కుప్పకూలిన కలల సౌధం

-అనువాదం – కె.మాధురి

శ్రుతికి మూడు సంవత్సరాలు నిండేసరికి, తరచు జ్వరాలతో, అతిసారంతో ఆస్పత్రి పాలయ్యేది. ఒక్క శ్రుతి అన్న పేరులోని మాధుర్యం తప్ప పిల్ల జీవితంలో ఏమాత్రం సంతోషం లేకుండాపోయింది. ఆమె బయటకి అంటూ వెళ్ళడం జరిగితే అది ఆస్పత్రికే.

కుటుంబం అంతటికి ఈ విషాదకర మైన అనుభవం కన్నీళ్ళు, సూదులు, పరీక్షలు తప్ప ఏమి మిగల్చలేదు. ఆఖరి ప్రయత్నంగా హెచ్ఐవి పరీక్ష జరిగింది. పరీక్షా ఫలితం పాజిటివ్ అవ్వడం వలన శ్రుతి చుట్టూ ఉన్నవారి వైఖరి పూర్తిగా మారిపోయింది.

శ్రుతి తండ్రి ఒక బ్యాంకు ఉద్యోగి. అతని భార్యకి గర్భవతిగా వున్నప్పుడు రక్తం ఎక్కించడం జరిగిందని కౌన్సిలింగ్ లో తేలింది. హెచ్ఐవితో ఉన్న రక్తం ఎక్కించిన ఫలితంగా శ్రుతి తల్లి, ఆమె భర్త, పుట్టబోయే బిడ్డ కూడా హెచ్ఐవి విషవలయంలో చిక్కుకున్నారు. కేవలం 5 సంవత్సరాలున్న వీరి పెద్దకూతురు ఆరతికి మాత్రం ఈ ఇన్ఫెక్షన్ లేదు.

శ్రుతి తండ్రి, తన భార్య హెచ్.ఐ.వి పాజిటివ్ అని తెలియగానే అవాక్కయి పోయాడు. రక్తం ఎక్కించినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ సంక్రమించిందని తెలిసి అతనికి వైద్యులమీద చాలా కోపం వచ్చింది. తాను కూడా హెచ్.ఐ.వి బాధితుడినని తెలిసి అతని ప్రపంచం తలకిందులైపోయింది. త్వరలోనే తన పెద్దకూతురు ఆరతి ఒక అనాధగా మిగిలిపోతుందన్న పచ్చి నిజాన్ని అతను తెలుసుకున్నాడు. తన భార్యకి రక్తం ఎక్కించిన ఆస్పత్రి మీద తనేమి చట్టబద్దమైన చర్య తీసుకోలేనని, తాము హెచ్ఐవి పాజిటివ్ అని తెలిస్తే తమకి ఎవ్వరూ సహాయపడరని అతనికి అన్పించింది. తన ఇద్దరి కూతుళ్ళని స్కూలునించి పంపించి వేస్తారు. బహుశా తమ సముదాయం నించి కూడా వాళ్ళని తరిమేస్తారు. తన వ్యాపారం దెబ్బతింటుంది. ఎన్నో తీవ్ర పరిణామాలకి ఇది దారితీస్తుంది. అతనిని,అతని భార్యని కలవరపెడుతున్న భయమల్లా, తమది పెద్దలు కుదిర్చిన వివాహంకాక, ప్రేమ వివాహం కనుక తమ తరువాత తమ పెద్దకూతురు ఆరతిని ఎవరు చూస్తారని. ఆ భయమే వారిని పీడించసాగింది.

సాధారణంగా హెచ్ఐవి సంక్రమించిన పిల్లలు ఎక్కువకాలం బతకరు. శ్రుతి గుర్తుగా మిగిలిందల్లా గుండెలో బాధ, మనసులో ఆమె జ్ఞాపకాలు, టేబుల్‌ మీద ఆమె ఫోటోలు. ఆమె తల్లి ఆమెను చేరడానికి ఎంతో దూరంలో లేదు. టీ.బి తో బాధపడుతూ క్రమంగా బరువు తగ్గిపోతోంది. శ్రుతి తండ్రి ప్రస్తుతం బాగానే వున్నాడు కాని బహుశా కొద్ది సంవత్సరాలలోనే ఈ వ్యాధి బారిన పడవచ్చు. ప్రాణంపోసి బ్రతికించవలసిన రక్తమే ప్రాణాన్ని బలిగొనడం అత్యంత విషాదకరమైన విషయం.

రక్తనిర్ధారణ

అనగనగా ఒక రాజుగారు. ఆయన తన ప్రజలు తన పట్ల ఎంత నిజాయితీ, శ్రద్ధ చూపిస్తున్నారో తెలుసుకోవడానికి, బజారులో వున్న ఒక ఖాళి కొలనులో ప్రతీఒక్కరూ ఒక సీసాతో నీరు పొయ్యాలని కోరారు. ఎవరికి వారు తమ వంతు పొయ్యకపోయినా అవతలివారు గమనించరని అనుకున్నారు. మరుసటిరోజు కొలను ఖాళీగానే వుంది. అదే విధంగా వైద్య వృత్తిలో వున్నవారు, రక్తం ఇతరులకి ఉపయోగించే ముందు బాధ్యతగా అన్ని విషయాలు పరిశీలించాలి. అది ఒక సీసాయైనా సరే, ఒక యూనిట్ అయినా సరే. రక్తం సరైనదని, రోగులకివ్వడం సురక్షితమేనని ముద్ర వేసేముందు ప్రతి రక్త యూనిట్ను క్షుణ్ణంగా పరీక్షించవలసిన నైతిక బాధ్యత వైద్యులమీద వుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మొత్తం కుటుంబాన్నే తుడిచిపెట్టేస్తుంది.

1989 నుంచి భారత ప్రభుత్వం రక్తంలో హెచ్.ఐ.వి ఇన్ఫెక్షన్ వుందో లేదో కనుక్కోవడం తప్పనిసరి అని తీర్మానించింది. చాలా ఆందోళనకర విషయమేమిటంటే ఇది సక్రమంగా అమలుకావడం లేదు. భారతదేశంలో రక్తదానం చేసేవారిలో మూడు రకాలవారున్నారు. వాలంటరీ (స్వచ్ఛందంగా) రీప్లేస్మెంట్ (తిరిగి నింపడం) మరియు ప్రొఫెషనల్ (క్రమబద్ధంగా).

వాలంటరీ – ఈరకంగా రక్తదానం చేసేవారినుంచి గుప్తంగా రక్తం తీసుకొని దాన్ని హెచ్.ఐ.వి ఇన్ఫెక్షన్ వుందా లేదా అని పరీక్ష చేస్తారు. ఒకవేళ అది పాజిటివ్ అయితే దానిని వాడకుండా పారవేస్తారు.

రీప్లేస్మెంట్ – ఇందులో, రోగి బంధువులు, స్నేహితుల దగ్గరనుంచి ఆపరేషన్‌కు ముందే రక్తం తీసుకుంటారు. తరువాత ఆ రక్తాన్ని దాతయొక్క అంగీకారంతో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కోసం పరీక్ష చేస్తారు- కాని చాలాసార్లు ఇది జరగటం లేదు.

ప్రొఫెషనల్ – ఈ తరగతికి చెందినవారు చాలా బీదవారు మరియు చదువులేనివారు. వీరు తమ రక్తాన్ని పలు బ్లడ్ బ్యాంకులకి అమ్ముతారు. ఒకవేళ అది పాజిటివ్ అని తేలితే వారు తమని ఏ ప్రశ్నలు అడగని, ఏ పరీక్షలూ చెయ్యని ఇంకొక బ్లడ్ బ్యాంకుకి వెళతారు. ఈ బ్లడ్ బ్యాంకువారు, ఇలా తీసుకొన్న రక్తాన్ని కల్తీ లేనిదని, పరీక్ష చేయబడిందని చెప్పి ప్రభుత్వ ఆస్పత్రులకి కూడా అమ్మేస్తుంటారు.

రక్తాన్ని చాలా విధాలుగా పరీక్ష చేయవచ్చు, అందులో సాధారణంగా చేసేది ఎలీసా పరీక్ష. దానికి కేవలం 40 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది చాలా సున్నితమైన పరీక్ష కాబట్టి 5 శాతం కేసుల్లో తప్పు ఫలితాలు రావడానికి అవకాశం వుంది. ఒకవేళ సందేహంగా వుంటే, ఆ యూనిట్ రక్తాన్ని మళ్ళీ నిర్ధారణ పరీక్షకు పంపిస్తారు లేదా రోగులకు ఉపయోగించరు. దీనికి సంబంధించిన అధికారులందరూ తమ మనఃస్సాక్షి చెప్పినట్లు నడుచుకోవాలి, ఎందుచేతనంటే వారి నిర్లక్ష్యం ఒక నిస్సహాయ రోగి మరణానికి దారితీయవచ్చు.

ఒకవేళ ప్రమాదకర పరిస్థితి అయితే, అయిదు నుంచి పది నిమిషాల్లో ఫలితాల్నిచ్చే స్పాట్ పరీక్షలు లభ్యంగా వున్నాయి. రక్తాన్ని హెపటైటిస్ బి వైరస్ వుందా లేదా అని కూడా పరీక్ష చెయ్యాలి. ఇన్ని రక్త పరీక్షలు చెయ్యడానికి సౌకర్యాలు లభ్యమౌతున్నాయి కనుక నిర్లక్ష్యం వహించకుండా సాకులు చూపించకుండా రక్తాన్ని సక్రమంగా పరీక్షించాలి. లేకపోతే శృతి కుటుంబంలాగా ఎన్నో కుటుంబాలు హెచ్ఐవి బారిన పడే ప్రమాదముంది.

(Whispers from within- unheard voices of HIV/AIDS- సౌజన్యంతో)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో