సామాన్యుల్ని అంచులకి నెట్టివేస్తున్న ‘నూతన ఆర్థిక విధానం’

– డా|| రమా మెల్కోటె

వేపచెట్టు చుట్టూ ఈ రోజు చాలా రాజకీయాలు నడుస్తు న్నాయి. వేపచెట్టు ఉపయోగాల గురించి మనందరికి తెలిసిందే. కాని, మన ఇళ్ళ చుట్టూ ఎక్కడ పడితే అక్కడ కనిపించే వేపచెట్లు మనకు చెందకుండా అవి ఏదో కంపెనీకో లేక ఏదో పెట్టుబడిదారుకో చెందినవంటే, నమ్మడానికి వీలు కాదు. కాని ఇప్పుడు మనదేశంలో జరుగుతున్నదదే. వేపచెట్టుతో వచ్చే సహజమైన క్రిమిసంహారక మందుల (లీరిళిచీలిరీశిరిబీరిఖిలిరీ) ను తయారుచేసే పేటెంట్‌ను రాబర్ట్‌ లార్సన్‌ అనే అమెరికా పౌరుడు కొని తన స్వంతం చేసుకొన్నాడు. (పేటెంట్‌ నెం. 4,556,562). పేటెంట్‌ పొందడం అంటే ఆ వస్తువును తయారుచేయడంలో గుత్తాధిపత్యం పొందడం. మరెవరికీ దాన్ని తయారుచేసే హక్కు లేకుండా చేయడం. రాబర్ట్‌ లార్సన్‌ తన పేటెంటును డబ్ల్యు.ఆర్‌.గ్రేస్‌ & కం. అనే అమెరికన్‌ కంపెనీకి పెద్ద లాభానికి అమ్మివేశాడు. అంటే ఇప్పుడు మనదేశ ప్రజలకు వేపచెట్టుతో వచ్చే ఎరువులు కాని మందులను కానీ తయారుచేసే హక్కు, అధికారాలు ఉండవు. డబ్ల్యు.ఆర్‌. గ్రేస్‌ కంపెనీ కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూరు జిల్లా అంతరాసన హల్లి గ్రామంలో రోజుకు 20 టన్నులు అమెరికాకు ఎగుమతి చేయగలిగేట్టుగా క్రిమిసంహారక వేప మందులను తయారుచేసే ఫ్యాక్టరీ తెరవబోతున్నారు. ప్రపంచంలో వేప మందులను మొదటిసారిగా వ్యాపారాత్మకంగా తయారుచేస్తున్నామని ఈ కంపెనీ చెప్పుకుంటున్నది. ఇది ఏమాత్రం నిజంకాదు. మన దగ్గర ఎన్నో చిన్న పరిశ్రమలు ఎప్పటినుంచో తయారుచేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అమెరికా పేటెంటు హక్కులు పొందితే, మనదేశంలో ఉండే సహజ సంపదపైనా దాని గురించి మనకుండే జ్ఞానంపైనా మనకే అధికారం లేకుండా పోతుంది. (వేపమందుల మీద పేటెంట్‌ హక్కులను ఎంతోమంది వ్యతిరేకిస్తూ ప్రచారం చేస్తున్నారు.) మన దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పుల్లో ఇది ఒక ముఖ్యమైన మార్పు. ఇది నూతన ఆర్థిక విధానంలో (శ్రీజూఆ) లో ఒక భాగం. దీని పాలసీ, ఇది తేబోయే మార్పులు, ప్రభావం ముఖ్యంగా స్త్రీలపైనా, వెనుకబడ్డ తరగతుల పైనా వుంటుంది. అయితే దీనికి కారణాలు తెలుసుకోవాలంటే నూతన ఆర్థిక విధానం గురించీ, దాని రాజకీయాల గురించి కొంత తెలుసుకోవాలి.

గత కొద్ది సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం, పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, ఆకాశాన్నంటుతున్న ధరలు – ఇవన్నీ ఆర్థిక సంక్షోభానికి దారితీసాయి. కొంతమంది మనదేశంలో వుండే ‘సోషలిజమే’ దీనికి కారణమని – అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పబ్లిక్‌ సెక్టార్‌, నిత్యావసరాలు ప్రజలకందుబాటులో వుండేట్టుగా ప్రభుత్వం విధించినటువంటి ‘ధరల నియంత్రణ’ (ఆజీరిబీలి బీళిదీశిజీళిజిరీ), రైతులకు ఇచ్చే రాయితీలు, ప్రైవేటు సెక్టరు పైన ఉన్న నియమాలు, ఎగుమతి దిగుమతులపై వుండే నియమాలు (్పుళిదీశిజీళిజిరీ) – ఇవన్నీ కారణమంటారు. అందుచేత ఆర్థిక వ్యవస్థను సరిదిద్దాలంటే ఇవన్నీ పోయి ప్రభుత్వం వీలైనంత తక్కువగా కలుగజేసుకుని, పరిశ్రమలను ప్రైవేటు రంగానికి వదిలి, ఆర్థిక వ్యవస్థను మార్కెట్‌ శక్తులకు వదిలినట్లయితే, పోటీ వల్ల ఉత్పత్తి పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుందని, దేశంలో ఉత్పత్తి చేసే వస్తుత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మకం (ఐబిజిలిబిలీరిజిరిశిగి) వుంటుందని అంటున్నారు. ఈ అవగాహన నుంచే నూతన ఆర్థిక విధానం రూపొందించబడింది.

నూతన ఆర్థిక విధానం అర్థం చేసుకోవాలంటే గత చరిత్ర గురించి కూడా కొంత తెలుసుకోవడం అవసరం. అతి క్లుప్తంగా చెప్పాలంటే దేశంలో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదం, వలస విధానాలు, వాటి ప్రభావాలు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వ విధానాలు. వీటిని ఇక్కడ పూర్తిగా విశదీకరించక పోయినప్పటికీ, 1947 తర్వాత వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి. రాజులచే పాలించబడ్డ రాష్ట్రాలు (ఆజీరిదీబీలిజిగి ఐశిబిశిలిరీ) (ఉదా : నిజాం, ట్రావెన్‌కోర్‌, ఝనాగడ్‌, జయపూర్‌ మొదలైనవి) స్వతంత్ర భారతదేశంలో కలిసిపోవడం, జమీందారీ, జాగిర్దారీ, తాలుగ్దారీలు అంతం కావడం, ఇవన్నీ దేశాన్ని రాజకీయంగా ఒకటిగా చేసింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెసు పార్టీ, నెహ్రూ నాయకత్వంలో ఒక ఆర్థిక విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఇది 1955లో కాంగ్రెసు పార్టీ జారీచేసినటువంటి ఆవడి తీర్మానంలో రూపొందించబడ్డది. ఇది ‘సోషలిజం’ ఆధారమైనటువంటి సమాజాన్ని (ఐళిబీరిబిజిరిరీశిరిబీ ఆబిశిశిలిజీదీ ళితీ ఐళిబీరిలిశిగి) స్థాపించటం ధ్యేయంగా ప్రకటించుకుంది.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, రాజకీయ పార్టీలలో వచ్చినటువంటి విబేధాలు, కలహాలు, ప్రజాఉద్యమాలు, విదేశీ పెట్టుబడిదారుల ఒత్తిడి, ఇవన్నీ కూడా కాంగ్రెసు పార్టీలో వివాదాలను రేకెత్తించాయి. గాంధీ అవగాహన ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెసుపార్టీ అధికారంకై పోరాడకుండా, ప్రజాతంత్ర సమాజాన్ని నిర్మించడానికి పూనుకోవాలి; సామాజిక ఆర్థిక వ్యవస్థలో గ్రామరాజ్యం, పంచాయితీలు రాజకీయ అధికారాన్ని చేపట్టాలి; కేంద్రీకృతమైన రాజ్యాధికారం కాకుండా, వికేంద్రీకృతమైన గ్రామ పంచాయితీలు అధికారాన్ని చేబట్టాలి. అయితే కాంగ్రెసు పార్టీలో విభిన్న అవగాహనలు ఉన్నప్పటికీ, రాజ్యం ;(ఐశిబిశిలి), రాజ్యాధికారమే నిజమైన మార్పు తేగలుగుతుందనే ధోరణివలన (్పులిదీశిజీబిజిరిశిగి ళితీ ఐశిబిశిలి బిరీ బిదీ రిదీరీశిజీతిళీలిదీశి ళితీ ్పునీబిదీవీలి) ప్రజా ఉద్యమాల్ని, అధికార వికేంద్రీకరణను ప్రోత్సహించలేదు. దీనికి కారణం కాంగ్రెసులో మెజారిటీగావున్న భూస్వామ్యవర్గం, పెట్టుబడిదారీ వర్గం. అయినప్పటికీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యంపై అన్నివైపులనుండి వచ్చిన ఒత్తిడివల్ల భూసంస్కరణలవంటి కొన్ని మార్పులు రాక తప్పలేదు. కాని అధికారరీత్యా గ్రామాల్లోకానీ, పరిపాలనా యంత్రాంగంలో కానీ గొప్ప మార్పులు రాలేదు. ఇదివరకు బ్రిటీషువారు తెచ్చినటువంటి ఎన్నో చట్టాలు అదే విధంగా కొనసాగాయి. ఉదా : క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం.

నెహ్రూ దృక్పధంలో దేశంలో ఉన్నటువంటి విచ్ఛిన్నకరమైన శక్తులు, మతం, కులం, భాషాతత్వ అహంకారాలను ఎదుర్కోవాలంటే, ముఖ్యంగా పరిష్కరించాల్సింది దేశం యొక్క ఆర్థిక సమస్యలు, దారిద్య్రం, నిరుద్యోగం. దీనికి మార్గం త్వరితగతిలో పారిశ్రామికీకరణ, సహకార సమిష్టి (బీళిళిచీలిజీబిశిరిఖీలి) వ్యవసాయం, ఈ రెండింటికీ కూడా ఆధునిక రాజ్యం, ప్రభుత్వ యంత్రాంగం అవసరం. అంతేకాకుండా రాజ్య పర్యవేక్షణలో ప్రణాళికలు (చీజిబిదీదీరిదీవీ) అంటే ఆర్థిక మార్పులకై మనకున్నటువంటి వనరులను (జీలిరీళితిజీబీలిరీ) క్రమబద్ధంగా, సక్రమంగా వాడటం, ఉత్పత్తిని పెంచడం ద్వారా అభివృద్ధి తేవడం. ఈ ఆధునికీకరణ ద్వారా అభివృద్ధిని తేవడమనేది రెండవ పంచవర్ష ప్రణాళికలో రూపొందించబడ్డది (1957-62). దీని ప్రకారం ఆధునిక అంటే సాధారణంగా పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం, వ్యవసాయ రంగంలో కూడా యంత్రీకరణ (ళీలిబీనీబిదీరిచిబిశిరిళిదీ) ప్రవేశపెట్టి అభివృద్ధి చేయడం మొదలైనవి, రాజ్యం, రాజ్యాధికారానికి, ప్రభుత్వ యంత్రాంగానికి అధికారం ఎక్కువ చేయడమే కాకుండా కేంద్రీకృతం కూడా చేశాయి. నెహ్రూ దృక్పథంలో ఆధునికీకరణ, పారిశ్రామికీకరణ రాజ్యపరివేక్షణలో జరగవలసిన ముఖ్యమైన మార్పు. ప్లానింగ్‌ ద్వారా ఆర్థికమార్పును, అభివృద్ధిని రాజ్యం తేగలుగుతుందనే ధోరణి ఒక విధంగా రాజకీయాల నుంచి ఆర్థిక సమస్యలు, వాటి పరిష్కరణపై దేశం దృష్టిని మళ్ళించింది. ఆర్థిక అభివృద్ధిలో ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతనే గుర్తించారు తప్ప మౌలికమైన మార్పులను తీసుకురావటంలో సామాన్య ప్రజల పాత్రను గుర్తించలేదు. ఉదా : జాగిర్దారీ, జమిందారీ వంటి వ్యవస్థలను రద్దుచేసినప్పటికీ, అత్యధికశాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నప్పటికీ భూసంస్కరణలను అమలులో పెట్టటానికి కృషిచేయలేదు. వయోజన ఓటు హక్కు అందరికీ (ఏదీరిఖీలిజీరీబిజి బిఖితిజిశి తీజీబిదీబీనీరిరీలి) రావడంవల్ల వెనకబడ్డ తరగతుల, కులాలలో ఒక కొత్త చైతన్యం రావడం, దేశమంతటా ఉద్యమాలు, సమ్మెలు, అన్నింటికంటె ముఖ్యంగా భాషా రాష్ట్రాలకై ఉద్యమాలు ఇవన్నీ మొదటి ఎన్నికల (1952) తర్వాత స్పష్టంగా కనిపిస్తాయి. కాంగ్రెసు పార్టీ 70% సీట్లను 45% ఓట్లతో పార్లమెంటులో గెలుచుకుంది. ఆవడి తీర్మానం ప్రకారంగా, కాంగ్రెసు పార్టీ తన అధికారాన్ని, రాజ్యం యొక్క అధికారాన్ని (జిలివీరిశిరిళీరిరీలి) ‘సోషలిజం’ పేరుతో సమర్ధించుకోవడానికి పూనుకుంది. అయితే ఈ సోషలిజం ప్రజాఉద్యమాల ద్వారాకానీ, అధికార వికేంద్రీకృతం ద్వారాకాని, సంస్థాగతమైన రాడికల్‌ మార్పులు ద్వారాకానీ కాకుండా, కేంద్రప్రభుత్వ పర్యవేక్షణలో పారిశ్రామికీకరణ ద్వారా, అంటే కాంగ్రెసు పార్టీ ఆధిపత్యంలో రావలసినటువంటి మార్పు. దీన్ని రాజ్య పెట్టుబడిదారీతనం (ఐశిబిశిలి ్పుబిచీరిశిబిజిరిరీళీ) అని కొందరు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ (ఖరినిలిఖి లిబీళిదీళిళీగి) అని కొందరు వర్ణించారు.

ప్రణాళిక ప్రకారంగా పారిశ్రామికీకరణకై కావలసిన వనరుల (ష్ట్రలిరీళితిజీబీలిరీ) ను చేకూర్చే సామర్థ్యం, శక్తి ఒక్క రాజ్యానికే ఉందని, రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక పెట్టుబడిదారుల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వమే భారీ పరిశ్రమలను (స్టీలు లాంటివి), పారిశ్రామికీకరణకు కావలసిన సాధన సామగ్రి (|దీతీజీబిరీశిజీతిబీశితిజీలి) (రైల్వేలు, రవాణా)ను నిర్మించడానికి పూనుకుంది. అంతేకాకుండా చిన్నరైతు, వ్యవసాయదారుల అవసరాలను తీర్చడానికి మధ్య దళారులను (ఆబిజీబిరీరిశిరిబీబిజి రిదీశిలిజీళీలిఖిరిబిజీరిలిరీ) తొలగించడం, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సంస్థలను నిర్మించడానికి కూడా నిర్ణయించింది. అదే విధంగా వివిధ వృత్తులపై జీవించే మధ్యతరగతి (ఆజీళితీలిరీరీరిళిదీబిజి ్పుజిబిరీరీలిరీ) వారి కొనుగోలు శక్తి పెంచడానికి, నిరుద్యోగం నిర్మూలించడానికి ముసాయిదాలు వేసింది.

ఈ విధంగా దేశంలో మొదటి దశలో కాంగ్రెసు ప్రభుత్వం నిర్ణయించిన పాలసీ ప్రకారంగా పాశ్చాత్య దేశాల్లో జరిగినట్లుగా పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ ద్వారా దేశసమైక్యత, అభివృద్ధి చేకూర్చాలనే విధానాలను పాటించింది. అయితే ఇటువంటి పారిశ్రామికీకరణకు కావలసిన పెట్టుబడులు దేశంలోనే కాక విదేశాల నుంచీ కూడా తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద, పెద్ద స్టీలు ప్లాంట్‌లు (భిలాయ్‌, దుర్గాపూర్‌, రూర్కెలా) డామ్‌లు (బాక్రానంగల్‌) లాంటివి కట్టడం జరిగింది.

నెహ్రూ వాటిని ”ఆధునిక దేవాలయాలన్నాడు”. ఈ పారిశ్రామికీకరణ వల్ల కొంత అభివృద్ధి జరిగినప్పటికీ పారిశ్రామికీకరణ ద్వారా ఆధునికీకరణ పేరుతో ప్రాథమిక విద్యకు, అక్షరాస్యతకు ప్రాముఖ్యతనివ్వకపోవటం, కేవలం ఉన్నత విద్యకూ, ప్రత్యేకమైన విద్యకూ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల సామాన్య ప్రజలకు విద్య అందుబాటులో లేకుండా పోయింది. దానితో క్రమంగా పెరుగుతున్న నిరుద్యోగం, ప్రాంతీయ విభేదాలు, పెరుగుతున్న ధరలు, దానికితోడు పాకిస్తాన్‌, చైనా దేశాలతో యుద్ధాలు, పెరుగుతున్న రక్షణ బడ్జెటు, వీటన్నింటికీ మించి కాంగ్రెసులో పెరుగుతున్న అవినీతి, ఇవన్నీ కలిసి 1960లలో ఒక కొత్త సంక్షోభాన్ని కలిగించింది. ప్రజాఉద్యమాలు, కాంగ్రెసు వ్యతిరేకత ఇవన్నీ పెరిగి 1967లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాయి. (1957లో కేరళలో మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కేంద్రప్రభుత్వం దాన్ని తొలగించి రాష్ట్ర పరిపాలనను స్థాపించింది.) ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెసు పార్టీ తన అధికారాన్ని పునర్‌స్థాపించడానికి కొత్త పాలసీలు (చీళిచీతిజిరిరీశి చీళిజిరిబీరిలిరీ) ‘గరీబీ హటావో’ లాంటివి అమలులోకి తెచ్చింది. స్వయంప్రతిపత్తిగల ఆర్థికవ్యవస్థను స్థాపించకపోగా ఇదివరకు పాటించినటువంటి ఆర్థిక విధానాలు (నీలిబిఖీగి రిదీఖితిరీశిజీగి బిదీఖి బీబిచీరిశిబిజి రిదీశిలిదీరీరిఖీలి చీజీళిఖితిబీశిరిళిదీ) విదేశీ పెట్టుబడిపై ఆధారపడటాన్ని (ఖిలిచీలిదీఖిలిదీబీలి) పెంచింది. వ్యవసాయరంగంలో కూడా అభివృద్ధి లేనందువల్ల (ఆహారధాన్యాలకన్నా వ్యాపార పంటలను ప్రోత్సహించడం) – (ముఖ్యంగా 65-67) అమెరికా నుంచి ఆహారధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా విదేశీ రుణాలు 1948లో 32 కోట్ల నుండి 1967లో రూ.5,400 కోట్లదాకా పెరిగాయి. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో (61-66) సగటు జీతం అసలు పెరగలేదు. పెట్టుబడులు పెంచే అవకాశాలు పెరగకపోగా, విదేశీ సహాయం (రుణాలు) ప్రణాళిక బడ్జెటులో 28% వరకు పెరిగింది. ఈ రుణసహాయంలో అమెరికా అగ్రస్థానం వహించింది. ఇటువంటి పరిస్థితుల్లో, 1966లో ద్రవ్యోల్బణం అంటే రూపాయి విలువ తగ్గిపోవడం జరిగింది. (36.5 శాతం వరకు) అంతేకాక ప్రభుత్వం దిగుమతి విధానాన్ని (|ళీచీళిజీశి చీళిజిరిబీగి) సరళీకృతం చేసి మార్కెటు శక్తులను ప్రోత్సహించింది.

భారత ప్రభుత్వం కొత్త విధానాలను అవలంబించసాగింది. అయితే 50లలో విదేశీ పెట్టుబడి, సహాయం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగితే 60లలో ఈ రుణసహాయం ప్రభుత్వం యొక్క అసహాయతను, అసమర్ధతను తెలుపుతుంది. ఎందుకంటే 50లలో ప్రభుత్వం యొక్క పాత్ర, ప్రణాళికల మొత్తం పెట్టుబడులలో పబ్లిక్‌ సెక్టారు వరకు కూడా 55 కోట్ల నుంచి 1,520 కోట్ల వరకు మూడవ ప్రణాళికలో పెరిగింది. అంతేకాక ప్రైవేట్‌ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఈ క్రింది సంస్థల ద్వారా దీర్ఘకాలిక రుణాలను కూడా ఇవ్వగలిగింది. అవి ఇండియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (|దీఖిరిబిదీ ఓరిదీబిదీబీలి ్పుళిజీచీళిజీబిశిరిళిదీ), ది నేషనల్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఊనీలి శ్రీబిశిరిళిదీబిజి |దీఖితిరీశిజీరిబిజి ఈలిఖీలిజిళిచీళీలిదీశి ్పుళిజీచీళిజీబిశిరిళిదీ), స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐశిబిశిలి ఓరిదీబిదీబీలి ్పుళిజీచీళిజీబిశిరిళిదీ) అయితే వ్యవసాయ రంగంలో సంస్కరణలు వచ్చినప్పటికీ 46 శాతం భూమి 10 శాతం భూస్వాముల చేతుల్లో ఉండిపోయింది. పేదరికంలో ఉన్న గ్రామీణ ప్రజల సంఖ్య 1960-61లో 38 శాతం నుంచి 64-65లో 45 శాతం వరకు పెరిగింది. 50 శాతం పట్టణవాసులు బీదరికంలో ఉన్నట్లు ఆర్థికవేత్తలు విశ్లేషించారు.

నెహ్రూ చనిపోకముందు ప్రణాళిక, ఆధునికీకరణ సరియైన పద్ధతిలో నడవలేదని ఆర్థిక పురోగమనం మానవతా దృక్పధంతో నడవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే నెహ్రూ వియన్‌ మోడల్‌ అనబడే పారిశ్రామికీకరణ పద్ధతిలోనే వైరుధ్యాలుండటం వల్ల అది అనుకున్న ఫలితాలను తీసుకురాలేకపోయింది. పెద్ద పరిశ్రమలు, ఆనకట్టలకు కావలసిన పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం ఇవన్నీ కూడా ఎక్కువ ఖర్చుతో దిగుమతి చేయడం అవసరమయింది. అంతేకాక ప్లానింగ్‌ ద్వారా రాజ్యం, రాజ్యాధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజల అవసరాల్ని కూడా కాంగ్రెసు ప్రభుత్వం తీర్చలేకపోయింది. 1964లో నెహ్రూ చనిపోయిన తర్వాత కాంగ్రెసులో చీలికలు రావడం, ఇందిరాగాంధీ అధికారంలోకి రావటం జరిగింది.

పెరుగుతున్న కాంగ్రెసు వ్యతిరేకత ఎదుర్కోవడానికి ఇందిరాగాంధీ విప్లవాత్మకంగా అనిపించే కొన్ని విధానాలను ప్రవేశపెట్టింది. 10 సూత్రాల ప్రోగ్రామ్‌ ద్వారా బ్యాంకులు, జనరల్‌ ఇన్స్యూరెన్స్‌, విదేశీ వ్యాపారాన్ని జాతీయం చేసింది. ప్రజల అవసరాలు తీర్చడానికి ఆహారధాన్యాలు, పౌరసరఫరాల వ్యవస్థ (ఆతిలీజిరిబీ ఈరిరీశిజీరిలీతిశిరిళిదీ ఐగిరీశిలిళీ) ద్వారా పంపిణీ చేయడం, సహకార సంఘాలను బలపరచడం, గుత్త పెట్టుబడిని ప్రభుత్వం క్రమబద్ధం (జీలివీతిజిబిశిలి) చేయడం, పట్టణ ఆస్తి (ఏజీలీబిదీ ఆజీళిచీలిజీశిగి) ని కంట్రోలు చేయడం, గ్రామీణ ప్రజలకై వివిధ ప్రోగ్రామ్‌లను అమలులో పెట్టడం, వ్యవసాయదారులకు సహాయం చేయడం, మైనారిటీలకు సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ ఇందిరాగాంధీ చేపట్టిన పథకాలు. 1971-72లో ‘గరీబీ హఠావో’ అనే నినాదంతో అగ్రకులాలతో, హరిజనులతో, మైనారిటీలతో, స్త్రీలతో ఒక కొత్త సాంఘిక అనుబంధాన్ని (ఐళిబీరిబిజి జుజిజిరిబిదీబీలి) తీసుకువచ్చింది. పాకిస్తాన్‌ యుద్ధంలో, బంగ్లాదేశ్‌ విడిపోవడంతో భారత సైన్యాల పాత్ర, రష్యా సహకారం ఇవన్నీ ఇందిరాగాంధీ నాయకత్వాన్ని బలపరచడమే కాకుండా, 72 ఎన్నికల్లో కాంగ్రెసుకు అత్యధిక మెజారిటీ వచ్చేట్లు చేసింది. అయినప్పటికీ కాంగ్రెసుపార్టీలో పోటీలు, వైరుధ్యాలు ఎక్కువ కావడం, ప్రజాస్వామ్యాయుత నిర్వహణ లేకపోవడంవల్ల అధికారం వ్యక్తీకృతం (ఆలిజీరీళిదీబిజిరిరీలిఖి ఆళిగీలిజీ) కావడం జరిగింది. అంతేకాక పెద్ద పెట్టుబడిదార్ల పాత్ర ఎక్కువ కావడం, వారి దగ్గర నుంచి కాంగ్రెసు పార్టీ విరాళాలు పెద్ద మొత్తంలో తీసుకోవడం జరిగింది. 1963-73 మధ్యలో ప్రైవేటు సెక్టారు ఆర్థికస్థోమత (జూబీళిదీళిళీరిబీ జురీరీలిశిరీ) 32 శాతం నుంచి 38 శాతం వరకు పెరిగింది. దీనిలో టాటా, బిర్లా వంతులు 40.1 శాతం వరకు!

1972-73లో ధరలు ఆకాశాన్నంటడమే కాకుండా, ప్రణాళిక అనేది లేకుండా పోయింది. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ అధికారం చాలా కొద్దిమంది సలహాపై నిర్వహించడంవల్ల పార్టీలో అసంతృప్తి, దేశంలో అస్థవ్యస్థత పెరిగాయి. వీటిని ఆసరాగా చేసుకుని 75లో అత్యవసర పరిస్థితి (జూళీలిజీవీలిదీబీగి) ప్రకటించడం జరిగింది. ఒక కొత్త ఆర్థిక పథకం – 20 సూత్రాల పథకం తయారుచేయడం, అత్యవసర పరిస్థితి పేరుతో ప్రజా ఉద్యమాలను అణచడం, ఇవన్నీ జరిగి ఇందిరాగాంధీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ కూడా త్వరలో ఓడిపోయి ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయమేంటంటే, దేశంలో ఆర్థిక పరిస్థితులు క్షీణించడమే కాకుండా వివిధ రకాల ఉద్యమాలు – పంజాబ్‌, అస్సాం, కాశ్మీర్‌ రావడంవల్ల రాజకీయ అస్థిత్వం కూడా పెరిగింది. 1984లో ఆమె హత్యానంతరం రాజీవ్‌గాంధీ అధికారంలోకి రావడం జరిగింది.

రాజీవ్‌గాంధీ పాలనలో ఆర్థిక విధానం

రాజీవ్‌గాంధీ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళతాననే ఉద్దేశంతో అంటే ఆధునిక కంప్యూటర్‌ యుగంలోకి ఆర్థిక విధానాలను రూపొందించాలని ప్రతిపాదించాడు. 1989లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక తయారుచేసింది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓడిపోయి జనతాదళ్‌ (వి.పి.సింగ్‌ ఆధ్వర్యంలో) అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రణాళికను మార్చడం జరిగింది. కాంగ్రెస్‌ పరిపాలనలో వచ్చినటువంటి నిరుద్యోగ సమస్యలు, వ్యవసాయరంగంలో సమస్యలు, సమాజంలో అన్ని అవకాశాలు కొద్దిమంది చేతుల్లో ఉండటం, మిగతా అత్యధిక జనాభా దారిద్య్రంలో ఉండటం, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు తేవడం జరిగింది. పనిచేసే హక్కు, ఎక్కువ శాతం పెట్టుబడులు గ్రామీణ ప్రాంతాలకు తరలించడం, గ్రామీణ కుటీర పరిశ్రమలు, మానవ వనరులు శ్రామిక శక్తి ద్వారా (ఉబిలీళితిజీ రిదీశిలిదీరీరిఖీలి) ఉత్పత్తి పెంచడం, వెనుకబడ్డ కులాలకు ఉపాధి కల్పించడం, కనీస వేతనాల చట్టం అమలులో పెట్టడం. అన్నింటి కంటె ముఖ్యంగా, ప్లానింగ్‌ పద్ధతిని అమలులో పెట్టడాన్ని వికేంద్రీకృతం చేయడం ఎనిమిదవ ప్రణాళిక ముఖ్య అంశాలు. ప్రణాళికలో స్త్రీలకు ప్రత్యేక పాత్ర ఉంది. స్థానిక వనరులు, నైపుణ్యం (రీదిరిజిజిరీ) సేకరించి ప్రణాళికను అమలులో పెట్టడం. దానికై స్త్రీలకు చదువు, సాక్షరతా కార్యక్రమాలు, పనులు నేర్పడానికి ట్రైనింగ్‌ కార్యక్రమాలు, పిల్లలకై సదుపాయాలు, ఉత్పత్తి విధానంలో స్థానం ఇవన్నీ కూడా కల్పించడానికి ప్రణాళిక రూపొందించబడింది. దీని ముఖ్యోద్దేశం స్త్రీలకు రాయితీలు ఇవ్వడం కాకుండా, వాళ్ళను అన్ని రకాలుగా శక్తివంతులను చేయడం. పర్యావరణ విచ్ఛిన్నం వల్ల స్త్రీలకు నీరు, ఆహారం, వంటచెరకు ఇవన్నీ కూడా అందకుండా పోతున్నాయి, కనుక పర్యావరణ సంరక్షణలో స్త్రీల పాత్రను గుర్తించి స్త్రీలకు కావలసిన సదుపాయాలను సమకూర్చడం ఒక ముఖ్యమైన విషయం. వీటన్నింటికంటె ముఖ్యంగా జనతాదళ్‌ ప్రభుత్వం మండల్‌ కమీషన్‌ సిఫార్సులను (వెనకబడిన తరగతులకు విద్యా ఉద్యోగ రంగాల్లో 27% రిజర్వేషన్లు కల్పించటం) అమలుచేయాలనే నిర్ణయం తీసుకుంది.

జనతాదళ్‌ తయారుచేసిన ప్రణాళికను జాతీయ అభివృద్ధి సంస్థ (శ్రీబిశిరిళిదీబిజి ఈలిఖీలిజిళిచీళీలిదీశి ్పుళితిదీబీరిజి) జూన్‌ 1990లో ఆమోదించింది. అయితే వి.పి.సింగ్‌ ప్రభుత్వం పడిపోవడంతో (నవంబరు 90) ప్రణాళికా సంఘాన్ని చంద్రశేఖర్‌ ప్రభుత్వం తిరిగి నియోగించింది. 6 శాతం అభివృద్ధి రేటు వచ్చేట్టుగా ప్రణాళికను జారీచేసింది. రాజీవ్‌గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పి.వి. నరసింహారావు ఆధిపత్యంలో అధికారానికి వచ్చింది. రాజీవ్‌గాంధీ ప్రారంభించిన సరళీకృత విధానాలు, కంప్యూటర్‌ యుగంలోకి దేశాన్ని అతిత్వరగా తీసుకుపోవాలన్న కలలను పి.వి. నరసింహారావు ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాల రూపంలో ప్రతిపాదించింది.

రాజీవ్‌గాంధీ ప్రవేశపెట్టిన సరళీకృత (లిబరలైజేషన్‌) పాలసీ ఎగుమతులను పెంచింది. అభివృద్ధి రేటు 17 శాతం (డాలర్లలో పెరిగింది. (86-87, 89-90) అయితే 90-91లో ఇది 9.0 శాతం తర్వాత 4.4 వరకు తగ్గిపోయింది. ఆర్థికలోటు పెరిగింది. దీనికి కారణం కొంతవరకు గల్ఫ్‌యుద్ధంవల్ల ఎక్కువ ధరకు చమురును దిగుమతి చేసుకోవలసిన అవసరం. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 1989-90లో రూ.6,273 కోట్ల నుంచి 1990-91లో రూ.10,819 కోట్ల వరకు పెరిగింది. అదే విధంగా మిషనరీ, రవాణా సామగ్రి (లివితిరిచీళీలిదీశి) దిగుమతులు 89-90లో రూ.8,559 కోట్ల నుంచీ 90-91లో 10,044 కోట్ల వరకు పెరిగింది. మొత్తం మీద లిబరలైజేషన్‌ పాలసీవల్ల దేశం యొక్క ఆర్థిక లోటు 1990-91లో (బీతిజీజీలిదీశి బిబీబీళితిదీశి ఖిలితీరిబీరిశి) 7,295 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. విదేశీ చెల్లింపు నిల్వలు చాలా తగ్గిపోయి (90 డిసెంబర్‌లో రూ.3,140 కోట్ల నుంచి 91 జూలైలో రూ.2,500 వరకు) విదేశీ రుణభారం పెరిగి చివరకు రూపాయి విలువ తగ్గించి 47 టన్నుల బంగారాన్ని చెల్లింపులు కట్టడానికి ఎగుమతి చేయాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. అంతేకాక ఫిస్కల్‌ డిఫిసిట్‌ (అంటే మొత్తం ఖర్చుకు మొత్తం రాబడికి (పన్నుల ద్వారా మరియు ఇతర రాబడి)కి ఉండే తేడా) 1989-90లో రూ.35,630 కోట్లు ఉంటే 90-91లో రూ.43,330 వరకు పెరిగింది. చాలా పెద్ద వడ్డీపై రుణాలు తీసుకుని ఈ లోటును తీర్చడంవల్ల విదేశీ రుణభారం, వడ్డీభారం ఆకాశాన్నంటాయి. (రుణభారం మొత్తం దేశీయ ఉత్పత్తిలో (స్త్రజీళిరీరీ ఖిళిళీలిరీశిరిబీ ఆజీళిఖితిబీశి) లో 55%, ప్రభుత్వ మొత్తం వ్యయంలో 20 శాతం వడ్డీ తీర్చడానికి ఖర్చవుతోంది.)

నూతన ఆర్థిక విధానం

సోవియట్‌ సోషలిస్ట్‌ రష్యా విచ్ఛిన్నమయిపోయిన క్రమంలో అమెరికా మోడల్‌ అంటే స్వేచ్ఛా వ్యాపారం, సరళీకృత మోడల్‌ ప్రపంచానికంతటికీ సరియైన విధానమనే ధోరణి ఇప్పుడు కనిపిస్తోంది. మనదేశంలో ఆర్థిక సమస్యలను పరిష్కరించాలంటే ప్రభుత్వ పాత్ర పూర్తిగా తగ్గించి ఆర్థిక వ్యవస్థను ఏ కట్టుదిట్టాలు లేకుండా చేసినట్లయితే అభివృద్ధి చెందుతుందనే అవగాహనతో ఈ నూతన ఆర్థికవిధానం రూపొందించబడ్డది. అంతేకాకుండా గల్ఫ్‌ యుద్ధం తర్వాత, పాశ్చాత్య దేశాల్లో అంతకు ముందునుంచే వస్తున్న ఆర్థికసంక్షోభం మరింత తీవ్ర పరిస్థితి దాల్చింది. కనుక ఆ దేశాలు తమ ఆర్థిక పరిస్థితుల్ని చక్కబెట్టడానికి వర్ధమాన దేశాల నుంచి రాబడి ఎక్కువ చేసుకోవటానికి సరళీకృత విధానాలను, వ్యవస్థాగతమైన (ఐజుఆ) (ఐశిజీతిబీశితిజీబిజి జుఖిశీతిరీశిళీలిదీశి ఆజీళివీజీబిళీళీలి) మార్పులను ప్రపంచ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్‌ (ఇళిజీజిఖి ఔబిదీది) ద్వారా ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.

విదేశీ మార్కెట్లలో భారతదేశ వస్తువుల అమ్మకాలు పెంచడానికి, ఎటువంటి ప్రభుత్వ నియంత్రణలు లేకుండా మార్కెట్లు స్వేచ్ఛగా పనిచేసినట్లయితే ఆర్థికవ్యవస్థ సమర్ధవంతంగా (లితీతీరిబీరిలిదీశి) గా పనిచేయగలుగుతుందనే భావనతో ఈ వ్యవస్థాగతమైన సంస్కరణలు (ఐజుఆ) రూపొందించబడ్డాయి. అయితే నిజంగా ఈ ఆర్థిక సంస్కరణలు, సరళీకృత విధానం ఎంతవరకు సామాన్య ప్రజల అవసరాల్ని తీర్చగలుగుతాయి అనేది ప్రశ్న. అంతే కాకుండా ఆర్థిక సమస్యలను తీర్చడానికి ఇది ఒకటే మార్గమా? ఈ పద్ధతులను అవలంబించిన దేశాల అనుభవం ఏమిటి? అందులో ముఖ్యంగా స్త్రీలపై దీని ప్రభావం ఏమిటి?

సరళీకృత విధానం యొక్క ముఖ్యమైన అంశాలు – (1) ప్రభుత్వ ఖజానా లోటు (తీరిరీబీబిజి ఖిలితీరిబీరిశి) ను తగ్గించడం కంటే ప్రస్తుత రాబడి కంటే ఎక్కువగా ఉంటే ఖర్చును తగ్గించడం (2) ద్రవ్య సరఫరా (ఖళిదీలిగి రీతిచీచీజిగి) ను అదుపులో పెట్టడం ద్వారా దేశీయ రుణాల పెరుగుదలను (ఖిళిళీలిరీశిరిబీ బీజీలిఖిరిశి లినిచీబిదీరీరిళిదీ) అరికట్టడం (3) ద్రవ్యోల్బణం (ఖిలిఖీబిజితిబిశిరిళిదీ) అంటే రూపాయి విలువను తగ్గించటం (4) విదేశీ వాణిజ్యాన్ని సరళీకృతం చేయడం, అంటే దిగుమతులపై క్రమంగా పన్నులను అడ్డంకులను (ఊబిజీరితీతీ లీబిజీజీరిలిజీరీ) ను తగ్గించడం, ఎగుమతులపై, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి చెందిన వస్తువులపై నిర్బంధాలను, నియమాలను తొలగించడం (5) విదేశీ పెట్టుబడి దేశంలోకి సులభంగా రావడానికి (ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులకు (ఈరిజీలిబీశి ఓళిజీలిరివీదీ |దీఖీలిరీశిళీలిదీశి) అవకాశాలు కల్పించడం (6) ధరల నియంత్రణకై నిత్యావసరాల ధరలతో సహా ఉండే కట్టుబాట్లు, నియమాలు ఎత్తివేయడం (ఖిలిజీలివీతిజిబిశిరిళిదీ) (7) సబ్సిడీలు – ముఖ్యంగా ఎగుమతులపై, ఎరువులు, ఆహారధాన్యాలపై, ఆహారపదార్థాలపై ఎత్తివేయడం. ఇది ప్రభుత్వ బడ్జెటులో ఖర్చులు తగ్గించడానికి, దేశీయ ధరలను అంతర్జాతీయ ధరలతో సరితూగేట్టు చేయడానికి (8) పబ్లిక్‌ సెక్టర్‌ను సంస్కరించడం అంటే నష్టాలకు గురిఅవుతున్న పరిశ్రమలను మూసివేయడం, పెట్టుబడులను నిరుత్సాహపరిచి రద్దుచేయడం, (ఖిరిరీరిదీఖీలిరీశిళీలిదీశి), క్రమంగా ప్రైవేటైజ్‌ చేయడం, ధరలను పెంచడం, ప్రభుత్వ రాయితీలు తగ్గించడం లేదా తీసివేయడం, (9) పెట్టుబడులను మూలధన మార్కెటును (్పుబిచీరిశిబిజి ళీబిజీదిలిశి) బలపరచడానికి, దేశీయ ద్రవ్య మార్కెటును (ఖిళిళీలిరీశిరిబీ తీరిదీబిదీబీరిబిజి ళీబిజీదిలిశి) సరళీకృతం చేయడం కొంతవరకు జరిగినప్పటికి, ఈ పాలసీ ఇంకా పూర్తిగా నిర్ణయించబడలేదు. (10) అదే విధంగా లేబర్‌ మార్కెటును సరళీకృతం చేయడం అంటే పరిశ్రమల మూసివేత సులభం చేయడం, కార్మికులకుండే రక్షణ చట్టాలను (ఆజీళిశిలిబీశిరిఖీలి ళీలిబిరీతిజీలిరీ) తీసివేయడం ఇవి కూడా ఇంకా అమలులోకి రాలేదు.

బహుళజాతి సంస్థలు మనదేశంలో పరిశ్రమలు స్థాపించడానికి అవకాశాలు కల్పించడం వల్ల, ఇక్కడ కార్మికుల శ్రమను చవక ధరలంటే తక్కువ జీతాలకు కొనుక్కుని, లాభాలు గడించి ఆ లాభాలను బయటికి పంపించే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నూతన ఆర్థిక విధానంతోపాటు, ఇప్పుడు డంకెల్‌ ప్రతిపాదనలు కూడా ఆమోదించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. చాలావరకు బహుముఖ విదేశీ వ్యాపారాన్ని (ఖతిజిశిరి జిబిశిలిజీబిజి ఊజీబిఖిలి) సరళీకృతం చేయడానికి, అంతర్జాతీయ వ్యాపారంలో (ఇళిజీజిఖి ఊజీబిఖిలి) ఉండే కట్టుదిట్టాలను, నియమాలను తీసివేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్వేచ్ఛావ్యాపార (తీజీలిలి ఊజీబిఖిలి) విధానానికి మార్చివేయడానికై ఈ ప్రతిపాదనలు చేయబడినవి. పేటెంటు విధానాల్లో మార్పులు కూడా ఈ ప్రతిపాదనలో ఉన్నాయి.

డంకెల్‌ ప్రతిపాదనలు (ఈతిదీదిలిజి ఈజీబితీశి ఊలినిశి) (ఈఈఊ)

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ వాణిజ్య వ్యాపారాన్ని కొన్ని కట్టుదిట్టాలలో ఉంచడానికి క్రమంగా దాన్ని సరళీకృతం చేయడానికి, వ్యాపారాన్ని బహుముఖం చేయడానికి ”గాట్‌” (స్త్రలిదీలిజీబిజి జువీజీలిలిళీలిదీశి ళిదీ ఊజీబిఖిలి ఞ ఊబిజీరితీతీ) (స్త్రజుఊఊ) పై సంప్రదింపులు పారిశ్రామిక దేశాల ఆధ్వర్యంలో ప్రారంభమైనాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు 1986లో ప్రారంభమైనాయి. దీనిలో అతిముఖ్యమైన విషయాలు, సాంకేతిక పరిజ్ఞాన హక్కులు (మేధోసంపత్తి హక్కులు), వ్యాపార సంబంధిత పెట్టుబడి సూత్రాలు. సూక్ష్మంగా చెప్పాలంటే వీటి ఉద్దేశం వర్ధమాన దేశాల – అదే విధంగా మిగతా అన్ని దేశాలు, జపాన్‌తో సహా, వాణిజ్యంపై ఆ ప్రభుత్వాలు ఎటువంటి కట్టుదిట్టాలు పెట్టకుండా స్వేచ్ఛ వ్యాపారానికి సదుపాయాలు కల్పించటం, అన్నింటికంటే ముఖ్యంగా పేటెంటు హక్కులకు సంబంధించిన చట్టాలను మార్చడం, ఎగుమతి దిగుమతులపై కట్టుదిట్టాలు, ప్రభుత్వ రాయితీలు కొట్టివేసి, పెట్టుబడులు, సర్వీసు సెక్టర్లను స్వేచ్ఛగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తరలించే అవకాశాలు కల్పించడం. ఈ అంతర్జాతీయ వాణిజ్య వ్యాపారాలను క్రమబద్ధం చేయడానికి అమెరికా చేసిన ప్రతిపాదనలే డంకెల్‌ ప్రతిపాదనలు అంటారు. ఇవి మూడవ ప్రపంచ దేశాలకు అతిక్లిష్టమైనవి.

పేటెంటు హక్కులకు సంబంధించిన విషయాలు వర్ధమాన దేశాల స్వయంప్రతిపత్తిపై పెద్దవేటు పెట్టే అవకాశం ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ, పారిశ్రామికీకరణ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే క్రమంలో వచ్చినవే ఈ పేటెంటు హక్కులు. అంటే ఒక కొత్త విషయాన్ని కనుగొన్నవారికి, వస్తువును తయారుచేసినవారికి ప్రభుత్వం చట్టరీత్యా ఇచ్చే కొన్ని ప్రత్యేక హక్కులు. దీని ప్రకారం ఎవరైనా కనుగొని తయారుచేసిన వస్తువును గాని, తయారుచేసిన పద్ధతి గానీ కొన్ని సంవత్సరాలవరకు మరెవరూ కూడా తయారుచేయడానికి వీలులేదు. ఈ విధంగా పేటెంట్‌ చేయబడ్డ వస్తువు, కాలపరిమితి దాటిన తర్వాత ఎవరైనా చేయడానికి, అమ్మడానికి (అంటే ప్రజలకందుబాటులోకి) స్వేచ్ఛ, అధికారము ఉంటాయి. ఇవి, నిజంగా హక్కులనే కంటే ప్రభుత్వం ఇచ్చే హామీ, సౌకర్యం అని చెప్పాలి. ప్రోసెప్‌ పేటెంట్‌ ప్రకారం వస్తువును చేసే పద్ధతిని మరెవరూ వాడటానికి వీలులేదు. అయితే వేరే పద్ధతిలో చేయవచ్చు. కాని ప్రొడక్టు పేటెంట్‌ అంటే ఆ వస్తువును ఏ విధంగానైనా, వేరే పద్ధతిలోనైనా మరెవరూ తయారుచేయడానికి వీలులేదు. అంటే ఒక విధంగా గుత్తాధికారమన్నమాట. ఈ పేటెంట్‌ హక్కుల పూర్వోత్తరాలు – ఏడవ శతాబ్దం బి.సి.లో కనిపిస్తాయి. గ్రీకు రాజులు కొత్త పంటలు కనిపెట్టిన పంటవాళ్ళకు ఒక సంవత్సరం దాకా మరెవరూ ఆ పంట చేయకుండా హక్కులిచ్చేవారట. అయితే పేటెంట్‌ చట్టాలు 2000 సంవత్సరాల తర్వాత లెనిస్‌ (ఇటలీ) లో చేతివృత్తి కళాకారుల హక్కులను భద్రపరచడానికి వచ్చాయి. అయితే సాంకేతిక పరిజ్ఞాన రంగంలో కూడా ఈ పేటెంట్‌ హక్కులున్నప్పటికీ, శాస్త్రజ్ఞులు చారిత్రాత్మకంగా వచ్చినటువంటి పరిశోధనలు, పరిజ్ఞానం లేనిదే కొత్త విషయాలు కనిపెట్టటం సాధ్యంకాదు. అందుచేత పేటెంటు హక్కుల చట్టాలున్నప్పటికీ, సామాజిక ఉపయోగానికి ప్రజలకందుబాటులో వుండేట్టుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు రానివ్వాలి. 19వ శతాబ్దంలో ఆధునిక పరిశోధనలు, శాస్త్రీయ పరిజ్ఞానం పెరగడంతో వాటిపై పేటెంటు హక్కులపై పోటీకూడా పెరిగింది. దీనితో పేటెంటు హక్కుల చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలు కూడా చాలా వచ్చాయి. మనదేశంలో 1856 నుంచి వచ్చినటువంటి (అంటే బ్రిటిష్‌వారు చేసింది) పేటెంటు చట్టాల్ని 1970లో మన స్వతంత్ర ప్రతిపత్తిని నిలబెట్టుకునేట్టుగా మార్చబడింది దీని ప్రకారంగా

(బి) ఆహార పదార్థాలు, మందులు, రసాయన పద్ధతి ద్వారా చేసిన వస్తువులపై తప్ప మిగతా వాటిపైన ప్రోడక్ట్‌ పేటెంటు హక్కులు పొందవచ్చును. అంటే ఆ వస్తువులను మరెవరూ వేరే పద్ధతిలో కూడా తయారుచేయడానికి వీలులేదు. అయితే మందులు, ఆహారపదార్థాలకు సంబంధించిన వాటిపై ప్రోసెస్‌ పేటెంటు మాత్రమే ఉంది. అంటే వాటిని వేరే ఏ పద్ధతిలో ఎవరైనా తయారుచేయవచ్చు. ఉదా: వాపు అరికట్టే మందు (లీజీబితిఖి దీబిళీలి ఓలిజిఖిలిదీలి) మనదేశంలో 10 గోలీల ఖరీదు 18 రూపాయలు మాత్రమే. అయితే అమెరికాలో దీని ఖరీదు రూ.520!!! ఎందుకంటే అమెరికాలో ఫైజర్‌ (ఆఓ|ఎజూష్ట్ర) అనే బహుళజాతి కంపెనీకి దానిపై ప్రొడక్ట్‌ పేటెంటు హక్కులున్నందు వల్ల ఆ కంపెనీ తప్ప మరెవరూ దీనిని వేరే ఏ పద్ధతిలో కూడా తయారుచేయడానికి వీలులేదు. అయితే మనదేశంలో ప్రోసెస్‌ పేటెంటు మాత్రమే ఉండటం వల్ల దీన్ని మనదేశంలో కంపెనీలు వివిధ పద్ధతుల్లో తయారుచేసి ప్రజలకు కొంతవరకైనా అందుబాటులో ఉండేట్టు చేస్తున్నారు.

(లీ) అణుశక్తి, వ్యవసాయ రంగం, హార్టికల్చర్‌ రంగంలో ఎటువంటి పేటెంటు హక్కులకు తావులేదు. అంటే ఈ రంగాల్లో మనదేశంలో ఎటువంటి పరిశోధనలు కానీ, ఏ వస్తువులను తయారుచేయడాన్ని కానీ ఎవరూ ఆపలేరు. (సాధారణంగా అణుశక్తికి సంబంధించినవి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటాయి.)

(బీ) పేటెంటు హక్కులున్న వాళ్ళు తప్పనిసరిగా ఆ వస్తువును మనదేశంలోనే ఉత్పత్తి చేయాలి. పేటెంటు హక్కులు భారతీయులు కాని విదేశీయులు కాని పొందవచ్చును.

(ఖి) జాతీయ సంక్షేమం (శ్రీబిశిరిళిదీబిజి రిదీశిలిజీలిరీశిరీ) పేటెంటు హక్కుల కంటే ముఖ్యం.

(లి) పేటెంటు హక్కులున్న వాళ్ళు ఆహార, ఔషధరంగంలో కావలసిన వస్తువులను ఉత్పత్తి చేయకపోయినా, ప్రజలకందుబాటులో ఉండే ధరలో అమ్మకపోయినా, ఈ వస్తువును మరెవరైనా ఉత్పత్తి చేయవచ్చును.

(తీ) పేటెంటు హక్కులు 14 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటాయి – ఆహార ఔషధరంగాల్లో మాత్రం 7 నుంచి 5 సంవత్సరాల వరకే. 1970 పేటెంటు చట్టం కాక, మన సాంకేతిక పరిజ్ఞాన హక్కులను భద్రపరచడానికి ఇంకా కొన్ని చట్టాలు ఉన్నాయి.

డంకెల్‌ ప్రతిపాదనలు ప్రపంచ వాణిజ్య వ్యాపార వ్యవహారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నవి. ఇవి సరళీకృత ప్రైవేటీకరణ ధోరణిలో ప్రభుత్వ పాత్రను తగ్గించడానికి పేటెంటు హక్కులను మార్చి ప్రోడక్ట్‌ పేటెంట్‌ హక్కులనివ్వడం, సర్వీసు సెక్టరు – అంటే బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ మొదలైనవాటిని ప్రైవేటైజ్‌ చేసి, విదేశీ బ్యాంకులు, కంపెనీలు కూడా ఏ కట్టుదిట్టాలు లేకుండా మనదేశంలోకి రానివ్వాలని ఒత్తిడి చేస్తున్నాయి. దీని గురించే ఇప్పుడు కొంత చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ప్రభుత్వ సబ్సిడీలు – ముఖ్యంగా వ్యవసాయరంగంలో తీసివేసి, వాణిజ్యాన్ని పూర్తిగా స్వేచ్ఛా వాణిజ్యంగా మార్చి, మార్కెటును బలపరచడానికి డంకెల్‌ ప్రతిపాదనలు ప్రయత్నిస్తున్నాయి పేటెంటు హక్కు చట్టాలను మార్చి ప్రోడక్ట్‌ పేటెంటుకై ఒప్పుకున్నట్లయితే మన పరిశ్రమలు – ముఖ్యంగా ఔషధ-వ్యవసాయ రంగంలో – నష్టపోవడమే కాకుండా మనకు చారిత్రాత్మకంగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి పరిజ్ఞానంపై మనకే హక్కులు లేకుండా పోతుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎన్నో మందులు మనదేశంలో తయారుచేసి చవక ధరల్లో అమ్మగలుగుతున్నాం. ప్రోడక్ట్‌ పేటెంట్‌ వల్ల వాటిని మనం తయారుచేసే హక్కులనే కోల్పోవచ్చు. కంపెనీలు పేటెంటు కొనుక్కొని గుత్తాధికారం పొందవచ్చు. దీనివల్ల ఎన్నో మందులు మన కందుబాటులో లేకుండా పోతాయి. అంతే కాకుండా వ్యవసాయ రంగంలో, విత్తనాలు తయారుచేయడంలో మన రైతులకు తెలిసినటువంటి మెలుకువలు, పరిశోధనల ద్వారా కనుగొన్నటు వంటి వివిధ రకాల జెనెటిక్‌ ప్లాంట్స్‌; మనదేశంలో వాడుతున్న సహజ ఎరువులు – ఇవన్నీ కూడ విదేశీ కంపెనీలు (లేదా మనదేశంలో కంపెనీలైనా) పేటెంటు హక్కులను కొని మన కందుబాటులో లేకుండా చేయవచ్చు.

సర్వీస్‌ సెక్టరులో బ్యాంకింగ్‌, ఇన్స్యురెన్స్‌, కంపెనీలు విదేశీ వ్యాపారానికి తెరిచినట్లయితే, పోటీతో మనదేశం నష్టపోవడమే కాకుండా, ఇంతవరకు ప్రభుత్వ సబ్సిడీలు, పాలసీలవల్ల పేదరైతులకు లభించే రుణాలు, రాయితీలు పోయే అవకాశముంది. విదేశీ బ్యాంకులు, కంపెనీలు లాభాలు గడించే పద్ధతిలో పేద రైతాంగం, వ్యవసాయదారుల అవసరాలను పట్టించుకోవు. అందుకే డంకెల్‌ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు వస్తున్నాయి. ఉదా: ముందే చెప్పినటువంటి వేప చెట్టు ప్రచారం. పారిశ్రామికదేశాల్లో కూడ ముఖ్యంగా ఫ్రాన్స్‌లో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ రాయితీలు ఇవ్వబడుతున్నాయి. అంతేగాక ఈ దేశాలు పారిశ్రామిక రంగంలో కూడా బహుళజాతి సంస్థల ద్వారా ప్రపంచ వ్యాపారాన్ని కంట్రోల్‌ చేస్తున్నాయి. ప్రపంచంలో 500 పెద్ద బహుళజాతి కంపెనీలు, మొత్తం వ్యాపారాన్ని (4.6 ట్రిలియన్‌ డాలర్లు) కంట్రోల్‌ చేస్తున్నాయి. దక్షిణ కొరియా తప్పిస్తే ఇవన్నీ కూడా ఉత్తరాది దేశాలకు చెందినవి. ప్రపంచ వ్యాపారంలో 2/5 వరకు ఈ బహుళజాతి కంపెనీల మధ్యలో జరుగుతుంది. అటువంటప్పుడు వాటికుండే అధికారం, ఆధిపత్యం వర్ధమాన దేశాలల్లో ఎటువంటి ప్రభుత్వ కట్టుదిట్టాలు లేకుండా సాగనిచ్చినట్లయితే ఈ దేశాలు తమ స్వతంత్ర ప్రతిపత్తిని పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. (భూమిక జూలై-సెప్టెంబరు 1993 సంచిక నుండి పునర్ముద్రణ)

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.