మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం

– కాత్యాయని విద్మహే

1990వ దశకం ప్రారంభంలో విద్యా ఉద్యోగాలలో వెనకబడిన వర్గాలకు మండల్‌ కమీషన్‌ చేసిన సిఫారసుల ప్రకారం రిజర్వేషన్స్‌ అమలుచేయాలని వి.పి.సింగ్‌ ప్రభుత్వం తలపెట్టినప్పుడు ప్రతిభకు తావులేకుండా పోతుందని, ప్రతిభావంతులు నష్టపోతారని కొన్ని వర్గాలు దానిని వ్యతిరేకించాయి. దానిని ప్రతిఘటిస్తూ ఉద్యమం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో అది విస్తృతంగానూ, తీవ్రంగానూ సాగింది. ప్రజాస్వామిక సంస్థలన్నీ ఆ ఉద్యమం వెంట వున్నాయి. వెనకబడిన వర్గాలలోకెల్ల వెనకబడినవాళ్ళు మహిళలు కనుక జండర్‌ వివక్ష మహిళలను విద్యా ఉద్యోగాది సామాజిక వ్యవస్థల అంచులకు నెట్టివేస్తున్నది కనుక రిజర్వేషన్‌ వ్యతిరేక, మండల్‌ వ్యతిరేక ఉద్యమాన్ని తాము కూడా ప్రతిఘటిం చాల్సిన అవసరం వుందని గ్రహించారు. ఆ రకంగా మహిళాఉద్యమం స్త్రీల అభివృద్ధికి అవరోధంగా వున్న సామాజిక రాజకీయార్థిక వ్యవస్థలను సంబోధిస్తూ విస్తరించింది.

అదే విధంగా 1991 ఆగస్టు 6న చుండూరులో దళితుల మీద జరిగిన దాడులను వ్యతిరేకించటం కూడా మహిళా ఉద్యమంలో భాగమైంది. చుండూరు హత్యాకాండకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలలో మహిళాసంఘాలు చురుకుగా పాల్గొన్నాయి. పీడితులలోకెల్ల పీడితులుగా స్త్రీలు పీడితజనపక్షం వహించటం సహజ మూ, సముచితమూ కూడా. ఆ క్రమంలోనే వేంపేటలో దళితుల హత్యాకాండ సందర్భం గా ఏర్పడిన వ్యతిరేక కమిటీలో మహిళా సంఘాలు భాగమయ్యాయి. ఈ అనుభవా లు మహిళా ఉద్యమంలో దళిత మహిళా కోణం బలపడటానికి ఉపకరించాయి.

1994లో తిరుపతిలో ‘మహిళా శక్తి’ నిర్వహించిన 5వ జాతీయ మహిళా సదస్సు దళిత గిరిజన ఉద్యమాల గురించి ప్రత్యేకంగా చర్చించింది. ఆ వేదిక మీద నుండే 1994 దళిత గిరిజన మహిళా సంవత్సరంగా ప్రకటించబడింది. 1998లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం బెంగుళూరులో జరిగిన సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ కమిటీ ‘దళితహక్కుల మహిళల కోసం’ ఒక పత్రాన్ని చర్చకు పెట్టింది. కులప్రభావాల నుండి ఆధిక్యతల నుండి బయటపడుతూ దళిత స్త్రీల సమస్యలను అర్థం చేసుకోవడానికి, పోరాడటానికి మహిళాసంఘాలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చాయి. దళితస్త్రీల అనుభవకోణం నుండి దళితస్త్రీల సమస్య చర్చించబడాలన్న అభిప్రాయం కూడా ఈ దశకంలో బలపడింది.

1997లో తూర్పుగోదావరి జిల్లా మునుగోపులలో గిరిజనులు తమ భూములు తమకే కావాలని చేస్తున్న పోరాటాన్ని అణచటానికి భూస్వాములకు అండగా పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జరిపారు. ‘కారం పార్వతి’ అనే మహిళ మరణించింది. భూమిహక్కుకై నిలబడిన గిరిజన మహిళపై జరిగిన ఈ దాడికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో మహిళా సంఘాలు ముందున్నాయి.

ఈ దశకంలో దేశంలో వాదవి వాదాలకు సంఘర్షణకు కారణమైన మరొక ఘటన అయోధ్యలో బాబ్రీమసీదు విధ్వంసం (1992 డిసెంబరు 6) ముస్లిం మైనారిటీ వర్గాల అస్తిత్వానికి సవాల యింది. మహిళా ఉద్యమంలో ముస్లిం మైనారిటీ కోణం అంకురించ టానికి ఇది తొలి ప్రేరణ.

ఈ దశకంలో మహిళా ఉద్య మంపై ప్రభావం చూపిన అంతర్జాతీయ ఒప్పందం సీదా. ఇది 1981 సెప్టెంబరు నాటికి 20 దేశాల ఆమోదంతో అంతర్జాతీయ స్థాయికి చేరిన ఒప్పందం ్పుళిదీఖీలిదీశిరిళిదీ ళిదీ శినీలి జూజిరిళీరిదీబిశిరిళిదీ ళితీ బిజిజి తీళిజీళీరీ ళితీ ఈరిరీబీజీరిళీరిదీబిశిరిళిదీ బివీబిరిదీరీశి ఇళిళీలిదీ (్పుజూఈజుఇ) – అన్నది ఈ ఒప్పందపు పూర్తి పేరు. 1993లో భారతప్రభుత్వం కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసింది. స్త్రీల సమానత, పౌరహక్కులు, న్యాయహక్కులు రెండు ముఖాలైతే, పునరుత్పత్తి విధులు, స్త్రీపురుష సంబంధాలను ప్రభావితం చేసే సాంస్కృతికాంశాలు కలిసి మూడవ ముఖం. ఆయా విషయాలపై వేరు వేరు రంగాలలో వివక్ష ఎలా వున్నదో తెలుసుకోవటానికి పరిష్కరించటానికి పూచీపడిన ప్రభుత్వం సర్వేలకు దిగింది. నివేదికలను కోరింది. ప్రభుత్వ నివేదికలకు సమాంతరంగా ప్రభుత్వేతర మహిళా సంఘాలు దేశీయ స్త్రీల స్థితిగతుల గురించి వివక్షకు సంబంధించిన వాస్తవ పరిస్థితుల తో నివేదికలు తయారుచేయటానికి పూనుకొన్నాయి. ఆ సమాంతర నివేదిక తయారీలో ఆంధ్రప్రదేశ్‌ మహిళాసంస్థలు – అస్మిత వంటివి పాలుపంచుకొన్నాయి. ఈ సమాంతర నివేదికలోని అంశాలపై ఆంధ్రదేశ మహిళా సంఘాలు విస్తృతంగా చర్చించాయి. 1995 ఆగస్టు 30 నుండి సెప్టెంబరు 8 వరకు బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సు (ఎన్జీవో ఫోరమ్‌)కు భారతదేశం నుండి వెళ్ళిన నాలుగువందలమంది (400) స్త్రీలకు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాళ్ళు కూడా వున్నారు.

బీజింగ్‌ రేకెత్తించిన చైతన్యాన్ని, అక్కడ జరిగిన చర్చలను, ముందుకు వచ్చిన అంశాలను విస్తృతంగా దేశంలో ప్రచారం చేయటానికి, స్త్రీలకు సంబంధించిన విధాన నిర్ణయాలలో ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టటానికి జాతీయ స్థాయిలో మహిళా సంఘాల సమాఖ్యగా నేషనల్‌ అలయెన్స్‌ ఆఫ్‌ వుమెన్‌ ఆర్గనైజేషన్స్‌, నవో (శ్రీజుఇం) ఏర్పడింది. ఈ సంస్థ పక్షాన హైదరాబాదులో ‘అస్మిత’ 1996 డిసెంబరు 9 నుండి 11వ తేదీ వరకు మూడు రోజులు దక్షిణాది రాష్ట్రాల సదస్సు జరిగింది. దళితస్త్రీల గురించి, జాతీయ విధానం గురించి ప్రధానంగా చర్చించింది ఈ సదస్సు.

ఆ రకంగా ప్రపంచాన్ని స్త్రీల కళ్ళతో చూడమని పిలుపునిచ్చిన బీజింగ్‌ మహిళా సదస్సు ప్రభావం మహిళలకు సంబంధించి ఒక జాతీయ విధానాన్ని రూపొందించుకొనేట్టు ప్రభావితం చేసింది. ఇక్కడనుండే మహిళాసాధికారత భావన విశ్వవ్యాపితమైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రదేశ మహిళా ఉద్యమం కొత్త శక్తిని పుంజుకొంది.

భారత ప్రభుత్వం 1992లోనే 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో స్త్రీలకు మూడవవంతు (33.3%) సీట్లను కేటాయిస్తూ పంచాయతీరాజ్‌ చట్టం చేసింది. స్త్రీల సాధికారత సాధనకు ఇది తొలి అడుగు. పార్లమెంటులో జండర్‌ సమానత సాధించేం దుకు మొత్తంగా మహిళా సాధికారత కొరకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు 1996 సెప్టెంబరు 12న ప్రతిపాదించ బడింది కానీ అది చర్చోపచర్చలకు, వాదవివాదాలకు గురి అవుతూ నానుతూనే వుంది. మహిళా సంఘాలు ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచటానికి నిరంతరం పనిచేస్తూనే వున్నాయి.

ఇదిలా వుండగా గత దశాబ్దిలో మహిళల ఆర్థికస్వావలంబన కోసం ఏర్పరచిన డ్వాక్రా బృందాల స్థానంలో మహిళాసాధికారతకు స్వయంసహాయక బృందాల ఏర్పాటును ప్రోత్సహించింది ప్రభుత్వం. పొదుపు, అప్పు అనే వ్యూహంతో పేదరిక నిర్మూలనకు, స్త్రీవిముక్తికి ఏకకాలంలో ఈ స్వయం సహాయక బృందాలు సాధనమవుతాయని భావించటం జరిగింది. పొదుపు చేయటానికి ఆదాయాలు లేని అప్పులు చేయాల్సిన జీవనావసరాలు వున్న నిరుపేద వర్గాల స్త్రీలు అప్పుల వలయంలో చిక్కుకొనటమే దీని పరిణామం అయింది. బ్యాంకుల సేవలు అందించలేని మారు మూల ప్రాంతాల మహిళలకు రుణసదు పాయం కల్పించేందుకు మైక్రోఫైనాన్స్‌ సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించింది. డబ్బు రూపంలో, వస్తువుల రూపంలో అధిక వడ్డీకి అప్పులిచ్చిన మైక్రోఫైనాన్స్‌ సంస్థలు వసూళ్ళకు అవలంబించిన నిరంకుశ దౌర్జన్యపూరిత చర్యలు స్త్రీల మీద ఒత్తిడి పెంచాయి. స్త్రీల ఆత్మహత్యలకు కూడా ఇది దారి తీసింది. దీనికి వ్యతిరేకంగా మహిళాసంఘాలు ఉద్యమించటం కనిపిస్తుంది.

ఇక ఈ దశకంలోని మరొక అంతర్జాతీయ పరిణామం ఇఊం ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావం. విషయానికి వస్తే – రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచదేశాల మధ్య ఒకే రకమైన వాణిజ్య నిబంధనలు ఏర్పరచటానికి జరిగిన ప్రయత్నంలో భాగంగా వచ్చిన గాట్‌ (స్త్రలిదీలిజీబిజి జువీజీలిలిళీలిదీశి ళిదీ ఊజీబిఖిలి బిదీఖి ఊబిజీరితీతీ, స్త్రజుఊఊ) ఒప్పందం 1986లో డైరెక్టర్‌ జనరల్‌ డంకెల్‌ చేసిన ప్రతిపాదనలతో 1995 నాటికి ఇఊం రూపాన్ని తీసుకొన్నది. 104 దేశాల ఆమోదంతో ఏర్పడిన వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ఒప్పందాలు ముఖ్యంగా వ్యావసాయిక ఒప్పందాలు గ్రామీణ మహిళలపై ఎలాంటి ప్రభావాన్ని వేస్తుందనే చర్చ ఈ కాలంలో మహిళా ఉద్యమంలో ప్రారంభమైంది.

(ఇంకావుంది)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో