నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ ట్రిప్‌

– లక్ష్మీ ,

భూమిక మేము అందరము భూమిక ఆఫీసు నుండి సాయంత్రం 4 గం.లకు నిజామాబాద్‌ విజయ పబ్లిక్‌ స్కూల్‌కు వెళ్ళేసరికి అమృతలత గారు, రమాదేవిగారు అందరు బస్సు దగ్గరకు వచ్చి మా అందరిని ఎంతో అప్యాయంగా పలకరించారు. అమృతలతగారు కట్టించిన అపురూప వెంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకొని వెళ్ళారు. ఆ గుడి ఎంత అందముగా ఉంది. అక్కడ నుంచి రావాలి అనిపించలేదు. అక్కడ నుంచి లాలన వృద్ధాశ్రమము వెళ్లాము.

తరువాత సాయిబాబా గుడికి వెళ్ళాము. అక్కడ గులాబి తోట చాలా బాగుంది. ఆ చికట్లోనే ఫోటోలు తీసుకున్నాము. అక్కడ నుంచి అమృతలత గారి ఇంటికి వెళ్లాం. హాలులో పక్షుల బొమ్మలు ఉన్నాయి. అవి నిజంగా ప్రాణాలతో ఉన్నట్లుగానే ఉన్నాయి. నేను, కల్పన, సరిత ఫోటోలు దిగాము. డిన్నర్‌ లాన్‌లో నాన్‌వేజ్‌ భోజనం ఏర్పాట్లు చేసారు అమృతలతగారు. ఎంతో అప్యాయంగా అందరికి వడ్డించారు. అందులో కోడికూర, రోయ్యలకూర, జొన్నరొట్టి చాలా బాగున్నాయి. తరువాత గేమ్స్‌ ఆడించారు. పాటలు పెట్టి డాన్స్‌లు చేయించారు. తరువాత పైకి వెళ్లి పడుకున్నాము. అక్కడ నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ వెళ్ళాము. అక్కడ అందరము గ్రూప్‌ ఫోటోలు దిగాము. అక్కడ పొచ్చెర జలపాతం వెళ్ళాము. వెళ్ళేసరికి అమృతలతగారు టిఫిన్‌ అరేంజ్‌మెంట్స్‌ చేశారు. అందులో మొక్కజొన్న, వడలు చాలా బాగున్నాయి. అక్కడ జలపాతంలోకి అమ్మజక్క ప్రసాంతక్క, రమాదేవిగారు తీసుకెళ్లారు. ఆ జలపాతం కింద నుంచుటే అసలు పైకి రావాలి అనిపించలేదు. నాకు ఇదే మొదటిసారి నేను ఎప్పుడు జలపాతం కిందకు వెళ్లలేదు అక్కడ నుంచి జరగాలి. అనిపించలేదు తరువాత కుంతల జలపాతం. చూసి మొండిగుట్ట వెళ్ళాం. అక్కడ కరుణగారు, కల్పనగారుని అమృతలతగారు పరిచయం చేసారు. అక్కడ వారు భోజనాలు ఏర్పాట్లు చేసారు. అక్కడ నృత్య ప్రదర్శనలు చేసారు. చాలా బాగుంది. బుర్కరేగడి, అమృతలతగారు ట్రాక్టర్‌లను సిద్ధం చేసారు. అలా మనము వెళ్లాలి అంటే వెళ్లలేము అక్కడికి అంది అమ్మజక్క. అమృతలతగారిలనే ఇవి అన్ని చూడగలి గాము. మనకు ఆ రాత్రి పడుకొవటానికి ఏ ఇబ్బంది కలగకుండా ఉట్నూరు గెస్ట్‌హజ్‌లో ఉండటానికి గీత అక్క ఏర్పాట్లు చేసారు.

కొమరం భీం గురించి తెలుసు కున్నాం. అక్కడకు వెళ్లటానికి ప్రసాంతక్క కారణం ఉషెగాం వెళ్లేసరికి అక్కడ అందరు వచ్చి బొట్టు పెట్టి మెడలో దండవేసి మమ్మలందరిని డప్పులతో తీసుకెలుతుంటే ఎంత ఆనందముగా ఉన్నదో అది ప్రసాంతక్కకే చెందుతుంది అక్కడ ఇత్తడితో చేసే వస్తువులు చాలా బాగున్నాయి తరువాత సమతా నిలయం వెళ్లేసరికి చాలరాత్రి అయినది పాపం పిల్లలు నిద్రపోకుండా మా అందరి గురించి ఎదురుచూస్తు అమ్మమ్మ అని అమ్మజక్క దగ్గరకు పరిగెట్టుకుంటు వచ్చారు. పిల్లలు గ్రీటింగ్స్‌ చేసి మా అందరికి ఇచ్చారు అవి ఎంత బాగున్నామ్‌. మీ అందరితో 3 రోజులు ఉండటము నాకు చాలా ఆనందముగా ఉన్నది. నేను ఇవి అన్ని చూసాను. అంటే మా అమ్మజక్క వల్లె.

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో