దశాబ్దాల పోరాట చరిత్రకు చిచ్చు – హైకోర్టు మార్గదర్శకాలు- హేమలలిత

ప్రముఖ మహిళా విప్లవకారిణి క్లారాజెట్కిన్‌తో లెనిన్‌ ఓ మాట అంటారు. ‘చట్టం ప్రాతిపదిక మాత్రమే చట్ట సమానత్వం సంపూర్ణ సమానత్వం కాదని, యిది నూటికి నూరుపాళ్ళు వాస్తవమే’. సమానత్వం కోసం చట్టాల్ని ప్రాతిపదిక చేసుకోవాలని ఆపై సంపూర్ణ సమానత్వం పొందడంలో చట్టం తొలి అడుగు కావాలని స్త్రీలు ఎన్నో పోరాటాలు చేసారు. అయితే వీటికి భిన్నంగా గడిచిన దశాబ్దాల మహిళా మేధావుల కృషి, ఉద్యమకారుల సంఘాల పోరాటాల సాక్షిగా స్త్రీల మనోభావాలకు, సామాజిక స్థితిగతులకు వ్యతిరేకంగా స్త్రీలపై మరింత హింస ప్రజ్వరి ల్లేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొన్ని మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది.

భార్యా భర్తలను ఏకం చేయడం కంటే వారి బంధాన్ని విచ్ఛిన్నం చేయిడానికి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 498(ఎ) (భార్యపై భర్త, ఆయన తరుపు బంధువులు క్రూరత్వాన్ని ప్రదర్శించడానికి సంబంధించిన సెక్షన్‌) ఒక ఆయుధంగా ఉపయోగపడటం దురదృష్టకరమని హైకోర్టు అభిప్రాయపడింది. భర్తను దారిలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది ఈ సెక్షన్‌ ఉపయోగించి పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. సరైన సలహాలు ఇచ్చేవారు లేకనే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతున్నాయని భర్తని మాత్రమే కాకుండా అత్తమామలు, ఆడపడుచులు వారి బంధువులను వేధింపులకు గురిచేయటానికి ఈ సెక్షన్‌ను ఉపయోగిస్తు న్నారని పెర్కొన్నది. అయితే ఇది ఈనాటి తీర్పు మాత్రమే కాదు. అత్తింటి వారిపై అభియోగాలు (అనవసర) మోపరాదని వరకట్నం మృతికేసుల్లో సుప్రీమ్‌కోర్టు ఒక కీలక తీర్పును 2010లో ఇచ్చింది.

ఇంతకీ 498’ఎ’ సెక్షన్‌ అంతట మహమ్మారీగా కనిపిస్తుంది. నిజానికి రెండింతులు పైగానే ముద్దాయిలు విడుదలౌతున్నారు. చట్టం ప్రకారం 498’ఎ’ ప్రకారం ఒక స్త్రీ తనపై జరిగే హింస వలన అత్మహత్య చేసుకొనే పరిస్థితులు నెలకొన్నా, లేక వరకట్నం కోసం డిమాండ్‌ చేసి హింసించడం నేరము. ఈ సెక్షన్‌తో పాటు అపరాధిత నమ్మక ద్రోహం (406), బెదిరించడం (506) కూడ ఒక్కొక్కసారి మోపబడతాయి. ఒకవేళ వరకట్నం మృతి జరిగితే 304’బి’, అత్మహత్య చేసుకోవటానికి ప్రేరింపించడం 306 లాంటివి కూడా మోపబడతాయి. కాని ప్రాసిక్యూషన్‌ గట్టి సాక్ష్యాధారాలతో నిరూపించవలసి వుంటుంది. ఇవి చాలా వరకు కోర్టులో నిలబడవు. విచారణ ముగిసేలోపే చాలా కేసులు సయోధ్యకు వస్తాయి. ఒకవేళ శిక్షించబడ్డ ముద్దాయిలు అప్పీలు చేసుకోవటానికి బెయిల్‌ మంజూరు అవుతుంది. అలా వాడు సుప్రీంకోర్టుకు వెళ్ళెలోపల ఇక్కడ స్త్రీ జీవితం చిధ్రమౌతుంది. ఇన్ని అవకాశాలు ఉన్న ముద్దాయిలకు అన్యాయం జరుగుతుందనే ధోరణి హైకోర్టు, సుప్రిం కోర్టులలో కల్పించడం వారి పితృస్వామిక ధోరణికి నిదర్శనం.

సుప్రీమ్‌కోర్టు ప్రీతిగుప్తా వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ జార్ఖాండ్‌ కేసులో ఇచ్చిన అదేశాల మేరకు ‘లా’ కమిషన్‌ చాలా స్పష్టంగా 498’ఎ’ సెక్షన్‌ నాన్‌ బెయిలబుల్‌గా ఉండాలనే సిఫార్స్‌ చేసినది. అంతేకాకుండా పార్లమెంటరీ కమిటి ఒక్క సంవత్సరం పాటు వివిద రాష్ట్రాలలో పర్యటించి, ఈ సెక్షన్‌ అమలులో స్థితిగతులను తెలుసుకోవటానికి అధ్యయనం చేసింది. అయినప్పటికి ఆ కమిటి ఈ సెక్షన్‌ను ప్రజలు వ్యతిరేఖిస్తుందన్నారని చెప్పలేదు. కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు ప్రజాభిప్రాయాలకు భిన్నంగా వెళ్ళడం ఆశ్చర్యకరం. హైకోర్టు అదేశాల ప్రకారం కేసు దర్యాప్తు డి.యస్పీ ర్యాంకుకు తగ్గని వారితో చేయాలి. ఒకవేళ తప్పుగా కేసులో ఇరికించారని అనుమానిస్తే, జిల్లా పోలీసు అధికారిగార్కి తెలియజేసి చార్జిషీటులో వారి పేరును తొలిగించవచ్చును. మేజిస్ట్రేట్‌ యాంత్రికంగా జైలుకు పంపకూడదు. ధనం, కులం, మతం అవినీతి అధికార హోదాలో ఉన్నప్పుడు స్త్రీలకు ఎటువంటి న్యాయం జరుగుతుందో ప్రజాస్వామిక వాదులుగా మనం ఊహించగలం.

ఈ తరహా మార్గదర్శకాలు డా|| బాబా సాహబ్‌ వ్రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. 1950లలో హిందూ కోడ్‌ బిల్లు కోసం ఆయన చేసిన పోరాటం స్పురణకొస్తున్న సందర్భం ఇది. ఆనాడు ఫాసిస్టు మతవాద శక్తులు ఏలాగతై స్త్రీల హక్కుల రక్షణకు గండి కొట్టారో ఈనాడు ప్రపంచీకరణలో స్త్రీల స్థితి గతులకు అడ్డుపడుచున్నారు. ఈ తరహా మార్గదర్శకాలు మహిళా మేదావులు చేసిన కృషిని అపహస్యం చేయడమే కాదు, మహిళా సంఘాల అవిరణ పోరాట స్ఫూర్తిని అవమానపర్చినట్లే ఇలాంటి పితృస్వామిక భావజాలంతో కూడిన తీర్పులను ఇస్తున్న న్యాయ వ్యవస్థను ప్రశ్నించవలసిన అవసరం నేడు ఉంది. వ్యవస్థ మారనంత వరకూ సామాజికంగా స్త్రీలకు రక్షణ లేదన్నప్పటి అవగాహన మన న్యాయవ్యవస్థకు లేదనటానికి ఈ తీర్పు ఒక తార్కాణం. తను చేసిన చట్టాలను సక్రమంగా సరైన రీతిలో అమలు చేయలేని యాంత్రాంగం ఈనాడు తాను చేసిన చట్టాలనే తానే నిర్వీర్యపర్చుతుందన్నటానికి ఇది ఒక తాజా ఉదాహరణ.

సంఘటితంగా హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అడ్డుకోవాల్సిన చారిత్రిక బాధ్యత మన స్త్రీలందరిపైన ఉన్నది. స్త్రీలకోసం మన కేంద్ర పదవినే వదులుకొన్న త్యాగమూర్తి బాబాసాహెబ్‌ లాంటి పురుషుల సహాకారం, బాధ్యత ఉంది. అందరం కలిసి దశాబ్దాలుగా పోరాడి, సాధించి, పొందిన చట్టాలను రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పొడవకుండా కాపాడుకోవల్సిన అవశ్యకత నేటి మన కర్తవ్యం. స్త్రీల హక్కులను హరించే ఈ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఐక్యమవుదాం. మన హక్కులను మనం తిరిగి పొందేందుకు అవిశ్రాంతిగా మన లక్ష్యం వైపు కలసినడుద్దాం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో