అడవుల్లో రచయిత్రుల ఝరి

 – సరిత, మహిళా సమత

తేది : 22.1.2014న ఆదిలాబాద్‌ జిల్లాకి హైదరాబాద్‌ భూమిక నుండి 25 మంది రచయితల బృందం మరియు స్టేట్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ ప్రశాంతి గారు, ఇంత మంది రచయిత్రులు మా జిల్లాకు రావటమనేది మా యొక్క అదృష్టంగా భావించాను. అందరు పెద్దవారు గొప్పమేధావులు వారికున్న విలువైన సమయాన్ని మా కొరకు వెచ్చించడం అనేది చాలా హర్షనీయమైనది.

ఆ రోజు ముందుగా మేము కెరమెరి మండలం నందు వారిని కలుసుకుని వారితో కల్సి నేను, జె.ఆర్‌.పి సాకృబాయి కొమరం భీం నివాసముండి వీరుడిలా పోరాడి మరణించిన స్థలం జోడేన్‌ఘాట్‌ ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అది కెరమెరి మండలానికి 25 కి.మీ దూరంలో ఎతైన కొండపైన వుంది. చుట్టు అడవి మధ్యలో నీటి కుంటలు, పంటపొలాలు దారి మధ్యలో మాకు ఒక పెద్ద నెమళ్ళ గుంపు కన్పించింది. అవన్నింటిని చూస్తూ అందరం చాలా ఆనందంగా ప్రయాణించాం. మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు కోపగూడ, బాభేఝరి, శివగూడ, కోలాంగూడ ఎదురయ్యాయి.

నేను మొదటిసారిగా అక్కడికి వెళ్ళాను. అదే చివరి గ్రామం ఇంకా అక్కడి నుండి ఏదారి లేదు. ఆ గుట్ట క్రింద ఆసిఫాబాద్‌ మండలం వుంది. ఆ గ్రామంలో కొమురం భీం విగ్రహం, ఆయనతో పాటు పోరాడిన వీరుల పేర్లతో కూడిన శిలాఫలకం వున్నాయి. కొన్ని ఇండ్లు ఉన్నాయి. అక్కడ పాఠశాల, హాస్టల్‌ వున్నాయి.

రచయితల బృందం అందరు అక్కడ కొమురం భీం విగ్రహం ముందు 2 నిమిషాలు మౌనం పాటించి జై కొమరం భీం అని నినాదాలు చేశారు. అది నాకు చాలా సంతోషం కలిగింది. దానితోపాటు సత్వవతిగారు ఇతనొక గొప్ప ఉద్యమకారుడు, ఇతనంటే నాకు చాలా అభిమానం అన్నారు. వచ్చేటప్పుడు మార్గమధ్యలో కొమరం భీం మరియు గిరిజనుల జీవన విధానం, వివాహ వేడుకలు ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు మరియు డెలివరీలకు సంబంధించి వివరంగా అడిగి తెలుసుకున్నారు.

తరువాత ఝరి గ్రామంలో మేమంతా కల్సి అల్పాహారం సేవించాము. మా అందరికోసం సంఘం వారు ప్రత్యేకంగా చేశారు. వాటిలో చూర్‌చాల్‌ చట్నీ పౌడర్‌ అందరికి చాలానచ్చింది అన్నారు. అంత పెద్ద వాళ్ళు ఒక చిన్న గ్రామంలో ఒక గుడిసెలో తింటారా అని అనుకున్నాము. కాని చాలా సంతోషంగా తిన్నారు. మాతో చాలా బాగా కల్సిపోయారు. ఇది మేము ఎప్పటికి మరచిపోలేం.

తరువాత అక్కడి నుండి జీవవైవిద్య కమిటీని చూడటానికి వెళ్ళడం జరిగింది. రాజయ్య రిటైర్డ్‌ ఎ.ఒ మరియు కమిటీ చైర్మన్‌ దస్తగిరి గారు వారు సేకరించిన పూర్వ ఆహార విత్తనాలను చూపించారు. వారి ఆఫీస్‌లో దాల్‌మిల్‌ చూడడం జరిగింది. కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జీవవైవిద్య కమిటీ ఏర్పాటు ఆవశ్యకత పై రాజయ్యగారు మాట్లాడినారు. అంతరించిపోతున్న వనరులు, ఆహారపంటలు, జీవరాశులను కాపాడుటకై ఈ కమిటీ పనిచేస్తుందని దీనిని 2011లో ఏర్పాటు చేశామని ప్రస్తుతం ఇక్కడ రైతులు పాత కాలపు పంటలు సాగుచేస్తున్నారు. వాటిలో మచ్చల కంది, పెసర్లు, జొన్నలు, కుసుమలు, చేపల పెంపకం చేపడుతున్నారని మాట్లాడినారు. పండిన దానిలోంచి 2 కిలోల ధాన్యాలు తీసుకుంటామని వంటకు కావాల్సిన విత్తనాలు నిల్వచేస్తూ మిగతా వాటిని తామే తింటామని మాట్లాడినారు. వీటిని సేంద్రియ ఎరువుల ద్వారా పండిస్తున్నామని మాట్లాడినారు.

వారు సాగు చేస్తున్న కందులను మాకు స్నాక్స్‌లాగా ఉడికించి పెట్టినారు. వాళ్ళు సాగుచేసే వాటిని సేనుకాడికెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళు మాకు కొన్ని మొక్కజొన్న కంకులు ఇచ్చినారు. ఉదయం నుండి వారు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ చాలా విషయాలు చక్కగా మాట్లాడినారు. అలాగే రచయిత్రులు రావటం చాలా సంతోషంగా వుందని చేప్పారు.

అక్కడి నుండి జైనూర్‌ మండలానికి బయలుదేరాము. జైనూర్‌కి కెరమెరికి మధ్యలో ఘాట్స్‌ సెక్షన్‌ వుంటుంది. ఈ ప్రదేశం చాలా ఎత్తుగా వంకలుగా వుంటుంది. దీనిని ఆగస్టు నుండి నవంబర్‌ నెలల్లో చూస్తే ఇంకా చాలా అందంగా చుట్టూ పచ్చని చెట్లతో వుంటుంది. ఇలాంటి ఘాట్స్‌లో మేము డాన్స్‌లు వేస్తూ ఎంజాయ్‌ చేశాము. మా ప్రోగ్రాంలో మా ఎస్‌.పి.డి అక్కతో మేము డాన్స్‌ చేస్తాం, కాని వీళ్ళందరు పెద్దవాళ్ళు మాతో డాన్స్‌ చేస్తారా అనుకున్నాం. కాని సత్యవతిగారు, మిగతావారు చాలా బాగా డాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశారు. చాలా బాగా అనిపించింది.

మార్గమధ్యలో ఎలాంటి పంటలు వేస్తున్నారు. అనేది చూస్తూ వాటి గురించి మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడ ఏ చిన్న విషయాన్ని కూడా ఒదల్లేదు. ప్రతీది గమనిస్తూ దాని గురించి తెలుసుకుంటూ వచ్చారు.

మేము జైనూర్‌ మండలం ఉపేగాం గ్రామానికి చేరుకున్నాం. అక్కడ గ్రామంలో మా సంఘం వారు రచయితల బృందానికి స్వాగతం చెప్పడానికి రెడీగా వున్నారు. ట్రైబల్‌ కల్చర్‌ ప్రకారంగా డప్పులు, పూల మాలలు, కుంకుమ పట్టుకుని ఉన్నారు. అందరికి బొట్టు పెడుతూ పూలమాలలు వేస్తూ స్వాగతించారు. ఇలా చేస్తే ఏమైనా అనుకుంటారేమో అసలు ఇష్టపడతారో లేదో అన్నట్టుగా వారిలో అనుమానం వుండే. కాని వాళ్ళను చూసి అక్కావాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళ సంప్రదాయాన్ని గొప్ప మనస్సుతో స్వీకరించటమనేది నిజంగా ఎంతో సంతోషం కలిగింది వాళ్ళకి.

అక్కడ నుండి మెటల్‌ వర్క్స్‌ చేసేవారిని కలవడానికి ”ఓజా” గూడకు వెళ్ళినాము. ఓజా ఇది ఒక ట్రైబల్‌ తెగ, వీరి వృత్తి మెటల్‌ వర్క్స్‌ చేయటం. ఆ వాడలోని వారందరు పిల్లలు, పెద్దవారు వచ్చారు. వాళ్ళు తయారు చేసినటువంటి మెటల్‌ బొమ్మలను ఒక మంచంలో పరిచారు. అందులో ఏనుగులు, గుర్రాలు, నాగోబా, దీపాలు, కాలికి వేసుకునే కడెం, పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు పెళ్ళి సమయంలో పట్టుకునే కత్తిలాంటివి మరియు గంటలు వున్నాయి.

వాటిని తయారు చేసేవారు వారి జీవన విధానం గురించి మాట్లాడుతూ వారు చేసిన వస్తువులు వేటికి సంబంధించినవి అనేది వివరించారు. రచయితల బృందం వారు, వారిని దాని పరంగా వారికి ఎంత ఆదాయం వస్తుంది. ఎలా సేల్‌ చేస్తారు. ప్రభుత్వం నుండి వున్న అవకాశాలు మొదలగునవి అడిగి తెలుసుకున్నారు.

వారు తయారు చేసిన వస్తువులు రచయితలని చాలా బాగా ఆకర్షించాయి. వాటిని కొనటమే కాక 25 సోలలు ఆర్డర్‌ చేశారు సత్యవతి. ఈ పరంగా వారికొక గుర్తింపు మరియు వారికి కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఈ బొమ్మలు చాలా ఖరీదు అయినవి చాలా ప్రఖ్యాతి గాంచినవి కాని వారికి మార్కెటింగ్‌ పెద్దగా లేదు. అందుకే ఇప్పటికి వారు వాటి కోసం చాలా శ్రమిస్తున్నా, సరయైన ఆదాయం లేక పేదవాళ్ళుగానే వున్నారు. వారికి మంచి అవకాశాలు రావాలని ఆశిస్తున్నాం.

తరువాత అక్కడి నుండి ప్రధాన్‌ గూడకు వెళ్ళినాము. అక్కడ సంఘం వారు మళ్ళీ డప్పులతో స్వాగతిస్తూ డాన్సులు వేస్తూ తీసుకెళ్ళారు.

ఆ డప్పుల శబ్ధం, వారు స్వాగతిస్తున్న తీరు ఆ పూల మాలలు, వారి నుదుటన కుంకుమ గ్రామం అంతా సందడిగా అక్కడికి చేరటం ఒక పెండ్లి, పండగ వాతావరణం లాగా అనిపించింది. అందులో గీతా గారు డప్పు కొడుతూ డాన్స్‌చేస్తూ వచ్చారు. అందరి ముఖాల్లో చాలా సంతోషంను నేను గమనించాను. ప్రతీ ఒక్కరు కూడా దాన్ని ఎంజాయ్‌ చేశారని నేను అనుకున్నాను.

ఫెడరేషన్‌ అధ్యక్షురాలు సుమిత్రాబాయి వాళ్ళు మాకందరికి భోజనం ఏర్పాటు చేశారు. వారు తినేటువంటి వాటిని ఆ రోజు ప్రత్యేకంగా చేశారు. జొన్నరొట్టెలు, మక్కగటక, చూర్‌చాల్‌ ఆకు చట్ని, గోధుమ స్వీటు, మినప వడలు వేసారు. కాని, అక్క వాళ్ళు తింటారో లేదో మా వంటలు నచ్చుతాయా అందరం అని చాలా టెన్షన్‌ పడ్డారు. కాని అందరు వాటిని ఇష్టంగా తినటం బాగున్నాయని. వారు వారితో చెప్పటంతో వారు చాలా సంతోష పడినారు. భోజన సమయంలో కూడా ఎ్కడ సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళతో మాట్లాడుతూ కాసేపు వాళ్ళ ”ధింస” నృత్యాన్ని చేయడం, ఓల్డ్‌ ఎమ్‌.ఎస్‌.కె., బాల సంఘం పిల్లలతో మాట్లాడిన తీరు బాగా నచ్చింది. వాళ్ళందరితో ఆప్యాయంగా మాట్లాడడం దగ్గరితనంగా చూడడం మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. కాని కొంచెం హడావుడి అయిపోయి సమయంలేకపోవడం వలన మాతో ఎక్కువసేపు వుండలేకపోయారు. అనే భావన కల్గింది. మళ్ళీ అందరూ మా జిల్లాకి రావాలని మాతో గడపాలని కోరుకుంటున్నాము.

ఈ అవకాశం మాకు కల్పించినటువంటి మా స్టేట్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ ప్రశాంతి అక్క గారికి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో