అమ్మా! నేర్పించు నిజమైన విద్య

ఎల్‌. మల్లిక్‌

ఎక్కిఎక్కి ఏడ్చినా రెక్కపట్టి, ఈడ్చుకెళ్ళి వ్యానులోకి ఎక్కిస్తావే అమ్మా!

ఎందుకొచ్చిన చదువే నాకిది? ఒంటబట్టాల్సిన చదువు, నా ఒంటిపైకెక్కి, భుజాన గుది బండలా వ్రేల్లాడడానికి తప్పా! మమ్మీ, డాడీల సంస్కృతి మోజులో, కార్పోరేట్‌ చదువు మత్తులో, గొంతుకోత పోటీలో, ఎంసెట్‌ల జోరులో ఉక్కిరిబిక్కిరి కావడమేనా చదువంటే?

ఆటపాటల మాట మరచి, నీ ఆప్యాయతానురాగాలకు దరమై, ఆ వసతి గృహాల్లో, స్కలు వ్యానుల్లో, పాఠశాల కటకటాల వెనుక క్రమశిక్షణ పేరుతో బాల నేరస్థుడిగా బ్రతుకీడ్చలేనే తల్లీ!
ఈ పోటీ పరీక్షల ఇరుకు బోనులో నేను, ఆదమరచి నిదరోలేక, ఎప్పుడు స్కలు వ్యాను హారను వినిపిస్తోందోనని కలలు కని ఉలిక్కిపడి లేచే నీవు. చిక్కుకొన్నాము మనము ఫలితమెరుగని ఈ పరుగుపందెంలో. అర్ధం పర్ధంలేని ఈ చదువుల పిచ్చిలో స్కూలు వర్కు నాకు హోంవర్కు నీకు. ఏ దరికి చేర్చేను నన్ను నేటి ఈ చదువు. పలుకలేనిక ఈ చిలుక పలుకులను. ఒకరిని మెప్పించడం, వేరొకరిని ఒప్పించడం, మరెవరినో ఆకర్షించడం ఇదేనా నా కర్తవ్యం? ఇది కాదు నాకు కావలసినది. నేర్పించు నిజమైన విద్య.
చిన్ననాటి నుండి నీవు నేర్పిన విద్యలో తోటివాణ్ణి అణగద్రొక్కి నేను అందల మెక్కాలన్న స్పర్దేతప్పా, సహవాసానికి తావేది! సమైక్య జీవన సౌందర్యాన్ని గర్చి, విలువైన ఆ జీవన విధానాన్ని గూర్చి ఏనాడూ నాకు చెప్పవెందుకని? ‘నేను’, ‘నాది’. అన్న స్వార్థమే తప్పా, ‘మనం’ ‘మనది’ అన్న భావం మచ్చుకైనా కానరాదే. నా ఇల్లు, వాకిలిని శుభ్రంగా ఊడ్చుకొనే నేను, ఆ చెత్తా చెదారాన్ని నిస్సంకోచంగా నడిరోడ్డుపై కుమ్మరిస్తాను. ఎందుకంటే అది నాది కాదు కనుక. నీవు నేర్పిన విద్యలో ఎక్కడా అది నాదన్న భావం నాకు కలుగనేలేదు కనుక. తన బిడ్డ ఆకలి తీర్చాలని నిరంతరం ఆరాటపడే ఒక వ్యక్తికి, పాపం అతని పనిమనిషి పాప అన్నం తిందో లేదో అనవసరం. ఎందుంటే అతని ఆకలిలోగానీ, అతని బిడ్డ ఆకలిలోగానీ దానికి ఏమాత్రం చోటులేదు. అది ఎక్కడిదో పరాయిది. ప్రతీరోజూ సరదాగా నాతోపాటు మా పెంపుడు కుక్కను కూడా షికారుకు తీసుకొని వెళ్ళే మా నాన్న అక్కడే నాతోపాటే ఆడుకొంట ఉండే, నా స్నేహితుడైన వాచ్‌మెన్‌ కొడుకును కూడా నాతో పాటు తీసుకొని రమ్మని ఏనాడూ అనరు. ఎందుకంటే ఒక తండ్రిగా ఆయనకున్న పరిథిలో వాడికి ఎక్కడా చోటులేదు. అది ఆయన బాధ్యత ఎంతమాత్రం కాదు. అందుకే ఓ ఆచార్య దేవా! ప్రార్ధిస్తున్నాను నిన్ను, బోధించు నాకు నిజమైన వసుదైకతత్వాన్ని, సౌభ్రాతృత్త్వాన్ని.
నేర్చుకోవడం అంటే అది ఒక నిరంతర సాధన. నాకు సులభంగా అర్థమయ్యే విషయలే కాదు, అంతతేలిగ్గా కొరుకుడుపడని, క్లిష్టమైన విషయలను సహితం నేర్పించు. నిజం చెప్పాలంటే నేర్చుకోవడమే అన్నిటిలోకి కష్టమైంది. నీవు తరగతిగదిలో చెప్పిందేదీ, బయట అలా కనిపించడంలేదు సరికదా, అందుకు భిన్నంగా కన్పిస్తుంది. ఉదాహరణకు మనిషిలో నమ్మకం గోడలా దృఢంగా ఉండాలని చెప్పావు. కానీ దృఢత్వానికి నిదర్శనంగా మాపిన ఆ గోడే బీటలు పడడాన్ని నేను బయట మాస్తున్నాను. అలా మాసినపుడల్లా నేను అయెమయంలో పడుతున్నాను. అందుకే వాస్తవంలో పరిస్థితులు వేరుగా ఉంటాయనే సత్యాన్ని కూడా తెలియజెయ్యి నాకు. ఉచ్చనీచాలతో సంబంధం లేకుండా సృష్టిలోని సమస్త విషయలను నేర్పించు.
ఆచార్యా! నేర్పించు నాకు నిజమైన భావవ్యక్తీకరణను. నిస్సంకోచంగా కుండ బ్రద్దలు కొట్టినట్లు నాలోని భావాన్ని సూటిగా చెప్పగల ధైర్యాన్ని ప్రసాదించు నాకు. ఒక పసి హృదయమంత స్వచ్ఛంగా, ఒక లేత కుసుమమంత నిర్మలంగా మాట్లాడే నేర్పును, మూగ, చెవిటి భేదంలేక, అధికులు, అల్పులన్న తేడాలేక, ముందు వెనుకలతో పనిలేకుండా, జీవ నిర్జీవులనే భావంరాక, సృష్టి సమస్తంతో సంభాషించగలిగే సామర్ధ్యాన్ని నేర్పించు నాకు. ఈ సరిహద్దు లన్నిటినీ చెరిపెయ్యగలిగిన శక్తినివ్వు.
నీవు ఎప్పుడ ఒకే ధోరణిలో మూస పోసినట్లు అలా చెప్పుకొంట పోతున్నావు. కానీ, అందుకు భిన్నంగా నేను క్రొత్తక్రొత్త పద్ధతుల్లో విద్య నేర్చుకోవాలనుకొంటున్నాను. విద్య కేవలం నాలుగు గోడల మధ్య నేర్చుకొనేదికాదు. పుస్తకాలు వల్లె వేయడం వల్ల వచ్చేది అంతకన్నా కాదు. నాకు ఒక ప్రక్క ఎన్నోరకాల సేవలను అందిస్తనే మరో ప్రక్క తమ పని తాము చేసుకొంట పోతున్నారు ఎందరో వ్యక్తులు, నా జీవితంలో ప్రతినిత్యం తారసపడుతుంటారు. కాని లోకంలో వీరంతా ఎంతో అల్పులుగా భావించబడుత ఉంటారు. ఉదాహరణకు ప్రతిరోజూ నాకన్నా ముందే నిద్రలేచి, క్రమంతప్పక నన్ను స్కలుకి తీసుకొచ్చే వ్యాన్‌ డ్రైవర్‌ నుండి సమయపాలనను పాటించడమెలాగో నాకు బోధించు. తన సొంత బిడ్డను సహితం సాకే తీరికలేక, వాణ్ణి ప్లే స్కూల్‌కు పంపే తల్లిదండ్రులున్న ఈ లోకంలో ఎందరో అనాధలను అక్కున చేర్చుకొని, తమ అమృత హస్తాలతో లాలించే మదర్‌ తెరిస్సా లాంటి కరుణామయ మూర్తుల నుండి దయగుణాన్ని పుణికి పుచ్చు కోవడమెలాగో నేర్పించు. పనిచేయడం కోసమే నిద్ర లేస్తున్నాయ అనిపించే ఒక చీమ, ఒక తేనెటీగను చూసి ఎవరి అజమా యిషీతోన పనిలేకుండా కర్తవ్యపాలన చేయడమెలాగో నేర్పించు. ఇలా సృష్టిలోని ఎంతటి అల్ప జీవి నుండైనా నేర్చుకొనే నైజాన్ని నేర్పించు.
ఈ లోకరఢికి భిన్నంగా వినడమే కాదు, ప్రశ్నించడం కూడా అవసరమని తెలియజెప్పు. ప్రశ్నించినప్పుడే జవాబులు దొరుకుతాయి. అప్పుడే జవాబుదారీగా ఉండడమెలాగో కూడా తెలుస్తుంది. ప్రశ్నించే శక్తితోపాటు ‘తెలియదు’ అని చెప్పగలిగే ధైర్యాన్ని కూడా బోధించు. అందుకు ‘అహం’ అడ్డుకారాదు. నా దగ్గర సమాధానం లేనప్పుడు ‘నాకు తెలియదు’ అని నిగర్విగా చెప్పగలిగే ఆత్మవిశ్వాసాన్ని నాకు నేర్పించు. క్రొత్త విషయలు నేర్చుకోడానికి ఇంతకంటే సులువైన మార్గం మరోటి లేదనేది నాకు అర్థమయ్యేలా వివరించు. అవసరమైనప్పుడు ఇతరుల సహాయన్ని అర్థించడమెలాగో కూడా నాకు నేర్పించు. అలా అర్థ్దించడం అవమానంగానో, బలహీనతగానో భావించరాదు. నేను చేరాల్సిన గమ్యం చాలా పెద్దది. అయినప్పుడు ఎందరి సహాయన్నో నేను అర్థించాల్సి వస్తుందని, పువ్వు ఫలంగా మారాలంటే, అల్పమైన తుమ్మెద సాయం అవసరమని నాకు అర్థ్దమయ్యేలా బోధించు. ఉవ్వెత్తున ఎగసిపడడమేకాదు, ఆ వెనువెంటనే లోనికి ఒదిగిపోయే సముద్ర కెరటంలా సమయసమయలను బట్టి, అవసరాన్నిబట్టి ఎదగడం, ఒదగడం ఎలాగో రెండ నాకు నేర్పించు.
విచక్షణారహితంగా ప్రవర్తిస్త, ఎన్నోవేల వృక్షాలను, మరెన్నో లక్షల పక్షులను నిష్కారణంగా నాశనం చేస్త, ప్రకృతి వినాశనానికి, అస్థవ్యస్థతకు కారణం అవుతున్నాను. నా విలాసవంతమైన జీవితం కొరకు ఈ భూమిపై భవిష్యత్తు తరాలకు బ్రతుకే లేకుండా చేస్తున్నాను. ఈ వినాశకర ప్రవర్తన నుండి వెనదిరగడమెలాగో నేర్పించు. నేను నా ఇంటి కిటికీ ముందు నిలబడి, ఆ పక్షుల కిల కిలారావాలు వినగలిగే రోజు తిరిగివచ్చే మార్గమేదో బోధించు. సృష్టి వినాశకరమైన, కాలుష్య కారకమైన ఈ విలాసవంత జీవితం, ఈ అసాధారణ జీవన విధానం నుండి బయటపడడమెలాగో చెప్పు.
ఈ లోకం, అయితే రాత్రి కాకుంటే పగలు అన్నంత సృష్టంగా లేదు. ఇది తెలుపు, నలుపుల సమ్మేళనం. మంచి, చెడుల కలగాపులగం. కాబట్టి ఏది ఏమిటో నాకు నేనుగా నిగ్గు తేల్చుకొనగలిగే ఇంగితాన్ని నేర్పించు. వేల, కోట్ల దేవతా మూర్తులకు నిలయమైన ఈ లోకంలో దేవతలు తక్కువ, మూర్తులు ఎక్కువ. వీటిలో ఏవి దేవుళ్ళో, ఏవి దెయ్యలో తేల్చుకోగలిగిన జ్ఞానాన్ని ప్రసాదించు నాకు. సిద్దుల సుద్దులు, మతాచార్యుల మధ్యవర్తిత్వాలు, మహామునుల మంతనాలతో పనిలేకుండా నాకు నేనుగా నా ఈ చుట్ట ఉన్న పరిసరాలను అర్థం చేసుకొనే నేర్పునివ్వు. మతంమత్తు నా కళ్ళకు మైకంలా కమ్మి, నిదురించే విద్యుద్ఘటం (స్లీపింగుసెల్‌)గానో, మానవ బాంబుగానో నేను మారిపోయి, మారణహోవన్ని సృష్టించే బలహీనతకు లోబడకుండా ఉండే ఒక తిరుగులేని శక్తిని నాలో నింపు. ఓ ఆచార్య దేవా! నేర్చుకోవడం ఎలాగో నేర్పించు, ఆ నేర్చుకోవడంలో క్రొత్తక్రొత్త విషయలు, క్రొత్తక్రొత్త మార్గాలు చూపించు. ఈ అనంత విశ్వంలో నన్ను నేను కాపాడుకొంట, తోటి వారి అస్థిత్వానికి తోడ్పడడమెలాగో నాకు అర్థమయ్యేలా నేర్పించు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

2 Responses to అమ్మా! నేర్పించు నిజమైన విద్య

  1. Rakesh says:

    మన ముందుతరానికీ / మనకూ, భావితరాలకు మనమేర్పరుచుకు(కుంటు)న్న విద్యావిధానాలకూ ఎన్ని తేడాలు!!

    మీ మీ బాల్యాలను గుర్తు తెచ్చుకోండి..
    (పల్లెల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో చదివినవారికైతే ఇంకా మంచిగ అర్థమైతది)

  2. Anonymous says:

    చాలా బవుందండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో