మహిళోద్యమ శిఖరం మల్లాది సుబ్బమ్మ – డ

ా|| కనుపర్తి విజయబక్ష్‌

ఆమె పేరు వినని మహిళోద్యమ కార్యకర్తలు వుండరు. ఆమె ఉపన్యాసం విన్నవాళ్ళందరికీ తెలుసు. ఆమె గొంతెత్తి ఉపన్యసిస్తే అదొక జలపాతం వలె పైనుండి ఎగిసిపడుతు గలగల ప్రవహించవలసిందే! తాను చెప్పదలచుకొన్న అంశాన్ని ఏ రకమైన సంకోచం లేకుండా నిర్భీతిగ చెప్పటం ఆమె అలవాటు. స్త్రీల తరఫున ఆమె గళమెత్తి ఎన్నో అన్యాయాలను ఖండించేరు. కుటుంబాలు కుటుంబాలను నాశనం చేస్తోన్న మద్యం మహమ్మారిని తరిమికొట్టటానికి ‘మద్యపాననిషేదోద్యమం’లో చురుకుగ పనిచేసారు.

సుబ్బమ్మ అభ్యుదయవాదుల ఇంట్లో పుట్టలేదు. అలాటి వారింట మెట్టలేదు. సనాతన సంప్రదాయ కుటుంబాలు రెండూను. అటువంటి నేపథ్యమున్న కుటుంబాల నుండి, పదేళ్ళకే పెళ్ళయిన పిల్ల, తన 34వ ఏట ఏ రకంగా అభ్యుదయం వైపు పయనించిందో ఆమె తన ‘ఆత్మకథ’లో వివరించేరు. ఈ ప్రయాణానికి పూర్తి సహాయసహకారాలందించింది తన జీవిత భాగస్వామి రామ్మూర్తిగారేనని చెప్పుకొన్నారు.

మల్లాది సుబ్బమ్మ, రామ్మూర్తి దంపతులతో నా పరిచయం హేతువాదోద్యమం ద్వారానే. నాకు, బక్ష్‌కి వివాహం జరిపించటంలో ‘గోరా’ గారితోపాటు రామ్మూర్తిగారు ప్రముఖపాత్ర నిర్వహించేరు. అప్పటికే బక్ష్‌కు ఆయనతో ఉద్యమం ద్వారా పరిచయం, సన్నిహితత్వం వుంది. అప్పటి నుండి నన్ను ఎంతో ఆప్యాయంగా ‘అమ్మాయి’ అని పిలుస్తూ ఆదరించేవారు.

హేతువాద, మానవతావాద ఉద్యమాల్లో పనిచేయడమే కాక ఆమె రచయిత్రిగా తనను తాను నిరూపించుకొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో మహిళోద్యమం-మహిళా సంఘాలు (1860-1983)’ పుస్తకంలో మహిళా ఉద్యమాలు, చట్టాలు, మహిళాసమాజం, స్త్రీల పత్రికలు మొదలైన వాటిని గూర్చి సమగ్ర సమాచారం అందించారు. ఇదొక పరిశోధనాత్మక రచన. దీనికి ‘తెలుగు విశ్వవిద్యాలయం’ వారి అవార్డు వచ్చింది.

వివిధ మతాల్లో స్త్రీల ఉనికి, స్థానం గురించి రచించిన పుస్తకాలు హైందవం-స్త్రీలు, ఇస్లాం-స్త్రీలు, క్రైస్తవం-స్త్రీలు ఏ మతమూ కూడ స్త్రీకి పురుషునితో సమాన ప్రతిపత్తి ఇవ్వకపోవటాన్ని ఆమె ఈ గ్రంథం ద్వారా చాటిచెప్పారు. ఆమె స్త్రీ పక్షపాతిగా అసంఖ్యాక గ్రంథాలు రచించారు. ‘స్త్రీ స్వేచ్ఛ’ పత్రిక నడిపారు. అంత క్రితమే ఆమె, రామ్మూర్తిగారు కలిసి ‘వికాసం’ మాసపత్రికను విజయవంతంగా నడిపారు.

ఆమె 1958లో సేవారంగంలోకి ప్రవేశించారు కుటుంబ నియంత్రణ కార్యకర్తగా. అప్పటి నుండి కడదాక స్త్రీ ఉద్యమాల్లో చీరాల-బాపట్ల-విజయవాడ కార్యక్షేత్రాలుగా పనిచేసి చివరకు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇక్కడే ఆమె ‘మహిళా అభ్యుదయ సంస్థ’ను స్థాపించి స్త్రీల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపిస్తూనే వున్నారు. ఈ సంస్థ ద్వారా అభ్యుదయ వివాహ వేదిక ద్వారా మతాంతర, వర్ణాంతర వివాహాల నిర్వహణ, వైవాహిక జీవనంలో సమస్యలకు కౌన్సిలింగ్‌, స్త్రీలకు వృత్తివిద్యల శిక్షణ, వృత్తివిద్యల ప్రాముఖ్యం గుర్తించి అమ్మాయిల కోసం వొకేషనల్‌ జూనియర్‌ కాలేజి స్థాపించడమే కాక, మెహదీపట్నంలోని ఆ కళాశాలకు తమ యావదాస్తిని యిచ్చేసారు.

సృజనాత్మక ప్రక్రియలైన కథ, నవలా రచనలను ఆమె చేపట్టారు. మాతృత్వానికి మరో ముడి కథలసంపుటి, వెలిగిన జ్యోతి, చీకటివెలుగులు, కాంతికిరణాలు, ప్రేమ+సెక్సు=నీతి, ఈ దేశం నాదేనా అనే నవలలు రచించేరు. ఇవన్నీ శిల్పం, శైలి దృష్ట్యా గొప్ప రచనలు అని చెప్పలేం కాని, ప్రతి రచనలోను స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలు, వాటిని ఎదుర్కోవటమే ప్రధాన అంశం.

ఆమె రచనలన్ని ఒకెత్తయితే ‘పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా’ అని రాసుకొన్న ఆమె ఆత్మకథ మరొకెత్తు. చిన్ననాటి విషయాలు, ఆనాటి పరిస్థితులు, మూఢవిశ్వాసాలు, బాల్యవివాహం, పిల్లలు, సంసారం, ఆమెలో వచ్చిన మార్పు, సాహితీ ప్రస్థానం, వివిధ సంస్థల స్థాపన – నిర్వహణ, మహిళాభ్యుదయ ట్రస్టు స్థాపించటం వగయిరా విషయాలన్ని విపులంగా రాయబడ్డాయి. ఒక సామాన్య గృహిణి స్త్రీస్వేచ్ఛకై పరితపించే వ్యక్తిగ పరిణమించటం వెనుక ఎంత తపన, పట్టుదల వున్నాయో అర్థమౌతోంది.

స్త్రీ సమాన ప్రతిపత్తితోనే సామాజిక చైతన్యం, అభివృద్ధి ఇమిడిపోయి వున్నాయనేది ఆమె సిద్ధాంతం.

వృద్ధాప్యం తరుముకొచ్చి, కదలలేని స్థితి వచ్చేవరకు ఆమె మహిళావిమోచనోద్యమాల్లో, హేతువాద మానవవాదోద్యమాల్లో పనిచేస్తూనే వున్నారు. ఉపన్యాసాల ద్వారా మహిళలను ఉత్తేజపరచటం, రచనల ద్వారా ఆలోచింప చేయటం, కార్యక్రమాల నిర్వహణ ద్వారా మేలు కూర్చటమనే పనులు ఏకకాలంలో చేస్తోనే వున్నారు. హైదరాబాద్‌లోని మెహదీపట్నంలోని సుబ్బమ్మగారిల్లే ఓ స్త్రీవిమోచన కేంద్రంగా అనిపిస్తోంది. ఎటు చూచినా స్త్రీలకు సంబంధించిన అంశాల బోర్డులే కనిపిస్తాయి.

ఎంత ఘోష ఎంతమంది గొంతు చించుకొని అరిచినా స్త్రీల మీద దాడులు, అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. ఆమె ఎన్నోసార్లు ఎన్నో వేదికల ద్వారా స్త్రీలపై జరిగే అన్యాయాలను గర్హించేవారు. మేము ఇటీవల హైదరాబాద్‌ వెళ్ళినపుడు ఆమెను చూడటానికని వెళ్ళాం. లేవలేని స్థితిలో మరొకరి ద్వారా తన పనులకై ఆధారపడుతు కూడ ఎంతో ప్రేమగ అవియివి మాట్లాడుతూ, హేతువాద ఉద్యమం గురించి కొద్దిసేపు మాట్లాడారు. ఆమె పుస్తకాలు కొన్ని తీస్తూ మేము ఒక రాతప్రతి తీసి చూస్తే ఆమె గబగబ ఆ పేజీలు తిప్పుతూ ఈ పుస్తకం ప్రచురించలేకపోయాను అన్నారు. ప్రముఖ తెలుగు రచయితలను గురించిన నోట్సు అది. ఆమె ఓపికకు ఆశ్చర్యపోయాం.

జీవించి వున్నంతకాలం హేతువాదిగా జీవించి, మరణానంతరం అట్లాగే కొనసాగాలనే ఆమె అభీష్టం ప్రకారం ఆమె శరీరాన్ని ఉస్మానియా ఆసుపత్రికివ్వాలన్న ఆమె కోర్కెను ఆమె కుటుంబ సభ్యులు నెరవేర్చటం ముదావహం… ఆమె మా దంపతులకు కూడ తన మరణానంతరం ఇట్లా చేయాలని కోరుతు రాసిన ప్రతిని ఒకటిచ్చారు.

హేతువాద మానవవాద ఉద్యమాల్లో ఓ గొప్ప ఉద్యమకారిణిగ పనిచేసి మాలాటి వాళ్ళెందరికో స్ఫూర్తినిచ్చిన ఆమె కార్యకలాపాలు. ఉద్యమకారులకు మరింత ప్రోత్సాహమివ్వాలి… తన జీవితాంతం వరకు మొక్కవోని నిజాయితీతో జీవించిన ఆమెకు మనస్ఫూర్తిగా జోహారులర్పిస్తూ…

జజజజజజ

 

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో