ఈనాటి బాలికలకు కావాల్సింది పోరాట స్ఫూర్తి – బి. విజయభారతి

”దాక్షిణ్య వాదం నుంచి దండకారణ్యం దాక భారత మహిళా ఉద్యమం.” వ్యాసాలు. ప్రచురణ – మార్చి – 2014.
రత్నమాల గారు జర్నలిస్టు, విప్లవ రచయితల సంఘం సభ్యురాలు. అనేక మహిళా సంఘాలలో స్త్రీలకు మహిళల సమస్యల గురించీ, పోరాడి సాధించుకోవలసిన హక్కుల గురించీ పాఠాలు చెప్పిన గురువు. వివిధ పత్రికలలో విజ్ఞానదాయకమైన వ్యాసాలు రాసిన విదుషి. మహిళా ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్న యోధురాలు. తన అనుభవాలనూ, జ్ఞాపకాలనూ, మనందరికోసం ఒక పుస్తకంగా తేవటం ఎంతో గొప్ప ఆలోచన. ఆమెకూ, ఆమె ఆలోచన కార్యరూపం దాల్చటానికి ఆమెకు తోడ్పడిన వారందరికీ మహిళలు రుణపడి ఉన్నారు.

ఈ పుస్తక పరిధి ఆకాశమంత విస్తృతమైనది. దండకా రణ్యం మనందరికీ సుపరిచితమైనదే అయినా అజ్ఞాతంగానే ఉంది. దక్షిణ దేశాల మానవ జాతుల మూలాలు ఎక్కడో అక్కడ గతంలో దండనతో ముడిపడినవే. పురాణాలలో- సాహిత్యంలో- చరిత్రలో- మనం చదువుకున్న- చదువుకోని సామాజిక విషయా లెన్నో ఈ పుస్తకంలో రత్నమాల గారు మనకోసం పొందు పరచటం ఆమెకు మహిళల మీద ఉన్న విశ్వాసాన్నీ – ప్రేమనూ వ్య్త పరుస్తున్నది. అందుకు మనందరం ఆమెకు కృతజ్ఞులమై ఉండాలి-

ఈ గ్రంథం పెద్దదే. మొత్తం 328 పేజీలు. మినీ రచనలు చదవటానికి అలవాటుపడ్డ వాళ్ళకి ఇది ఇంత పెద్ద పుస్తకమా అనిపిస్తుంది. కాని ఇందులోవన్నీ వేర్వేరు వర్గీకరణలతో ఉన్న వ్యాసాలు కాబట్టి దేనికదే చదివి జీర్ణించుకోవచ్చు. భారతదేశంలోని గిరిజన ఆదివాసీ మహిళలపై నిర్హేతుకంగా జరుగుతున్న దాడులు – అత్యాచారాలు ప్రపంచం దృష్టికి వెళ్తున్న ఈ సమయంలో వాటి గురించి – వాటి మూలాల గురించి కొంతయినా తెలుసుకోవటం చదువుకున్న మహిళలుగా మన కర్తవ్యం. మనకు దూరంగా ఉన్న ఆ సమాజాల గురించి ప్రాథమిక సమాచారమే కాదు మొత్తం సమాచారాన్ని ఈ వ్యాసాలు మన ముందు ఉంచుతున్నాయి.

ఒక్కో వ్యాసమూ చదివాక ఎంతో అలసట-కోపం- విభ్రాంతి-. మహిళల హక్కుల గురించీ – సమానావకాశాల గురించీ – స్త్రీవాదం గురించీ- ఉద్యమాల గురించీ మాట్లాడుకునే వారందరూ ఇంకా తెలుసుకోవలసిన అంశాలెన్నో ఈ వ్యాసాలలో ఉన్నాయి.

విరసం కార్యకలాపాలతో మమేకం అయిన వ్యక్తిగా రత్నమాల గారి గురించి చాలా మందికి కొన్ని అభిప్రాయాలు ఉండి ఉంటాయి. అలా ఉండటం తప్పుకాదు. కాని ఈ వ్యాసాలు చదవటం మొదలుపెట్టాక ఆమె సంపూర్ణ మూర్తిమత్వం కళ్ళకు కడుతుంది. ఈ సమాజ వికాసంలో పోరాటంలో మనవంతు ఎంత? మన పాత్ర ఏమిటి? అనే ప్రశ్న కూడా కలవర పరుస్తుంది.

స్త్రీల అణచివేతలో పితృస్వామ్య కుటుంబ నిర్మాణం ప్రధానమైనది అంటున్న రత్నమాల ఆ పితృస్వామ్యం కుల మత వర్గ నిర్మాణాలతో ముడిపడి ఉంటున్న వాస్తవాన్ని స్పష్టంగా చూపారు. స్త్రీలు వివిధ రాజకీయ సామాజిక రంగాలలోకి ప్రవేశించాలంటే ఎన్ని రకాల ఒత్తిళ్ళను – మూఢ విశ్వాసాలను ఎదిరించాలో చెప్పారు. బాధ్యతలను స్వేచ్ఛలో భాగంగా చూపుతున్న పురుషస్వామ్యాన్ని అర్థం చేసుకోవటంలో ఎంత మెలకువ చూపాలో తెలియజెప్పారు. భారత మహిళ స్వేచ్ఛకోసం తపిస్తూ ఉన్నది. ఆత్మగౌరవం, నిర్ణయాధికారం, పురుషులతో సమాన ప్రతిపత్తి ఉన్న స్వేచ్ఛ ఆమె కోరుతున్నది- అందుకోసం రాజ్యంతోనూ బలమైనవనుకొంటున్న ఇతర సామాజిక నిర్మాణాలతోనూ వ్యవస్థలతోనూ తలపడుతున్న దండకారణ్య మహిళలను మన ముందుంచుతున్నారు రత్నమాల. వినయ విధేయతలకంటే ఈనాటి బాలికలకు కావలసినది పోరాట స్ఫూర్తి.

ఈ పుస్తకం ఆ స్ఫూర్తినిస్తున్నది.
”దాక్షిణ్యవాదం నుంచి దండకారణ్యం దాక భారత మహిళా ఉద్యమం.” వ్యాసాలు.
రచయిత్రి – యం. రత్నమాల
ప్రతులకు – యం. రత్నమాల, మేఘా అపార్ట్‌మెంట్స్‌, ఫ్లాట్‌ నెం. 302, నల్లకుంట, హైదరాబాద్‌ – 44
ఫోన్‌ : 27662957, సెల్‌ : 9440329445
పుస్తకం వెల – రు. 200/-, పుటలు – 328

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో