సూదులతో పాటు హెచ్ఐవిని పంచుకున్నాను

-ఆనంద్

నా పేరు ఆనంద్. నాకు 22 సంవత్స రాలు. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారిది సొంత వ్యాపారం. అమ్మ మాస్ మీడియాలో పనిచేస్తోంది. ఒక చెల్లెలు. ఇంకా కాలేజీలో వుంది. మాది మద్రాసుకు 400 కి.మీ. దూరంలో వున్న ఒక పట్టణం.

స్కూలు తరువాత నేను మద్రాసులో ఒక టెక్నికల్ కోర్సులో చేరాను. హాస్టల్‌లో వుండవలసి వచ్చింది. ఇనిస్టిట్యూట్‌లోనూ, హాస్టల్‌లోను చేరిన మొదట్లో చాలా కష్టమనిపించేది. అక్కడి విద్యార్థులందరూ సంపన్న కుటుంబంలోంచి వచ్చినవారు. కాని నా తల్లిదంద్రులు నా ఫీజు కట్టడానికి చాలా కష్టాలు పడేవారు. కోర్సు చాలా కష్టంగా వుండి నేను మొదటి సెమిస్టరు ఫెయిల్ అయ్యాను. నామీద చాలా ఆశలు పెంచుకున్న నా తల్లితండ్రులకి మొహం చూపించాలంటే చాలా సిగ్గనిపించేది. ఇంతకు ముందెన్నడూ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం అంటూ జరగలేదు. నిజానికి మా నాన్నగారు నా మార్కుల గురించి బంధువుల దగ్గర చాలా గొప్పగా ప్రస్థావించేవారు, చాలా గర్వపడేవారు. సెమిస్టరు పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం నన్ను చాలా కృంగదీసింది. ఈ విషయం నా తల్లిదండ్రులకి ఎలా చెప్పాలి? ఇలాంటి ఆలోచనలు నన్ను తరచూ వేధిస్తూ వున్నాయి.

నేను హాస్టల్‌లో స్నేహం చేసిన కొంతమంది మత్తు పదార్థాలతో ప్రయోగాలు చేసేవారు. కొంతమంది మాత్రలు వేసుకుంటే, కొంతమంది సిగరెట్లు కాల్చేవారు. నేను రెండూ ప్రయత్నించాను. ఒకరోజు నా రూమ్మేటు ఒక సూదితో నా దగ్గరకు వచ్చాడు. నన్ను కూడా ప్రయత్నించమని ఒప్పించాడు. దానివల్ల వచ్చిన నిషా నాకు చాలా మనశ్శాంతినిచ్చింది. నేను త్వరలోనే ఆ ఇంట్రావీనస్ మత్తు పదార్థానికి బానిసనైపోయాను. హెచ్ఐవి గురించి విన్నాను కాని, అది సూదులు పంచుకోవడం వల్ల వ్యాపిస్తుందని తెలీదు.

అలా ఆరునెలలు వాడిన తరువాత, నా స్నేహితుల్లో ఒకడికి న్యూరల్ వ్యాధి మొదలైంది. మాకు తెలుసు, అతను చాలామందితో సెక్సులో పాల్గొనేవాడని. వ్యాధి ముదిరి, కోమాలోకి దింపింది. అతను త్వరలోనే దానికి బలైపోయాడు.

అతను ఎయిడ్స్ తో పోయాడని ఇనిస్టిట్యూట్‌లో ఒక వార్త (రూమరు) బయలు దేరింది. అది అందరిని చాలా భయపెట్టింది. నేను వెంటనే మత్తు పదార్థాలు మానేసి, అటువంటిదేమి నాకు జరగకూడదని దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాను.

నేను శలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు జబ్బు పడ్డాను. నాకు పరీక్షలు చేయించడానికి నన్ను మద్రాస్ తీసుకువచ్చారు. నేను హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. మా నాన్నగారు నాకు కౌన్సిలింగ్ ఇస్తామంటున్నా డాక్టర్‌ల సలహా పెడచెవిన పెట్టి నన్ను ఇంటికి తీసుకువచ్చి ఒక గదిలో బంధించారు. ఎవర్నీ నన్ను చూడనిచ్చేవారు కాదు. ఒక పనివాడు నాకు భోజనం తెచ్చేవాడు. పనివాడ్ని కూడా నన్ను ముట్టుకోవద్దని హెచ్చరించారు. నా బట్టలు, పాత్రలు నేనే శుభ్రం చేసుకోవలసి వచ్చేది. నా మత్తుపదార్థాల వాడకం మాన్పించడానికి ఇంజక్షన్ ఇచ్చే డాక్టరు కూడా నామీద జాలి చూపించేవారు కాదు. అవి చాలా దుర్భరమైన రోజులు. నా సొంత ఇంట్లో నా గది ఒక జైల్లా, నేను ఒక అంటరానివాడిగా అన్పించేది. ఇలా ఆరునెలలు కొనసాగింది.

ఒకరోజు నా తల్లిదండ్రులు ఒక టి.వి. షోలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ మీద కార్యక్రమం చూడడం జరిగింది. ఆ కార్యక్రమం చాలా పరిజ్ఞానం ఇచ్చేదిగా వుండడం వలన, నా తల్లిదండ్రులు ఆ వ్యాధి కేవలం ముట్టుకున్నందువల్ల వ్యాపించదని తెలుసుకున్నారు. ఎయిడ్స్ తో బాధపడుతున్న వ్యక్తుల్ని కరుణతో కనికరంగా చూడాలని తెలుసుకున్నారు. ఆరోజు నా తల్లిమొహంలోకి చూసి, ఆమె ఓదార్చే చేతుల్లో చాలా ఏడ్చాను.

సమస్యలుః సూదులు పంచుకోవడం

వ్యాధి వున్నవారు ఉపయోగించిన సూదులు, సిరంజిలు మరొకరు ఉపయోగిస్తే ఈ హెచ్ఐవి తొందరగా వ్యాపించే అవకాశం వుంది. మణిపూర్ రాష్ట్రంలో వున్న 15,000 సూదుల ద్వారా మత్తుపదార్థాలు ఉపయోగించేవారిలో దాదాపు 90 శాతం మంది ఈ హెచ్ఐవి పాజిటివ్ అని తేల్చారు. దానికి కారణం వీరు ఒకరు ఉపయోగించిన సిరంజిలు ఇంకొకరు వాడడం.

ఇంజెక్షన్ ద్వారా మత్తుపదార్థ సేవనం (వాడకం) చట్ట విరుద్దమైనది మరియు మత్తు పదార్థాలు వాడుతున్న వారిని అని వాడితే వచ్చే ప్రమాదాలేమిటో హెచ్చరించాలి- వారిని ఈవిధంగా హెచ్చరించాలి.
1) ఒకవేళ మాదకద్రవ్యాలు వాడినా అవి ఇంజెక్షను ద్వారా తీసుకోకూడదు.
2) ఒకవేళ ఇంజక్షను ద్వారాతీసుకుంటే ఒకరు వాడిన సిరెంజి మరొకరు వాడ కూడదు.
3) ఒకవేళ సిరెంజిలు, సూదులు పంచుకోవలసివస్తే, వాటిని బ్లీచ్తో బాగా శుభ్రపరచి వాడడం చెయ్యాలి.
4) ఒకవేళ బ్లీచ్ లేకపోతే వాటిని వేడినీటితో శుభ్రపరచాలి.
5) ఒకవేళ వేడినీళ్ళు లేకపోతే చల్లనీటిలోనైనా సరే బాగా శుభ్రపరచాలి.

ఒంటరితనం (ఐసోలేషన్)

హెచ్ఐవి పాజిటివ్, మరియు ఎయిడ్స్ వున్నవారి బారినించి వ్యాధిలేనివారిని రక్షించడానికోసం, ప్రతీదేశంలో వీరిని వేరుచెయ్యాలని ప్రజలు పిలుపునిస్తున్నారు. కొన్ని దేశాలు ఇన్ఫెక్షన్ వున్నవారిని బంధించేంత దూరం కూడా వెళ్ళాయి.

వ్యత్యాసాన్ని చూపిస్తున్న ఈ విపరీత పద్ధతులు ఘోర అజ్ఞానానికి, అసహనానికి అద్దం పడుతున్నాయి. ఈ హెచ్ఐవి పాజిటివ్ వున్నవారిని కేవలం రోజూ ముట్టుకోవడం (తాకడం) వల్ల ఎవరికీ ఏమీ ప్రమాదం వుండదు. ఇంకా చెప్పాలంటే మామూలు ప్రజల్నించి ఈ హెచ్ఐవి పాజిటివ్ వారికి, వీరి (ఇమ్యూన్ సిస్టమ్) దెబ్బతినడం వలన ఆపర్చ్యునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం వుంది.

ప్రేమ, కనికరం, సహాయం వుంటే, హెచ్ఐవి పాజిటివ్ వారు తమకు వచ్చే ఎటువంటి ఇన్ఫెక్షన్‌లతో అయినా పోరాడి, వీలైనంతవరకు ఆరోగ్యంగా వుండడానికి అవకాశం వుంది.

(Whispers from within- unheard voices of HIV/AIDS- సౌజన్యంతో) అనువాదం- కె.మాధురి

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో