అల్లరి చీమకు బుద్ధొచ్చింది

అదో చిట్టడవి. ఒక రోజు మిత్రులైన కుందేలు, ఉడుత ఆట పాటల్లో మునిగిపోయాయి. అంతలో ఓ చీమ వచ్చి ఉడుతను చటుక్కున కుట్టసాగింది. కుందేలు వారించబోతే దానిని కూడా కుట్టి పకపకా నవ్వింది. అది చూసి గాల్లో ఎగురుతున్న ఓ పిచ్చుక కిందకు దిగి ‘ఓ అల్లరి చీమా! ఇతరులను హింసించి వినోదించడం మంచి పని కాదు’ అంది.

చీమ గబుక్కున పిచ్చుక మీదకు ఎక్కేసి దాన్నీ కుట్టసాగింది. బాధ తట్టుకోలేక పిచ్చుక గాల్లోకి ఎగిరింది. చీమ దాన్ని కుట్టడం ఆపేసి ఓ పిచ్చుకా! ఇలా ఎగురుతుంటే నాకు భలే ఆనందంగా, ఉల్లాసంగా ఉంది. నన్ను ఇలాగే ఎక్కించుకు తిప్పు. కిందకు దిగావా మళ్లీ కుడతా అని హెచ్చరించింది.

చీమ మళ్లీ కుడుతుందన్న భయంతో పిచ్చుక పాపం గాల్లో ఎగరసాగింది. ‘అహా! ఆకాశంలో విహారం ఎంత హాయిగా ఉందో!’ అంటు చీమ మురిసిపోయింది. ఇంతలో చీమకు కింద ఒక సరస్సు కనిపించింది. ”పిచ్చుకా! నాకు నీటి మీద కాసేపు ప్రయాణించాలని ఉంది. కిందకు దిగు’ అంది. సరస్సులోని ఓ తామరాకుపైకి చేర్చింది పిచ్చుక. ‘అబ్బ! ఇక్కడ ఎంత బాగుంది? ఈ ఆనంద సమయంలో నిన్నోసారి కుట్టాలని ఉంది’ అంటూ పిచ్చుకను కుట్టబోయింది. చీమ. ‘నన్ను కుట్టడం అటుంచు, నిన్ను మింగడానికి వస్తున్న ఆ కప్పను చూడు. ఇక్కడితో నీ యాత్ర ముగిసినట్టే. నీ చావు ఖాయమైంది’ అని నవ్వింది పిచ్చుక. కప్పను చూడగానే చీమకు వణుకు పుట్టింది. ఎటూ తప్పించుకోలేని పరిస్థితి దానికి. గత్యంతరం లేక పిచ్చుకా నన్ను కాపాడవూ!’ అని వేడుకుంది. ‘అందర్నీ కుడుతూ ఆనందించే నీలాంటి వాళ్లకు తగిన శాస్తి కావాల్సిందే. నేను కాపాడను’ అంది పిచ్చుకు. నన్ను క్షమించి రక్షించు. ఇకపై బుద్ధిగా ఉంటాను. అని బతిమాలింది చీమ. పిచ్చుక మనసు వెన్నలా కరిగింది.

ఇంతలో కప్ప తామరాకు దగ్గరికి రానే వచ్చింది. చీమ పైకి అధాటున దూకబోయింది. ఇంతలో పిచ్చుక చీమను పైన కూర్చోబెట్టుకుని చెట్టుపైకి రివ్వున చేరుకుంది బతుకు జీవుడా అంటూ చీమ తప్పించుకుంది. తరువాత చీమ చిట్టడవికి వెళ్లింది. అప్పట్నుంచే అల్లరి చీమకు బుద్ధొచ్చి, అందరితో స్నేహంగా ఉండసాగింది.

నీతి : మనల్ని ఒకరు బాధపెట్టినా వారిని మనం బాధపెట్టకూడదు.

 

(ఎల్‌ఎస్‌ఎన్‌ రెయిన్‌ బో హోమ్‌ పిల్లలు గీసిన బొమ్మలు, కథ.)

 

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో