ప్రతి స్పందన

సత్యవతిగార్కి

మీ గుండె మీటి రాసిన ‘రచయిత్రుల క్యాంప్‌’ చదివాను. తెలుగు సాహిత్య చరిత్రలో రచయిత్రులకు చోటు తక్కువ. ఆ ఆక్షేపణలు, అవహేళనలు ఎక్కువ.

అందునా యత్రాచరిత్రల్లో కూడా మగవాళ్ళదే ఆధిపత్యం. అనకూడదుకానీ ఆధునిక గ్లోబల్‌ మనువులు ఇంకా నాలుగు గోడల్ని పరిపాలిస్తునే ఉన్నారు. స్వేచ్ఛను ఆశించడంకన్నా ఆచరించటం మిన్న. మీ నేతృత్వంలో సాగిన రచయిత్రుల సాహితీ యాత్ర అటు సమాజానికి, ఇటు సాహిత్యానికి కొత్త ప్రేరణ.

ఇప్పుడిప్పుడే యత్రా చరిత్రలు పాఠ్యాంశాల్లో భాగం అవుతున్నాయి. ‘భూమిక’ తన యాత్రా చరిత్రల్ని పుస్తక రూపంగా తీసుకొస్తే బాగుంటుంది. ఈ తరం వాళ్ళకీ రాబోయే తరం వాళ్ళకీ అది ఎంతో ఉపకరిస్తుంది. కళాశాలల్లోను, విశ్వవిద్యాలయస్థాయిలోనూ వీటిని సిలబస్‌లో చేర్పించే ప్రయత్నం చేయండి. లేదా చేయించండి. ప్రయెజనకరంగానూ, సృజనాత్మకంగానూ వుంటుంది.
ఎండ్లరి సుధాకర్‌, రాజమండ్రి

మిత్రులతో పంచుకుందామని

ఇప్పుడు చాలామందికి కాలం పరిగెడుతోంది. సంవత్సరాలు వెనక్కి త్వరగా జరిగిపోతున్నాయి. జీవితం దినచర్య అయిపోయింది. ఉదయాన వార్తాపత్రికలు రాత్రి చూసేసిన చద్ది వార్తలతో పాటు మరిన్ని నెత్తురు మరకల్ని అంటించుకుని వస్తాయి. కాఫీతోపాటు వాటిని జీర్ణించుకోగలిగే జడత్వాన్ని వరంగా పొందుతున్నాం. ఒక్కొక్కసారి ఒంటరితనం ఆవహించి ఊపిరాడనప్పుడు, ఉక్కపోసినప్పుడు, నిరాశే తప్ప ఏమీ కనపడనప్పుడు, ఆ జీవంలేనితనాన్ని, ఒక్కొక్కసారి, ఒక చిన్న ఆశ చిగురు తొడిగినప్పుడు, చల్లగాలి తిరిగిందనిపించినప్పుడు, నల్లమబ్బుల చివర ఒక వెండి అంచుని చూసినప్పుడు, అప్పుడు ఇప్పుడు కూడా మీరే గుర్తొస్తారు. అందుకోసం గడచిన ఏడాదిని మీతో పంచుకుందామని ఈ మాటలు. ఈ ఏడాది నేను కొన్ని మంచి సినిమాలు చూశాను, పర్జానియ, ట్రాఫిక్‌ సిగ్నల్‌, చెక్‌ దే ఇండియ,మెట్రో లాంటివి. సినిమాల్లో ఈ ఏడాది తార ”తారే జమీన్‌ పర్‌” కూడా చూసి, పిల్లాడితో పాటు నేను కూడ బాగా ఏడ్చేశాను. సినిమాలో ఏడవడం, పుస్తకాలు చదువుత కళ్ళు తుడుచుకోడం ”సిల్లీ” అని తెలుసు, దాన్ని, పేధలాజికల్‌ అన్నా, ఆడతనం అన్నా నేనేం అనుకోకపోగా సంతోషిస్తాను కన్నీళ్ళు ఇగిరి పోనందుకు. అవి మన స్వంతమైనందుకు. కొన్ని పుస్తకాలుకూడా మీకు చెప్పదగ్గవి చదివాను. ఆర్‌హన్‌ పామక్‌ ”స్నో”, పాలో కోయిలో ”జహిర్‌”, (ఆల్కెమిస్ట్‌” రాసినాయిన), అజార్‌ నఫిిసి ”రీడింగు లోలిటా ఇన్‌ టెహ్రాన్‌” లాంటివి. సహవాసి గారి ”నూరేళ్ల తెలుగు నవల” పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరించి దానిమీద ఒక పత్రికలో సమీక్ష వ్రాశాను. చాలా మంచి పుస్తకం. పత్రికల్లో అప్పుడప్పుడు మంచి కథలు చదివాను. అన్నింటికన్న మనందరం మళ్ళీ తలకోన స్నేహయత్రకి వెళ్ళడం గొప్ప అనుభవం, అది మనందరిదీ కనక నేనే ప్రత్యేకం చెప్పక్కర్లేదు. 125 ఫోటోలున్నాయి. సిస్టం తెరిచినప్పుడల్లా కనపడ్డానికి పులికాట్‌ సరస్సు మీద పడవని డెస్క్‌టాప్‌ మీద పెట్టాను. మనం కలిసినప్పుడు చాలా ఊసులు చెప్పుకుంటాం. ఎన్నో తీర్మానాలు చేస్తాం. తరచూ కలుద్దామనుకుంటాం. కనీసం దరవాణిలో మాట్లాడుకుందాం అనుకుంటాం. పోనీ ఇమెయిల్‌ అయినా ఇచ్చుకుందాం అనుకుంటాం. ఈ తీర్మానాన్ని అందర కాకపోయినా కొండవీటి లాంటి ఒకరిద్దరైనా అమలుచేస్తున్నందుకు కొండవీటిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం మంచి హెర్బల్‌ డైరీ తెచ్చినందుకు కూడా. దాన్ని అందరికీ పరిచయం చెయ్యడం మన బాధ్యత అని మీకు చెప్పక్కర్లేదు. ఎంచక్కటిపేరుండగా ఆమెని కొండవీటి అనాల్సివచ్చినందుకు ఒకటే కారణముంది. చాలా మంది ప్రముఖులు మా యిద్దర్నీ తారుమారు చేసేస్తున్నారు. పులికాట్‌ ఆనందాన్ని అందరికీ గుర్తుచేస్తున్నాను, మరొక్కసారి. అలా ఆనందం ఎక్కువకాలం నిలవదని చెబుతూ రాజయ్యగారి అబ్బాయి హత్య వార్త వచ్చింది. నేను రాజయ్యగారిని శ్రీకాకుళంలో కథానిలయం ప్రారంభోత్సవంలో కలిసినప్పుడు ఆయన తన కుటుంబం గురించి చెప్పి ”మా అబ్బాయి నాకు అబ్బాయిలాగా ఉండడు. చాలా పొడుగు. నా ఫ్రెండ్‌లా ఉంటాడు” అని మెరిసేకళ్ళతో చెప్పారు. ఈ దుఃఖం వెంటాడుతూనే వుంది. వెడుతూ వెడుతూ బేనజీర్‌ని తీసుకుపోయింది కదా ఈ ఏడాది… వారసత్వ రాజకీయల పదవీ వ్యామోహాల, మత మౌఢ్యాల, స్త్రీద్వేషాల, అనేకానేక కారణాల అతి సాహసిక ప్రాణత్యాగం. సరే కొత్తసంవత్సరం చాలా మంచి శకునంతో ప్రారంభమైంది. మావూరి (విజయవాడ) మంచి పుస్తకవిక్రేతేకాక, పుస్తకాలను గౌరవించే మంచి అభిరుచికల అశోక్‌ గారు ఆ రోజు ఆయన ప్రచురించిన రచయితల కేలెండర్ని విడుదల చేశారు. ఈ కేలెండర్‌ అత్యంత శ్రమకోర్చి తయారు చేసిన అత్తలరి నరసింహారావుగారు వచ్చి అది తయారు చేయడంలో తన అనుభవాలు పంచుకున్నారు. తరువాత మేము కొంతమంది సాహితీ మితృలం కాసేపు మాట్లాడుకున్నాం. చాలా బాగున్న ఉపయెగకరమైన ఈ కేలెండర్‌ కావాలంటే అశోక్‌ గార్ని అడగాల్సిందే. ఎందుకంటే ఆయన దాన్ని అమ్మరట. ఇలా ప్రారంభమైన ఈ సంవత్సరం గత సంవత్సరపు గాయాలను మర్చిపోడానికి ఏమి లేపనం ఇస్తుందో చూద్దాం.
పి. సత్యవతి, విజయవాడ

ప్రియనేస్తం సత్యవతికి

జనవరి భూమిక స్నేహపరిమళాల సుమగుచ్ఛమై నూతన సంవత్సర శుభాకాంక్షలతో పలకరించింది. తీరా చూస్తే పువ్వు ప్రతిరేకులోన మిత్ర బృందాలే! అందుకేనేమో ఆ ప్రత్యేక పరిమళం! రచయిత్రుల బృందం చేసిన స్నేహయత్రా విశేషాలు అనేక దృక్కోణాల్లో కనబడి చెప్పలేని సంతోషం కలిగింది. అనివార్య కారణాలవల్ల మీతో రాలేకపోయినందుకు బాధ కలిగింది.
మీరందించిన అక్షరాల సాయంతో ఆకుపచ్చలోయల్లోకి, ఆనందపు హేలల్లోకి పోతుంటే మీ ఉత్సాహం, సాహసప్రవృత్తీ, ఎపుడు వర్తమానంలోనే జీవించే మీ స్వభావం, స్త్రీలైనా, పురుషులైనా కేవలం మనుషులుగా వాళ్ళను ట్రీట్‌ చేసే పద్ధతీ, శ్రమ జీవుల శ్రమను ప్రేమపూర్వకంగా గౌరవించే సంస్కారం నాకెంతో నచ్చాయి. పెద్దవాగులో మీరు చిన్న పిల్లైపోయిన తీర, రైలు బాత్‌రమ్‌లో స్నానం చేసి, చీర మార్చుకున్న విధానం చదివితే మీ మీద గౌరవం రెట్టింపయిది. పెద్దవాగు మనసుల్లోని మాలిన్యాలను కడిగిపారేసిందన్న వాక్యం స్వచ్ఛత కోరే మీ మనసుకి అద్దం పట్టిందనిపించింది. ప్రకృతికి ఎంత శక్తి కదా! ఇవాళ మనుషుల్లో ఏర్పడ్డ యాంత్రికతకీ, మనసుల్లో పేరుకుపోతున్న మాలిన్యానికీ, బీపిగా, షుగరుగా బయటపడుతున్న ఒత్తిడికీ ప్రధానకారణం ప్రకృతికీ దూరంగా జీవించడమే అనిపిస్తుంది!
చాలామంది..స్త్రీలైనా, పురుషులైనా ముందు తాము మనుషులని మరచిపోతారేవె. స్వేచ్ఛాప్రియత్వం, సంఘభయం, ఆడంబరం, అహం, అణకువ, బెరుకు, వాచాలత్వం,బానిస మనస్తత్వం లేదా దొరతనం..ఇలా ఎన్నో గుణాలు, మనోభావాలు వారిని స్త్రీలుగా, పురుషులుగా విడదీస్తాయేమో! ఎన్నో సందర్భాలలో మనుషులు మనుషులుగా కాక స్త్రీలుగా పురుషులుగా ప్రతిస్పందిస్తారు. ప్రకృతిని దగ్గరగా చూసి మైమరపు పొందడం తల్లి ఒడిలోకి బిడ్డ చేరడం లాంటిదేకదా! అయినా చాలామంది స్త్రీలు మనసులో ఎంత కోరిక ఉన్నా నీళ్ళలో స్వేచ్ఛగా ఆనందించలేరు. ఒకవేళ ఆనందించినా ఆ విషయం మీ అంత స్వేచ్చగా వర్ణించలేరు. నేనొక స్త్రీనా పురుషుడినా, పిల్లనా, పెద్దనా అన్న వివరాలన్ని వదిలేసి ఒక మనిషిగా మీరు స్పందించడం, అలా స్పందించడం మీ హక్కు అన్న విషయన్ని సృష్టీ కరించడం నాకెంతో నచ్చింది. అలాగే వాంతితో చీర పాడయినపుడు రైల్లో బాత్‌రమ్‌లో స్నానం చేసి, చీర వర్చుకోవడం కూడా. అలాంటి సందర్భాలల్లో సాధారణ స్త్రీ ఎంత ఇబ్బంది అయినా భరిస్తుందేగాని సౌకర్యం కోసం ప్రయత్నించదు. ఎందుకంటే మనిషిగా అత్యవసరం అనిపించేదే అయినా స్త్రీకి అంత ముఖ్యం కానిదవుతుంది! అందుకే చాలా ఇళ్ళలో ఈనాటికీ ఆఖరున తినే గృహిణి ఆర్థాకలితో పడుకుంటుంది! తన్నుల, దెబ్బల తిన్న మనిషిగా కాక స్త్రీగా రియాక్ట్‌ అవుతుంది. చాలా బాధ కలిగితే ఆత్మహత్య చేసుకుంటుందిగాని తిరగబడదు. ఎంత విచారకరం! ఈ పరిస్థితిలో మార్పు రావాలని భూమికని తీర్చిదిద్దుతున్న మీరు బాపుజీ పద్ధతిలో నా జీవితమే నా సందేశం అంటున్నట్టనిపించింది. అడవిలో సహజంగా విచ్చిన పూవ్వులా సుకుమార భావాల సుమ పరిమళాలను వెదజల్లుతనే పువ్వు వెనుక దాగి ఉండే ముళ్ళలా మనోధైర్యం, సాహసంలోంచి సుగుణాలని ఆత్మరక్షణకోసం అందుబాటులో ఉంచుకోవడం ఎంతో స్ఫర్తిదాయకం.మీకు నా అభినందనలు

వారణాసి నాగలక్ష్మి, హైద్రాబాద్‌

స్త్రీవాద పత్రిక ‘భూమిక’ రథసారథి సత్యవతి గారికి,

భూమిక పత్రిక కార్యాలయంలో జరిగిన సమావేశానికి శ్రీమతి శాంతసుందరిగారు నన్ను తీసుకువచ్చి రచయిత్రులందరికీ పరిచయం చేసారు.ఆ రోజు జరిగిన సంభాషణలు, చదివిన స్పందనలు విని నాలో కలిగిన, తరంగించిన ప్రతిస్పందనలను మీకు చెప్పాలనిపించింది. ఈ నెల భూమిక చదివాక నా కవితలను, నా మనసులోని కొన్ని భావనలకు ఒక రూపం తెచ్చి మీ ముందుంచాలనిపించింది.
గత నెలఖరులో రచయిత్రులందరూ కలసి ఒక అద్భుతమైన, అనన్యమైన విహారయత్రకు వెళ్ళి వచ్చి అప్పటి ఆనందపరవశాలను పంచుకొన్న సమావేశానికి నేను అక్కడ ఉండడం నా అదృష్టం. నేను ప్రత్యక్షంగా ఆ తలకోన జలపాతాలు, పులికాట్‌ సరస్సులో పడవ ప్రయణం అనుభవించకపోయినా ఆ అనుభతులన్నీ (మీ అనుభతులన్నీ) నా సొంతమయ్యాయి. ఆ జలపాతాల రాగధారలో నేను తడిసాను. ఆ కోతుల అల్లరితో నాకూ పరిచయం కలిగింది. గుండె లోతుల్లోంచి పొంగే ఆనందం పాటలుగా మీ గొంతుల్లో పల్లవించడం నాకూ వినిపించింది. ఆ పులికాట్‌ సరస్సులోని పడవ ప్రయణంలో నేనూ ఊయలలగాను. నిజానికి మామూలు సామాన్య జనాలని అంత మందిని అన్ని రోజులు ఒక చోటికి తీస్కొనివెళ్ళడం ఎంతో కష్టం. అలాంటిది అందరూ కవయిత్రులు, రచయిత్రులు. చూసిన అందాలను అనుభవించిన మధురానుభతులను అంత అందంగాను మాటలలో చూపగల సహృదయినులు. అన్ని మనసుల్ని అన్ని ఆలోచనలను ఎన్నో అనుభతులు కల్గించగలిగిన గొప్ప ప్రయత్నం సఫలం చేసిన సత్యవతిగారికి నా ఆనందాంజలి. రోజువారి ఇనుపగోడల ప్రపంచం నుండి కొద్దిరోజులు ఆ అడవితల్లి పచ్చని వెచ్చని ఒడిలో గమ్మత్తైన అనుభూతుల పరంపరలో అన్ని పనులు, తనువులు మైమరచి ఆ చల్లని చిరుగాలుల స్పర్శకు పచ్చని చెట్ల ఆహ్లాదంలో పరవశించి తమలోని పసితనం చిన్నతనం అన్నీ తరగలెత్తి పైకి పాటగా పలకడం….ఆ గంతులు పరుగులు సెలయేటి నీటిలో ఆటలు….అన్నీ నా కళ్ళముందు నిలిచాయి. ఎంతో ఆనందంగాను ఒకింత కుళ్ళుగాను అనిపించింది….మీరంతా వెళ్ళి ఆ పరిమళాలన్నీ తెచ్చి చూపినందుకు, నేనూ మీతో రాలేకపోయినందుకు.
నేను భూమికకు ఏ విధంగానైన ఉపయెగపడగలిగితే మహద్భాగ్యంగా భావిస్తాను. నాకు చేతనైనవన్నీ ఏమైనా చేస్తాను. మీ అనుమతితో!
పృథ్వి, హైద్రాబాద్‌

గౌరవనీయులైన సత్యవతిగారికి

మీరు మీ స్నేహితులు అందరు కలిసి కష్టానష్టాలకు ఓర్చి ఈ పత్రికను నడుపుతున్నారు. మీరందరు చేస్తున్న ఈ కృషిని ఎంతైనా మెచ్చుకోవచ్చు. భూమికను చదువుతున్నపుడు నేను ఎంతో భావుకురాలిపై పోతాను. మన స్త్రీల యెడల జరుగుతున్న అన్యాయలు, అక్రమాలు చదువుతుంటే కళ్ళనుండి నీళ్ళు టపటప రాల్తాయి. భూమిక ఎంతో ఇన్‌ఫర్‌మేటివ్‌గా ఉంటుంది. కథలు, కవితలు మనస్సును స్పర్శిస్తాయి. మీరు, మీ టీమ్‌ చిరంజీవులు.
డా. సి.వసంత, ఔరంగాబాద్‌

సత్యవతిగారికి,ప్రతినెల భూమిక నాకు సకాలంలో చేరుతోంది. అలా చేరేటట్లు పంపుతున్న మీ పత్రిక నిర్వాహకులందరికీ నా తరఫునించి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రవాసాంధ్రులమైన మాకు తెలుగు పలుకులు, పలకరింతల, భాషా విన్యాసాలు, తెలుగు శోభల ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. మీ అందర స్త్రీవాదాన్ని అంత చక్కగా, సునిశితంగా, దీక్షగా, కష్టానష్టాలకోర్చుత మీ పత్రికలో చిత్రీకరిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా వుంది.

బి.బాలాదేవి, భువనేశ్వర్‌

భూమిక మిత్రులకు నమస్తే

జనవరి సంచికలో ఆ దేశం నీకేమిచ్చింది? అంటూ, మన వాళ్ళ పెంపకం తీరుని కొండేపూడి నిర్మల అద్దంలో చపించారు. చెప్పేది తెలుగు భాష – దేశభక్తి -పోరాటం తమ పిల్లల్తో చేయించేది ఇంగ్లీషు భాష – పరదేశ మోహం-బానిసత్వం. అవి కన్న వాళ్ళని మరిపించే శక్తులవడంలో ఎంచేదేముంది?పులి నోరు మింగినందుకు వగచేదేముంది? తోసింది తామే కదా! చిన్న వ్యాసం ద్వారా చాలామంది రెండు నాల్కల ముఖాల్ని ఫెడేల్మని గుద్దినందుకు కొండేపూడి నిర్మలగారికి అభినందనలు. అయితే ఆమే అదే పని చేశారన్నదే విషాదం.

డి. నటరాజ్‌, వైజాగు

జనవరి నెల ‘భూమిక’ పత్రిక చేతిలో పడగానే, స్నేహితురాళ్ళ నవ్వులు, పాటలు, మాటలు, అన్నీ పాత సినిమాలో రింగులు రింగులుగా వచ్చే జ్ఞాపకాల్లా చుట్టు ముట్టాయి. పత్రికలో విహారయత్రా విశేషాలుచదువుతుంటే మళ్ళా మనసు అక్కడికి పరుగులు తీసింది. తిరగ వేస్తున్న పేజీలతో పాటు ‘నిర్మల’ ఆవేదన ‘ఆదేశం నీకేమిచ్చింది? దగ్గర ఆగిపోయింది. చదువుతుంటే మనసు కలుక్కుపోయింది.
ఎప్పటిలాగే శీలా సుభద్రాదేవిగారి కవిత్వం సున్నితంగా సాగింది. సీతారాంగారి ఒకే ప్రశ్న అనేక ఐడియలు చాలా బాగుంది. ఇప్పుడు మనం బ్రాండడ్‌ వస్తువులే వాడి వస్తువులాగే వున్నాము. అమెరికా నుంచి వచ్చి ఆరు నెలలైనా సూట్‌కేసుల మీద బోర్డింగు పాస్‌ల స్టిక్కర్లు తీయకుండా అమెరికా బ్రాండ్‌డ్‌లాగా వున్నాం. ఏదైతేనేం..ఇవి మన కొచ్చిన ఐడియ. ముఖ్యంగా ప్రతిమగారికి సత్యవతిగారికి ధాంక్స్‌ చెబుతూ మళ్ళీ స్నేహితురాళ్ళందరికీ ‘హాయి’ చెబుతూ మరొక విహార యాత్రకోసం ఆ నవ్వుల కోసం ఎదురు చూస్తూ..చూస్తూ..

రేణుక అయెల, హైద్రాబాద్‌

బస్సుల్లో స్త్రీల రిజర్వేషన్‌ సార్ధకం చేసుకుందాం.

గత సంచికలో బస్సు ప్రయణాల్లో రిజర్వేషన్‌ హక్కుకు సంబంధించిన కరపత్రాన్ని చూడగానే మనస్సుకు ఎంతో ఊరట కల్గింది. ఈ చర్చను ఆహ్వానిస్తున్నందుకు అభినందనలు. ఎన్నో ఏండ్లుగా ఇది మనలను కలచి వేస్తున్న సమస్య. ఈ మధ్యే ఆంద్రజ్యోతి నవ్య డెస్క్‌ కూడా ఈ విషయంగా స్పందించి స్పందనలను ఆహ్వానించింది. ఈ మధ్య బస్సుల్లో ప్రయాణమంటే మరీ విసుగనిస్తుంది. బస్సుల ప్రయాణాల్లో ఆత్మవంచన తప్పడం లేదు. ఏ బస్సెక్కిన ఆడవాళ్ళు సీట్లలో పురుషుల దర్శనం తప్పడం లేదు. మా సీట్లను ఖాళీ చెయ్యండంట ఎంత చెప్పినా ఫలితం శున్యం. ఈ సీట్లల్లో కొన్ని సార్లు యువకులు కూడా ఉంటున్నారు. ఆడవాళ్ళు బస్సెక్కినట్టు, కన్పించినా తమ తలలను కిటికీల్లోకి దూర్చో లేదా నిద్రమత్తును నటిస్త నానా అవస్థలు పడుతుంటారు, స్త్రీల అక్షరాస్యత పెరిగి ఉద్యోగాలు చేస్తున్న కాలమిది. కుటుంబ భారాన్ని స్త్రీలే అధికంగా నెత్తిన వేసుకున్న కాలమిది. ఇంట్లో ఎ టు జెడ్‌ అన్ని అవసరాలు తీర్చి ఉద్యోగ నిమిత్తం అప్‌ అండ్‌ డౌన్‌లు చేస్తున్న కాలమిది. పెండ్లి కాని ఆడపిల్లలకు ఈ అప్‌ అండ్‌ డౌన్‌లు అనివార్యం, కానీ తీరా బస్సు వరకు వెళ్ళే వరకు ఏ ఒక్కనాడు బస్సులో సీటు దొరకదు. అన్ని బస్సుల హౌస్‌ ఫుల్లే. బస్సు వచ్చి రాకముందే టకా టకా ఎక్కడమో కిటికీల్లోంచి కర్‌చిఫ్‌లను వెయ్యడమో వాళ్ళపని. బస్సు స్టార్టింగు పాయింట్‌గా ఉన్న ఊళ్ళో పరిస్థితే ఇది. మద్య స్టేజీల్లో ఎక్కిన వాళ్ళకు మొండి చెయ్యే. మా సీట్లు మాకివ్వండంటూ నెత్తినోరు మొత్తుకున్నా కంఠశోషే. కండక్టర్ల సహకరించరు. మీరు అనుభవాలను రాసి పంపమని కరపత్రంలో సూచించారు. అనుభవాలు తలచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అరచీ అరచీ నోరెండుక పోయింది. లేడీస్‌ సీట్లకు వాళ్ళ వెనుక భాగాన్ని ఆనించి తగులుతూ నిల్చుంటారు. ఏమంటే నిల్చున్నాం. కనపడటం లేదా? అని ఎదురు ప్రశ్న గర్భిణీ స్త్రీలు, చంకన పిల్లలతో ఉన్న స్త్రీలు, వృద్ధులు… వీళ్ళెవరు ఈ పురుష పుంగవులు కంటికి ఆనరు.
రాత్రిళ్ళు ప్రయణీకుల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. వెనుక సీట్లన్ని ఖాళీగా ఉన్నా స్త్రీల సీట్లలోనే మగవాళ్ళు కూర్చుంటారు. ఏంటని ప్రశ్నిస్తే ఖాళీగానే ఉంది కదా? అని ఎదురు ప్రశ్న. ఈ స్త్రీలే వెళ్ళి వెనకాల కూర్చుంటారు. తమ సీట్లలో కూర్చోవచ్చనే అవగాహనే ఉన్నట్టు కన్పించరు. చాలామంది గుట్కాలు వేసుకుని ఉంటారు. చాలా వాసన వస్తూ ఉంటుంది.
ఒకరోజు మధ్యాహ్నమే నేను వికారాబాద్‌ నుండి హైద్రాబాద్‌ వస్తున్నాను. నేను విండో సీట్లో కూర్చున్నాను. కునుకు పట్టింది. మెలకువ వచ్చి చూద్దును కదా ఓ తల నా భుజంపై ఆన్చి గుర్రు పెడుతోంది. ఎవరని చూస్తే ఓ 25 సం. యువకుడు .బాగా కోప్పడి లేపాను. నేను పెద్దదాన్ని నా భుజం పై తల ఆన్చడం కొంత ఇబ్బంది కల్గించినా కసిరో తిట్టో లేపడంతో సరిపోయింది. వయసులో ఉన్న ఆడపిల్లలు కూర్చున్నా వాళ్ళ ప్రర్తనలో తేడా ఉంటుందంటారా? ఈ విషయన్ని కండక్టరు గమనించాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ” ఈ అల్లర్లన్నీ మాకెందుకు? టిక్కెటు ఇచ్చుకోవడంతో మా పని పరిసమాప్తి”అన్నట్టుంటుంది వారి ప్రవర్తన.
ఇక ముందు ఇలాంటి సంఘటనలు ఏమైనా మళ్ళీ ఎదురైతే వీలైతే ఫోటోతో సహా పంపిస్తాం. మీరు ఈ అనుభవాలకు ఏ విధంగా స్పందించేది తెలిపితే బావుండేది. ఈ మీ మా మన ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆశిస్తూ…

తిరునగరి దేవకి, వికారాబాద్‌

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

2 Responses to ప్రతి స్పందన

 1. Anonymous says:

  బాగున్నాయి

  కొంచెం అచ్చుతప్పులపై దృష్టి పెట్టండి.

  అందరికి అభినందనలు

  జాన్ హైడ్ కనుమూరి

 2. sudha rani . o. says:

  పెరుగుతున్న బరువు వార్నింగ్
  కాస్తయినా వుండాలి కేర్ టేకింగ్
  కాదంటే తరువాత ఫీలింగ్
  అటుపైన చేస్తుంది ఫైరింగ్
  అంతరంగంగ స్కేరింగ్
  చివరికి డాక్టరుకు ‘ట్రింగ్ ట్రింగ్’ –

  —- ఓ. సుధా రాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో