మరో డిసెంబర్‌ 1, మళ్లీ ప్రపంచ ఎయిడ్స్‌ దినం

గత పాతికేళ్లుగా వైరస్‌ మనిషి బలహీనతలతో చావు బ్రతుకుల ఆట ఆడుతోంది.

లైంగిక విప్లవం పుట్టిన దేశంలోనే పుట్టిన మానవరోగనిరోధక వ్యవస్థను క్షీణింపజేస్తున్న వైరస్‌పై అలుపెరుగని పోరాటాన్ని అన్ని దేశాల చేస్తున్నాయి.

అంతర్జాతీయ స్థాయి నుంచి స్థానికస్థాయి వరకు వివిధ స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు, ప్రభుత్వాలు తమ ప్రయత్నాలను తాము చేస్తూనే ఉన్నాయి. ఈ నిర్విరామ పోరాటంలో అంతిమ విజయం మనిషిదేనన్న ‘ఆశ’ ఒక్కటే వీళ్లందరినీ నడుపుతున్న శక్తి.
బహుశా ఈ ఏడాది కూడా ఆంధ్రదేశంలో నలుమూలల్నించి ర్యాలీలు ఉంటాయి. విద్యాసంస్థలు, ఎన్‌.ఎస్‌.ఎస్‌. విద్యార్థులు, విశ్వవిద్యాలయలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఆటోడ్రైవర్లు, ట్రక్‌ డ్రైవర్లు, పాజిటివ్‌ నెట్‌వర్క్స్‌, ఇంకా అనేకానేక మంది మానవహారాలు పట్టి ఎయిడ్స్‌ దినాన్ని పాటించటమో, ‘ఎయిడ్స్‌ దినోత్స’వాన్ని జరపటమో చేస్తాయి. ఎయిడ్స్‌ దినాన్ని పాటించటానికి, దినోత్సవాన్ని జరపటానికి మధ్య చాలా తేడా ఉంది. బహుశా ఈ రెంటి మధ్య తేడాను చాలామంది చాలాచోట్ల గమనిస్తున్నట్లు లేదు. ఎయిడ్స్‌ గురించి అవగాహనలో అత్యంత కీలకపాత్రను పోషిస్తున్న మీడియలో కూడా ‘ఎయిడ్స్‌ దినోత్సవం’ అనే వినపడేది గతంలో. ఉత్సవాలు జరుపుకుంటాం. దినాలు పాటిస్తాం.
నిజంగా ఎయిడ్స్‌ దినాన్ని పాటించటం అంటే ఏమిటి? ఈ ప్రశ్న చాలాకాలం నుండి వేధిస్తోంది. ఎయిడ్స్‌ డే రోజున ఒక ప్రమాణం కూడా విద్యాలయలు చేయిస్తాయి విద్యార్థుల చేత. ”నేను హెచ్‌.ఐ.వి. ఎయిడ్స్‌ పట్ల సమగ్ర చైతన్యంతో, సంపూర్ణ దృక్పథంతో ఉంటానని హెచ్‌.ఐ.వి. పాజిటివ్‌ల పట్ల సహానుభతితో వ్యవహరిస్తానని, ఎయిడ్స్‌ నివారణలో నావంతు కృషి చేస్తానని, ఆంధ్రప్రదేశ్‌ను ఎయిడ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తానని నా మనస్సాక్షిగా మీ అందరి సమక్షాన ప్రతిజ్ఞ చేస్తున్నాను” అని ప్రతిజ్ఞలతోనే ఎయిడ్స్‌డే ముగుస్తుంది. ఒక లెక్చరర్‌గానే కాకుండా ఓ ఫీల్డ్‌ వర్కర్‌గా, ఎయిడ్స్‌ నియంత్రణ కార్యకర్తగా గత ఐదారు ఏండ్లుగా మా విద్యార్థులచేత ప్రతిజ్ఞలు చేయించాను. కానీ, ఆ సాయంత్రమే వివిధ బార్లలో గుంపులు గుంపులుగా కూర్చుని ‘ఎయిడ్స్‌ డే’ పాటిస్తున్న విద్యార్థుల్ని చూస్తే చాలా భయం కలిగేది. బహుశా ఈ భయమే నా చేత పనిచేయించింది.
చాలా ఆశావహంగా వట్లాడాల్సిన సందర్భంలో నిరాశ కాదు గానీ, ఇటీవల ఓ పుస్తకం చూశాక కొన్ని వాస్తవాలను అవెంత కటువుగా ఉన్నా సరే వట్లాడక తప్పడం లేదు. ఏ కోణంలో చూసినా ఎయిడ్స్‌ వ్యాధి కాదు. ఏ విధంగా పరిశీలించినా ఎయిడ్స్‌ను జబ్బు, వ్యాధి అనవలసిన అవసరం లేదు. మళ్లీ గుర్తు చేసుకుందాం. హెచ్‌.ఐ.వి. మానవరోగ నిరోధకవ్యవస్థను క్షీణింపజేస్తుంది. దీనికి మందు లేదు. నివారణ ఒక్కటే వర్గం. ఇది నాలుగు విధాలుగా తప్ప ఇతరత్రా ఏ మార్గంలోన వ్యాపించదు. సోకదు. ఇంతే ఈ నాలుగు మా
మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచానికి పాతికేళ్లు పట్టింది. ఈ మూడు ముక్కల పట్ల సరైన పద్ధతిలో వ్యవహరిస్తే ఎయిడ్స్‌ డేలు జరపాల్సిన, పాటించాల్సిన అవసరమే రాదు.
అంటే మనం ఎయిడ్స్‌ డేలను పాటించటం లేదు. ఎయిడ్స్‌ డేలను జరుపుతున్నాం. వైరస్‌ అత్యంత వైభవంగా తన సిల్వర్‌జూబ్లీని జరుపుకుంది. బహుశా హెచ్‌.ఐ.వి కి షష్ఠిపూర్తి పండుగలు జరిగినా నేను ఆశ్చర్యపోను.
ఎందుకంటే హెచ్‌.ఐ.వి. పట్ల వ్యవహరించాల్సిన దృక్పథంతో కూడిన అవగాహన ఇంకా సమాజానికి కలగలేదు. జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ, వివిధ రాష్ట్రాల ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థలు నిర్విరామంగా విశేషకృషి ఎంత చేసినా ఆయ సంస్థల శ్రమను చిన్నబుచ్చగల పరిస్థితులు ఇవ్వాళ ఉన్నాయి. ఆ పరిస్థితులను మనం అర్థం చేసుకోగలగాలి. ఆ పరిస్థితుల నేపథ్యాలను చదవగలగాలి. విశ్వ ఆర్థిక వ్యవస్థల ప్రకృతిని, ప్రవృత్తిని మనం లోతుగా దర్శించగలగాలి.
వీటిపట్ల ఒక అవగాహన, దృక్పథం కలగకుండా ఎయిడ్స్‌ నియంత్రణ, నివారణ పట్ల ఉత్పాదక సామర్థ్యం గల యువతకు కానీ, రిస్క్‌ బిహేవియర్‌ ఉన్నవారికి గానీ మనం చెప్పగలిగేదంట ఏమీ ఉండదు.
2007 డిసెంబర్‌ నాటికి పుట్టబోయే ప్రతి బిడ్డకూ హెచ్‌.ఐ.వి, సోకకుండా ప్రసవం జరపాలన్నది లక్ష్యం. రాష్ట్రంలోని వివిధ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఆసుపత్రి లేదా సురక్షిత ప్రసవం పరిధిలోకి వస్తున్న గర్భిణీ స్త్రీలు 48 శాతం మించి ఉండటం లేదు. వీటికి కారణాలు అనేకం అయినా మరణం ఒక్కటే.
పట్టించుకోవలసిన విషయలను పట్టించుకోవలసినంత తీవ్రంగా పట్టించుకోక పోవడం వల్లనే మనం మరిన్ని ఎయిడ్స్‌ డేలను జరపడానికో, పాటించడానికో తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అనేక అంతర్జాతీయ పాఠాలు మనముందున్నా పదే పదే గుర్తు చేస్తున్న విధ్వంసం గురించి మనకు పెద్దగా పట్టింపు కూడా లేదు.
దక్షిణాఫ్రికా గురించి ఇక్కడ ప్రస్తావించడం అసందర్భమేమీ కాదనుకుంటాను. ప్రపంచం మొత్తం మీద అధికారికంగా ఎయిడ్స్‌ వల్ల నష్టపోయినది దక్షిణాఫ్రికా, తరువాత నష్టపోగల అవకాశం ఒక భారతదేశానికే ఉంది. 1999 ఏప్రిల్‌ 1న చార్లీన్‌ స్మిత్‌ అనే దక్షిణాఫ్రికా శ్వేత మహిళ రేప్‌కు గురయ్యింది. జోహెన్స్‌బర్గ్‌లో తన ఇంట్లోనే నల్లజాతీయుడైన ఎంబెకైల్‌ జింటో రేప్‌ చేశాడు. 1999 డిసెంబర్‌లో పట్టుబడ్డాడు. 30 ఏళ్ళు జైలు శిక్ష విధించబడింది. అత్యాచారానికి పదిహేను ఏళ్ళు, దొంగతనానికి మరో పదిహేనేళ్ళు కలిపి శిక్ష విధించారు.
చార్లీన్‌ స్మిత్‌ మామూలు గృహిణి కాదు. ఆమె ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌. జర్నలిస్టులు అంతా ఏం చేస్తారో అదే ఆమె చేసింది. తన అనుభవం గురించి రాసింది. రేప్‌ జరిగిన తరువాత తాను రాయటం మొదలుపెట్టి నాలుగు రోజుల తరువాత పూర్తి చేసి జోహెన్నెస్‌బర్గ్‌ నుండి వెలువడే మెయిల్‌ అండ్‌ గార్డియన్‌ పత్రికలో వ్యాసం ప్రచురించింది. ఆ వ్యాసంలో ప్రారంభ వాక్యాలు : ”దక్షిణాఫ్రికాలో ప్రతి 26 సెకన్లకు ఒక మహిళ రేప్‌ చేయబడుతుంది. గత గురువారం రాత్రి నావంతు వచ్చింది” ఆ వ్యాసం అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. రేప్‌ చేసిన పురుషుడు హెచ్‌.ఐ.వి. పాజిటివ్‌ అయితే? అన్న ప్రశ్న దగ్గర నుండి మొదలు పెట్టి రేప్‌ బాధితులకు ఇవ్వవలసిన చికిత్స వరకూ, వాటిల్లో వైరస్‌ ప్రభావం చూపకుండా ముందస్తుగా మొదలు పెట్టవలసిన యంటీ రెట్రో వైరల్‌ ట్రీట్‌మెంట్‌ వరకూ, ఆపైన ప్రభుత్వ విధాన నిర్ణయల వరకూ ఎన్నో అంశాలు ఉన్నాయి ఆ వ్యాసంలో.
విశ్వ ఆర్థికంలో పెరిగిన నేర మనస్తత్వం మనమేమీ ఎరగనిది కాదు. దక్షిణాఫ్రికాను వదిలేస్తే భారతదేశంలో రేప్‌కు గురవుతున్న స్త్రీలు ఎంత మంది? ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది? ఏవి రిపోర్ట్‌ చేయబడుతున్నాయి? ఎటువంటి వైద్య సదుపాయలు అత్యాచార బాధిత మహిళలకు ఉన్నాయి లాంటివాటిని గురించి ఆలోచించవలసి ఉంది. నా ఉద్దేశ్యం రేప్‌ ద్వారా హెచ్‌.ఐ.వి. సోకుతున్న మహిళల సంఖ్య పెరుగుతూ ఉన్నదని నిర్ధారించటం కాదు. ఎటువంటి విషయం పైన అయినా మన వైఖరి, దృక్పథాల గురించిన మాట ఏమిటి అనేది. అదృష్టవశాత్తు చార్లీన్‌ స్మిత్‌ను రేప్‌ చేసిన వ్యక్తి హెచ్‌.ఐ.వి. పాజిటివ్‌ కాదు.
దక్షిణాఫ్రికా గణాంకాలు చెపుతున్న వాస్తవం ఏమంటే ప్రపంచంలో అత్యాచారానికి ఎక్కువ గురవుతున్న మహిళల సంఖ్య అక్కడ ఎక్కువ. ఎయిడ్స్‌ మహావ్యాధి విజృంభణ కూడా దక్షిణాఫ్రికాలో అధికమే. ఈ గణాంకాలను చూసి ఆలోచిస్తే ప్రపంచంలో ఎయిడ్స్‌ బారిన పడిన వారి సంఖ్యలో దక్షిణాఫ్రికా తరువాత స్థానం భారతదేశానిదే. అంటే ఇక్కడ కూడా అత్యాచార బాధితుల సంఖ్య అధికంగా ఉన్నట్లా కాదా?
సరైన విధాన నిర్ణయలు లేక అవస్థల పాలవుతున్న దేశాల కంటే సరైన విధాన నిర్ణయలు ఉండీ వాటి పట్ల ప్రజలకు సరైన అవగాహన లేకపోవటం వల్ల ఇబ్బందులకు గురవుతున్న దేశాలు, రాష్ట్రాలలో ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ మరింత కష్టతరంగా మారుత ఉన్నది.
ఉదాహరణకు మన రాష్ట్రంలో ఎయిడ్స్‌ నియంత్రణ విషయంగా ఎన్నో ప్రయత్నాలు, రాజకీయ నాయకత్వం ఉండటం వలన సఫలమవుతున్నాయి. ‘ఆశ’ కార్యక్రమం అందులో ఒకటి. రెండోది ‘బీబోల్డ్‌ క్యాంపెయిన్‌’. ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖరరెడ్డి, ఆర్థికమంత్రి రోశయ్య తదితరులు హెచ్‌.ఐ.వి. పరీక్షలు చేయించుకొని కొన్ని పాజిటివ్‌ సంకేతాలను ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అసెంబ్లీ ప్రాంగణంలో ‘కండోమ్‌ బెలన్లు’ పెట్టి సరైన చైతన్యం, అవగాహన కలిగించేందుకు ప్రయత్నం చేసింది. నిజానికి అట్లాంటి ప్రయత్న పరంపరే ఈ రాష్ట్రంలో జరగకుండా ఉంటే ప్రతి ఐదు ఇళ్లకు ఒక్కరు చొప్పున హెచ్‌.ఐ.వి. పాజిటివ్‌లు ఉండే పరిస్థితి దాపురించేది.
పాఠశాల స్థాయిలో ‘లైంగిక విద్య’ గురించి ఇవ్వాళ ప్రతికూల అభిప్రాయలు వింటున్నాం. మైనర్లుగా ఉన్న పిల్లలు ఒక వైపు పెళ్ళిళ్లు చేసుకుంట తిరుపతిలాంటి చోట్ల, అన్నవరం, భద్రాచలాల్లో మనకు దర్శనమిస్తున్న తరుణంలో మనం విలువల గురించి, నైతిక అనైతిక విషయల గురించి విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నాం. హెచ్‌.ఐ.వి. వ్యాప్తి తీవ్రతను, వ్యాపిస్తున్న మార్గాలను, వ్యాప్తి మౌలిక కారణాలను నిశితంగా పరిశీలించకుండా విలువల తీర్పులను ఇస్తున్న తరుణంలో మరో డిసెంబర్‌ 1, మళ్లీ ప్రపంచ ఎయిడ్స్‌ దినం పాటిస్తున్నాం.
డిసెంబర్‌ 1, 2008 లో నైనా మనం మరికొన్ని అంశాలను ఇంకొంత లోతుగా చర్చించుకుందాం. మదర్స్‌డేకి, వాలెంటైన్స్‌డేకి, ఎయిడ్స్‌డేలకు మధ్య స్పష్టమైన విభాజక రేఖను గీద్దాం. ఆరోగ్యకరమైన ఆలోచనలను, అలవాట్లను ఆచరిద్దాం. వాటిని డిసెంబర్‌ 1నే కాకుండా జీవన విధానంలో భాగం చేద్దాం.

సీతారాం

Share
This entry was posted in గౌరవ సంపాదకీయం. Bookmark the permalink.

6 Responses to మరో డిసెంబర్‌ 1, మళ్లీ ప్రపంచ ఎయిడ్స్‌ దినం

 1. jilukara says:

  గౌరవ సంపాదకీయం ఆలోచింప చేసేలా వుంది. అతి త్వరలో సమగ్ర వ్యాధి నిరోధక ఔషదం వస్తుందని ఆశ. ఏయిడ్స్ గురించి అవగాహన కలిగించడానికి సీతారాం చేసిన క్రుషి అసాధారణమైంది. వారికి ధన్యవాదాలు.

 2. బాగుందండి……మంచి అంసమ పై రాసినందుకు ధన్యవాదాలు….
  ఇదే అంశం పై నేను రాసిన టపా..
  http://aksharaarchana.blogspot.com/2007/12/blog-post.html
  శ్రీనివాసమౌళి

 3. bollojubaba says:

  మీ సంపాదకీయం చాలా బాగుంది.

  నాకూ చాన్నాళ్ల నుండి ఎయిడ్సు దినోత్సవం అనే మాటపైనే పేచీ. కొన్ని పత్రికలలో కూడా అదే ధోరణి.
  ఎయిడ్సు పట్ల వివక్ష నిరక్ష్య రాస్యులలో ఇంకా కొనసాగుతున్నన్నదన్న విషయం నగ్న సత్యం.

  అదృష్టవసాత్తూ పాఠశాలల్లో, కాలేజీలలో మనం చేస్తున్న ప్రచారం (ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో ప్రస్తుతం మొదటి జెనరేషను చదువరులే ఉంటున్నారు కనుక) చాలా చాలా ఉపయోగ పడుతుందని నా అభిప్రాయం.

  చార్లెస స్మిత వ్యాస ప్రారంభవ్యాక్యం “ఇప్పుదు నావంతు వచ్చింది ” అనడం చాలా అద్బుతం మంచి ప్రయోగాన్ని పరిచయం చేసారు.
  దన్యవాదములు

  బొల్లోజు బాబా
  http://sahitheeyanam.blogspot.com/

 4. అంతా బాగానె ఉంది కాని దాని తొ పాటు ఒక సెక్స్ కథ అందు లొ లైంగిక సంబందించి మంచి సందేశం ఉంటే బాగుంటుంది

 5. Loy14 says:

  Morgan Freeman, to do the wrong thing. ,

 6. Stinky22 says:

  Some people have to learn the hard way. ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో