”దుఃఖానికి విరుగుడు ఒక్కోసారి దిగమింగుకోవటమే!”

లకుమ

మగ్గాన్నే నమ్ముకుని – బతుకు
పగ్గాల్ని చేపట్టినవాడా!

రెక్కల కష్టంతోనే – రెండంకెల
డొక్కల్ని నింపిన వాడా!

‘గువ్వ’ల చెన్నడి సాక్షిగా –
కులవృత్తిని నెత్తికెత్తుకున్న వాడా!
ఎగిరిపోతాయని తెలిసీ –
ఉపాధేయ రెక్కల్ని తొడిగిన వాడా!
‘గీత’గా పుట్టి,
ద్వైతంగా జీవించి – కడకు
‘క్రొత్త నిబంధన’గా భూమిపొరల్లో ఒరిగిన వాడా!
వెళ్ళిపోయవా? అప్పుడే –
వెళ్ళిపోయవా??
నూరేళ్ల కింకా రెండుపదుల బాకీవుందే?
ఆ బాకీ మాటేం చేశావ్‌? చెప్పు!
చుట్టను తగలేసి –
పొగలాగా నువ్‌ కనుమరుగయ్యావు సరే,
యాబది వసంతాల నిన్నే నమ్ముకున్న –
ఆ ఏడడుగుల్నీ,
ఈ మూడు ముళ్లనీ,
ఒక్క అంతిమశ్వాసతో –
అబద్ధం చేసి పారేశావే!
ఆకాశంలో సగాన్ని –
అన్యాయం చేసి వెళిపోయావే!
వెళిపోయావా? అప్పుడే –
వెళ్లిపోయావా?? అని నేనైతే అనను –
అట్లా అనకపోయినా ఇది ‘ఎలిజి’ కాకపోదు
రావటం వెళ్లటానికే అని నాకూ తెలుసును.
వెళ్లిరావటం మీద నిక్కచ్చిగా –
నాక్కొన్ని పేచీలుండనే ఉన్నయ్‌
కదా?!
అవునుగానీ –
వర్షించేవి కేవలం రెండు కళ్లేనా?
ఉండుండీ ఓ గుండె కూడా వర్షిస్తుంది
ఓనా మేనకోడళ్లూ! కోడళ్లూ!!
కొడవళ్లల్లాంటి ప్రశ్నల్ని సంధించే కోడళ్లూ!!!
ఈ గుండెకింద తడిని చూడండి
మీ పది చెవుల్నీ వుంచి –
రాలే చినుకుల ‘గుట్టుచప్పుడు’ వినండి
అప్పుడు మీ ముక్కుల కోటేరుల మీద –
చూపుడువ్రేళ్లు మొలుచుకు వచ్చేను?!
‘జాతస్య మరణం ధృవమ్‌’
మరోసారి రుజువయ్యిందా?
అన్ని అనుబంధాల్నీ తెంపుకున్న
‘ఆత్మదీపం’ కొండెక్కి పోయిందా?
ఉన్న పెద్దదిక్కు కాస్తాపోతే
కడకు నాలుగు ‘దిక్కులు చట్టమే’, అయ్యిందా?
ఇంక ‘పెద్దరికా’ని కర్థం
నిఘంటువుల్ని వెదుక్కోవటమే అయ్యిందా?
అంతిమ ఘడియల్నీ, అంతే చివరి రోజుల్నీ
మంచానే అన్నీ అయిన, మంచమే అంతా అయిన
అయినవాళ్లే కానివాళ్లూ కాదన్నవాళ్లూ
అయిన వాళ్ల కోసం –
నా కవితా స్వర్గద్వారపు వాకిళ్లు తెరచివుంచా!
‘తలుపులేలేని వాకిళ్లు’!!
నూలుతో పెనవేసుకపోయిన నీజీవితానికో
నూలుపోగైనా దక్కింది లేదు.
నీ శవపేటిక మీదా, ఓ మూరెడు
చేనేత గుడ్డా పరచుకుంది లేదు.
ఇదీ ‘మన జాతీయ జౌళి విధానం’!
ఇంకా కులవృత్తుల్నే నమ్ముకున్న
నీలాంటి వేనవేల వెర్రి ఆత్మల ఘోషను
ఒక్క కవితాత్మ మాత్రమే అర్థం చేసికోగల్దు!
పార్లమెంటు అంటే
ఓ నాలుగుకొయ్యల, నలభై ఇటుకల అయినచోట….!!
బాధకు విశ్వరూపమే దుఃఖం
దుఃఖానికి విరుగుడు దిగమింగుకోవటమే
ఇంక నీవు లేనే లేవన్న
నిజం ముద్ద మింగుడు పడని ‘దల్లా’
ఒక్క నీ ‘అర్థశరీరానికే’.
రేపు –
ఈ నీడలంతా ‘ఎవరికి వారే’ అయితే –
ఓ ఒంటరి పండుటాకు మాత్రం,
జ్ఞాపకాల ”యమునా తీరాన”……….
(అత్తయ్యకు ఓదార్పుగా….)

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో