‘జోహార్‌ మహిళోద్యమ కెరటమా’ – ఝాన్సీ కె.వి. కుమారి

మనిషి గుండెలోని
చీకటి కోవిరాలను చూస్తే
నీకెంత కోపమో
వెలుగు రేకవై ఉదయించావు
పేదగొప్ప, కులము మతము
స్త్రీలు పురుషులు, నిచ్చెనమెట్లు
ఎన్నెన్ని అసమానతలు…
గీతలు గీచిన వాళ్ళంతే
నాకు జాలి… వాళ్ళ అభద్రతా భయాలకు
ఆ గీతల్ని తుడిచే
దయా సాగరమైనావు
అసహాయులకు అభయహస్తమైనావు
అన్నార్తులకు అన్నం ముద్దవైనావు
అనాధలకు ఆసరా అయ్యావు
మూఢనమ్మకాల మూర్ఖత్వాలపై
అక్షర యుద్ధం చేశావు
ఎక్కుపెట్టిన నీ అక్షరాలను
ఎన్ని అవార్డులో వరించాయి…
వాటిని చూసి మురిసిపోలేదు నువ్వు
నిక్కమైన పనిచేసి
నిఖిల లోకం కళ్ళు తెరిపావు
ఆస్తులను ప్రదర్శించే
ఆడంబరాల పెళ్ళిళ్ళను నిరసించి
రెండు దండలు రెండు ఫోటోల
అందరి అండదండల
అనురాగాల కళ్యాణాలతో
ఆప్యాయతల పునాదివేశావు
బాహ్య చూపులకు నువ్వు
సామాన్య మహిళవు
బాజా భజంత్రీలు లేని
మౌన శ్రామికవు
‘ఆమె’ నవ్వుల కోసం
అహరహరం అలమటించిన
లక్షల అబలల మాతృమూర్తివి!
‘అక్షర’ సబలల ఆశయ స్ఫూర్తివి!!
అమ్మా, మల్లాది సుబ్బమ్మా,
నీ కలల సమాజ ఆవిర్భావానికి
మ(ర)ల్లా పుట్టాలి నీలాంటి ‘అమ్మ’!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో