మహిళా సాధికారత ఎండమావేనా? పై – పరిశీలన వ్యాసం – సైదులు పోలం, డా|| కె. ఐలయ్య

అర్థరాత్రి మహిళ నడిరోడ్డుపై నిర్భయంగా నడిచే రోజునే నిజంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లని, మహిళకు సరియైన భద్రత, గౌరవం ఉన్నట్లని గాంధీజీ అన్నారు. కానీ 66 ఏళ్ళ స్వాతంత్య్ర భారతావనిలో నడిరాత్రి కాదు,మిట్ట మధ్యాహ్నం కూడా అడుగు బయట పెట్టలేని పరిస్థితులు దాపురించాయి. మహిళలకు ఇంటా, బయట రక్షణ లేని పరిస్థితులు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా లింగ వివక్ష నేటికి 136 దేశాల్లో ఉంటే భారత్‌ 101వ స్థానంలో వున్నది. ఆర్థిక స్వాతంత్య్రం, చదువు, ఉద్యోగం, ఆరోగ్యం విషయంలో మహిళలు ఇంకా వివక్షను, అణచివేతను ఎదుర్కొంటున్నారు. పురుషునితో సమానంగా ఏ చోటా గౌరవం, స్థానం దక్కడం లేదు.

దేశంలో 45 శాతం ఆడపిల్లల్ని 18 ఏళ్ళలోపే పెళ్ళిచేసి, సంసార కూపం లోకి తోసేస్తున్నారు. తల్లి చాటు పిల్లలు కాస్తా, పిల్లల తల్లులై పోతున్నారు. విద్య, ఉద్యోగావకాశాలకు దూరమై, శారీరకం గానూ, మానసికంగానూ దుర్బలులై పోతు న్నారు. సామాజిక కట్టుబాట్లు, దురాచా రాలు చివరికి ఆడజాతి పాలిట పెనుశాపాల వుతున్నాయి.

ఇంటికి ఇల్లాలు అందమని, ఆడపిల్లలు పుడితే అదృష్టదేవతలని, మహా లక్ష్ములని పొగుడుతున్న మనం, పురుషులతో సమానంగా సమాన అవకాశాలు ఎందుకి వ్వడం లేదు? ఎందుకు వారిపై వివక్షతను చూపుతున్నాం. ఎన్నో ఏళ్ళుగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్‌లో ఎందుకు ఆమోదం పొందడం లేదు? వివిధ రాజకీయ పార్టీలు మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని, వారి అభ్యుదయానికి పాటుపడ తామని చెప్పుకుం టున్నారు. మరి వారి పార్టీలలో సమానా వకాశాలు ఎందుకివ్వడం లేదు? స్త్రీని ఆదిశక్తి, పరాశక్తిగా కొలిచే ఘనమైన సంస్కృతి కల్గిన మనం వారిని వంటింటికే ఎందుకు పరిమితం చేస్తున్నాము? వారిని బయట ప్రపంచానికి ఎందుకు పరిచయం చేయడంలో విఫలమయ్యాము? ధైర్యం చేసి కొంతమంది మహిళలు బయటికి వస్తే వారిపై జరిగే లైంగిక హత్యలను, హింసలను, వేధింపులను ఎన్ని చట్టాలున్నా ఎందుకు కాపాడలేక పోతున్నాయి.

దేశ ప్రథమ మహిళా రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్‌ చరిత్రకెక్కారు. తొమ్మిదేళ్లుగా దేశాన్ని ఏలిన యుపిఏ కూటమికి పెద్ద దిక్కుగా సోనియాగాంధీ, లోక్‌సభ స్పీకర్‌గా మీరా కుమార్‌, ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మాస్వరాజ్‌, విదేశాంగ కార్యదర్శిగా సుజాతాసింగ్‌, భారత తొలి ప్రధాన సమాచార కమీషనర్‌గా దీపక్‌ సింధూ, ఐసిఐసిఐకి సి.ఈ.వో, ఎండీగా చందా కొచర్‌,  ఫిక్కి అధ్యక్షురాలిగా నైనాలాల్‌ కిద్వాయ్‌, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా వసుందర రాజె, ఉత్తరప్రదేశ్‌ ముఖ్య మంత్రిగా పనిచేసిన మాయావతి, డిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌, బీహార్‌ ముఖ్యమంత్రిగా చేసిన రబ్రీదేవి, ఇంకా కల్పనా చావ్లా, సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌, హారిక, సింధు, మేరీకోమ్‌, కిరణ్‌బేడి లాంటి మహిళలు వివిధ రంగాలలో మహోన్నత స్థానాలు అధిరోహిస్తూ ఉండవచ్చుగానీ దేశంలోని స్త్రీ మూర్తులందరి ప్రగతికి అదొక్కటే కొలబద్ద కాదు కదా!

భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని గర్వంగా చెప్పుకునే మనం వారికి లోక్‌సభలో 11 శాతం, రాజ్యసభలో 10.7 శాతం మహిళా ప్రతినిధులే ఉన్న తీరు అందుకు తగినట్లుగా కనబడుతుందా?

దేశంలో నాలుగు దశాబ్దాల్లో ఆడపిల్లలపై అత్యాచారాలు 900 శాతం పెరగడం ఆందోళన కలిగించడం లేదా?

దేశంలోని భూ యజమానుల్లో 10 శాతమున్న మహిళలు లేరు. అదే ఇటలీలో 31.9 శాతం, థాయిలాండ్‌లో 33 శాతం, యు.కె.లో 19 శాతం మహిళలు న్నారు. ఆ స్థాయికి మనమెప్పుడు చేరుతా ము? మనకు స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు అయినా 2005 దాకా మహిళల కు ఆస్తి హక్కు లేదు అంటే మనం వారిపై చూపే సమానత్వం, సాధికారత ఎలాంటిదో అర్థమవుతుంది.

గ్రామాల స్థాయిలో వివిధ రకాల ఎన్నికలలో రిజర్వేషన్స్‌ నేపథ్యంలో మహిళ లకు అవకాశం వస్తే రాజకీయ నాయకులకు సంబంధించిన వారినే పోటీలలో నిలబె డుతూ, నిర్ణయాధికారాలలో వారికి అవకా శం ఇవ్వటం లేదంటే ఇది దేనికి నిదర్శనం?

ఇంకా స్త్రీని ద్వితీయ శ్రేణి పౌరురా లిగా, అబలగా చూసే ధోరణి ఇంకా రాజ్య మేలుతోంది. ఆడపిల్ల పుట్టిందంటే అరిష్టంగా భావిస్తున్న చీకటి సమాజం మనది. కడుపులో వున్న బిడ్డ కూడా లింగ వివక్షకు బలవుతున్న సాంకేతిక వికృత సమాజంలో మహిళలు అడుగడుగునా ప్రాణగండం ఎదు ర్కొంటున్నారు. ఈ కారణం గానే దేశంలో రోజు రోజుకూ స్త్రీ, పురుష నిష్పత్తిలో భయంకరంగా వ్యత్యాసం పెరిగి పోతున్నది.

1961 నుండి భారత్‌లో బాలికల జననాలు పడిపోతున్న తీరు బాలికల జననాలు – ప్రతి వెయ్యిమంది మగ పిల్లలతో పోలిస్తే

1961    1971    1981    1991    2001    2011

976    964    962    945    927    914

ప్రస్తుతం దేశంలో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య 3.72 కోట్లు తక్కువగా ఉన్నట్లు జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాల ప్రభావం ఆడపిల్లల జననాలపై అధికంగా పడుతోంది. కానీ ఆ ఒక్కరు లేదా ఇద్దరు మగపిల్లలైతే సంతోషించే వారి సంఖ్యా ఎక్కువే. గడిచిన పదేళ్లలో జమ్మూ కాశ్మీర్‌ గుజరాత్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో ఆడపిల్లల జననాలు భారీగా తగ్గిపోయాయి. ఆడశిశువులకు జన్మనివ్వడంలోనే కాదు, మహిళలకు వివిధ రకాల అవకాశాలు, వనరుల కల్పనలోనూ భారత్‌ స్థానం ప్రపంచంలోనే అన్యాయంగా వుంది అని ”వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం” నిరుడు నవంబర్‌లో విడుదల చేసిన తాజా నివేదిక ఎండగట్టింది. ప్రధానంగా పురుషులు మహిళలకు వనరుల అందుబాటూ, అవకా శాలూ ఎలా ఉన్నాయన్నా విషయాలన్నింటిని పరిశీలించి ఆ నివేదికను రూపొందించారు. ఆర్థిక పరమైన అంశాలంటే జీతభత్యాలు, ఉద్యోగవకాశాలు, అత్యంత నైపుణ్యం వున్న స్థానాల్లో అవకాశాలు అన్నది అందులో మొదటి అంశం. మహిళల ఆరోగ్యం, సగటు ఆయుఃప్రమాణం, లింగ నిష్పత్తి రెండో అంశం. రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం – నిర్ణయాధికారం స్థానాల్లో అవకాశాలు మూడో అంశం. విద్యావకాశాలు నాలుగో అంశం. ఆ అంశాలలో మహిళల స్థితిగతులను బట్టి 135 దేశాలకు ‘ర్యాంకు’లు ప్రకటిస్తే భారతదేశం 2006లో 98వ ర్యాంకు దక్కగా, 2011లో అది 113కు దిగజారడం మనం ఎలాంటి పురోగతిని సాధించామో తెలుస్తుంది.

ఆడపిల్లలను తల్లి కడుపులో ఉండగానే చంపే దారుణమైన సంస్కృతి మొదలు – పుట్టి పెరిగిన తర్వాత అవకాశాల కల్పనలో వివక్ష వరకూ పరిస్థితి అన్యాయంగా ఉందని తాజా గణాంక అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరేళ్ళలోపు బాలికలు 2001 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమంది బాలురకు 941 మంది బాలికలుంటే 2011 నాటికి 859 మంది మాత్రమే వున్నారు. అంటే దేశంలో బాలికల పరిస్థితులు ఎలా వున్నాయో తెలుస్తుంది.

ముగింపు : బాలికలు కడుపులో పడినప్పటి నుండే వారు వివక్షతకు గురవుతు న్నారు. బాలికలు కాస్తా మహిళలుగా మారే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతు న్నారు. రాజకీయ నాయకులు మహిళా సాధికారతపై ప్రసంగాలివ్వడం మాని రుజువు చేసి చూపాల్సిన అవసరం ఎంతైనా వున్నది. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు చేసినా అవే సంఘటనలు పునరావృతం అవుతున్నాయంటే లోపం ఎక్కడో తెలుసు కుని, చట్టాలను కఠినంగా పనిచేసే విధంగా చేయాలి. ఇంట్లో మహిళ పెత్తనం సాగించే కుటుంబాలు పురోభివృద్ధి సాధించా యనడం జగమెరిగిన సత్యం కావున పాలన రంగంలో వారికి పురుషులతో సమానంగా అవకాశం కల్పించడం ఎంతైనా అవసరం. అన్ని రంగాలలో మహిళలకు సమానావకాశాలు కల్పించాలి. దేశంలో మహిళా సాధికారత సాధించాలంటే కేవలం ప్రభుత్వాలే కాకుండా సమాజంలో ప్రతి పురుషుడు వారికి అండగా వుండాలి. ఏనాడైతే మనం వారికి పూర్తిగా నమ్మకాన్ని, భరోసా కల్పిస్తామో అప్పుడే మనదేశం సర్వతోభివృద్ధి చెందుతుంది.

సమాజంలో మహిళలకు తగిన ప్రాధాన్యంతో పాటు సామాజిక గౌరవం దక్కేందుకు జాతీయ మహిళా కమీషన్‌ చిత్తశుద్ధితో కృషి చేయాలి. ప్రగతి కాముక దేశంగా చెప్పుకుంటున్న మనం స్త్రీని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో తీసుకెళ్ళిన నాడే దేశం అభివృద్ధి చెందుతుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో