిగడితే, నన్ను నేనే నిలవరించుకుని, పాఠకులు స్పందించేందుకు అవకాశం లేకముందే సెన్సార్‌ చేసుకుంటాను. ఇది నన్ను గురించి నేను తెలుసుకునేలా చేస్తుంది. మేధాపరమైన సాహసాలు చేయనివ్వదు. బహుశ నా రచనలు కూడా లోతు లేకుండా పైపైనే ఉంటాయి. అందుకని నేను తాత్కాలికంగా కాలమ్‌ రాయటం ప్రజలతో ప్రత్యక్షంగా సంభాషించటం ఆపేశాను. దానికి బదులు సత్యంకోసం నాలోని రచయిత చేసే ప్రయణంలో మిగిలిన సాహిత్య రూరపాల అర్థమేమిటో తెలుసుకోవాలనుకుంటున్నా. నేను వాస్తవం రాయలనుకోవటం లేదు. కల్పన రాయలనుకోవటం లేదు. కానీ కాల్పనికత జోడించిన జ్ఞాపకాలతో వాస్తవాలమీద, అంతర్గత సత్యాలమీదా స్వారీచేద్దామనుకుంటున్నా.
నాకు ఇంగ్లీషు భాషంటే ప్రేమ ఎందుకంటే ఆ భాషలో ‘వల్డ్‌’ ‘వర్డ్‌’ అనే పదాలకు ధ్వనిలో పెద్ద తేడా ఉండదు. ఒకదానినొకటి అద్దంలో ప్రతిబింబంలా ప్రతిఫలించేవి. నాకు ప్రపంచమంటే పదమే. నేను పదాల గుండా ప్రపంచాన్ని చూస్తాను. నా వాస్తవానికి రచన అక్షరరపాన్నిస్తుంది. నా సత్యాలకు, యితరులవి కావు – నివాసస్థానాన్ని సృష్టిస్తుంది.
వాస్తవికత విషయనికొస్తే వ్యక్తిగత సత్యాలు సంక్లిష్టంగా ఉంటాయి. మారు తుంటాయి. కొన్నిసార్లు వైరుధ్యాలతో వుంటాయి. రాజకీయ చరిత్ర, మత బోధనలు, మనం యింకించుకునే కుటుంబ, సాంస్కృతిక భ్రమలు, యితరుల ప్రాపంచిక అనుభవాల మారని వాస్తవాలతో విభేదిస్తాయి. వాస్తవికతను అనుకరించే కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించాలని నేనను కోను. నేను జీవించిన వాస్తవ ప్రపంచాన్ని తిరిగి సృష్టించాలనుకుంటాను. సత్యాలను, మనుషులను, సంఘటనలను – వాటిని నేను చూసినట్లుగానే తిరిగి సృష్టించాలను కుంటాను. నా వర్తమానానికి చేరుకోటానికి నా గతాన్ని తిరిగి తెచ్చు కుంటాను. మిగిలిన విషయలతోపాటుగా, తుడిచిపెట్టుకు పోయిన తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లను మళ్ళీ దర్శించాలనుకుంటాను. రెండ నా ఇళ్ళే. నా తలిదండ్రులు తాతలు విభజనకు పూర్వం ఇండియకు చెందినవారు. వారి జీవితాలను నేను సాంస్కృతిక సమ్మేళనం ద్వారా నాలో అంతర్భాగం చేసుకున్నాను. 1971లో జరిగిన విధ్వంస సంఘటనల్లో మేం ఒక దేశాన్ని సాధించుకున్నప్పటికి నా తరం చాలా పోగొట్టుకుంది – వీటన్నిటిని ఒక గొప్ప చారిత్రక దృష్టితో, జాతీయ రాజకీయలలో భాగంగా, పెద్ద ప్రశ్నలుగా కాకుండా, నా వ్యక్తిగతమైన, దగ్గరిచూపుతో, నత్తగుల్ల చూపుతో ఎక్కడ ప్రజలు స్నేహితులు శత్రువుల్లా కాకుండా ప్రజలుగా మాత్రమే వుంటారో ఆ దృష్టితో చస్తాను.
నా కాల్పనిక సాహిత్యంలో ఎప్పటి నుంచో నా లోపం నివసించే స్వరం యొక్క కథను, అచ్చమైనదాన్ని, అంతా చూసేటట్టు, ఆ ఆలోచనలకూ భావనలకు పదాలే లేని వాటిని వినాలనుకుంటున్నారు. ఈ వ్యక్తిని వ్యక్తిగా తప్పొప్పుల నియమాల పూత లేకుండా, హృదయంలోంచి వట్లాడేవ్యక్తిగా కవిత్వం మాతృభాషగా గల వ్యక్తిగా సృష్టించాలనుకుంటున్నాను.
ఒకసారి నేనో కార్టన్‌ చశాను. ఒక డాక్టరు రోగి ఛాతిభాగాన్ని ఎక్స్‌రేలో చూసి ”అయ్యె! నీ లోపల పుస్తకం ఉన్నది” అంటాడు. నా లోపల ఒక పుస్తకం కాదు ఎన్నో పుస్తకాలు బైటికురికేందుకు ఉన్నాయని చెప్పటానికి నాకు ఎక్స్‌రే అక్కర్లేదు. కానీ ఎక్స్‌రే సత్యంకోసం వెలిగే కోరికతోపాటు చీకటి ప్రాంతాలను కూడా చూపగలుగుతుందేమో – అలాగే తలుపు దగ్గర కనపడకుండా నుంచున్న కాపలా దారుని గురించిన భయం కూడా దూరంగా లేదేమో.
నా జీవితం కేవలం నా ఒక్కదానిదే కాదు. నేను నా జీవితంలో, యితరుల జీవితాలలో ఏ సమస్యలు లేకుండా నివసించగలిగితే. ఉచ్చరించకూడనివి పలికి మనం మర్యాదా ముసుగుల్లో దాక్కుంటున్నా మని చెప్పగలిగితే? ప్రజలకు కోపం వస్తే, బాధపడితే, మా అమ్మ నా రచన చసి బాధపడినట్లు బాధపడితే ఏమవుతుంది? దాన్ని గురించి అంత ఆలోచించాలా? ఈ ప్రశ్నల గురించి నేను ఆలోచిస్తున్నపుడు కూడా నేను అపరాధ భావనకు లోనై ఉన్నాను. రెక్కలు ముడుచుకున్న కవయిత్రిగా, నిశ్శబ్దాల రచయిత్రిగా రాయని పుస్తకాల రచయిత్రిగా….

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.