ప్రివెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చెయ్యాలి

-వి. రాజేశ్వరి (ఇంటర్‌వ్యూ: కె. సత్యవతి)

నేను వనితా మహా విద్యాలయలో రీడర్‌గా పనిచేస్తున్నాను. మా కాలేజిలో చదివే పిల్లలకి హెచ్ఐవి గురించి అవగాహన వుందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా కాలేజిలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ వుంది. దీని తరఫున విద్యార్థులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు, ఎన్నో ర్యాలీల్లో పాల్గొంటుంటారు. ఎయిడ్స్ ర్యాలీలో పాల్గొంటారు. మా కాలేజీలో రెడ్ రిబ్బన్ క్లబ్ వుంది. ఇటీవలే మైక్రో బయాలజీ డిపార్ట్‌మెంటువాళ్ళు మూడురోజుల ఎగ్జిబిషన్ నిర్వహించి హెచ్ఐవి వైరస్ గురించి తెలియచెప్పారు. పిల్లలంతా ఆ ఎగ్జిబిషన్ చూసారు. అవగాహన వుంది గానీ వాళ్ళు ఓపెన్‌గా మాట్లాడటం కష్టం. ఎక్కువమంది vulnerable sections నుండి వచ్చారు. అంతేకాదు వాళ్ళ కుటుంబాల్లో వీళ్ళే మొదటిసారి చదువుకొంటున్నవాళ్ళు. వాళ్ళ అభిప్రాయాలు రాబట్టడం కష్టం. స్కూల్ స్థాయిలో సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలున్నాయి. ఈమధ్య ప్రజ్వల సంస్థనుండి సునీత వచ్చారు. ఆవిడ చెప్పిన విషయాలు పిల్లలు విన్నారు. మా కాలేజీలో కౌన్సిలింగ్ సెంటర్ కూడా వుంది.

నేను ‘ఆశ’ ప్రోగ్రాం, ప్రచారం గురించి విన్నాను. సమాజంలోని అందరికి ఈ వైరస్ వల్ల రిస్క్ వుంది. కిందిస్థాయి, పై స్థాయి అని కాదు అందరికీ ప్రమాదం వుంది. ఈ వైరస్ సోకిన పాజిటివ్‌ల పట్ల సానుభూతితో వుండాలి. వాళ్ళకి కావలసిన సహకారాన్ని అందించాలి. వాళ్ళని మామూలు మనుష్యులుగానే చూడాలి తప్ప, వివక్ష చూపించకూడదు.

నా ఉద్దేశ్యంలో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి రిస్క్ సమానంగానే వుంది. రక్త పరీక్ష ఖచ్చితంగా చేయించాలి. అందరికీ హెచ్ఐవి వుండాలని కాదు కానీ ఇది అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుంది. సురక్షితంగా వుండడం కోసం ఇది ఉపయోగపడుతుంది.

ఇప్పటి పరిస్థితి చూస్తుంటే, పిల్లల భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల్లో దీనిపట్ల సరైన అవగాహన పెంచాలి. వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడాలి, సమస్యల్లేకుండా బతకాలి అని అనుకోవడంతో పాటు పిల్లలు హెచ్ఐవి పట్ల కూడా అవగాహన పెంచుకునేలా తల్లిదండ్రులు ప్రయత్నించాలి. ఇది ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న సమస్య కాబట్టి, మా విద్యార్థులకి అవగాహన ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి అనే అంశాలమీద కూడా మేము కృషి చేస్తున్నాం. ఈ అంశాన్ని పాఠ్యాంశం చేస్తే బావుంటుంది. పర్యావరణం మీద పాఠం పెట్టినట్టుగానే దీనిని పాఠం చెయ్యాలి. జనాభా విస్పోటనంతో పాటు దీనిగురించి కూడా విస్తృతంగా చర్చించొచ్చు. జనాభా అంశంలో అధిక జనాభా వల్ల, హెచ్ఐవి కూడా పెరగడాన్ని చర్చిస్తున్నాం. దీనివల్ల అన్ని వయసుల పిల్లలకి పాఠశాల నుండి పి.జి వరకు పిల్లలకు ఈ సమాచారం అందుతుంది. అవగాహన పెంచుతుంది. సమస్యల గురించి వాళ్ళు సందేహాలడిగితే చర్చించడం తేలికవుతుంది.

మహమ్మారిలా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను అరికట్టడానికి అందరం కృషి చెయ్యాలి. ప్రివెన్షన్ మీద, ప్రొటక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చెయ్యాలి. సోషల్ వర్కర్లు, ఫెమినిష్టులు దీనికి కృషి చెయ్యాలి.

-వి. రాజేశ్వరి, రీడర్, అర్థశాస్త్రం, వనితా మహావిద్యాలయ హైదరాబాద్.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో