మా వాళ్ళే నన్ను సెక్స్ వర్కర్‌ని చేసారు

-శ్రీదేవి

వయస్సు 25 సం. మాది నెల్లూరు జిల్లా. నా చిన్నతనం అంతా లేమితనంతోనూ, సంఘర్షణతోనూ, మా అమ్మపై జరిగే హింస చూస్తూ గడిచింది. నా సవతి తండ్రి ఆమెను చాలా శారీరకంగా బాధపెట్టి, ఆమె సంపాదన అంతా లాక్కునేవాడు. నా తల్లి పనిమనిషిగా పనిచేసేది. నేను ఎప్పుడూ పాఠశాలకి వెళ్ళకుండా ఆమెతోపాటు పనిలోకి వెళ్ళేదాన్ని. నా 12 సంవత్సరాల వయసులో, నా తల్లితండ్రులు నన్ను తెనాలిలోని ఒక ఇంటిలో పనిమనిషిగా పెట్టారు. అది ఒక వేశ్యాగృహం. నేను కస్టమర్‌లకి సిగరెట్లు తేవడం, కూల్డ్రింకులు తేవడం లాంటి పనులు మొదలుపెట్టాను. పనిలో చేరిన 2 సంవత్సరాలలో నేను పెద్దమనిషిని అయ్యాను. కాని ఓనరు ఈ విషయం మా అమ్మతో చెప్పనివ్వలేదు. ఎప్పుడు మా అమ్మ నన్ను చూడడానికి వచ్చినా, మా ఓనరు అక్కడే వుండడం జరిగేది. నాకు చాలా భయం అన్పించి, ఓనరు ఎదురుగుండా ఏమీ మాట్లాడేదాన్ని కాదు. కొన్నాళ్ళ తరువాత మా అమ్మ నన్ను చూడడానికి రావడం మానేసింది.

నా పదహారో ఏట, మా ఓనరు నాకు నచ్చచెప్పి, నన్ను ఒప్పించి వేశ్యావృత్తిలోకి దింపాడు. దాంతో నేను వేశ్యగా పనిచెయ్యడం మొదలుపెట్టాను. నేను ఆరు, ఏడుగురు కస్టమర్‌లని వినోదపరుస్తూ లాడ్జిలకి, హోటళ్ళకి వెళ్ళేదాన్ని. పోలీసులు నన్ను రెండు మూడుసార్లు అరెస్టు చేసి కొట్టినారు కాని బెయిల్ మీద బయటకు వచ్చేదాన్ని. కస్టమర్లు/ పోలీసులు పెట్టే బాధ భరించడం కష్టమైపోయింది. నాకు ఈ వృత్తి వదిలేద్దామని వుందని కోరిక బయటపెట్టినపుడు, నన్ను వెంటనే ముంబాయిలోని ఒక బ్రోకరుకి 10,000/- రూపాయలకి అమ్మేశారు. ముంబాయిలో జీవితం కూడా తెనాలి జీవితంలానే వుండేది. కస్టమర్‌లని ఆనందపరచడం, వచ్చిన దాంట్లో ఎక్కువ భాగం ఓనరుకే వెళ్ళేది. ఒకరోజు మేము పోలీసులకి పట్టుబడ్డాను. కథ విన్న తరువాత, నాకు తెనాలి తిరిగి వెళ్ళిపోవడానికి కొంత డబ్బిచ్చారు.

నేను తెనాలిలో మా అమ్మ ఇల్లు కనుక్కోలేకపోయాను. మళ్ళీ నన్ను అమ్మేసిన వేశ్యాగృహానికే వచ్చాను. నేను తిరిగి వచ్చేటప్పటికి ఐదునెలల గర్భవతిని. అయినా కూడా నన్ను సెక్సులో పాల్గొనమని బలవంతం చేసేవారు. నా ఆరోగ్యం పాడయ్యి, అది వదిలేసి ఒకావిడ దగ్గర వుంటూ వచ్చాను.

తొమ్మిదవ నెల వచ్చేవరకు నేను వైద్య పరీక్ష చేయించుకోలేదు. తరువాత ఒక లోకల్ ఆస్పత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నప్పుడు నేను హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. వెంటనే పరిస్థితి మారిపోయింది. డాక్టర్లు, వారి సిబ్బంది నాతో మాట్లాడ్డం మానేశారు. వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుతూ నేను ఏం చెయ్యాలో చెప్పలేదు.

నేను మళ్ళీ రోడ్డుమీదకు వచ్చాను. ఈసారి ఒక సెక్సువర్కరు నాకు ఆశ్రయమిచ్చింది. పదిహేను రోజుల తరువాత నేను మళ్ళీ అదే గవర్నమెంటు ఆస్పత్రిలో పురిటికోసం చేరాను. కాని డాక్టర్లు, నర్సులు ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు- నేను ఎంత బాధపడుతున్నా. ఒక ఆయా నాకు బిడ్డని ప్రసవించడంలో సహాయం చేసింది.

సమాజ ఫెలోషిప్ యొక్క సహకారం ఈ ఫెలోషిప్ (ఉపకార వేతనం) బృందం పౌష్టికాహారం గురించి విశదీకరిస్తారు.
(యాక్షన్ ఎయిడ్ సౌజన్యంతో) అనువాదం: కె. మాధురి

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

5 Responses to మా వాళ్ళే నన్ను సెక్స్ వర్కర్‌ని చేసారు

 1. Anonymous says:

  ఈ కధ చల్ల దూప

 2. Anonymous says:

  పపమ పసి కూన

 3. koresh says:

  తెలిసి తెలీని వయసు ఎంథ మంది ఇలాగా ఎవరు బాద్యులు

 4. ramesh says:

  అమె చెసింది తప్పుకాదు
  హస్పత్రివాల్లు పటించుకొవడమె తప్పు పుట్టబోయె పాపకి ఎమి తెలుసు ?

 5. నిజంగా బాధ గా ఉంది అ అమ్మాయి కి నాఅనా వారు చేసినా ది గోరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో