విన్నీ మండేలా ! – ఉదయమిత్ర

లేదు లేదోయమ్మ.. లేదోయమ్మ..
ఇట్లాంటి మాయమ్మలో కానలేదమ్మ
అయినోల్లు దూరమైనా…
కేసులెన్ని జుట్టుకున్నా…
”పీడిత వర్గాల చెయివీడలేదమ్మ”       ||లేదు||
తెల్లజాతోల్లపై ఫైర్‌ బ్రాండయ్యింది
నల్లజాతోల్లకు దేశమాతయ్యింది
త్యాగాల బాటలో వెనుదిరుగనీతల్లి
”జనహృదయనేతగా కలకాలము నిల్చె”               ||లేదు||
నాయకులెందరో జైలుపాలు గాగ
అన్నీ తానే అయి సుడిగాలిలా దిరిగె
తెల్లోల్ల కేమొ చెమట పుట్టించంగ
”యువతగుండెల్లోన తుఫాను రేపింది”       ||లేదు||
కక్షగట్టి నట్టి పరాయి పాలనలో
ఎన్నెన్ని శిక్షలో, ఎన్నెన్ని బాధలో-
తనువు, మనసు రెండు నిప్పుల కొలిమైనా
”ఎదురొడ్డి నిల్చింది; ఉక్కుమనిషయ్యింది” ||లేదు||
తెల్లోల్లతో చెలిమి వల్ల కాడన్నాది
సంకీర్ణపాలనను దుమ్మెత్తిపోసింది..
నల్లోలహక్కులు అడుగంటినంటూనే
”సొంతపార్టీమీద ధిక్కారమయ్యింది”      ||లేదు||
నల్లజాతి వజ్రమమ్మా…
నువ్వు.. గాయాల నదివైతివమ్మా..
ఏటికే ఎదురీదినావు.
నువ్వు.. ఎల్లలే తుడిచేసినావు..
నల్లజాతి పోరుజెండా
నువ్వు.. గగనాన ఎగరేసినావు..
”సూర్యచెంద్రులు, చుక్కలున్నంతదాంక
ఎల్లకాలము నిన్ను గుర్తుంచుకుంటాము..
ఎల్లకాలము నిన్ను గుర్తుంచుకుంటాము.
ఎల్లకాలము నిన్ను గుర్తుంచుకుంటాము..
”విన్నీమండేలా”కు

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో