పరిమళించిన మానవత్వం

వి. ప్రతిమ

‘స్త్రీలకి ముప్పయ్యేళ్ళు దాటితే అంతా అయిపోయినట్లే’ అంటాడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌…. ఆ మాటనీ, తలకోన వంటి అడవిలో మీరంతా ఒంటరిగా ఎలా వుంటారు? అంటూ మమ్మల్ని వెనక్కి లాగాలని చూసిన చాలా మంది మాటల్నీ బద్దలు కొడుత అంతా ముప్ఫయి పై బడినవారే ముప్పయి మంది చేసిన సాహసయాత్ర యిది….

స్త్రీలు యాత్రలు చేయడమన్నది విదేశాలలో పరిపాటి కావచ్చునేమో కానీ మనదేశంలో అందునా ఆంధ్రదేశంలో తెలుగు స్త్రీలు జిగురులా అంటించుకున్న యింటిని వదిలి స్నేహితులతో కలిసి యాత్రలు చేయడమన్నది చాలా అరుదైన విశేషం… అలా వెళ్ళి వచ్చిన వారిలో ఒకరిద్దరు మాత్రమే దాన్ని నమోదు చేయడం జరిగింది.
1860వ సం||లో శ్రీమతి పోతం జానకమ్మ తన భర్తతో కలిసి ఇంగ్లండు యాత్ర చేసినపుడు ఆమె రాసుకున్న వివరాల పక్రారం ‘పిక్చర్స్‌ ఆఫ్‌ ఇంగ్లాండు’ అనే ఆంగ్ల పుస్తకాన్ని ముదించారు…. 1920వ సం||లో తాండరి రామాబాయమ్మ సిలోన్‌ యాత్ర చేశారట…. ఆమె మద్రాసు నుండి ఓడమీద బయలుదేరినట్లుగా తెలుస్తోంది… ఇకపోతే 1967లో నాయని కృష్ణకుమారి గారు తన విద్యార్థినులతో కలిసి కాశ్మీరు యాతక్రి వెళ్ళటం జరిగింది…. ఆ అనుభవాన్ని ఆమె ‘కాశ్మీర దీపకళిక’ అన్న పుస్తకంలో అందంగా పొందుపరిచారు…. ఇటీవల అబ్బూరి ఛాయదేవి గారు చైనా వెళ్ళిన సందర్భంగా ‘చైనా ఛాయాచిత్రాలు’ అన్న పేరుతో తన అనుభవాన్ని నమోదు చేశారు.
అటువంటి సాహసయాత్రలకి గతసంవత్సరం నుండీ శ్రీకారం చుట్టిన కొండవీటి సత్యవతిని హృదయ పూర్వకంగా అభినందిస్తూ అందరి తరపునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
‘ఒక నెల రోజులపాటు పుస్తకపఠనం కంటే కూడ ఒక్కరోజు ప్రయాణం గొప్ప అనుభవాన్నిస్తుంది’ అంటారు విజ్ఞులు….
ఈ సారి మా రచయిత్రుల కంపెనీ ఒక రిపోర్ట్‌లా కాకుండా మొత్తం యాత్రలో నాకనుభవంలోకొచ్చిన నాలుగు రసాస్వాదనలని వ్యక్తం చేద్దామనుకుంటున్నాను….
ఒకటి భయందోళన, రెండు మానవీయ స్పందన, మూడు ధైర్యం… నాలుగు అపరిమితమైన ఆనందం…
ఈ మధ్యన మా నెల్లూరు జిల్లాలో విపరీతమైన, నిరంతరాయమైన వర్షాలు కురిసి వెలిసిన సంగతి అందరికీ తెలిసిందే… దాంతో మా జిల్లా అంతా గోదావరి జిల్లాల్లా ఎటుచసినా నీళ్ళు, పచ్చదనం చూపరులని ఆకట్టుకుంటున్నాయి….
మావూరికి సమీపంలో వున్న ప్రళయ కావేరి పొంగిపొరలుతోంది….
ప్రళయ కావేరి సరస్సులో పడవ ప్రణం ఏర్పాటు చేస్తే నాతోటి రచయిత్రులంతా అద్భుతమైన ఆనందానికి లోనవుతారు కదా అన్న వుద్దేశ్యంతో పదిహేను రోజుల ముందే అడ్వాన్సిచ్చి రెండు బోట్లు బుక్‌ చేసి పెట్టాను… భీమునివారి పాళెం నుండి ‘ఇరకం’ దీవి దాకా పోవడానికి గంట రావడానికి గంట….. నీళ్ళలో పడవ ప్రయాణం…. రెండు గంటలు నటా ఇరవై నిమిషాలు…. హాయి హాయి….
ప్రళయ కావేరి సముద్రంలో కలిసేచోటు…. అది సరస్సో, సముద్రమో తెలీనంత విస్తారంగా నీళ్ళు…. ఆ నీళ్ళలో ఇటు ఆంధ్రప్రదేశ్‌నీ అటు తమిళనాడునీ వేరు చేస్తున్నట్టుందీ ఆ ‘ఇరకం’ దీవికి పడవలో వెళ్ళడం నిజానికి ఒక అద్భుతమైన, అరుదయిన అనుభవం….
ఆ మధ్యాహ్నం రెండుగంటలకి మేము భీమునివారిపాళెం చేరుకున్నాము… అక్కడి మత్స్యకారులు, పడవవాళ్ళు అంతా తమిళులే…. అప్పటికే అక్కడ మాకోసం ఎదురు చస్తుండిన శివకువర్‌ మమ్మల్ని బోటువద్దకి తీసికెళ్ళాడు….
పదిహేను మంది చొప్పున రెండు బోట్లలో మేమంతా సర్దుకు కూచున్నాం…. మా పడవ నడిపే మురుగన్‌ తెడ్డేస్త మంచి తమిళపాటనందుకున్నాడు… అప్పటికే మళ్ళిన గాలికి ఎదురు నడుస్తున్న పడవలో అటు, ఇటు నీళ్ళు చేప పిల్లల్లా ఎగిరెగిరి మా మీద పడుతున్నాయి… ఆ అద్భుత దృశ్యాన్ని చూసి, అనుభవించి తీరాల్సిందే తప్ప మాటలతో వర్ణించనలవి కానిది…..
‘గాలివానలో, వాననీటిలో పడవ ప్రయాణం…’ అం టూ సత్యవతి పాటందుకుంది…. సమత కూడ తనతో గొంతు కలపడంతో మురుగన్‌ పాటాపి బలంగా తెడ్డు వేయడంలో మునిగిపోయడు.
పాట మీద పాటతో… కబుర్ల మీద కబుర్లతో పువ్వులయి విరబసిన నవ్వులన్నింటినీ తననిండా పరుచుకుం టూ ఆనంద డోలికలో వూగుతోంది పడవ….
మాతో పాటుగా కదిలిన రెండోపడవ భార్గవీరావు, శాంత సుందరి, ఇంద్రగంటి జానకీబాల, శీలా సుభద్రాదేవి, కె.బి. లక్ష్మి, కె. వరలక్ష్మి, అనిశెట్టి రజిత, కాంతి, అత్తలరి విజయలక్ష్మి, రేణుక, కొండేపూడ, అయెల వంటి ఎందరో ప్రముఖ రచయిత్రులను తీసుకుని మా పాటలకందనంత దూరంలో ‘ఇరకం’ వైపుగా సాగుతోంది.
మామూలుగా బోటు షైరంటే పది నిముషాలో, పదిహేను నిముషాలో వుంటుంది… అటువంటిది అంతసేపు ఎడతెగకుండా నీటి ఊయలలో… మా హృదయలన్నీ ఆనంద తాండవం చేస్తుండగా హఠాత్తుగా శివకువర్‌ ‘మీరు తొందరగా రమ్మంటే రాలేదు… ఎదురుగాలి వీస్తోంది చూడండి…’ అన్నాడు… పడవ అంచుమీద కూర్చోని ప్రళయ కావేరితో సరసాలాడుతున్న సత్యవతిని లోపలికి కూర్చోమంటూ సూచించాడు. తన సౌందర్యాన్నంతా సిగ్గుపడకుండా ఆరబోసుకుంటోన్న ప్రకృతినంతా తన చిన్న సెల్‌ఫోను కెమెరాలో బంధించాలని ప్రయత్నిస్త అట ఇట తిరుగుతోన్న నాగమణిని కదలకుండా వుండాలని సైగ చేశాడు…. అప్పటికే తన కెమెరాని బంధించిన వనజాక్షి ఆందోళనగా శివకువర్‌ కేసి చస్తోంది…..
అందరిలో ఒక సన్నని పురుగులాంటి దేదో వెన్నుపూసల్లోనుండి జరజరా పాకినట్టయింది….
”ఏమైంది శివకువర్‌కి?” అని నేను ఆలోచనలో వుండగానే ”చూడు బాబూ! ముందుకెళ్ళడం భయమైతే వెనక్కెళ్ళి పోదాం” అన్నది సత్యవతి సీరియస్‌గా….
అదేం లేదు మేడమ్‌… మీరు ముందే వచ్చివుంటే బాగుండేది. యిప్పుడు గాలి మళ్ళింది కదా… ఎదురుగాలిలో తెడ్డేయడం కష్టం అన్నాడు. ఇతడు నిజంగా చెప్తున్నాడా లేదా ప్రవదమేమయినా పొంచి వున్నదా అన్న సందిగ్ధం…. ‘ప్రమాదమైతే వెనక్కి వెళ్ళి పోదాం’ అన్నారంతా. శివ మౌనంగా వుండిపోయాడు….
నేను మురుగన్‌ని తమిళంలో అడిగాను ‘వెళ్దామా ముందుకి వొద్దా’ అంటూ….
‘భయమొణ్ణుం యిల్లేమా…. నీంగ ఉక్కొరుంగు… నాదినుంపోరే…. యిన్నికి రెండువాటి పోయుటు వందేన్‌…” అన్నాడు ధీమాగా… (భయపడాల్సిందేమీ లేదు.. మీరు కూర్చోండి… నేను రోజూ వెళ్తున్నాను కదా… ఈ రోజు రెండుసార్లు వెళ్ళొచ్చాను)….
అయినా అందరికీ మౌనం వీడలేదు.
”ఈ మౌనం, ఈ బిడియం యిదేనా యిదేనా చెలియకానుకా” అంట శివలక్ష్మి గొంతెత్తడంతో మళ్ళీ పడవలో చిరునవ్వుల కలకలం… చిరుజల్లుల కలవరం కలగలిపిన ఊయలలో పడవ ముందుకు సాగుతోంది వెన్ను చూపకుండా.
”నీ రక్షకుడికి (శివకువర్‌) అతి రక్షణయి మనల్ని చంపుతున్నాడు” అంది శిలాలోలిత నవ్వుత.
నా హృదయ కుహరంలో మాత్రం మౌనం గడ్డకట్టుకుపోయి ఎంతకీ కరగనంటోంది…
‘ఇంతమంది స్త్రీవాద రచయిత్రులను ఒక్కసారిగా పిలిచివాళ్ళని ఏవిధంగా మెయింటెన్‌ చేద్దామనుకుంటున్నారు…? సెక్యూరిటీ గురించి ఆలోచించారా?” అంటూ నన్ను నిరుత్సాహ పరిచిన మా జిల్లా రచయిత్రి మాట పదేపదే కళ్ళెదుట నిలిచి నన్ను కలవరపెట్టసాగింది…
”కలవరమాయే మదిలో …. నా మదిలో” అంటూ సత్యవతి, శిలాలోలిత ఉత్సాహపరచాలని ప్రయత్నించినప్పటికీ నా వెన్నుపూసలో పాకిపోయిన పురుగు ఎంతకీ బయటికి రానంటోంది.
సెక్యూరిటీ…. సెక్యూరిటీ…. ఇంతమంది ప్రోమిసింగు రైటర్స్‌కి నా సెక్యూరిటీ…. ఇదంతా నా బాధ్యతే… నేనే చేశాను…. నేనే చేశాను అన్న ఆందోళన నన్నెంతకీ వీడలేదు…
అందరూ భయన్ని మరిచిపోయి ఆనందపు జల్లులతో తడుస్తండగా ఎట్టకేలకు పడవ ఆవలి ఒడ్డుకు ‘ఇరకం’ దీవి చేరుకుంది…. దిగగానే రెండో బోట్లోనుండి దిగిన వరలక్ష్మి సీరియస్‌గా ”ఎవరి ప్రోగ్రాం ప్రతిమా యిది… ఎవరేర్పాటు చేశారు’ అంది. అంటే అవతలి బోట్లో వాళ్లు కూడా చాలా కంగారు పడ్డారన్నమాట. శివకుమార్‌ అమ్మమ్మ వాళ్ళు ఇరకంలో వుంటారట…. అందర్నీ దీవంతా తిప్పి చూపించి… గుళ్ళు, గోపురాల గొప్పతనం చెప్పి మళ్ళీ బోటెక్కించాడు… నా మనసు మాత్రం అల్లకల్లోలంగానే వుంది.
మళ్ళీ నీళ్ళల్లో మా తిరుగు ప్రయణం ప్రారంభమైంది….
”ఇరకం దీవుందీ…దీవి మీదా గుడి వుందీ
గుడిలోపల అమ్ముందీ… అమ్మ మనసులో ఏముందీ…. దీ….” అంట ఘంటశాల నిర్మల గొంతు శ్రావ్యంగా ప్రళయ కావేరిని తాకుతండగా అంత్యాక్షరితో రెండు పడవలు ఓలలాడాయి…. పి.సత్యవతి గారు, వారి చెల్లెలు అనూరాధ… యింకా భూమిక పిల్లలు ఏమాత్రం భయందోళనలకు గురికాకుండా పడవ ప్రయాణాన్ని ఆస్వాదించడం నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.
సరిగ్గా అయిదు గంటలకు మేము ముందుగా నిర్ణయించుకున్న సమాయనికే పడవ ఒడ్డు చేరుకున్నది.
”పడవెళ్ళి పోతోందిరా ఓ మానవుడా” అంట అందరం పడవకీ… పడవని నడిపిన వారికీ…. మాకు రక్షకుడుగా నిలిచిన శివకువర్‌కీ వీడ్కోలు పలికి తిరిగి బస్సెక్కి మామండరు అడవుల వైపుగా సాగిపోయం….
చాలా సేపటికి గానీ నేను మనిషిని కాలేకపోయను.
ఇకపోతే నా రసాస్వాదనలో రెండోది మానవీయకోణం.
తలకోన జలపాతం వద్దకు మమ్మల్ని చుట్టుముడుతోన్న కోతుల నడుమ….. కర్రలు పుచ్చుకుని తరుముత వెళ్ళడం మూడో ఉద్వేగభరితమైన అనుభవం…
ఎవరికి వాళ్ళు విడిపోయి…. కలగలిసి చాలా దరం ఎక్కుత పోయక ఒక జంట ఆ కొండకోనల్లో జలపాత స్నానం చేసొచ్చి తలలారబెట్టుకుంట నిల్చుని వున్నారు….
వారికి ఒకింత దరంలో నిల్చుని పంతం సుజాత జలపాతాన్ని తన కెమెరాలో బంధిస్తోంది… పక్కనే వున్న విరిజకి కెమెరా యిచ్చి తాను జలపాతం నేపథ్యంతో ఫోటో కోసం నిల్చుంది సుజాత.
ఎక్కడి నుంచొచ్చిందో ఒక గండు కోతి సుజాత చేతిలోని హేండ్‌ బ్యాగుని సున్నితంగా, ఒడుపుగా లాక్కుని ప్రయణీకుల రక్షణ కోసం ఏర్పరిచిన బ్యారికేడ్లు దాటుకుని లోయలోతుల్లోకి చెంగు చెంగున పారిపోయింది….
సుజాత, విరి నిర్ఘాంతపోయి చూస్తుండగానే పక్కన తలారబెట్టుకుంటున్న ఆ జంటలోని పురుషుడు కోతితో పాటుగా వెనువెంటనే ఆ లోయలోకి దిగిపోయడు…. దాదాపు ముప్పావు గంట అతడు కోతి తిరిగిన స్థలాలన్నింటినీ వెదికి సుజాతకి కొంత డబ్బు, మొబైల్‌ ఫో ను తెచ్చిచ్చాడు…
వద్దంటంటే కూడ మళ్ళీ మరోసారి దిగిపోయి మరికొంత డబ్బుని ఏరుకొచ్చాడు…. అతడి భార్య తన పొడవాటి తడి జట్టును గాలికొదిలి ఆందోళన నిండిన కళ్ళతో భర్త కోసం ఆతృతగా ఎదురుచూడ్డం మా అందరి హృదయాల మీద ముద్రించుకు పోయింది….
ఈ సంఘటన గురించి ఎలాగూ సుజాత సవివరంగా వ్రాస్తుంది కాబట్టి నేను మరిన్ని లోతులకు వెళ్ళడం లేదు.
ఆ విధంగా ఆ సాయంత్రం తలకోన అడవిలో అన్నిరకాల పూల పరిమళాలతో పాటుగా మానవత్వం గుభాళించింది…. ఆ సువాసన మేము తిరిగి వచ్చేసిన తర్వాత కూడ మా హృదయలను చుట్టుకుపోయి పరిమళిస్తనే వుంది….
మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం…. స్వాగతం అంట అతడికి మా అభినందనలు, ధన్యవాదాలు తెలిపాం.
నా మూడో రసాస్వాదన అపరిమితమైన ఆనందం.
తలకోన గెస్ట్‌హౌస్‌ నుండి మా తిరుగు ప్రయాణం.
ఉదయన్నే రాజేశ్వరీ విలాస్‌ కాఫీ క్లబ్‌లో రాజేశ్వరి పెట్టిన వేడి వేడి దోశెలు తిని, కాఫీ తాగి బస్సెక్కాం…
సరిగ్గా పది నిముషాలు కూడ కాకముందే బస్సాగింది…. ‘ఏమయిందా’ అని అనుకుంటుండగానే మేమొక ‘రోప్‌వే’ వద్ద ఆగాం అన్న విషయం అర్థమయింది…. ఆ అడవిలో పెద్ద పెద్ద మానులకు వేళ్ళాడదీయబడిన ఆ కరవ్రంతెన… లకడీకాపూల్‌ మా కోసమే నిర్మించబడి వున్నట్లుగా మమ్మల్ని ఆహ్వానించింది…..
నిజంగా అటువంటి వేళ్ళాడే, ఊగులాడే వంతెనలు సినిమాల్లో చూడ్డమే తప్ప వాస్తవంలో ఎన్నడూనాకు అనుభూతిలోకి రాలేదు…. నేనెన్నడూ చూడలేదు….
ఆ ఊగే వంతెన మీద ప్రియమైన స్నేహితురాళ్ళతో కలిసి మధ్యమధ్యన ఛాయచిత్రాలను బంధిస్తూ…. ఆనంద తరంగాల మీద తేలియడుతున్నట్లుగా నడవడం నిజంగా గొప్ప అనుభూతి…. అది నిజంగా మాటలకందనిదే….
ఆ వంతెన మీదుగా ఆవలివైపుకి వెళ్ళి ”చెట్టులెక్కగలవా…. ఓ నరహరి పుట్టలెక్కగలవా? అంటూ చెట్లెక్కి, తీగల్లాగి డొంకలు కదిలించి… తిరిగి వచ్చేస్తే ‘రోప్‌వే’ అయిపోతుందేమో, అనుభవం కరిగిపోతుందేమోనని అటువైపే వుండిపో యాం చాలాసేపటిదాకా.
ఆ ‘రోప్‌వే’ అక్కడున్నదని తెలియచెప్పి మా అందరి జీవితాల్లో మైలురాయి వంటి గొప్ప ఆనందానుభూతిని మిగిల్చిన ప్రియమైనవిష్ణుకి ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం అందరం….
ఇకపోతే నా చివరి రసాస్వాదన ధైర్యం.
నాకిప్పటిదాకా పరిచయమైన అనేకానేక మందిలో కొండవీటి సత్యవతి నిర్మొహమాటం, ధైర్యం, తెగువ తాననుకున్నది అనుకున్నట్లుగా చేసేయడం…. యివన్నీ కూడ నన్ను ఎంతగానో విస్మయపరిచేవి….
అయితే ఈ టిప్ర్‌లో నన్ను మరింత అబ్బుర పరిచిన అమ్మాయి రచన… చాలా ఉత్సాహంగా ఉరకలు వే స్తూ మొత్తం యాత్రంతా తానే అయి తిరిగిన రచన అందర్నీ ఆకట్టుకుంది…. ఇంతవరకే అయితే రచనని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం వుండేది కాదేమో…
మా తిరుగు ప్రయణంలో తిరుపతి రైల్వేస్టేషన్లో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది… ఎవరో ఒక ఆకతాయి కుర్రాడు రచనని చూసి ఫారినర్‌ అనుకుని తెలుగురాదు లెమ్మని పరుషమైన మాటలు మాట్లాడాడు…. రచన తల్లి సమతా రోష్ని అతడికేసి తీవ్రంగా చూడ్డంతో సమతను కూడ ఏదో అన్నట్టున్నాడు.
వెంటనే రచన బలమైన చేయి అతడి భుజాన్ని తాకింది. ఎడాపెడా రెండు దెబ్బలేసి కాలర్‌ పట్టుకుని సమత వద్దకు తీసుకొచ్చి తన తల్లికి క్షమాపణ చెప్పించింది వాడితో…
ఇది నిజంగా మరపురాని సంఘటన….
మన అమ్మాయిలంతా కూడ యిలా ధైర్యసాహసాలతో బలంగా వుంటే ఎంత బావుంటుందా అని నాకు పదే పదే అన్పించింది.
ఆ దిగ్బమలోనుండి తేరుకుని రచనకి అభినందనలు, మిత్రులకి వీడ్కోలు తెలపకముందే ఒక జీవితకాలం ముందుగానే రైలు కదిలింది నన్నొంటరిగా ఫ్లాట్‌ఫామ్‌ మీద మిగిల్చి….
”ఒంటరినై పోయాన…. యిక యింటికి ఏమనిపోను” అని పాడుకుంటూ నా బస్సువైపుగా తడబడు తూ పడ్డాయి నా అడుగులు. బస్సులో కూర్చుని ‘భ్రమణకాంక్ష’ వున్న నా పాదాలకు మరోసారి నమస్కరించాను.
జలపాత స్నానం మన స్నేహం

కొండేపూడి నిర్మల

రచయిత్రుల క్యాంపు అనగానే లోగడ వెళ్ళిన పాపికొండలు గుర్తొచ్చి మళ్ళీ అంతకంటే ఎక్కువే అనుభూతులు మనసు నిండా నింపుకోవాలనే వచ్చాను.
స్వేచ్ఛ ఎక్కువైతే క్రమశిక్షణ తప్పుతుంది. క్రమశిక్షణ ఎక్కువైతే స్వేచ్ఛ దెబ్బతింటుంది. మన సత్యకి ఆ బాలెన్సు తెలుసు. కాబట్టి పెద్దగా కోపం తెచ్చుకునే అవసరం ఎవరికీ రాలేదు. నా వరకు నేను నా సమస్యలు ఒత్తిడి, అన్నీ మర్చిపోయాను. ఇంట్లో, పనిలో ఇనపమొహం పెట్టుకుని పెద్దరికం అభినయించే మనమంతా ఆ ఒక్కరోజు పసిపిల్లలైపోయాం.
ముఖ్యంగా ఆ జలపాతం దగ్గర, కదిలే వంతెన దగ్గర మనం కొట్టిన కేరింతలకి అడవి దద్దరిల్లి పోయి వుండాలి. బాల్యాన్ని మళ్ళీ ఇంత అనుభతి ఇచ్చిన సత్యకి ఒక పె…ద్ద ముద్దుతో…

ఒక తీయని జ్ఞాపకం

బి. రమాదేవి
భూమిక రచయిత్రుల విహారయత్రలో భాగంగా ఖాజీపేట స్టేషన్‌లో నేను, అనిశెట్టి రజిత కల్సి, కొండేపూడి నిర్మలగారు, సమతా రోష్నిగారిని కల్సినపుడు చాలా ఉత్సాహం వచ్చింది. ట్త్రెన్‌ ఎక్కగానే సత్యవతి గారితో సహా 25 మంది రచయిత్రులుగా సుపరిచితులైన మిత్రురాళ్ళంతా ఒకేచోట కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. రాత్రంతా ట్రెయిన్‌లో గడిపి ఉదయం నాయుడుపేట స్టేషన్‌లో దిగగానే నవ్వుతూ, చేతులు చాస్తూ ఆప్యాయంగా డి.ఎల్‌. సుహాసిని గారు రావటం, స్టేషన్‌ నుండి నేరుగా తూపిరిపాలెం వద్ద సముద్రపు ఒడ్డుకు వెళ్ళి నింగిని ముద్దాడేందుకు ఎగిసిపడే అలలతో, చిన్నపిల్లలమై ప్రకృతి ఒడిలో చేరి బాహ్యప్రపంచాన్ని మరచిపో యాం. అలలపై ఓలలాడాం.
అక్కడి నుండి ప్రతిమ గారింటికి వెళ్ళడం, ఆ యింట వారి అమ్మగారు, చెల్లిగారు మా అందరి రాక పట్ల చూపిన ఆదరణ, ఇష్టం మాటల్లో చెప్పలేనివి. ఆదరంగా, స్నేహపూర్వకంగా, ఇష్టంగా ఆతిథ్యం ఇస్త, ఆనందించిన వారి స్నేహ మాధుర్యం, వారి ఇంటి వాతావరణం మనసుకు చాలా ఆహ్లాదాన్నిచ్చింది.
నాయుడుపేట నుండి పులికాట్‌ సరస్సులో విహారానికి వెళ్ళాం. ఎగిరిపడుతున్న సముద్ర కెరటాలపై గంటసేపు ప్రయణం ఓ అద్భుత అనుభవం. సృష్టి రహస్యాలలో సముద్రసోయగం ఎంతో అణకువగా ఉంటూనే ప్రళయగర్జన చేస్త, మానవ జీవితాలను అతలాకుతలం చేసేది ఈ సముద్రమేనా అని ఆశ్చర్యం, భయందోళనలు, సంభ్రవశ్చర్యాలు కలిగినాయి. అలా రెండుగంటలు సముద్రంలో విహరించి ఆ రాత్రి ఇక మన నాగరిక ప్రపంచాన్ని వదిలి, పక్రృతి ఒడిలోకి ప్రయణం చేస్త, దట్టమైన మామండూరు (కడప) అడవి బాట పట్టాం. చక్కటి వెన్నెల రాత్రి చిక్కగా పరచిన వెన్నెలలో వెన్నెల పాటలు పాడుతు అలా కొంతసేపు నడక సాగించాం. ఒక పక్క వణికించే చలిపులిని, మరోప్రక్క అడవుల్లో సంచరించే పులుల గర్చి చర్చిస్త, వెన్నెల స్నానాలు చేస్త అక్కడి గెస్ట్‌హౌస్‌లో రెస్ట్‌ తీసుకున్నాం. ఉదయన్నే ఆరు గంటలకు అడవిలోని దట్టమైన వృక్షసంపదను చస్త మూడు నాలుగు చిన్నచిన్న సెలయేళ్ళను దాటి, ఒక పెద్దవాగు చేరుకున్నాం. అలా ఎంతదరం నడిచినా ప్రకృతి ఒడిలో సేదదీరటంతోనే ఆ అలసట అంతా వయమయ్యింది. 60 వసంతాలు దాటిన శాంతసుందరి గారు, ఇంద్రగంటి జానకీబాల, భార్గవీరావు లాంటి పెద్దల ఉత్సాహం అలుపెరుగని వారి నడక వలో మరింత ఉత్సాహాన్ని కలిగించాయి. ప్రకృతి ఒడిలో చిన్నారుల్లాగా నీళ్ళలో ఈతలు కొడుత, కేరింతలు, జలకాలాటలు, పాటలు పాడుత, స్వచ్ఛమైన నీటి ప్రవాహంలో ఓలలాడాం. 2 గంటల పైగా ఉన్నా, తనివి తీరకున్నా, మళ్ళీ వెళ్ళాల్సిన ప్రయణం మమ్మల్ని తప్పనిసరిగా కదిలించింది. అలా బయలుదేరి, తలకోన అడవులలోకి వెళ్ళడానికి ప్రయణమై చిత్తరు జిల్లాలోని శేషాద్రి పర్వతాల వెంట పరుగులు (బస్సులో) పెట్టాం. ఆ మధ్యాహ్నం తలకోన గెస్ట్‌హౌస్‌ చేరి భోంచేసి, తలకోన అడవుల అందాలు 380 అడుగుల ఎత్తు నుండి ఉరకలెత్తే జలపాతం క్రింద చిందులేయలనే ఆరాటంతో మేము అలసట, నడకను లెక్కచేయక ఆ అటవీసంపదకు ముగ్గులమవుత, ఎంతో ఎత్తైన వృక్షాలను చస్త వాటిమీద జీవిస్త, వచ్చీపోయే యత్రికులను నానా ఇబ్బందులు పెడ్త, బ్యాగులతో సహా అన్నీ లాక్కెళుత, అందరినీ భయపెడ్త అల్లరి చేస్తున్న వానరసైన్యం. విన్యాసాలు చస్త సాగిపోయం. జలపాతం అందాలు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. కాని జలపాతం క్రిందకు చేరే దారి సరిగా లేక, దాని కింద చిందులు వేయలి, స్నానవడాలి అని ఉవ్విళ్ళూరే మనసుకు కొంత నిరాశ అనిపించింది. ఆ బాధను పంతం సుజాత బ్యాగును కోతి లాక్కెళ్ళడంతో వ అందరి దృష్టి ఆ బ్యాగు వెదకటం దాని కొరకు ముందుకొచ్చిన సహయత్రికుడు లోయలోకి చకచక దిగి డబ్బును, సెల్‌ను ఏరుకొని రావడంతో మనసు కాస్త నిమ్మళించింది. అతని సహృదయతకు భమిక యూనిట్‌ అంతా అభినందనలు తెలిపింది. ఆనందంగా చిందులేస్త తిరిగి గెస్ట్‌హౌస్‌కి వచ్చాం. రిలాక్స్‌ అయిన తర్వాత పంతం సుజాత గారి పుస్తకావిష్కరణ (ముంగిట్లో మువ్వల శబ్దం) జరిగింది. ఆ పుస్తకంపై విమర్శ – రచయితుల్రందరి అభిప్రాయలు, చేపట్టవలసిన కార్యక్రవలు చర్చించుకున్నాం. నేను పాడిన పాట ”దృష్టిని బట్టి” వారందరినీ కదిలించింది. చాలా ఇష్టం కలిగించింది. వటలగోష్ఠి, పాటలగోష్ఠి తర్వాత భోజనం నిద. వణికించే చలిని తట్టుకొంట నిద్రపోయం. మళ్ళీ ఉదయమే రెడీ అయి నింగికీ, నేలకీ మధ్య ఊయలలగుత, ఊగిసలాడుత సాగే అద్భుతమైన ‘్పుజుశ్రీంఖ ఇజుఉచ’ చెక్క వంతెనపై పాతపాట ఝడిలో తడిసి, తన్మయంగా తనివితీరా అడవి అందాలను తిలకించాం. అక్కడి నుండి బయలుదేరి తిరుపతికి వెళ్తూ మధ్యలో కళ్యాణి పాజ్రెక్టు, చంద్రగిరి కోట చసి అక్కడి నుండి తిరుపతిలో జరిగే సాహితీ బ్రహ్మోత్సవాలు తిలకించి, అక్కడినుండి తిరిగి మళ్ళీ రొటీన్‌ ప్రపంచంలోకి వచ్చాం. ప్రకృతి ఒడిలో గడిపి తిరుపతి వచ్చేవరకు మా స్వంత కుటుంబాలను, బాధలను, బాధ్యతలన అన్నింటినీ మరచి ఆనందంగా గడిపాం. మళ్ళీ మా రొటీన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాం. ఇలా వెళ్ళటం మనలో నూతనోత్సాహాన్ని, మానసిక ఆనందాన్ని, మనకంటూ ఒక స్వంత ప్రపంచం, స్వీయనందం ఎంత అవసర మో తేల్చి చెప్పింది ఈ టిప్ప్రు. ఎక్కడా, ఎవరికీ, ఎలాంటి ఇబ్బందుల రాకుండా, అన్ని ఏర్పాట్లు ఎంతో దూరదృష్టితో, నేర్పుతో సకాలంలో అన్ని అమరేలా చేసిన సత్యవతి గారి దీక్షాదక్షత లు, శ్రద్ధాసక్తులు, బాధ్యతాయుతమైన తన విధివిధానం నాకెంతో నచ్చాయి. తనలోని నాయకత్వ స్ఫూర్తి నాకెంతో నచ్చింది. చిన్నచిన్న ఇబ్బందులున్నా లెక్కచేయకుండా చాలా హాయిగా సాగిపోయిన ఈ విహారపు అను భూతి మన జీవితంలో ఒక తీయని జ్ఞాపకంలా మిగిలిపోవాలని ఆశి స్తూ….

మరువలేని అనుభవం

తలకోన ట్రిప్‌కి రావాలని పిలిచినపుడు మొదటిసారి పాపికొండలు టూర్‌ను మిస్‌ అయ్యాను. కనుక దీనిని మిస్‌ కాకూడదని వెళ్ళాను. అందులో ఇంతమంది ప్రముఖ రచయిత్రులతో కలిసి ప్రయాణం చేయడం చాలా బాగుంది. బీచ్‌లో ఆట,పులికాట్‌ సరస్సులో ప్రయాణం, మామండూర్‌ వాగులో ఆటలు, పాటలు, తలకోన జలపాతంలో తడవడం, కోతులతో ఆటలు ఎంతో నచ్చింది. అంతేకాకుండా ఆకాశానికి, భూమికి మధ్య తరులపై నడకలో నేను చాలా ఎంజాయ్‌ చేశాను. అక్కడనుండి కళ్యాణి డ్యాం, చంద్రగిరికోట దర్శనం మొత్తంగా చెప్పాలంటే ఈ ట్రిప్‌ ఎప్పటికి మరువలేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్యవతిగారికి చాలా థాంక్స్‌.
సిహెచ్‌.నాగమణి

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

One Response to పరిమళించిన మానవత్వం

  1. Anonymous says:

    భూమిక చాలా భాగా చెసింధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో