కాగితం - ఎస్‌. స్రవంతి

ఈ తెల్లని కాగితం
అందరికి కావాలి
కాగితం మాత్రం
ఎవ్వరికి కనిపించడం లేదు
సిరామరక మాత్రమే కనిపిస్తుంది.
అందరికి…
చివరికి ఎల్లప్పుడూ రాసే కవికి కూడా
ఈ కాగితంపై సిరామరక ఎలా వచ్చిందని
రాసేవాళ్ళు కాకపోతే
పొలంలో పనిచేసే వాళ్ళేశారా?
లేక
కాగితం అమాంతం వెళ్ళి
సిరాపైన పడిందా?
పడితె తప్పు కాగితానిదా
బలహీనమైన కాగితం బలమైన గాలిలో
ఎగరను అంటే వినేదెవ్వరు?
నిజంగానే కాగితం సిరాతో నిండిపోయినా
రంగు మారిపోయిందంటూ బుకాయిస్తారు
ఈ రంగు మాకు ఇష్టం లేదు అంటారు.
బాధపడిన కాగితం
ఏమని విలపిస్తుంది.
మరో దుర్మార్గానికి బలైపోవలసి వస్తుంది
ఎవరో వేసిన మరకకు కాగితం బలైపోయింది
ఇది గ్రహించవలసిన వారు కూడా
కాగితాన్నే కాల్చేశారు.
రెండు కన్నీటి చుక్కలు పడ్డా
ముడుచుకుపోయే కాగితాన్ని
అమాంతం మురికి కాలువలో పడేశారు
అంత చులకనైపోయింది కాగితం
మరకపడ్డ కాగితానిది తప్పు కాదు
ఆ మరక వేసిన వాళ్ళదని
ఎప్పుడు గ్రహిస్తారు
అందరూ ఓదార్చాలనే ప్రయత్నిస్తారు
పరిష్కరిద్దామని ఎవ్వరూ పూనుకోరు
చెప్పే మాటలు ఆచరించాలంటూ
మాటలు కోటలు దాటేలాగా చెప్తారు
హద్దుల్లో పెట్టాలని కాగితంపై
బండపెడతారు
నడుములు వంగిపోయిన
పట్టించుకోక పోగ
బండపైనే యుద్ధం చేస్తారు
నష్టపోయింది
యుద్ధం చేసేవారు కాదు
బండ కాదు
బండకింద నలిగిపోయే కాగితం
చివరికి ఆ కాగితం
వారి భావాలనే చిత్రిస్తుంది కానీ
తన బాధను చెప్పుకోనే అవకాశమే లేదు
పట్టించుకోరు
పట్టించుకొంటామని
పట్టుకొని చించేస్తున్నారు
చివరికి పొట్లం కట్టి
పల్లీలతో అమ్మేస్తున్నారు
చచ్చిన కాగితాలను ఎరువుగ
వాడుకొంటున్నారు
ఇదంతా చూసినా సరే చివరికి
ఒక కాగితమే ఇంకొక కాగితానికి
నిప్పంటిస్తోంది
నాతోపాటు నువ్వు
దహించుకుపోతున్నావని
గ్రహించదు
అగ్గిపుల్లను శిక్షించరు
అగ్గేమనమైతే బ్రతికేవాళ్ళెవరు?
ఆలోచించరు
ప్రపంచపాలన నడిచేది కాగితంపైనే
మలాన్ని తీయడానికి ఉపయోగించేది కాగితమే
ఈ బాధలను చిత్రించేది కాగితంపైనే
కాగితం ఎవ్వరికీ కనిపించదు
చివరికి ఇప్పుడు కూడా
కవిత్వమే కనిపిస్తుంది అంటారు
చదివిన తరువాతైన
కాగితం కనిపిస్తుందేమో
చూద్దాం!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>