ముజఫర్‌నగర్‌ నరమేధం – బాధితుల గోడు

– భండారు విజయ 

పచ్చని చెఱకు తోటలు తియ్యని సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆకాశం అప్పుడప్పుడు జల్లెళ్ళతోటి వర్షాన్ని కుమ్మరిస్తోంది. రోడ్లన్ని బురదతో చితుకుచితుకుగా… చిత్తడయి దారి అంతా గుంటలు, రాళ్ళకుప్పలు, గులకరాళ్ళు డబ్బాలో వేసి ఊపినట్లుగా, ఎప్పుడు ఏ పార్టు కారు నుండి విడిపోతుందో తెలియదు. ఢిల్లీ నుండి నూరుమైళ్ళ పైన మా ముజఫర్‌నగర్‌ యాత్ర కొంత అసౌకర్యాన్ని, అసహనాన్నీ కలిగిస్తుండగా మా మొదటి మజిలి ‘షామిలి’ మండలానికి చేరింది. మేం వెళ్ళేటప్పటికే అక్కడ ఒక చిన్న ‘కొట్టం’లాంటి ‘గ్యారేజి’ ఎదురుగా దాదాపు 80, 90 మంది దాక ముస్లిం స్త్రీలు, పిల్లలు, మగవాళ్ళు గుమికూడి ఉన్నారు. అందులో కొందరు లీడర్లు లాంటివారు మాకు సన్నని బంతిపూల దండలతో లోపలికి ఆహ్వానం పలికారు. అక్కడ ఇరుకుగా అమర్చిన కుర్చీల్లో మేం కూర్చొనగా పిల్లలు, పెద్దలు అందరూ మా ముందు కూర్చొని ఒక్కొక్కరు స్నేహపూర్వకంగా చేతులు కలుపుతూ తమ గోడును మాముందుంచే ప్రయత్నం చేసారు.

వాళ్ళంతా ముజఫర్‌నగర్‌ జిల్లాలో ‘బుదాన’, ‘షామిలి’, ‘లిజార్ట్‌’, లాక్‌, హసంపూర్‌, ముస్తాన్‌ఖేడ్‌ గ్రామాల నుంచి ప్రాణభయంతో, ఇళ్ళు పొలాలు కొల్లగొట్టబడి, కాలి బూడిద అయిపోయిన వారి వంటచెఱుకులను వదిలి పారిపోయి వచ్చినవారే! ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. కలిపితే సామూహిక విషాద వ్యథ.

ఎక్కువగా గ్రామస్తులందరూ దళిత కులాలైన జాట్స్‌, ముస్లింలు, హరిజన్‌లు. ఈ సంఘటన జరగకముందు అందరూ ఒకరితోనొకరు అన్యోన్యంగా, స్నేహంగా ఎన్నో ఏళ్ళ తరబడి సఖ్యతతో కలిసిమెలిసి వున్నవారే.

సెప్టెంబర్‌ 8వ తేదీ 2013న ఏం జరిగిందో తెలియదు. ఒక్కుమ్మడిగా కలకలం లేచింది. అప్పటివరకు ‘జాట్‌’ తెగకు చెందిన ఊరి సర్పంచు ”బిల్లు ప్రధాన్‌” ఆదరణలో ఉన్న ఊరంతా చెల్లాచెదురైపోతుండగా కొన్ని గుంపులు ఆయుధాలతో విచక్షణారహితంగా ముస్లిం ఇళ్ళపైబడి దొరికినవారిని దొరికినట్లు కర్రలతో, రాళ్ళతో కొట్టడం మొదలుపెట్టారు. ఇళ్ళలోకి జొరబడి ఆడవాళ్ళను, పిల్లలను బయటకు లాగి, వివస్త్రలను చేసి, ఇళ్ళల్లోని వస్తువులను బయటకు విసిరేస్తూ, చిందరవందర చేస్తూ వస్తువులపై పెట్రోలు కుమ్మరించి నిప్పు పెట్టారు. మగవాళ్ళను, యువకులను, దొరికినవారిని దొరికినట్లు కర్రలతో దాడిచేస్తూ బలవంతంగా లాక్కొనివెళ్ళి ఒక గడిలో బంధించారు. ఆ తర్వాత ఆడవారిని, పిల్లలను మరొక గడిలో బంధించారు. దాదాపు 300-350 మంది ఆడవారు మగవారు లాక్‌ గ్రామంలో బందీలైపోయారు. అలా దాదాపు ఒక రోజంతా తిండి, తిప్పలు లేక లోపల నరకయాతన అనుభవిస్తూ, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతికారు. పోలీసులు వచ్చినా దుండగులపై ఎటువంటి కేసులు పెట్టకపోగా వీరినే ఊరు వదిలి వెళ్ళిపోవాలని బెదిరించటం జరిగిందని వాపోయారు.

వాళ్ళ మాటలను బట్టి తెలిసినదేమిటంటే ఈ సంఘటనకు కారణం ఇద్దరు ‘జాట్‌’ తెగకు చెందిన యువతులను ఇద్దరు ‘ముస్లిం’ తెగకు చెందిన యువకులు అటకాయించి, వారిని ఛిడాయించటమే! ‘జాట్‌’ యువకులు అలా చేయవద్దని ఎంత వారించినా, ఆ యువకులు వినకపోవడంతో జాట్‌ యువకులు దాడికి దిగారు. అదే పెరిగి, పెరిగి గాలివానలా గ్రామాల్లో మతవిధ్వంసానికి దారితీసిందని పోలీసులు చెప్పగా విన్న గ్రామస్తులు కుప్పకూలిపోయారు. గడీల్లో బంధించినవారికి పెట్టిన ఆహారాన్ని కూడా తినకుండా వారంతా ఆ రాత్రి ఆకలితో జాగారం చేసామని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. వారు పెట్టిన ఆహారం తిని కుక్కలు చనిపోయాయని, అలాంటి విషాహారాన్ని పెట్టి మమ్మల్ని చంపచూసారని మరికొందరు చెప్పారు.

అంతేకాక కొందరు ఆడపిల్లల్ని బట్టలు ఊడదీయించి, బలవంతంగా డ్యాన్సులు వేయించారని, పైశాచికంగా వారిపై చేతులు వేస్తూ క్రూరాతిక్రూరంగా వ్యవహరించారని ”బయానా” అనే 50 సం||ల మహిళ చెప్పింది.

మా ఇళ్ళను లూటీ చేసారని, కొడుకు పెళ్ళి కోసం దాచిన డబ్బులు, వస్తువులు, బట్టలు, బంగారాన్ని దోచుకొన్నారని దుఃఖంతో, భయంతో, తామంతా ప్రాణాలు నిలుపుకోవాలన్న ఆశతో వూరు వదలి పారిపోయి వచ్చామని, దాదాపుగా 5 నెలలు కావస్తున్నా మాకు ఎటువంటి సాయం ప్రభుత్వం కాని, స్వచ్ఛంద సంస్థలు కానీ చేయలేదని, ప్రభుత్వం ఇప్పటికైనా ఇళ్ళు కట్టిస్తే ఎక్కడైనా వెళ్ళి కష్టపడి బ్రతుకుతామని కొందరు చెప్పారు. ఊరు వదిలిరావటం వలన పిల్లల చదువులు ఆగిపోయాయనీ, బట్టలూ, తిండీ, మందులకన్నా ముందు మాకు ఇళ్ళు కట్టించమని ప్రాధేయపడ్డారు.

‘బుదానా’ క్యాంపులోని స్త్రీ ‘ఫర్‌జానా’ జబ్బుతో పడుకున్న తన భర్తను రక్షించుకోలేకపోయానని, ‘జాట్‌’ యువకులు తగులబెట్టిన తన ఇంట్లో తన భర్త తన కళ్ళ ముందే కాలి బూడిదై పోయాడని కన్నీరుమున్నీరుగా విలపించింది. దాదాపు 500 దాకా ఇళ్ళను వదిలి ముస్లిం వర్గం వారందరు ఊరు ఖాళీ చేసి వచ్చేసారు.

”షకీరా” అనే యువతి కూడా తన ఇల్లు కూడా పూర్తిగా లూటీ చేయబడిందని, తన ఇజ్జత్‌ను కాపాడుకోవటానికై పరుగులు తీస్తూ అన్నీ వదులుకొని, చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఊరు వదిలి పారిపోయి వచ్చానని చెప్పుకొచ్చింది.

‘షబనమ్‌’, ‘జబున్నీసా’, ‘ఇఫ్రాన్‌’లు కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టి చివరికి క్యాంపుల్లో కాలం వెళ్ళబుచ్చుతున్నవారే!

‘కుదానా’ గ్రామంలో ‘ఖుర్సిదా’ మరో ఘోరకృత్యం చెప్పింది. తన భర్తను గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికివేసారని, పోలీస్‌ స్టేషన్‌లో ఓ|ష్ట్ర ల ఫైల్‌ చేసినదాని ఫలితం లేకపోగా ఓ|ష్ట్ర ను వెనక్కి తీసుకొనకపోతే తనని కూడా చంపేస్తామని, తన ఆడపిల్లల్ని రేప్‌ చేస్తామని బెదిరించి కేస్‌ను విత్‌డ్రా చేయించారని వాపోయింది.

‘మొహాన’ అనే స్త్రీ తన హృదయవిదారకమైన గాథ చెబుతుంటే కళ్ళు చెమ్మగిల్లనివారుండరు. తన 8 సం||ల కొడుకుని ఇదే అదనుగా చూసి ఒక ‘దర్జీ’ అయిన ముస్లిం యువకుడు, ఒక ‘జాట్‌’ తెగకు చెందిన బట్టలు నేసే యువకుడు కలిసి రెండు, మూడు గంటలుగా అత్యాచారం చేసారని, ఫలితంగా అబ్బాయికి 8 కుట్లు పడ్డాయని, పోలీస్‌స్టేషన్‌లో కేస్‌ పెడ్తే, వాపస్‌ తీసుకొనకపోతే తన ఆడపిల్లల్ని కూడా రేప్‌ చేయబోయారని, అందువలన కేస్‌ వాపస్‌ తీసుకోవాల్సివచ్చిందని చెప్పుకొచ్చింది.

‘షామిలి’ బాధితుల్లో ఎక్కువశాతంమంది ‘మిలగ్‌పూర్‌’ క్యాంపులో గుడారాల్లాంటి వాటిల్లో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఒళ్ళు గడ్డకట్టుకపోయే చలితోపాటు సముద్రపు ఆటుపోటుల్లా అప్పుడపుడు కురిసే జడివానల మధ్య అన్ని గుడారాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. వర్షం లేనపుడు బయట పొయ్యిలు పెట్టి వంటలు చేసుకుంటూ రాత్రివేళ ఒక కుక్కిమంచంపై ఇంట్లోని వారందరు కూర్చొని తెల్లవార్లూ జాగారాలు చేస్తున్నారు. పిల్లలు చదువుల్లేక బిక్కుబిక్కుమంటూ గుడారాల బయట బురదల్లో ఆడుకుంటున్నారు. పిల్లల నవ్వులు, కేరింతలూ.. ‘లీజిలిరీరీరిదీవీ రిదీ ఖిరిరీవీతిరిరీలి’ ఏమో అనిపించింది.

‘బుదాన’ క్యాంపులో గల ‘లిజార్ద్‌’ గ్రామంలోని ముస్లిం ప్రజలందరు తమ, తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చనిపోయినవారు పోగా మిగిలినవారయినా తమని తాము రక్షించుకోవాలన్న ఆరాటంతో, బ్రతుకు తీపితో పరుగులు తీస్తూ వచ్చినవారే. వాళ్ళు చెప్పే అల్లర్ల అసలు కారణాలు చెబితే ఒళ్ళు జలదరిస్తుంది. ఇద్దరు ముస్లిం యువతులను ‘జాట్‌’ యువకులు కొందరు దాదాపుగా 15 రోజులు ఒక చీకటి గదిలో బంధించి వారిని పశుత్వంతో క్రూరాతిక్రూరంగా అత్యాచారం చేసినారని, వాళ్ళని రక్షించటానికి వెళ్ళిన పోలీసులకు ఆ అమ్మాయిలు దిగంబరంగానే తమ చివరి వాఙ్మూలము ఇచ్చి మరణించారని ”కందాల” గ్రామ నివాసి ‘అక్తరి’ విలపిస్తూ చెప్పింది.

‘అన్వరి’ అనే స్త్రీ తాను పరుగుపెడుతూ వస్తుంటే క్రిందపడి కాలు విరిగిపోయిందని, తన ఇంటిని కూడా కాల్చివేసారని, తాను చూస్తుండగానే ఒక స్త్రీని, ఒక పురుషుడ్ని రంపంతో కోసి ముక్కలుముక్కలుగా చేసారని, పోలీసుల కాళ్ళపైపడి రక్షించమని వేడుకున్నా, తమకు సాయం చేయలేదని, మమ్మల్ని బూతులు తిట్టి అక్కడినుంచి పంపించివేసారని చెప్పింది.

‘షకీల’ అనే మరో మహిళ తమ ‘లిజార్డ్‌’ గ్రామంలో దళితులైన ‘జాట్స్‌’, ‘చమర్లు’, ముస్లింలు అందరూ ఎన్నో ఏళ్ళ నుండి కలిసికట్టుగా జీవించేవారని, ఒక్కసారిగా విజృంభించిన ఈ గొడవల వలన ఎంతోమంది మగవారికి కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాయని, పోలీసులు చూస్తూ ఊరుకున్నారే గాని వారిని ఏమీ చేయలేకపోయారని, దాదాపుగా 12, 13 శవాలు 3 రోజులుగా అలాగే పడి ఉన్నాయని, శవాలకు పురుగులు పట్టినా అక్కడినుండి తొలగించలేదని వాపోయింది.

‘లిజార్డ్‌’ గ్రామంలో ఒక స్త్రీని అత్యాచారం చేసి చంపటం వలన ఆమె పాలుతాగే పిల్లవాడు చనిపోయిన తల్లి శవంపై పడుకొని పాలు తాగుతూ అలాగే చనిపోయాడని, అలాంటి బాలింతలు ఎందరో తమతమ పిల్లల్ని ఎత్తుకొని, మాన, ప్రాణ భయాలతో పారిపోయి వచ్చారని తాను తన తొమ్మిదినెలల కొడుకును ఎత్తుకొని పారిపోయివచ్చానని ‘నసీమ’ చెప్పింది.

‘హదీష’ అనే మహిళను జాట్‌ యువకులు కర్రలతో కొట్టడం వలన తన చేయి విరిగిపోయిందని, ‘షహాజ’ ఇల్లు తన ఇల్లు లూటీ కాబడిందని వివరించింది.

‘మరియమ్‌’ అనే స్త్రీ తన తల్లిదండ్రులను చంపి, తన తోడబుట్టిన చెల్లెళ్ళను ఎత్తుకొనిపోయారని, అందులో ఒక అమ్మాయి ఛాతిని కత్తితో నరికివేసారని, చిన్నపిల్లల్ని ఒక పెద్ద పెట్టెలో వేసి బంధించటం వలన వాళ్ళందరూ చనిపోయారని తెలిపింది.

”ఆసియా” తన భర్తను తన సవితిని తన కళ్ళముందే ముక్కలు ముక్కలుగా నరికివేసారని, తాను ఎలాగో తన పిల్లల్ని పట్టుకొని తప్పించుకొని పారిపోయి వచ్చానని, తనకు ఇప్పుడు ఈ పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కావటం లేదని కన్నీరుమున్నీరవుతూ చెప్పుకొచ్చింది.

మేము చూసిన 5 క్యాంపుల్లో కూడా ప్రతి కుటుంబంలో ఎవరినో ఒకరిని పోగొట్టుకున్నవారే! కాళ్ళు-చేతులు విరిగి ప్రాణభయంతో ఊళ్ళో వదిలి పారిపోయి వచ్చినవారే! ప్రతి బాధిత కుటుంబానికి 5 లక్షల చొప్పు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ‘276’ కుటుంబాలకు మాత్రము సహాయం చేసి తమ లెక్కల్లో ‘450’ కుటుంబాలకు ఇచ్చినట్లుగా ప్రకటించిందని వారు వాపోయారు. దానిలో కూడా వివక్ష చూపి వేరువేరు కుటుంబాలు కలిగి ఉన్నప్పటికిని ‘తల్లి, తండ్రి’ కొడుకులూ కూతుళ్ళూ అని అంతా ఒకే కుటుంబంగా తీసుకొని లెక్క కట్టిందని వారు చెప్పారు.

అంతేకాకుండా అన్ని క్యాంపులూ దళారుల గుప్పెట్లో ఉండి దళారులను మచ్చిక చేసుకొన్నవారికి మాత్రమే అప్పుడప్పుడు సహాయాలు అందుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ఎన్నిమార్లు ఆయా పేర్లను లిస్టులో రాసుకొని పోయినా, తమకు ఎటువంటి సహాయము ఇంతవరకు అందలేదని చెప్పటం జరిగింది. సర్వేలు చేయాల్సిన అధికారులు దళారులు ఇచ్చిన పేర్లనే నమోదు చేయటం వలన సహాయం అందవల్సినవారికి, చేరవల్సినవారికి అందటం లేదని తాము ఎన్నిసార్లు తహసిల్దార్‌ ఎం.డి. ఇస్లామ్‌ చుట్టూ తిరిగినా, ఎస్‌.డి.ఎమ్‌. పి.కె.శర్మగారి చుట్టు తిరిగినా న్యాయం జరుగలేదని బాధపడ్డారు. సమాజ్‌వాద పార్టీ మినిస్టర్‌ ‘బిలిందర్‌ గుజ్జాల్‌ బిస్లా’ను కలిసి ఎన్ని మెమొరాండాలు సమర్పించినా న్యాయం జరుగలేదని క్యాంపుల్లో ఉండే యువకులు ఆవేదనతో చెప్పారు. మాకొక యం.ఎల్‌.ఏ. సెల్‌ఫోన్‌ నెంబరు ఇచ్చి అతనితో వాళ్ళ గురించి ఫోన్‌ చేసి మాట్లాడమని కోరారు.

‘లిజార్డ్‌’ ‘హాసన్‌లార్‌’ క్యాంపులోని కొందరు ముసలివాళ్ళు ‘మస్తాన్‌’ భేడ్‌ గ్రామంలోకి ధైర్యాన్ని కూడదీసుకొని వెళ్ళారనీ కానీ చావు ఎటువైపు నుండి కబళిస్తుందో అని బిక్కుబిక్కుమంటూ అక్కడ జీవిస్తున్నారు. స్త్రీలు, పిల్లలు, యువకులు, యువతులు మాత్రం చలికి, వర్షానికి, వణుకుతూ, తడుస్తూ అరకొర వసతులు కూడా లేని గుడారాల్లో తలదాచుకుంటున్నారు. అక్కడంతా సామూహికమే – ఏదీ ఎవ్వరూ వేరువేరు కాదు… ఆకలీ, అభద్రతా, అనారోగ్యాలూ, అగమ్యగోచరాలు, సమస్యలూ, చావులూ అన్నీ అందరికి ఒక్కటే. ఒక్కొక్కరికీ రాత్రీపగలూ అనేకానేకమైన చావులు –

మంచుకొండలూ, పచ్చని చెరుకూ, గోధుమ ఆవాల అందమైన పంటపొలాలూ, చేన్లూ, పాడిపశువులూ, ప్రజలూ, ప్రభుత్వాలు, పరిపాలనలూ పవిత్రంగా పరమశాంతి సహనాలతో సహజీవనం చేసే పౌరసమూహాల జీవనదృశ్యాలు. నిజమేనా నిజమే మీరూ వెళ్ళండి. రెండువేల మైళ్ళు ప్రయాణించి మీకోసం వచ్చామని వారిని అక్కున చేర్చుకొని విలపించండి. గుండె నిండిన భారం కొంచెమైనా తగ్గుతుందేమో చూద్దాం – రాతిబండల్లా గడ్డకట్టుక పోయిన మన అంతరంగాలు కొంచెమైనా రుగుతాయేమో చూద్దాం.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో