‘మా’ భాగ్యమే సౌభాగ్యం

డా. రాజ్యలక్ష్మీ సేఠ్‌

(వడ్డాది సౌభాగ్య గౌరి (సౌభాగ్యమ్మగా బంధువులకి, స్నేహితులకి పరిచయం) 1915 మార్చి 18న కాకినాడలో గోపరాజు రాజ్యలక్ష్మి, వెంకట సుబ్బారా
వు గార్ల నాల్గవ కుమార్తె.

నలుగురు అక్కచెల్లెళ్ళు, ముగ్గురు అన్నదమ్ముల (రెండవ అన్నగారు విజయవాడలో నాస్తిక కేంద్ర వ్యవస్థాపకులు గోరాగారు) మధ్య పెరిగారు. ఏడవ తరగతి వరకే చదువుకున్నా పాటలు పద్యాలు తండ్రిగారు (కాకినాడలో అరవై శివరాత్రులు ఎకాహ భజనలు చేసి ‘మహాదేవ శంభో’గా పేరు పొందారు) రచించిన కీర్తనలు, అధ్యాత్మ రామాయణ కీర్తనలు కంఠతా పాడటం నేర్చుకొని, తొమ్మిదేళ్ళ వయస్సునుండి స్కూలు నాటకాలలో ముఖ్య భూమికలల్లో నటించడం అలా బాల్యం గడిచింది. పదకొండేళ్ళకి విశాఖపట్నవాసులు డా.కృష్ణరావుగారితో పెళ్ళయి వడ్డాది వారి సమిష్టి కుటుంబంలో రెండోకోడలిగా అడుగు పెట్టారు. పుట్టినింట, మెట్టినింట స్నేహశీలి అనే పేరు తెచ్చుకొన్నారు. 1949లో బొల్లారంలో (సికింద్రాబాదు కంటోన్‌మెంట్‌) భర్త మెడికల్‌ ప్రాక్టిస్‌ మొదలుపెట్టడంతో అప్పటినుండి హైద్రాబాదులోనే స్థిరపడ్డారు. ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు పది పదిహేడు ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు భర్త 1957లో హఠాత్తుగా గుండె పోటుతో మరణించడంతో యభై ఏళ్ళుగా పిల్లల్ని పెంచడం, వారి జీవితాల్ని తీర్చిదిద్దటానికి పూనుకొన్నారు. నలుగురు అమ్మాయిలను భారతీయ నృత్యాలలో, ముఖ్యంగా కూచిపూడి నృత్యంలో పేరు సంపాదించుకోడానికి ఆవిడ శ్రమ, ప్రోత్సాహం చాల ఉందని చెప్పచ్చు. పిల్లలు, మనుమలు, మనుమరాళ్ళు, మునిమనమల మధ్య అమ్మగా, అమ్మమ్మగా, నానిగా, దాదిగా, పిలిపించుకుంటూ, పెళ్ళిళ్ళు, పేరంటాలలో పాల్గొంటూ తొంభై రెండేళ్ళ వయస్సులో 2007 జనవరి 14న ఆఖరి శ్వాస విడిచారు.)
అమ్మ రోజు రోజుకీ శక్తి కోల్పోతోందని తెలియగానే, ఐదుగురు పిల్లలం హైద్రాబాదులో మూడో కూతురు విజయ దగ్గర ఉంటున్న అమ్మ దగ్గరకి చేరుకున్నాం. పిల్లలందరు శ్రద్ధగా తల్లిని చసుకోడం అమ్మ అదృష్టమన్నారు. కాని అది మా భాగ్యంగా భావించాము. యభై సంవత్సరాలు మా కోసమే తన జీవితాన్ని వెచ్చించిన అమ్మ వ్యక్తిత్వం, స్వభావం, నేర్పు, ఓర్పు, ఆశయాలు, ఆదర్శాలు ఎప్పటికి మరిచిపోలేని విషయలు ఎన్నో. కొన్ని ఈ నివాళిలో…
తన వ్యక్తిత్వంలో మేము గమనించినది ఏంటంటే అందరికి తనకి తోచిన సలహాలు ఇస్తూ, సహాయం అందిస్తూ ప్రోత్సహించే స్వభావం. పిల్లలం మేమెప్పుడైన నిరాశ, నిస్పృహలకి లోనైతే, ”ఫరవా లేదు (తన ఊత పదం) లేవండి, ముందు ఏం చెయ్యాలో ఆలోచించండి.” అని వెంటనే ఏదో పనిలో నిమగ్నమయ్యే టట్లు చేసేది.
ప్రతి చేతలో పనితనం, నేర్పు కనిపించేది. పదిమందికి వంట నిమిషాల మీద చేయడం, ఇంట్లో ఏమున్నా లేకపోయినా వచ్చే పోయే అతిథులని సంతృప్తి పరిచేది. తను చేసిన చక్కపొడికి (అమ్మ అలానే అనేది) చాలా డిమాండ్‌ ఉండేది. మద్దతు ఉండుంటే ఒక బ్రాండ్‌ పేరుతో ఇండస్ట్రీగా మొదలు పెట్టేదేమో! పెళ్ళిళ్ళలో తాంబూలంలో వాడడానికి తయరు చేయించుకునేవారు కొందరు. ఉత్సాహంతో చేసి పెట్టేది. ఇంక కుట్టుపనులలో అయితే మా గౌన్లు, పరికిణీలు, జాకెట్లు, డాన్స్‌ డ్రెస్సులు అన్నీ తనే కుట్టేది. తన ఎనభైవ ఏట వరకు కుట్టింది. ఆఖరి మనుమరాలైన మా అమ్మాయి ఏష్ణకు ఎన్ని గౌన్లు కుట్టిందో. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనులో. చిన్న, చిన్న ముక్కలు, పీలికలు మంచివి చూసి పారేయకుండా ఉపయోగించి, అందంగా బట్టలు కుట్టడం అమ్మ ప్రత్యేకం. సుమతీ అక్కయ్యకి డాన్స్‌ ప్రోగ్రాములప్పుడు సృజనాత్మకంగా అమ్మ చేసిన జడ అలంకరణ మెచ్చుకునేవారు. ఆ తీరు ఇప్పటికి కొందరు మేకప్‌ ఆర్టిస్టులు అనుసరిస్తూనే ఉన్నారు.
బొల్లారంలో ఉన్నప్పుడు మహిళా సమాజం ఒకటి మొదలుపెట్టి నాన్నగారి ప్రోత్సాహంతో ఎన్నో కార్యకలాపాలని ప్రవేశపెట్టింది. కుట్టుపనులు, చేతిపనులే కాక, స్వెట్టర్లు అల్లి అమ్మడం, ఎవరికి వచ్చిన పనులు వారు చేసి ఒక ఉపాధి కల్పించుకోడానికి పనులు కల్పించేది. ఇంటిదగ్గరున్న ఆడవాళ్ళు ఇడ్లి, వడలు లాంటివి చేసి అమ్మడానికి పెట్టడంతో పనులలో నిమగ్నమైన మెంబర్లకి అవి కొనుక్కుని ఇళ్ళకి తీసుకెళ్ళి కుటుంబ సభ్యుల అవసరాలు కూడా చసుకోడానికి వీలైంది. దాంతో మహిళలకి సమాజం పనులలో పాల్గొనడానికి వీలుగా ఉండి సమాజం యొక్క సభ్యత్వం పెరిగింది. ఇదంతా చూసి గోరాగారు వెంటనే అంబర్‌ చర్కాలు తెప్పించి, వాటి మీద దూది ఏకడం, దారం, వడకటం, వాటిని అమ్మడానికి ఏర్పాటు చేయడంతో చాలా కొద్దికాలంలోనే సమాజం అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాని హఠాత్తుగా నాన్నగారు గుండెపోటుతో మరణించడంతో కుటుంబానికి ఒక పెద్ద దెబ్బ. ఉత్సాహములేక, అక్కడినుండి ఇల్లు మారడం చేత ఆ పనులు మానుకోడం అయింది. ఆ సమయంలో హైద్రాబాద్‌లోని ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు, శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌, మరి జమునాబాయి లాంటి వ్యక్తులు ”మా సంస్థలో వచ్చి పనులు చేపట్టు” అని అడిగినప్పుడు, తన అస్తిత్వం రపుదిద్దుకోడానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ నృత్య శిక్షణకి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతిపాదనలు సమ్మతించలేదు.
కళలలో ఆసక్తి చూపడమే కాకుండా, మమ్మల్ని నేర్చుకోడానికి ఉత్సాహపరిచేది. ఏదయినా విలువైన కళ మీద శ్రద్ధ చూపి ఆ కళలో పైకి రావాలంటే పట్టుదల ఉంటేనే ఫలానావాళ్ళు ఆ కళలో బాగా రాణిస్తున్నారనే పేరు వచ్చి పైకి రావడానికి అవకాశం ఉంటుందనేది. ఏ కళనైనా ఆసక్తి చూపించి, కృషి చేసి, స్పెషలైజ్‌ (తరచుగా తను గ్రహించిన ఇంగ్లీషు పదాలు వాడేది) చేస్తే పదిమందికి తెలుస్తుంది, అని మాకు, మనుమలకి,మా శిష్యులకి తరచుగా సలహాలిస్తూ ప్రోత్సాహపరిచేది. కూతురు భర్తతో విడిపోయిన కొత్తలో వ్యాపంలో పెట్టాలని ‘నీవు చీర అంచులు, ఫాల్స్‌ బాగా కుట్తావు. ఊరికే అందరికి కుట్టిపెట్టకు, డబ్బు పుచ్చుకో” అని ఉపాయలు చెప్పి ఉత్సాహపరిచింది. అలాగే నన్ను డాన్స్‌లో ప్రవేశపెట్టి తర్వాత, పువ్వులంటే ఎలర్జీతో, పైగా అక్కయ్యలతో సామ్యం ఉండకూడదనీ ప్రదర్శనలు ఇవ్వను అంటే, ”నేర్పించడంలో నీకు శ్రద్ధ ఉంది, అందులోకి వెళ్ళు అంటేనే నట్టువాంగం కూడ నేర్చుకొని కూచిపూడి నృత్య ప్రదర్శనలలో ఆడవాళ్ళు నట్టువాంగం చేయని రోజులలో ఒక కళాకారిణిగా స్థిరపడడం అయింది.
పోచంపల్లిలో నేసి తీసుకొచ్చిన చీరల వాళ్ళని కొత్త కొత్త డిజైన్స్‌, రంగుల కలయికలు చెప్పి వాళ్ళ అమ్మకాలు పెరిగేటట్లు చూడడం, వాళ్ళకి లాభం ఉండేటట్లు, కొనుక్కొన్న వాళ్ళకి తక్కువ ధర అనిపించేటట్లు బేరాలు కుదిర్చి అమ్మించిన చీరలు ఎన్నో! అడీ తన మంచం మీద కూర్చోని. చుట్టూ చీరలు పరచి, చూపిస్తూ, ఒప్పిస్తూ, సరదాగా మాట్లాడుతూ హుషారుగా అమ్మిపెట్టడం తనకే చేతనయ్యే పని అనిపించేది. చీరలవాళ్ళు బలవంత పెట్టి ఇచ్చిన కమీషనుతో తనకు నచ్చిన చీరలు కొనుక్కొని కట్టుకునేది. ఎప్పుడూ నీట్‌గా తయరై, ఏదో పనిలో నిమగ్నమై ఉండి తనకి తొంభై ఏళ్ళు అనేటట్లు అనిపించేది కాదు. అందుకే ”పట్టుచీర కట్టుకొని, నవ్వుతూ, సరదాగా ఉంటారు. సమయం తెలియదు” అని, ముదుసలిగా ఉంటారని అనుకొని వచ్చి కలిసిన వాళ్ళు, ”మీ అమ్మగారు ఎంత అందంగా, ఠీవీగా, చలాకిగా ఉంటారు” అని ఆశ్చర్యపోయేవారు. తను అలా ఉంటూ మాకు కూడా కొన్ని అలవాట్లు పాటించేటట్లు శిక్షణ ఇచ్చింది. ప్రొద్దునే లేచి తలజుట్టుపై పై దువ్వుకోడం (రేగిన జుట్టుతో కనపడడం బాగుండదని), పక్కదుప్పటి మడత పెట్టడం లాంటివి. ఉన్న బట్టల జతలని సందర్భోచితంగా కట్టుకోవాలని ఎప్పుడ చెప్తూ ఉండేది. ఎలాగూ ఉతకాలి కదా అని రాత్రి ఖరీదైన బట్టలతో పడుకోవద్దు, పాతవి కట్టుకోండి (నైటీలు వాడుకలో లేని రోజులలో) బట్టల మెరుపు తగ్గిపోతుంది అనే జాగ్రత్తలు ఇప్పటికీ మేము పాటిస్తూ ఉన్న అలవాట్లే.
నాన్నగారు పోయిన తర్వాత ఒక మహిళగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా ఒక ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో సమిష్టి కుటుంబంలోని నిబంధనలు పాటిస్తూ, పేరు ప్రతిష్ఠలు నిలబెట్టడానికి తాపత్రయపడుతూ మరో జీవిత అధ్యాయం మొదలు పెట్టడం అయింది. పిల్లలందరిని పోస్టుగ్రాడ్యుయేషన్‌ వరకు చదివించి, ”ఆ డాన్స్‌లు అవీ ఇంక పక్కన పెట్టి ఏ టైపో నేర్పించి ఉద్యోగాల్లో పెట్టు” అనే సలహాలు అందరు ఇచ్చినా ధ్యేయంతో ముందుకు సాగింది. కూచిపూడి నృత్యంలో నలుగురు కూతుర్లు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోడానికి తోడ్పడింది. పెద్దక్కయ్యలు ఉమ, సుమతీలు కూచిపూడి నేర్చుకొన్న మొదటి ఆడపిల్లలో ఒకరుగా చెప్పొచ్చు కూడాను. పెద్ద కూతురు డా. ఉమా రావరావు, నృత్య అధ్యాపకురాలిగా 1960లలో ప్రభుత్వ సంగీత కళాశాలలో ఉద్యోగం చేసి, తర్వాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నృత్యశాఖాధిపతిగా ఉంటూ మరాఠా మహారాజు సహాజి రాసిన ప్రబంధాలపై పరిశోధనచేసి డాక్టరేటు పుచ్చుకోడం జరిగింది. రెండో కూతురు, సుమతీ కౌశల్‌(ప్రస్తుతం అమెరికాలో ఉంటూ నృత్యం నేర్పుతున్నారు) కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సి నృత్యాలలో ప్రావీణ్యత పొంది దేశ, విదేశాలలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొన్న ప్రఖ్యాత నర్తకి. 1957లో డిల్లీలో జరిగిన ”ఇంటర్‌ యూనివర్సిటీ యూత్‌ ఫెస్టివల్‌”లో కూచిపూడిలో మొదటి బహుమతి తెచ్చుకొన్న ప్రధమ నర్తకి. 1950లలో ఆడపిల్లలు కూచిపూడి నేర్చుకోవడం అరుదైన విషయం. అటువంటి సమయంలో నృత్యాచార్యులు వేదంతం లక్శ్మీ నారాయణ శాస్త్రిగారు, వారి కుమారుడు వేదంతం జగన్నాధ శర్మగారు, డా.నటరాజ రామక్రిష్ణగారు ఇంటికి ఆహ్వానించి నృత్యం నేర్పించడానికి వెనుతీయలేదు. కొంతమంది కుటుంబసభ్యులు అభ్యంతరం చూపినా, అన్నింటినీ సమర్ధించుకుంటూ ముందుకు సాగడం అప్పటి రోజులలో ధైర్యంతో కూడుకొన్న పని. తండ్రి పోయిన రెండో నెలలో, అప్పటికే నిర్ణయమైన ప్రదర్శన రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్‌ ముందు బొల్లారం లోని రాష్ట్రపతిభవన్లో సుమతీ అక్కయ్య నృత్య ప్రదర్శన ఇవ్వడం ఎంతో విమర్శలకి ఎదురైనా ”ద షో మస్ట్‌ గో ఆన్‌” అన్నట్టు నృత్యకళకి ప్రాముఖ్యత ఇస్తూ ముందుకు పిల్లల్ని పంపింది.
తర్వాత రోజుల్లోకూడా డాన్స్‌ నేర్చుకునే పిల్లల పెళ్ళిళ్ళు నిశ్చయం అయిందనగానే అమ్మ వెంటనే అడిగే ప్రశ్న, ”అత్తవారి వైపు వాళ్ళకి కళలు, ముఖ్యంగా డాన్స్‌ అంటే ఇష్టమేనా? ఎంకరేజ్‌ చేస్తారా తర్వాత?” అని. తన అనుభవాల వల్ల. పిల్లలకి డాన్స్‌ ఇంతింత చెప్పించాం. వాళ్ళు మానేయడానికి కాదు అని అలాంటి సంబంధాలు వెతకడానికే శాయశక్తులా ప్రయత్నించింది. పెద్ద అక్కయ్యని డాన్సుల్లో ప్రోత్సహిస్తామని ముందు ఒప్పుకున్న అత్తింటివారు పెళ్ళైన తర్వాత ”నీ అంతట నీవే మానేస్తావని అనుకున్నాం, ఇప్పుడు పిల్లలతో ఇంకా చేస్తావా?” అని అడ్లు పెట్టి, ప్రదర్శనలని ఇవ్వడానికి అయిష్టత చూపించడంతో, కనీసం డాన్స్‌ నేర్పించచ్చు అని సంగీత నృత్య కళాశాలలో అధ్యాపకురాలిగా చేరినప్పుడ ఏవో అడ్డంకులు కలగచేయడం నిరాశ కలిగించింది. తక్కిన పిల్లలకి ఏ కులమైనా సరే, కళలని ఆదరించి, అర్ధం చేసుకొని, అభివృద్ధికి దోహదపడే వ్యక్తితో వివాహం జరపాలని అనుకోడమేకాదు ముగ్గురు కూతుర్లకి ఆ విధంగా పెళ్ళిళ్ళు చేసింది. ఏ పిల్లలకి కట్నాలు ఇవ్వలేదు, కొడుకికీ తీసుకోలేదు. అల్లుళ్ళు హిందీ, బెంగాలి భాషలు మాత్రమే తెలిసిన వాళ్ళవడం, ఆచార వ్యవహారాలు వేరై, ముందులో ఇబ్బంది పడ్డా, మెల్లిగా తనకి వచ్చీ రాని (అన్నయ్య తమాషాగా అనేవాడు, ”అమ్మ మధ్యమ ఫెయిల్‌ హిందీనాలెడ్జ్‌ ఇప్పుడు పనికొస్తోంది” హిందీలో అళ్ళుళ్ళతో మట్లాడి సమస్యలేకుండా గడపటంతో అల్లుళ్ళ్‌ కూడా కొడుకుల్లన్నట్లు అవ్మ! అవ్మ! అంట ప్రేమగ మసులుకొనేవారు. కొడుకు హిందీ, ఉర్ద, తెలుగు కలిపి మట్లాడే కోడల్ని పరిచయం చేసినా (అన్నయ్య ఎప్పుడు పెళ్లిచేసుకున్నది తెలియదు) కోపతాపాలు లేకుండా ఓపిగ్గా ”ఇల్లులు కాదు, ఇళ్ళు అనాలి, కచ్చి మిరపకాయకాదు పచ్చి మిరపకాయ, ఆలు చెత్త, తోలు కాదు, తొక్క అనాలి” అని నేర్పి, ”ఊరికే కూర్చోకు మెట్రిక్‌ పూర్తి చేయి, కుట్టుపనులు నేర్చుకో అని సలహాలు ఇచ్చేది. ఆచార వ్యవహారాలు భిన్నమైనా, సర్దుకు పోతూ ఆదరించడం చూసి బంధువులు, స్నేహితులు వ్యతిరేకత చపించలేకపోయారు.
కొన్ని విషయాలలో గోరా గార్ని ఇలా ప్రశ్నించేదికూడాను. ”నీవు పిల్లల వివాహాలు కావాలని వేరే కులాల్లో ఎంచి చేస్తావు. ఆహ్వాన పత్రికలలో ”కాస్మోపాలిటన్‌ డిన్నర్” అని వేస్తావు. అలా వేస్తేనే మా ఇంట్లో పెళ్ళిళ్ళకి వస్తానంటావు. ఎందుకన్నయ్యా అలా వెయ్యడం? ఇప్పటి వరకు చేసిన పెళ్ళిళ్ళలో అల్లుళ్ళే వేరే జాతి, భాషలకి చెందినవారైనపుడు? అలా వెయ్యడం సబబుకాదు. ఎత్తి చూపించినట్లు ఉంటుంది. అవసరం లేదు. అలావెయ్యను.” సామాజికకోణంలో చూసినా, సాంస్కృతిక, కళాభిరుచిగురించి చూసినా తన ఆదర్శాలు, ఆశయలు, అభిప్రాయలు ఆచరణలో పెట్టడానికి వెనకాడక ముందుకు సాగింది అమ్మ.
తను అలవరచుకొన్న ఆధ్యాత్మిక చింతనవల్లే కాబోలు ఎవ్వర్ని ఇబ్బంది పెట్టకుండా ఎలా వీలైతే అలా పరిస్థితులకి అనుగుణంగా సర్దుకుపోవడం అలవాటు చేసుకొంది. ఒక్కగానొక్క కొడుకు వేరేగా ఉన్నా, నా అల్లుళ్ళు కొడుకుల్లాగా చూసుకుంటారు అని కూతుర్లందరి దగ్గరికి వెళ్ళి ఉండినా ఎక్కువగా (ఇరవై ఐదేళ్ళుగా) మూడో కూతురు విజయ దగ్గర ఉండటమయింది. అన్ని సౌకర్యాలు చూస్త చాలా బాగా చసుకుంటోంది విజయ అని చాలా గొప్పగా చెప్పుకొనేది. కొడుకు వచ్చివెళ్ళగానే ”జగదీశ్‌ కి చాలా ప్రేమ” అని ఉబ్బిపోయె అమ్మకి హఠాత్తుగా కొడుకు అరవైఏళ్ళ వయస్సులో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడం ఒక పెద్ద దెబ్బ. అయినా తట్టుకొంది. సుందర చైతన్య స్వామి వారి మాటలు, పాటలు, ఉపన్యాసాలు వింటూ మనశ్శాంతి పొందడమే కాక శారీరకంగా వచ్చే బాధలు మర్చిపోతూ, ”స్వామిజీ అంటూ” అప్పుడుప్పుడ కలిసి మట్లాడే అవకాశం పొందుతూ అనుంగు శిష్యురాలిగా సంతోషపడింది. ఆశ్రమానికి విరాళాలు ఇచ్చి ఆనందం, తృప్తి పొందింది. తను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి, తెలుసుకున్న ఆధ్యాత్మిక విషయలు అందరికి చేప్తూ, వివరిస్తూ కాలక్షేపం చేసినా ఆ విషయలు బాగా ప్రచారంలోకి రావాలనే ఉద్ధేశంతో, తహతహతో, బలమైన కోరికతో తను కూడబెట్టిన డబ్బుతో తాతగారి కీర్తనల పుస్తకం ”అక్షర హంసలు” పునః ప్రచురణ చేసి, ఆడియో కాసెట్లలా తీసుకొచ్చి తృప్తి చెందింది. ఇంకా తక్కిన రచనలు కూడ ముద్రణ రూపంలో తీసుకురావాలనే తాపత్రయం, దూరదృష్టితో, రేపు ఏం అవుతుందో అని భయపడకుండా ఈ రోజు ఏం చేయాలి అని ఆలోచించే కర్తవ్యధోరణితో మేము కూడ అలాంటి పనులు అందుకోవాలనే ఉద్ధేశంతో కాబోలు అమ్మ వీలునామాలో రాయించిన విషయం – తన నగలు, వెండి సామాన్లు తన తదనంతరం ఎవరైనా పంచుకున్నా, వాటి ఖరీదు డబ్బు తను మొదలు పెట్టిన ఎండోమెండ్‌ ట్రస్టులో జమా చేయాలని, ఆ బడ్బుతో ఆధ్యాత్మిక పరమైన పుస్తకాలు, కాసెట్స్‌ తయరుచేయించడానికి ఉపయెగించాలని.
పిల్లలు, వారి అభివృద్ధి చస్తూ అనందించేది ఆఖరి రోజుల్లో. మేము ముగ్గురు అక్కచెల్లెళ్ళం (ఉమా రామారావు, సుమతీ కౌశల్‌, నేను) 2006లో డిశంబరు 21 నుంది 26, వరకు కూచిపూడిలో జరిగిన నృత్యాత్సవాలలో పాల్గొనడానికి సన్నాహం అవుతున్నపుడు, తన ఆరోగ్యం నాజూకుగా ఉన్నా. ఇలా ముగ్గురం అక్కచెల్లెళ్ళు మూడు వివిధ అంశాలలో పాల్గొనడం మొదటి సారి అని (ఉమా అక్కయ్య శిష్యుల చేత ప్రదర్శన ఇప్పిస్తే, అరవై ఆరేళ్ళ సుమతీ అక్కయ్య ఒక కాలు ఫ్రాక్చర్‌ అయినా ప్రదర్శన ఇవ్వడం, నేను పరిశోధన చేసిన విషయంపై ప్రసంగం ఇవ్వడం) (ఒక విశేషంగా చెప్పుకున్నారని చెప్పగానే తను తయరు చేసి తాతగారి పటం ముందు పెట్టిఉంచిన అక్షింతలతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ అన్న వటలు ఇవిః ”కూచిపూడి డాన్స్‌ అంటే.. అదీ కూచిపూడిలో ఉన్నవాళ్ళు విద్యని గంగాళాలు, గంగాళాలు తాగి ఉంటారు. ఆ విద్యని తాగేయడంలొ ఆ కళ వృద్ధి చెందింది. అందులో నా పిల్లలు కూడా చెంచాడేసి తాగి ఉంటారు. అందుకే వీళ్ళకి ఈ కళంటే రుచి, అభిమానం, నైపుణ్యం వచ్చిందని ఒకసారి స్టేజ్‌ మీద చెప్పాను. గుర్తుందా? ఇంకా చెప్పాలంటే మీకు ఎక్కువగానే ఉంది. వాళ్ళకన్నా. కాబట్టి నేననేది వీళ్ళు చెంచాడు, చెంచాడు అయినా అదీ బాగా జీర్ణించుకొని, వృద్ధి పొందడానికి చాలా చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందులోని చిన్న విషయలు తెలుసుకున్నారు.”
అలాగే విజయ (విజయారామం) ముఫై ఐదు ఏళ్ళకే భర్తని కోల్పోయినా, నిలదొక్కుకొని, ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్స్టిట్యట్‌లో ఇరవైఏళ్ళకి పైగా పరిపాలన విభాగంలో డెప్యూటీ డైరెక్టరుగా కృషి చేస్తూ ఆ సంస్థ పనులలో నిమగ్నమైపోవడం చూసి ”నాకే కాని పవర్‌ ఉంటే విజయకి డాక్టరేట్‌ పదవి ఇచ్చేదాన్ని” అని మురిసిపోయింది. ఏదైన ఆలోచన వస్తే వెంటనే ఆచరణలో పెట్టే అలవాటుతో, చనిపోయే వారం ముందు జనవరి మూడో తారీఖున (నాన్నగారి జన్మదినజయంతి ఆ రోజు) ఐ ఇన్స్టిట్యుట్ తరపున వాళ్ళని పిలిచి పదిహేనువేలు విరాళం ఐదు సంవత్సరాలపాటు ముగ్గురు పేషంట్లకి ప్రతి జనవరి మూడున ఉచిత శస్త్రచికిత్స చేయడానికిగాను ఇవ్వడంలో చాల సంతృప్తి చెందింది. అంతే కాదు. నేత్రదానం చేయాలనే తన కోరిక కూడా వాళ్లకి తెలియచేసింది. ఆ ప్రకారమే మరణించిన వెంటనే కళ్ళు దానం చేసిన తర్వాత మాకు అనుమానం ఉండింది. తొంభై రెండేళ్ళు, పైగా శస్త్ర చికిత్సలతో కృంగిన శరీరం, కళ్ళు ఉపయెగపడతాయా అని. కాని రెండు కార్నియాలు ”పర్ఫెక్ట్‌ కండిషన్లో” ఉన్నాయని, వెంటనే ఇద్దరు పేషంట్లకి ఉపయెగించారని’ అప్పుడే దహనం చేసి వచ్చిన మా ఐదుగురు కూతర్లకి వారందించిన తృప్తికరమైన సమాచారం.
అందరాని లోకాలకి తరలి వెళ్ళిపోయినా, మరువలేని మాటలు, ఆదర్శాలు మాకు వదిలిన సౌభాగ్యం, మా అమ్మ కావడం మా భాగ్యమే!
రాజ్యలక్ష్మి సేఠ్‌ సౌభాగ్యం గారి ఆఖరి అమ్మాయి.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.