స్త్రీవాదోద్యమ ద్వితీయ దశ

పి. సత్యవతి

ఇప్పటివరకూ రాగం భూపాలం శీర్షికలో స్త్రీవాదోద్యమ రెండవ దశగా భావించే 1960-80ల మధ్యకాలంలోనూ, అంతకు ముందూ స్త్రీల చైతన్యాన్ని మెరుగుపరిచే దిశగా కృషి చేసిన అనేకమందిని గురించి చెప్పుకున్నాం.

ఇప్పుడు ఈ ఇరవై సంవత్సరాల కాలంలో జరిగిన పరిణామాలను సింహావలోకనం చేసుకుని, స్త్రీ వాదోద్యమపు మూడవ దశ గురించి ఆలోచిద్దాం. స్త్రీ వాదోద్యమం స్త్రీల ప్రాధమిక హక్కులైన ఓటు, చదువు, ఆస్తి మొదలైన వాటికోసం ప్రారంభమైంది.అది మొదటిదశగా చెప్పుకుంటే స్త్రీలు తమ వ్యక్తిగత జీవితాలలోని రాజకీయాలను, పితృస్వామ్య సమాజ స్వభావాన్ని గుర్తించి, అన్ని రంగాలలోన తమపై కల అణచివేతనూ, వివక్షను ప్రశ్నించడం ప్రారంభించడాన్ని రెండవ దశగా చెప్పుకోవాలి.ఈ ఇరవై సంవత్సరాల కాలంలోనూ అమెరికన్‌ స్త్రీల విషయంలో జరిగిన ముఖ్య సంఘటనలు కొన్ని :
1963వ సంవత్సరంలో అమెరికన్‌ సమాజంలో స్త్రీల స్థాయిని అంచనా వేయడానికి నియమింపబడిన సంఘం తన నివేదికలో, ఆ దేశంలోని స్త్రీల జీవితాలకి సంబంధించిన అన్ని అంశాలలో వివక్ష కొనసాగుతున్నదని స్పష్టం చేసింది. అదే సంవత్సరం బెట్టీఫ్రీడన్‌ వ్రాసిన ఫెమినైన్‌ మిస్టిక్‌ అనే పుస్తకం స్త్రీల చుట్ట సమాజం అల్లిన భ్రాంతి భావనలను బద్దలు కొడుత స్త్రీలందర తమకు నిర్దేశించిన ఆదర్శ తల్లి,గృహిణి పాత్రలలో ఆనందంగా యిమిడిపోలేదని ఫ్రీడన్‌ తన పుస్తకంలో అనేకమంది స్త్రీలను ఇంటర్వ్య చేయడం ద్వారా నిరూపించింది.ఈ పుస్తకం అమెరికన్‌ సమాజంలో సంచలనం సృష్టించింది.1964లో అమెరికన్‌ సివిల్‌ రైట్స్‌ చట్టం ఆమోదింపబడింది. దీని ద్వారా పని ప్రదేశాలలో జాతి, లింగ వివక్షతలను ప్రభుత్వం నిషేధించింది. ఈ బిల్లులో లింగ వివక్ష అనే పదాన్ని ఆఖరి క్షణంలో జోడించారని అంటారు. అయితే చట్టపరంగా లింగ వివక్ష లేకపోయినా ఆచరణలో అది స్థిరంగా ఉండిపోవడాన్ని ప్రతిఘటిస్తూ 1966లో ”నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ విమెన్‌” ను ప్రారంభించారు. ఈ సంస్థ ప్రారంభకులలో బెట్టీ ఫ్రీడన్‌ ఒకరు. తరువాత విద్యారంగంలో వివక్షను నిషేధించే చట్టం 1972లో వచ్చింది. 1970లలోనే రాడికల్‌ స్త్రీవాదం ప్రారంభమైంది. చట్టాల వలన వివక్ష అంతరించదనేది అనుభవ సత్యంగా మిగిలింది. అందువలన సమాన హక్కుల సవరణను రాజ్యాంగంలో పొందుపరచాలని స్త్రీల సంఘాలు పోరాటం సాగించాయి. అయితే దీని వ్యతిరేకులు కొందరు, సమాన హక్కులు సమాజంలో తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయని వాదించడం మొదలు పెట్టారు. పురుషులు కుటుంబాలను విడిచి పెడతారనీ, స్వలింగ వివాహాలు ఎక్కువవుతాయనీ వాదించారు. ఈ బిల్లును ధృపపరిచే వేళకి అమెరికాలోని ఇంకా మూడు రాష్ట్రాలలో దీనికి ఆమోదం రాలేదు.
1973లో 50 రాష్ట్రాలలో గర్భస్రావాన్ని చట్టబద్ధం చేశారు 1970 దశకం చివర్లో స్త్రీవాద ఉద్యమకారిణుల మధ్య అభిప్రాయలలో తేడాలొచ్చాయి. అనేక సమస్యలు చర్చకు రావడమే ఇందుకు కారణం. యంటీ పోర్నోగ్రఫీ వర్గం, సెక్స్‌ పాజిటివ్‌ ఫెమినిజం అంటూ చీలిపోయరు.
అప్పుడు ప్రారంభమైన పత్రికలలో గ్లోరియా స్ట్రీనం స్థాపించిన పత్రిక, అనే స్త్రీల వార్తాపత్రిక, బ్రిటన్‌లో వచ్చిన అనే పత్రిక ముఖ్యమైనవి. ఇందులో స్పేర్‌ రిబ్‌ తప్ప మిగతావి ఇప్పటికీ నడుస్తున్నాయి.
పితృస్వామ్య రాజకీయలను ప్రశ్నించడం, స్త్రీలకు అన్నిరంగాలలో ప్రవేశాన్ని సాధించడం మొదలైన ఎన్నో హక్కులను సాధించిన రెండవదశ తరువాత స్త్రీవాదం బలహీనపడిందనే మాట వినిపిస్తూ వుంటుంది. ఆ ఉత్తేజం ఎక్కడికీ పోలేదు అందులోని మంచినంతా జీర్ణించుకుని మూడవ దశ (థర్డ్‌ వేవ్‌)లోకి అడుగు పెట్టింది.

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.