కవితలు

నిషేధం నవ్వింది
పంతం సుజాత

నీకూ నాకూ మాటతేడాలొచ్చిన ప్రతిసారి
చిత్రంగా ఇంట్లో వస్తువులకి ప్రాణమొస్తుంది.

చేతికి చేతికి మధ్య ప్రేమ వారధిలా నిలిచిన కాఫీ కప్పు
టీపాయ్‌ నాశ్రయించి తన ఉనికిని ప్రదర్శిస్తుంది,
కంటనీరు వంట ఇంట్లో మంటలార్పుతుంటే
కత్తిపీట మీద కాకరకాయ
కావ్యాలు రాస్తుంది,

బయటకి వెళ్ళేటప్పుడు ఇంటిగేటు నీకు ఇల్లాలవుతే
అంతగా శబ్దం చేస్త తలపడం చాతకాని నామనసు నల్లా అవుతుంది,
అనుకోకుండా తగిలిన నీ చెయ్యి తీసుకుని అవ్యక్తంగా చస్తే
అనుకుని ముందుకేగిన ఆశ నిశ్శబ్దంగా వెనకడుగు వేసింది,

దీక్ష మరిచిపోయిన కార్మికుడిలా నువ్వు మాట్లాడుతుంటే
కక్ష బానిన ఆహ్లాదం కనికరించినట్ల్లైంది,
రక్షణ వలయనికి రంగవల్లిక లద్దినట్లైంది,
పక్షిమూకలొచ్చి పాటపాడినట్లైంది.

ద్రవీభూత సముద్రం
ఎన్‌. అరుణ

ఈ పచ్చని చెట్లకావల
ఒక మహాసముద్రం వుందంటే
ఆశ్చర్యపోక తప్పదు.

నాలుగడుగులు వేసి చెట్లను దాటామా
నింగీనీర ఏకమైన
అద్భుత మహావిష్కృతి
వర్షంలో విశాఖ సముద్రాన్ని చూడటం
ఓ ఆర్ద్రమైన అనుభూతి.

పైనుంచి రాలే ఒక్కో చుక్కా
నీళ్లను చేరి సముద్రంగా మారిపోతుంది.
మబ్బులనుంచి రాలిన బిందువులు
సముద్రాన్ని చేరుతున్నాయో
సముద్రంనుంచి జల్లులు పైకెగసి
ఆకాశాన్ని తాకుతున్నాయె
సందిగ్ధ దృశ్యం.

సముద్రానికి కాపలాగా
ఒడ్డున ఓ చిన్నగుడి
సముద్రంలోనుంచి పైకిలేచిన ఓ పెద్దచేప
లోకాన్ని చూసి ఆశ్చర్యపోయి
గడ్డకట్టి పోయినట్టుగా ‘డాల్ఫిన్స్‌ నోజ్‌’.
తీరాన్ని చేరుతున్నామన్న సంతోషంతో
ఇంతెత్తున లేచిపడుతూ వస్తున్న కెరటాలను
మళ్లీ వెనక్కి లాగుతున్నదెవరో!
మరకతాలు రాశిపోసినట్టు
ఓ పక్కన ఎత్తైన కొండలు
మరోవైపు కనుచూపుమేర పరుచుకున్న
అనంత జలరాశి
పైనుంచి ధారాపాతంగా జాలువారుతూ
నిలువెల్లా తడిపేస్తున్న వానజల్లులు
నిజానికీ వాన
నాలో కురుస్తున్నదే.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో